
సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం కరుణాకరన్ డైరెక్షన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను కరుణాకరన్ ఫార్మట్‌లో ఉండే లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ‘తేజ్ ఐ లవ్ యూ’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తేజ్ ,అనుపమ జోడికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
అయితే కిషోర్ తిరుమల.. సాయి ధరమ్ తేజ్‌తో చేయబోయే తరువాతి సినిమాకు కూడా అనుపమానే హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారట. సో.. ఈ జోడి వరుసగా రెండు సినిమాల్లో వెండితెరపై సందడిచేయబోతోందన్నమాట. ఈ సినిమాలో అనుపమాతో పాటు, హలో ఫేం కళ్యాణీ ప్రియదర్శిన్ కూడా మరో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment