వాళ్లలా నొప్పించి సంపాదించడం లేదు | sunil interview about chitralahari | Sakshi
Sakshi News home page

వాళ్లలా నొప్పించి సంపాదించడం లేదు

Published Mon, Apr 15 2019 12:06 AM | Last Updated on Mon, Apr 15 2019 5:18 AM

sunil interview about chitralahari - Sakshi

సునీల్‌

‘‘గెలుపు, ఓటమి అనేది దేవుడు సృష్టించింది కాదు. మనం పెట్టుకున్న గేమ్‌ అది. ఇందులో ఫస్ట్‌ వస్తే సక్సెస్‌. అది త్వరగా సాధిస్తే సక్సెస్‌. ఇలా అన్నీ మనం ఆడుకుంటున్న ఆటలు. ఇలా ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్లు పరిగెడుతున్నాం. గెలిచిన వాడిని అభినందించకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినవాడిని తక్కువ చేయడానికి ప్రయత్నించకుండా ఉండాలి’’ అని సునీల్‌ అన్నారు. సాయిధరమ్‌ తేజ్, కల్యాణి ప్రియ దర్శన్, నివేథా పేతురాజ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో కమెడియన్‌ పాత్రలో ప్రేక్షకులను అలరించిన సునీల్‌ పంచుకున్న విశేషాలు...

► మనోజ్, విష్ణులతో సినిమాలు చేసే సమయం నుంచి తేజు నాకు తెలుసు.  మాతో చాలా బాగా కలసిపోయేవాడు. అప్పట్లో తేజుని హీరోగా పెట్టి నేను ఓ సినిమా దర్శకత్వం చేద్దామనుకున్నాను. ఇప్పటికి కలసి యాక్ట్‌ చేసే చాన్స్‌ వచ్చింది.  

► నా గ్లాస్‌మేట్స్‌ చాలా మంది ఉన్నారు. చెబితే లిస్ట్‌ సరిపోదు. ఉన్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌లో త్రివిక్రమ్‌ ఒకరు. ఆనందం అయినా, బాధ అయినా తనతో పంచుకోవాలనుకుంటాను. కష్టం దాటగలిగే కాన్ఫిడెన్స్‌ మాలో నింపేవాడు త్రివిక్రమ్‌. 

► ఇప్పుడు టెక్నాలజీని(ఫేస్‌బుక్, ట్వీటర్‌) ఉపయోగాల కంటే అనవసరమైన వాటికే వాడుతున్నాం. ఇటీవల ఏదో యూట్యూబ్‌ వీడియోలో నేను చనిపోయాను అని ఓ వీడియో పోస్ట్‌ చేసేశారు. అంటే వ్యూస్‌ కోసం వేరే వాళ్లను హర్ట్‌ చేసేస్తారా? లీగల్‌గా ప్రొసీడ్‌ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్లు సారీ చెప్పేశారు. వాళ్లను మళ్లీ ఇబ్బంది పెడితే నాకేం వస్తుంది? అని వదిలేశాను. వాళ్లలా ఎదుటి వ్యక్తిని నొప్పించి నేను సంపాదించడం లేదు. అందర్నీ నవ్వించి సంపాదిస్తున్నాను. 

► సోషల్‌ మీడియా రావడం వల్ల ప్రతిదీ వార్త అయిపోయింది. ఆ వార్త చదువుతూ మీ టైమ్‌ను వేస్ట్‌ చేస్తున్నారు. ఆ సమయంలో ఇంకో మంచి ఆలోచన చేయొచ్చు కదా?

► కమెడియన్‌ నుంచి హీరోగా మారినప్పుడు యాక్షన్‌ కామెడీ చేద్దాం అనుకున్నాను. హాలీవుడ్‌ సినిమాల్లో హీరో పక్కన ఉండే క్యారెక్టర్లు కూడా ఫిట్‌గా సిక్స్‌ ప్యాక్స్‌తోనే కనిపిస్తారు. యాక్షన్‌ కామెడీ హీరోగా చేయాలని సిన్సియర్‌గా ట్రై చేశా. హీరోగా సినిమాలు చేస్తున్నానని కామెడీ పాత్రలు చేయమని అడగడం తగ్గించారు దర్శక–నిర్మాతలు. హీరోగా నాకు నచ్చినవి కొన్ని ఉంటే నిర్మాతల వల్ల ఒప్పుకున్న సినిమాలు మరికొన్ని. అప్పుడు ఫెయిల్యూర్స్‌ ఎదుర్కొన్నా నాతో చాలా మంది నిలబడ్డారు. నాకు ఇండస్ట్రీలో ఎవరితో గొడవలు లేవు. అందరితో బావుంటాను. నా అదృష్టం అదే.

► మన సినిమాలు ఎక్కువ శాతం హాలీవుడ్‌ కాపీయే. మనవి  వాళ్ల దగ్గరకు వెళ్లడం ఉండదు. 

► హీరోగా కాకుండా కమెడియన్‌గా కొనసాగాలనుకుంటున్నాను. అప్పుడు నెలకు 2సార్లు తప్పకుండా ప్రేక్షకులను పలకరించవచ్చు. హీరోగా సంపాదిస్తున్న దానికంటే తక్కువ వస్తుంది కదా? అని మీరు అడిగితే ఒకేసారి పది రూపాయిలు తీసుకున్నా, పదిసార్లు రూపాయి తీసుకున్నా అంతే కదా అంటాను. 

► కామెడీ సినిమాలకు డిమాండ్‌ ఎప్పటికీ ఉంటుంది. మనం కథ రాయకుండా కామెడీ సినిమాలు లేవు అనడం కరెక్ట్‌ కాదు. ‘మొన్న’ ఎఫ్‌ 2’ సక్సెసే ఇందుకు నిదర్శనం.

► ప్రస్తుతం అల్లు అర్జున్‌– త్రివిక్రమ్, రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో చేస్తున్నాను. నా అభిమాన హీరోతో ఓ పెద్ద సినిమాలో చేస్తున్నాను (చిరంజీవి–కొరటాల శివ సినిమాను ఉద్దేశిస్తూ).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement