నేను శైలజ దర్శకుడితో నాని | Nani next movie with Kishore Tirumala | Sakshi
Sakshi News home page

నేను శైలజ దర్శకుడితో నాని

Published Sun, Oct 15 2017 1:57 PM | Last Updated on Sun, Oct 15 2017 3:57 PM

Hero Nani

వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని మరో సినిమాకు ఓకె చెప్పాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏతో పాటు మేర్లాపాక గాంధీ తెరకెక్కిస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

నేను శైలజ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ ప్రస్తుతం రామ్ హీరో ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు నాని. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement