రవిశంకర్, మోహన్ చెరుకూరి, సాయిధరమ్ తేజ్, కిషోర్ తిరుమల, నవీన్ ఎర్నేని
‘‘నిన్నటివరకు వేడి వేడిగా ఎలక్షన్లు జరిగాయి. ఈ రోజు అందరూ సేద తీరటానికా అన్నట్లు మా సినిమా విడుదలైంది. అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ రావటం చాలా ఆనందంగా ఉంది’’ అని నవీన్ ఎర్నేని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ సివీయం∙నిర్మించిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ‘చిత్రలహరి’ విడుదలైంది.
ఈ చిత్రం తాము ఊహించినట్లుగా విజయం సాధించడం ఆనందంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి ‘సినిమా చాలా బావుంది, మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమైంది’ అని చెప్పటం, మార్నింగ్ షో నుండి మంచి మౌత్ పబ్లిసిటీతో సినిమాకు మంచి రెస్పాన్స్ ఉండటంతో మ్యాట్నీ కలెక్షన్స్ పెరిగాయి. ఏది ఏమైనా మొదటి మూడు రోజుల్లో అంటే ఆదివారం సాయంత్రంకల్లా మా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అవుతారని మా నమ్మకం’’ అన్నారు.
దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఏ సక్సెస్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూశానో అది ఈ రోజు నెరవేరింది. ప్రేక్షకులు అన్ని మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి ‘సార్.. ఇది నా పర్సనల్ స్టోరీలా ఉంది’ అన్నారు. ఐ యామ్ సో హ్యాపీ’’ అన్నారు. చిత్రకథానాయకుడు సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా జెన్యున్‌గా ఫీలై మా సినిమాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. నన్ను బోయ్ నెక్ట్స్ డోర్ (పక్కింటి కుర్రోడు)లా ఉన్నావని అంటున్నారు.
‘మా ఫాదర్‌తో రిలేషన్ సినిమాలో మీకు, మీ ఫాదర్‌కి ఉన్న రిలేషన్ లాగానే ఉంది సార్’ అని చాలా మంది కుర్రాళ్లు ట్వీటర్ వేదికగా చెబుతుంటే ఆనందంగా ఉంది. అవి రీ ట్వీట్‌లు చేసుకొంటూ, వాళ్లకి సమాధానం చెప్పటంతోనే ఈ రోజంతా సరిపోయింది. కలెక్షన్‌లు చాలా బావున్నాయి. చాలా రోజుల తర్వాత సక్సెస్‌మీట్‌లో పాల్గొంటున్నాను. ఈ సినిమా యూత్‌కి కనెక్ట్ అవ్వటంతో మంచి ఫలితం వచ్చింది. ఈ విజయం నా ఒక్కడిది కాదు, టీమ్ సక్సెస్. మెగాఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేశారు. నేను ముందు నుంచి అనుకున్నట్లుగానే మంచి విజయం సాధించాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment