Kishore Tirumala
-
క్రేజీ కాంబినేషన్?
హీరో రవితేజ(Ravi Teja), దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala) కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల రవితేజను కలిసి ఓ కథను వినిపించారట కిశోర్ తిరుమల.ఈ స్క్రిప్ట్ నచ్చ డంతోప్రాథమికంగా రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, కథ మొత్తం పూర్తయిన తర్వాత ఫైనల్ నరేషన్ విని ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయం తీసుకుంటారని టాక్. మరి.. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ సెట్ అవుతుందా? వేచి చూడాలి. -
ఒక్కరు కూడా మా సినిమా బాలేదని అనలేదు: శర్వానంద్
‘‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాని నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా చూసి, బాగుందన్నారు. మా సినిమా చూసినవారిలో ఒక్కరు కూడా బాగోలేదని అనడం నేను వినలేదు’’ అని శర్వానంద్ అన్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలయింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో నవ్విస్తామని ముందే చెప్పాం.. అన్నట్లుగానే థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తున్నామని వారు చెబుతుండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘మా అమ్మానాన్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చూసి, ఒక మంచి సినిమా చూశామన్నారు. కుటుంబమంతా కలిసి మా సినిమా చూస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు రష్మిక. ‘‘నేను శైలజ’ కంటే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’తో మీకు మంచి గుర్తింపు వచ్చింది’’ అని ఈ సినిమా చూసిన మా వీధిలోని వారందరూ చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు కిశోర్ తిరుమల. ‘‘ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు సహనిర్మాత శ్రీకాంత్. కెమెరామేన్ సుజిత్, నటీమణులు రుచిత, దీప్తి మాట్లాడారు. చదవండి: Aadavallu Meeku Johaarlu Review: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ ఎలా ఉందంటే? -
'ఆడవాళ్లు మీకు జోహార్లు' నుంచి లేటెస్ట్ అప్డేట్
Aadavallu Meeku Johaarlu Title Song To Be Released: యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25నప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని వచ్చేనెల4న, సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇక ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు -
'ఆడవాళ్లు మీకు జోహార్లు' విడుదల ఎప్పుడంటే ?
Sharvanand Aadavallu Meku Joharlu Movie 2022 Release In February: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతుంది. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో సినిమా ప్రమోషన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కింటి కుర్రాడి పాత్రలో నటిస్తుండగా, రష్మిక పాత్ర మంచి అనుభూతిని ఇస్తుందని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యతను టైటిల్ తెలియజేసేలా ఉంది. ఖుష్బు, రాధిక శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్‌లు అందించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. #AadavalluMeekuJohaarlu Releasing in Theaters on February 25 💥💥#AMJOnFEB25 @iamRashmika @DirKishoreOffl @realradikaa @khushsundar #Urvashi @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl pic.twitter.com/Z8I7ssvapf — Sharwanand (@ImSharwanand) January 28, 2022 -
విశాఖలో ‘రెడ్’ చిత్రం విజయోత్సవం
-
రెడ్ మూవీ రివ్యూ
టైటిల్ : రెడ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : రామ్ పోతినేని, మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, సంపత్ రాజ్, వెన్నల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీ స్రవంతి మూవీస్ నిర్మాత : ‘స్రవంతి’రవికిశోర్ దర్శకత్వం : తిరుమల కిశోర్ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ విడుదల తేది : జనవరి 14, 2021 సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న రామ్, ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఇప్పుడు అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని తనకు గతంలో‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్' అనే సినిమా చేశాడు. తమిళ్ మూవీ తడమ్ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో రామ్ తొలి సారిగా డ్యూయల్ రోల్ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నేడు‘రెడ్’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో రామ్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? కిశోర్ తిరుమల,రామ్ కాంబో హ్యాట్రిక్ విజయం సాధించిందా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ సిద్దార్థ్(రామ్) ఒక సివిల్ ఇంజనీర్. తాను పని చేసే ఆఫీస్‌లోనే మహిమా(మాళవికా శర్మ)అనే యువతిని చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెతో వ్యక్తం చేయడానికి నానా ఇబ్బందులు పడుతాడు. చివరకు ఎలాగోలా తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పేస్తాడు. ఆమె కూడా సిద్దార్థ్‌ను ఇష్టపడుతుంది. కొద్ది రోజుల్లో పెళ్లికూడా చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే.. ఆదిత్య(రామ్) ఓ తెలివైన దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో.. జల్సాలు చేస్తుంటాడు. పేకాటలో లక్షలకు లక్షలు పొగొట్టుకుంటాడు. ఇలా ఒకసారి తన ఫ్రెండ్ వేమ(సత్య) దాచుకున్న డబ్బులు తీసుకొని వెళ్లి పేకాటలో పొగుట్టుకుంటాడు. దాని వల్ల వేమ ఓ ప్రమాదంలో ఇరుక్కుంటాడు. తన స్నేహితుడిని కాపాడటం కోసం ఆదిత్య 9 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఓ రౌడీకి ఇస్తాడు. ఇదిలా ఉంటే.. ఆకాశ్ అనే ఓ యువకుడు దారుణ హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసులో సిద్దార్థ, ఆదిత్య ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసు సీఐ నాగేంద్ర కుమార్(సంపత్ రాజ్), ఎస్సై యామిని(నివేదా పేతురాజ్) ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపడతారు. ఇక ఈ కేసులో సిద్దార్థ్‌ను ఇరికించడానికి సీఐ నాగేంద్ర కుట్ర చేస్తాడు. అసలు ఈ హత్యకు సిద్దార్థ్, ఆదిత్యలకు సంబంధం ఏంటి? ఇద్దరిలో ఆకాశ్‌ని ఎవరు హత్య చేశారు? సీఐ నాగేంద్రకు, సిద్దార్థ్‌కు మధ్య ఉన్న గొడవేంటి? సిద్దార్థ్, ఆదిత్యల మధ్య సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును చేధించారా లేదా? అనేదే మిగత కథ నటీనటులు రెండు విభిన్న పాత్రలో కనిపించిన రామ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సిద్దార్థ్ పాత్రలో క్లాస్‌గా కనిపించి మెప్పించిన రామ్.. ఆదిత్య పాత్రలో ఊర మాస్‌గా అలరించాడు. తన నటనతో మరోసారి ఎనర్జిటిక్ స్టార్ అని నిరూపించుకున్నాడు. ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్ మంచి ప్రదర్శన ఇచ్చారు. మహిమా పాత్రలో మాళవికా శర్మ మెప్పించారు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన ముద్రవేశారు. మాళవిక శర్మ-రామ్ రొమాన్స్ బాగా పండింది. లిప్ లాక్‌లతో హీటెక్కించారు. ఇక అమాయకపు యువతి పాత్రలో అమృతా అయ్యర్ అద్భుతంగా నటించాడు. సంపత్ రాజ్, వెన్నల కిషోర్, సత్య తమ పరిధిమేర నటించారు. విశ్లేషణ ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి సూపర్ హిట్ల తర్వాత తిరుమల కిశోర్, రామ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం రెడ్. ‘ఇస్మార్ట్ శంకర్'లాంటి సూపర్ హిట్ తర్వాతా రామ్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ‘రెడ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను కొంతమేర దర్శకుడు అందుకున్నాడు. తమిళ్ మూవీ తడమ్‌కు ఇది రీమేకే అయినా.. తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా కథలో మార్పులు చేసి మెప్పించాడు. ఫస్టాఫ్‌లోనే ఇద్దరు రామ్‌లను తెరపై పరిచయం చేసిన దర్శకుడు... ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో సినిమా చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఇంటర్వేల్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు. ప్లాష్‌బ్యాక్ ట్విస్ట్‌లు కూడా ఆడియన్స్‌కి కథపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అయితే రామ్‌లోని ఎనర్జిటిక్ని దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ.. సినిమా స్లోగా రన్ అవుతున్న భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ప్లాష్‌బ్యాక్‌లో రామ్ తల్లిని చూపించిన విధానం కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచు. సినిమాలోని డైలాగ్స్ బాగుండటంతో పాటు ఆలోచించే విధంగా చేస్తాయి. ‘రామాయణం మగాళ్లు కాకుండా ఆడాళ్లు రాసిఉంటే.. వారిపై అనుమానం ఉండేది కాదు అని ఒక్క డైలాగ్‌తో మహిళల బాధను తెలియజేశాడు. ‘నచ్చింది తినాలనుకున్నా.. తినకపోతే ఏమౌతుందిలే అనుకునే బతుకులు వాళ్లవి’ అంటూ మధ్యతరగతి బతుకులు ఏంటో తన డైలాగ్స్‌తో తెలియజేశాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఒక పాట మినహా మిగిలినవి అంతంత మాత్రమే అయినా, తనదైన బిజీఎంతో మ్యాజిక్ చేశాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రెడ్ మరీ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ కాదు కాని చూడాల్సిన చిత్రమే. ప్లస్ పాయింట్స్ : రామ్ నటన కథలోని ట్విస్టులు సెకండాఫ్ మైనస్ పాయింట్స్ స్లో నెరేషన్ ఫస్టాఫ్లొని కొన్ని సీన్లు అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అప్పుడు దిమాక్ ఖరాబ్.. ఇప్పుడు డింఛక్
ఇస్మార్ట్ శంకర్‌తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ‘రెడ్’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో రామ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని రామ్ అభిమానులకు కానుకగా ‘రెడ్’ చిత్రంలోని ‘డింఛక్’ అనే మాస్ సాంగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ పాటను మణిశర్మ కంపోజ్ చేయగా సాకేత్, కీర్తనలు పాడారు. జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియగ్రఫీ, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇక ఈ సాంగ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ సాంగ్ రేంజ్లో హిట్టయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ లవ్ ట్రాక్‌కు ప్రేక్షకులను విశేష ఆదరణ లభించిన విషయం తెలసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తన పుట్టిన రోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉండాలని రామ్ పిలుపునిచ్చారు. అభిమానుల ఆరోగ్యం, సంతోషమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని.. అదే తనకు ఇచ్చే అసలైన పుట్టిన రోజు కానుకగా భావిస్తానని రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక తమ హీరో పిలుపు మేరకు ఆయన బర్త్‌డే వేడుకలకు రామ్ అభిమానులు దూరంగా ఉన్నారు. అయితే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ హీరోకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. రామ్ కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ‘రెడ్’ చిత్రం తమిళ హిట్ ‘తడమ్’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. చదవండి: ఇన్నాళ్లకు కౌశల్‌కు సినిమా అవకాశం బాలయ్య కోసం భారీగా శత్రు గణం Here’s the teaser of one of my fav songs from #RedTheFilm 💥 #DinchakSong 💥https://t.co/UU5Zns38JH I had a blast on sets filming this..I’m sure you guys will have a blast at the theatres watching this. 🔥 Love..#RAPO pic.twitter.com/qE9qi0qevZ — RAm POthineni (@ramsayz) May 15, 2020 -
‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో అస్త్రాన్ని విడుదల చేసేందుకు సమయాత్తమవుతోంది. చిత్రంలోని తొలి సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మార్చి 6న సాయంత్రం 5 గంటలకు సినిమాలోని ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేశారు. ఇక మణిశర్మ శైలిలో ఈ మెలోడీ సాంగ్ ఉండబోతోందని చిత్ర బృందం తెలిపింది. ఇక కిశోర్ తిరుమల-రామ్ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ సాంగ్ కూడా హిట్టయిందంటే ‘రెడ్’ జోరుకు బ్రేకులు ఉండవని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. చదవండి: ‘ఆయన రావడం మా అదృష్టం’ ‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’ -
మాస్.. మమ్మ మాస్?
‘ఇస్మార్ట్ శంకర్’తో ఇస్మార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు రామ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి మాస్ హిట్‌గా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ ఏ సినిమా చేయబోతున్నాడు? అంటే పలు వార్తలు వినిపిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అలాగే వీవీ వినాయక్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇది మాస్ ఎంటర్టైనర్ అట. ముందుగా ఏ సినిమా పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. -
రీమేక్‌తో హ్యాట్రిక్..!
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇస్టార్ శంకర్ తరువాత ఓ రీమేక్ సినిమా చేసేందుకు రామ్ ఓకె చెప్పాడట. తమిళ్లో ఘనవిజయం సాధించిన ‘థడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ రైట్స్ ఇప్పటికే స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను గతంలో రామ్ హీరోగా నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలకు దర్శకత్వం వహించిన కిశోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘చిత్రలహరి’పై చిరు ఏమన్నాడంటే..
-
‘చిత్రలహరి’పై చిరు కామెంట్స్
వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు చిత్రలహరి కాస్త ఊరటనిచ్చినట్టు కనిపిస్తోంది. గత చిత్రాల కంటే ఈ సినిమా ఫర్వాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే చిత్రలహరిపై భిన్నాభిప్రాయాలు వస్తుండగా.. మూవీకి ప్రమోషన్‌ను కల్పించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో తెలిపారు. చిత్రలహరి గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ చాలా చక్కగా, పరిణితితో నటించాడని, డైరెక్టర్ కిషోర్ తిరుమల మంచి సందేశాన్నిచ్చే చిత్రాన్ని చక్కగా రూపొందించారని, మైత్రి మూవీస్ సంస్థకు తగ్గట్టుగా ఈ సినిమాను వారు నిర్మించారని తెలిపారు. ఈ మూవీలో నటించిన మిగతా పాత్రల గురించి కూడా తనదైన శైలిలో కామెంట్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన సంగీతంతో సత్తా చాటారని కొనియాడారు. -
‘చిత్రలహరి’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘చిత్రలహరి’ టీజర్ రిలీజ్
-
రచయితగా మారిన మెగా హీరో
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్, తనకంటూ సొంత ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్ హీరో, తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డాడు. దీంతో తన కోసం తానే ఓ కథను రెడీ చేసుకునే పనిలో ఉన్నాడట సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే ఓ లైన్‌ను సిద్ధం చేసుకున్న సాయి, పూర్తి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తాను రాసుకున్న కథను డైరెక్ట్ చేయాల్సిందిగా ఓ యంగ్ డైరెక్టర్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నాడట. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అన్న విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రలహరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. -
రామ్ రికార్డ్.. 3 రోజుల్లో 3.3 కోట్ల వ్యూస్
రామ్ కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘నెం.1 దిల్ వాలా’ యూ ట్యూబ్ లో విడుదలైన మూడు రోజుల్లోనే 33 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. గతంలో హిందీలో విడుదలైన ఏ తెలుగు సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ సాధించలేదు. ఇటీవల తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్లు బాలీవుడ్లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ స్నేహం విలువను చెప్పే అందమైన ప్రేమ కథా చిత్రం. కోరుకున్న అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడని తెలిసి.. వదులుకున్న అబ్బాయి కథ. స్నేహితులుగా రామ్, శ్రీ విష్ణు నటించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియదర్శి, కిరీటి దామరాజు అల్లరి మాటలు నవ్వులు పంచాయి. స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై స్రవంతి రవికిశోర్, కృష్ణ చైతన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మనీష్ షా విడుదల చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన మూడు రోజుల్లోనే ఈ సినిమా 33 మిలియన్ల (3 కోట్ల 30 లక్షల) వ్యూస్ సాధించడం పట్ల హిందీ అనువాద హక్కులు తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ మనీష్ షా ఆనందం వ్యక్తం చేశారు. -
తేజుకి పోటీ తప్పడం లేదా..?
మెగా మేనల్లుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ మొదట్లో ఫుల్ జోష్‌లో ఉన్న హీరో.. ఈ మధ్య కాస్త తడబడ్డాడు. వరుసబెట్టి ప్లాఫులిస్తున్న ఈ మెగా హీరోకు టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. ఈ మధ్యే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ‘నేను శైలజా’ ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘చిత్రలహరి’ అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని.. అందులోనూ ఏప్రిల్ 19న చేయాలని అనుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ మొదటివారంలో మహేష్ బాబు మహర్షి చిత్రం థియేటర్లలో సందడి చేయనుండగా.. చిత్రలహరిని రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఇదే డేట్‌కు నాని జెర్సీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మరి చిత్రలహరిని నానికి పోటీగా వదులుతారో.. లేక వాయిదా వేస్తారో చూడాలి. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. -
సుప్రీం హీరో రెడీ టు షూట్..!
మెగా వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. ముఖ్యంగా నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్యు సినిమాల్లో సాయి లుక్‌పై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆలోచనలో పడ్డా సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రాన్ని ప్రారంభించడానికి గ్యాప్ తీసుకున్నాడు. కొద్ది రోజులుగా అమెరికాలో ఉంటూ సరికొత్త లుక్‌లోకి మారే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్‌లో రెడీ అయిపోయాడట. ఫిట్ బాడీతో పాటు డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో రెడీ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్‌లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందించనున్నారు. -
‘చిత్రలహరి’పై ఇంట్రస్టింగ్ న్యూస్
కొద్ది రోజులుగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో ‘చిత్రలహరి’ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సాయి ధరమ్ తేజ్ కొత్త మేకోవర్‌లో రెడీ అయిన వెంటనే కొత్త సినిమా పట్టా లెక్కనుంది. ఇంట్రస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిత్రలహరి అనేది ఓ బార్ పేరన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే తాజాగా మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. చిత్ర.. లహరి అనేవి సినిమాలో హీరోయిన్ల పేర్లన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక హీరోయిన్గా నివేదా థామస్ ను ఎపింక చేయగా మరో హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ట్రయాంగిల్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకుడు. -
అమెరికాకు మెగా హీరో.. అందుకేనా?
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన తేజ్ కెరీర్ స్టార్టింగ్‌లో పరవాలేదనిపించినా తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డాడు. ఇటీవల విడుదలైన తేజ్ ఐ లవ్ యు కూడా ఆకట్టుకోలేకపోవటంతో ఈ యంగ్ హీరో ఆలోచనలో పడ్డాడు. కథల ఎంపికతో పాటు లుక్ విషయంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు సాయి ధరమ్. అందుకే తన తదుపరి చిత్రంలో సరికొత్తగా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు ఈ మెగా హీరో. అందుకే మేకోవర్ కోసం అమెరికా వెళ్లనున్నాడట. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రలహరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాలో సాయి ధరమ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, రితికా సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
సుప్రీం హీరోతో రితికా?
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు ప్రస్తుతం కాలం కలిసిరావడంలేదనే చెప్పాలి. చేసిన ప్రతీ సినిమా బెడిసికొడుతోంది. మాస్ జపం చేస్తూ... మూస ధోరణిలో సినిమాలు చేయడమే దానికి కారణం అని తెలిసినట్టుంది ఈ హీరోకి. అందుకే గేర్ మార్చి ప్రేమకథలపై పడినట్టు కనిపిస్తోంది. ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే కరుణాకరన్ డైరెక్షన్లో ‘తేజ్ ఐ లవ్ యూ’ అనే సినిమాను చేస్తున్నాడు. తదుపరి చిత్రంగా నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. కిశోర్ గత చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు. అందుకే సాయిధరమ్ సినిమాతో తిరిగి ప్రూవ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు ఈ యంగ్ డైరెక్టర్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్గా కల్యాణీ ప్రియదర్శన్‌ను ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ పాత్రకు అనుపమా పరమేశ్వరన్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అనుపమా స్థానంలో గురు ఫేం రితికా సింగ్ పేరు వినిపిస్తోంది. ఫైనల్ గా ఎవరు సాయిధరమ్ తో జోడి కడతారో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
సాయి ధరమ్ - అనుపమ... మరో సినిమా?
సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం కరుణాకరన్ డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కరుణాకరన్ ఫార్మట్‌లో ఉండే లవ్ అండ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ‘తేజ్ ఐ లవ్ యూ’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తేజ్ ,అనుపమ జోడికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కిషోర్ తిరుమల.. సాయి ధరమ్ తేజ్‌తో చేయబోయే తరువాతి సినిమాకు కూడా అనుపమానే హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట. సో.. ఈ జోడి వరుసగా రెండు సినిమాల్లో వెండితెరపై సందడిచేయబోతోందన్నమాట. ఈ సినిమాలో అనుపమాతో పాటు, హలో ఫేం కళ్యాణీ ప్రియదర్శిన్ కూడా మరో హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మెగా హీరో చేతికి నాని సినిమా
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నానితో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా ప్లాన్ చేసింది. ఈ సినిమాకు నేను శైలజతో సూపర్ హిట్ కొట్టిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నట్టుగా ప్రకటించారు. అయితే చాలా రోజులుగా చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో కీలక మార్పు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు కిశోర్ చెప్పిన కథపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయకపోవటంతో ఈ ప్రాజెక్ట్ చేతులు మారిందట. నానికి చెప్పిన కథతోనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమాను తెరకెక్కించాలని భావిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అయితే సుప్రీం హీరో కూడా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సాయి.. తరువాత మారుతి, గోపిచంద్ మలినేనిలతో సినిమాలు చేయాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ లు అయిపోయాకే కిశోర్ తిరుమలకు ఛాన్స్ ఇస్తాడా..? లేక ముందే ఈ సినిమాను స్టార్ట్ చేస్తాడా చూడాలి. -
మార్చిలో నాని కొత్త సినిమా..!
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్న నాని.. త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న కృష్ణార్జున యుద్ధం ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు నాని. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి రెండో వారంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. -
‘చిత్ర’మైన టైటిల్‌తో నేచురల్ స్టార్?
సాక్షి, సినిమా : టాలీవుడ్లో నాని వేగాన్ని అందుకునే స్టార్ మరెవరూ కనిపించటంలేదు. వరుసగా సినిమాలు.. వాటి సక్సెస్‌లతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు. ఇప్పటికే ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం షూటింగ్లో పాల్గొంటున్న నాని.. హను రాఘవపూడితో ఓ చిత్రం కమిట్ కాగా, విక్రమ్ కుమార్ కథను దాదాపు ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని సైతం నేచురల్ స్టార్ ఓకే చెప్పినట్లు సమాచారం. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడంట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం 'చిత్రలహరి' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. టైటిల్ క్యాచీగా ఉండటం.. పైగా టైటిల్ రిజిస్ట్రర్ కావటంతో దాదాపు ఖాయమనే అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జనవరిలో గానీ .. ఫిబ్రవరిలోగాని ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఓవైపు నాని ఎంసీఏ చిత్రం క్రిస్మస్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. నాగ్‌తో మల్టీస్టారర్ కూడా జనవరి నుంచే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. -
నేను శైలజ దర్శకుడితో నాని
వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని మరో సినిమాకు ఓకె చెప్పాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏతో పాటు మేర్లాపాక గాంధీ తెరకెక్కిస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. నేను శైలజ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ ప్రస్తుతం రామ్ హీరో ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు నాని. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. -
ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడు..!
-
ట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు..!
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫ్రెండ్ షిప్ డేకు ఒక్కరోజు ముందు రిలీజ్ చేశారు. రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీని స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేశారు . ట్రెండ్ మారినా ఫ్రెండు మారడు అంటూ సాగే ఈ పాటను ఆగస్టు 6 ఉదయం 10 గంటలకు రిలీజ్ అయ్యింది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించారు. రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. -
'ఉన్నది ఒక్కటే జిందగీ' ఫస్ట్ లుక్
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీని స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు . ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అంటూ సాగే ఈ పాటను ఆగస్టు 6 ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్ తో పాటు సాంగ్ రిలీజ్ ను కూడా తన ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేశాడు రామ్. This one is going to be Super Fresh!!! #VOZ First Look! NEXT- #TrendMarinaFriendMaradu single Out Tomorrow at 10AM!!! #VunnadhiOkateZindagi pic.twitter.com/WJxCvz2Bz7 — Ram Pothineni (@ramsayz) 5 August 2017 -
కొత్త కథ... కొత్త లుక్
గుబురు గడ్డం... కోర మీసం... కండలు తిరిగిన దేహం... కళ్లల్లో ఆనందం... హ్యాండ్సమ్ లుక్‌లో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు రామ్. ఈ కాన్ఫిడెన్స్‌తో కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. నటుడిగా, హీరోగా ‘నేను శైలజ’తో రామ్‌కు మంచి పేరు తీసుకొచ్చిన కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ కథానాయికలు. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పీఆర్ సినిమాస్ పతాకాలపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కొసరాజు రామ్మోహనరావు క్లాప్ ఇచ్చారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ – ‘‘రామ్ లుక్, స్టైల్ దగ్గర్నుంచి సినిమాలో ప్రతిదీ కొత్తగా ఉంటుంది. కిశోర్ తిరుమల మంచి కథ రెడీ చేశారు. ఏప్రిల్ 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఫ్రెష్ కాన్సెప్ట్‌తో, సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులు తమను ఐడెంటిఫై చేసుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రతి క్యారెక్టర్ లైవ్లీగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. యువ హీరో శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి నటించనున్న ఈ చిత్రానికి కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమేరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
టాలీవుడ్లో మరో సిక్స్ ప్యాక్ హీరో
ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన సిక్స్ ప్యాక్స్ బాడీ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు ఆరుపలకల దేహంతో ఆకట్టుకోగా.. తాజాగా మరో యంగ్ హీరో కూడా ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నాడు. నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన నెక్ట్స్ సినిమాలో సిక్స్ బ్యాడీతో కనిపించనున్నాడు. కొద్ది రోజులుగా కాలీగా ఉన్న యంగ్ హీరో రామ్ త్వరలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను ప్రారంభించనున్నాడు. ఇదే కాంబినేషన్లో రూపొందిన నేను శైలజ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా రామ్ కూడా కొత్త సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్ భాయ్ లుక్‌లో మాత్రమే కనిపించిన రామ్, ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో అలరించనున్నాడట. రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను రామ్ సొంతం నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గత ఆరు నెలలుగా ఏ సినిమాకు అంగీకరించకుండా కాలీగా ఉన్న రామ్, కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. -
హమ్మయ్య.. రామ్ డేట్ చెప్పేశాడు..!
నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్, ఆ తరువాత రిలీజ్ అయిన హైపర్తో మరోసారి ఆకట్టుకున్నాడు. అయితే హైపర్ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనతో చాలా రోజులు పాటు సినిమాను ఎనౌన్స్ చేయకుండా కాలం గడిపేశాడు. ఈ గ్యాప్‌లో కరుణాకరణ్, అనీల్ రావిపూడి లాంటి దర్శకులతో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. ఏది సెట్స్ మీదకు రాలేదు. ఫైనల్‌గా మరోసారి నేను శైలజ కాంబినేషన్‌కే ఫిక్స్ అయ్యాడు రామ్. మరోసారి కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రారంభించనున్నారు. రామ్ కండలు తిరిగిన దేహంతో కనిపించనున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేను శైలజ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి అదే కాంబినేషన్లో పనిచేస్తున్నాడు. -
కాంబినేషన్ రిపీట్
ఓ నోట్ ఎక్కువ కాదు.. ఓ నోట్ తక్కువ కాదు.. ‘నేను శైలజ’లో కథతో పాటు రామ్ నటన పర్ఫెక్ట్ నోట్లో సాగింది. సాధారణంగా రామ్ ఏ సినిమా చేసినా, అందులో అతడి డ్యాన్సులు, ఎనర్జీ గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. కానీ, ‘నేను శైలజ’లో రామ్ సెటిల్డ్ యాక్టింగ్ చేశాడని మంచి పేరొచ్చింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్లో సగం ‘నేను శైలజ’ కథా రచయిత, దర్శకుడు కిశోర్ తిరుమలకు దక్కుతుంది. రామ్‌లోని అంత మంచి నటుడిని బయటకు తీసింది ఆయనే కదా మరి! తాజా ఖబర్ ఏంటంటే... ‘నేను శైలజ’ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మరోసారి రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్, ‘స్రవంతి’ రవికిశోర్లకు దర్శకుడు కథ చెప్పడం, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయట! స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. ‘నేను శైలజ’కు పూర్తి భిన్నంగా ఈ కథ ఉంటుందట. ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లాలనుకుంటున్నారని భోగట్టా. -
కిశోర్కే ఓటేసిన రామ్
నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ హైపర్ తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. హైపర్ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ మీద కన్నేశాడు రామ్. అందుకే మరోసారి నేను శైలజ కాంబినేషన్ నే రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ముందు అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలని భావించినా.. ఇప్పుడే ప్రయోగం చేయటం ఇష్టం లేని రామ్ సేఫ్ గేమ్ కే మొగ్గుచూపుతున్నాడు. అయితే తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేను శైలజ లాంటి సినిమాతో తన కెరీర్‌కు కిక్ ఇచ్చిన, కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. నేను శైలజ తరువాత వెంకటేష్ హీరోగా ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు రామ్. ఆ సినిమా ఆగిపోవటంతో రామ్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాశాడు. రామ్ హోం బ్యానర్ స్రవంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
'నేను శైలజ' కాంబినేషన్లో మరో మూవీ
నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో హైపర్ సినిమాను పూర్తి చేసిన రామ్ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్‌కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేను శైలజ లాంటి సినిమాతో తన కెరీర్‌కు కిక్ ఇచ్చిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే వెంకటేష్‌తో సినిమా కమిట్ అయిన కిశోర్, రామ్‌తో సినిమాను మొదలెట్టడానికి కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. మరి ఈ గ్యాప్ లో రామ్ మరో సినిమా చేస్తాడేమో చూడాలి. -
ఇటు వినోదం... అటు కుటుంబం
ఇటు వినోదం.. అటు కుటుంబం.. రెండూ ఉన్న కథలంటే విక్టరీ వెంకటేశ్‌కి బాగా ఇష్టం. కాసేపు నవ్విస్తూ, ఇంకాసేపు కంటతడి పెట్టిస్తూ.. ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగించే చిత్రాల్లో నటిస్తుంటారాయన. వెంకటేశ్ కథానాయకుడిగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కను న్న చిత్రం ఈ కోవలోనే ఉంటుందట. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో పి.ఆర్.సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తరహాలో ఉంటుంది. వెంకటేశ్ పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఆయన్నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి’’ అని నిర్మాత అన్నారు.