
యంగ్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పూరి, రామ్‌లు కం బ్యాక్ అవుతారన్న టాక్ వినిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందనరావటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది.
ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా నైజాం హక్కులు రూ. 7 కోట్ల 20 లక్షలకు ఆంధ్రా హక్కులు రూ. 6 కోట్ల 50 లక్షలకు సీడెడ్ రూ. 3 కోట్ల 33 లక్షలకు అమ్ముడైనట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలలోనూ ఇస్మార్ట్ శంకర్‌కు మంచి బిజినెస్ జరుగుతోంది.
ఈ సినిమా కర్ణాటక హక్కులు రూ. కోటి యాబై లక్షలకు అమ్ముడు కాగా మిగతా రాష్ట్రాలన్ని కలిపి రూ. 65 లక్షలు పలికాయి. ఇవి కాక డిజిటల్, శాటిలైట్ హక్కులు అన్ని కలిపి దాదాపు రూ. 17 కోట్ల వరకు పలికాయి. దీంతో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్‌కు ముందే దాదాపు రూ 36 కోట్ల 18 లక్షల బిజినెస్ చేసినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment