ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇస్టార్ శంకర్ తరువాత ఓ రీమేక్ సినిమా చేసేందుకు రామ్ ఓకె చెప్పాడట. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ‘థడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ రైట్స్ ఇప్పటికే స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను గతంలో రామ్ హీరోగా నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలకు దర్శకత్వం వహించిన కిశోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment