మా అమ్మగారి ఆశ నెరవేరింది | Chitralahari movie pre release event | Sakshi
Sakshi News home page

మా అమ్మగారి ఆశ నెరవేరింది

Apr 8 2019 3:51 AM | Updated on Apr 8 2019 3:51 AM

Chitralahari movie pre release event - Sakshi

నవీన్‌ ఎర్నేని, కిషోర్, నివేదా, సాయిధరమ్‌ తేజ్, కల్యాణి, సునిల్, దేవిశ్రీప్రసాద్‌

‘‘కొరటాల శివ, సుకుమార్‌గారికి థాంక్స్‌. మా సినిమాకు ప్రారంభంలో ఎంతో బూస్ట్‌ ఇచ్చారు. మైత్రీ మూవీస్‌ నాకు స్పెషల్‌. ఎందుకంటే ఆరు సినిమాల ఫ్లాప్‌ తర్వాత నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి థ్యాంక్స్‌’’ అని సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు.  కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్, కల్యాణీ ప్రియదర్శన్‌  హీరోయిన్లు. నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవిశంకర్‌ నిర్మాతలు.

ఏప్రిల్‌ 12న ఈ సినిమా విడుదల కానున్న  సందర్భంగా  ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. చిత్రం ట్రైలర్‌ను కొరటాల శివ, సుకుమార్‌ విడుదల చేశారు. సుకుమార్‌ మాట్లాడుతూ – ‘‘కిషోర్‌ సెన్సిటివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఈ సినిమా ఒక ఉగాది పచ్చడిలాంటిది.  సినిమా కోసం బాడీ లాంగ్వేజ్‌ మార్చుకునే హీరోలు తమిళంలో ఉంటారు. అలాంటి హీరోల్లా సాయి ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. మంచి పాటలు కుదిరాయి ’’ అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘ఇంత మంది దర్శకులకు అవకాశం ఇస్తున్నారంటే సంస్థ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. పెద్ద సినిమాలే కాకుండా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు చేయాలని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ అధినేతల తపన. రైటర్‌గా మా దగ్గర పని చేసిన కిషోర్‌లో చాలా టాలెంట్‌ ఉంది.  తన నుండి చాలా చాలా మంచి సినిమాలు వస్తాయి. నాకీ కథ చెప్పారు. తేజు హానెస్ట్‌ పర్సన్‌. తను తప్ప ఎవరూ ఈ కథకు న్యాయం చేయలేరనిపించింది’’ అన్నారు. ‘‘కిషోర్‌ ఎప్పటి నుండో పరిచయం. దేవిశ్రీ మ్యూజిక్‌ అంటే నాకు చాలా ఇష్టం.

ఆయనతో పనిచేయాలని మా అమ్మగారు కోరుకున్నారు. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ఎన్ని ఫ్లాపులొచ్చినా, హిట్స్‌ వచ్చినా ఈ స్టేజ్‌పై ఉన్నానంటే కారణం మా మావయ్యలు.. మెగాభిమానులు’’ అన్నారు సాయిధరమ్‌ తేజ్‌. ‘‘నవీన్‌  ఎర్నేనిగారి వల్లే ఈ సినిమాకు ‘చిత్రలహరి’ అనే టైటిల్‌ పెట్టాను. అలాగే యలమంచిలి రవి, మోహ¯Œ గారికి థ్యాంక్స్‌. నా మూడు సినిమాలకు దేవీగారి మ్యూజిక్‌ పెద్ద ఎసెట్‌గా నిలుస్తూ వచ్చింది. కార్తీక్‌ కెమెరామేన్‌గానే కాదు.. కథలో నాతో పాటు ట్రావెల్‌ అవుతూ వచ్చారు.

నేను రైటర్‌గా ఉన్నప్పటి నుండి తేజుతో పరిచయం ఉంది. తప్పకుండా అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు కిషోర్‌ తిరుమల. ‘‘ఇందులో లహరి అనే పాత్ర చేశాను. సొంత వాయిస్‌తో డబ్బింగ్‌ కూడా చెప్పాను’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్‌ . ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు నివేదా పేతురాజ్‌. ఈ వేడుకలో సునీల్, బ్రహ్మాజీ, దర్శకులు సంతోష్‌ శ్రీనివాస్, వెంకీ కుడుముల, మారుతి, శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement