‘చిత్ర’మైన టైటిల్‌తో నేచురల్ స్టార్‌? | Chitralahari Title for Nani | Sakshi
Sakshi News home page

నాని కోసం చిత్రలహరి టైటిల్‌?

Published Thu, Oct 19 2017 11:00 AM | Last Updated on Thu, Oct 19 2017 1:14 PM

Chitralahari Title for Nani

సాక్షి, సినిమా : టాలీవుడ్‌లో నాని వేగాన్ని అందుకునే స్టార్ మరెవరూ కనిపించటంలేదు. వరుసగా సినిమాలు.. వాటి సక్సెస్‌లతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు. ఇప్పటికే ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం షూటింగ్‌లో పాల్గొంటున్న నాని.. హను రాఘవపూడితో ఓ చిత్రం కమిట్‌ కాగా, విక్రమ్‌ కుమార్‌ కథను దాదాపు ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని సైతం నేచురల్ స్టార్ ఓకే చెప్పినట్లు సమాచారం.

నేను శైలజ ఫేమ్‌ కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడంట. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం 'చిత్రలహరి' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. టైటిల్ క్యాచీగా ఉండటం.. పైగా టైటిల్‌ రిజిస్ట్రర్‌ కావటంతో దాదాపు ఖాయమనే అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జనవరిలో గానీ .. ఫిబ్రవరిలోగాని ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. 

ఓవైపు నాని ఎంసీఏ చిత్రం క్రిస్మస్‌ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. నాగ్‌తో మల్టీస్టారర్‌ కూడా జనవరి నుంచే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement