నాలుగు విభిన్న పాత్రల కథ ‘చిత్రలహరి’ | Sai Dharam Tej And Kishore Tirumala Chitralahari Teaser | Sakshi
Sakshi News home page

నాలుగు విభిన్న పాత్రల కథ ‘చిత్రలహరి’

Published Wed, Mar 13 2019 9:58 AM | Last Updated on Wed, Mar 13 2019 9:58 AM

Sai Dharam Tej And Kishore Tirumala Chitralahari Teaser - Sakshi

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు చిత్రయూనిట్. సినిమాలోని ప్రధాన పాత్రల స్వభావాలను టీజర్‌లోనే చెప్పేశారు. ఆపాత్ర మధ్య జరిగే సరదా సంఘటనలే ఈ సినిమా కథ అంటూ హింట్‌ ఇచ్చేశారు.

నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ మరో కీలక పాత్రలో అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement