చీకటికి చిరునామా నేను.. చిత్రలహరి | Sai Dharam Tej Chitralahari Trailer | Sakshi
Sakshi News home page

చీకటికి చిరునామా నేను.. చిత్రలహరి

Published Sun, Apr 7 2019 10:19 AM | Last Updated on Sun, Apr 7 2019 10:19 AM

Sai Dharam Tej Chitralahari Trailer - Sakshi

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. సక్సెస్‌ కోసం సెంటిమెంట్‌లను కూడా ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాలో తన పేరును సాయి తేజ్‌  అని వేసుకుంటున్నాడు ఈ మెగా హీరో. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్రయూనిట్ థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. కెరీర్‌లో సక్సెస్‌అన్నదే లేని ఓ యువకుడి కథ చిత్రలహరి. సాయి ధరమ్‌ సరసన కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాలో సునీల్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement