అమెరికాకు మెగా హీరో.. అందుకేనా? | Sai Dharam tej Make over For Chitralahari | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 15 2018 12:32 PM | Last Updated on Sun, Jul 15 2018 12:32 PM

Sai Dharam tej Make over For Chitralahari - Sakshi

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు ప్రస్తుతం బ్యాడ్‌ టైం నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన తేజ్‌  కెరీర్‌ స్టార్టింగ్‌లో పరవాలేదనిపించినా తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డాడు.  ఇటీవల విడుదలైన తేజ్‌ ఐ లవ్‌ యు కూడా ఆకట్టుకోలేకపోవటంతో ఈ యంగ్ హీరో ఆలోచనలో పడ్డాడు. కథల ఎంపికతో పాటు లుక్‌ విషయంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు సాయి ధరమ్‌.

అందుకే తన తదుపరి చిత్రంలో సరికొత్తగా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు ఈ మెగా హీరో. అందుకే మేకోవర్ కోసం అమెరికా వెళ్లనున్నాడట. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రలహరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఈ సినిమాలో సాయి ధరమ్‌ సరసన కల్యాణీ ప్రియదర్శన్‌, రితికా సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement