డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇస్మార్ట్ శంకర్. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే 75 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. నటుడు, దర్శకుడు ఆకాష్ తన సినిమా కథను కాపీ కొట్టి ఈ సినిమా రూపొందిచారంటూ ఆరోపణలు చేయటంతో ఇస్మార్ట్ శంకర్‌పై వివాదాలు మొదలయ్యాయి.
తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. బెంగళూరులోని మల్టీప్లెక్స్‌లలో ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రామ్ సిగరెట్ తాగుతున్నట్టుగా ఉన్న స్టిల్స్‌పై హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి స్టిల్స్‌ను పబ్లిక్ ప్లేస్‌లో ప్రదర్శించటం చట్టరీత్యా నేరమని, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.
రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించారు. నటి చార్మీతో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment