
రామ్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో నిధీ అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్రబృందం గోవా వెళ్లనుంది. అక్కడ ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment