
నిత్యం వివాదాలతో సావాసం చేసే ఆర్జీవీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాడు. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్‌లో వెళ్తూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వివాదం సృష్టించాడు. అసలేం ఏం జరిగిందంటే.. టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. రామ్ గోపాల్‌వర్మ శిష్యుడన్న సంగతి తెలిసిందే. చాల కాలానికి తన శిష్యుడు పూరి ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ కొట్టాడు. ఈ చిత్రాన్ని చూసేందుకు వర్మ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ తన శిష్యులతో కలిసి బైక్‌పై వెళ్లాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీ చేసిన ట్రిపుల్ రైడింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రిపుల్ రైడింగ్, నో హెల్మెట్ కారణంగా ఆర్జీవీకి ట్రాఫిక్ పోలీసులు రూ.1,335 ఫైన్ విధించారు. అసలు ఈ వివాదం మొదలైందీ వర్మ వల్లే. ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ అగస్త్య మంజు, తాను బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌లో హెల్మెట్ లేకుండా సినిమాను చూడటానికి వెళ్తున్నానని ఫోటోను షేర్ చేశాడు ఆర్జీవీ . దీంతో ఈ పిక్ వైరల్ కాసాగంది. ఇక ఈ ఫోటోను నెటిజన్లు కామెంట్లతో ఓ ఆట ఆడేసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు వర్మ చాలెంజ్ విసిరాడని, మూడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని.. నో హెల్మెట్, త్రిబుల్ రైడిండ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు చివరకు ఫైన్ విదించారు.
Comments
Please login to add a commentAdd a comment