Makeover
-
మిషన్ మేకోవర్
సినిమా కథకు తగ్గట్లుగా డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ చేయడమే కాదు... క్యారెక్టరైజేషన్‌కు సరిపోయేట్లు హీరోల ఆహార్యం కూడా ఉండాలి... గెటప్ కుదరాలి. అప్పుడే సిల్వర్ స్క్రీన్‌పై కథ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇలా కనెక్ట్ కావడం కోసం కొందరు హీరోలు మేకోవర్ మిషన్‌ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ‘తండేల్’ కోసం నాగచైతన్య, ‘స్వయంభూ’కి నిఖిల్, ‘స్వాగ్’కి శ్రీవిష్ణు వంటి హీరోలు మేకోవర్ అయ్యారు. త్వరలో సెట్స్‌కి వెళ్లడానికి మిషన్ మేకోవర్ అంటూ రెడీ అవుతున్న హీరోల గురించి తెలుసుకుందాం.⇒ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్‌పై మహేశ్‌బాబును సరికొత్తగా చూపించాలని రాజమౌళి ఫిక్స్ అయిపోయారు. ఇందుకు తగ్గట్లుగానే మహేశ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. మేకోవర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో మహేశ్ విదేశాలకు వెళ్లొచ్చారు. ఈ సినిమాలో మహేశ్ లుక్, గెటప్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఈ చిత్రకథను ఇప్పటికే పూర్తి చేశారు విజయేంద్రప్రసాద్. పాటల పని కూడా ఆరంభించారు సంగీతదర్శకుడు కీరవాణి. ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ గురించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ కొత్త సినిమా మేకోవర్ అంటే చాలు... ఎన్టీఆర్ రెడీ అనేస్తారు. ఈసారి దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ ఓకే చెప్పారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామని ఇటీవల మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ గ్యాప్‌లో ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. వీలైనంత త్వరగా ఈ సినిమా తొలి భాగం షూట్‌ను పూర్తి చేసి, ‘డ్రాగన్’ మేకోవర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట ఎన్టీఆర్. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా, విలన్‌గా బాబీ డియోల్ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ⇒ ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్‌తో రామ్‌చరణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తన వంతు షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత రామ్‌చరణ్ ఆస్ట్రేలియా వెళ్తారు. హాలీడే కోసం కాదు.... బుచ్చిబాబు సన దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలోని క్యారెక్టర్ మేకోవర్ కోసం వెళ్లనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులోప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బుచ్చిబాబు. కాగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ మూవీలోని గెటప్స్ కోసం చరణ్ ప్రత్యేక్ష శిక్షణ తీసుకోనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ⇒ విజయ్ దేవరకొండను ఇప్పటివరకు అర్బన్, సెమీ అర్బన్ కుర్రాడిగానే ఎక్కువగా సిల్వర్ స్క్రీన్‌పై చూశాం. కానీ తొలిసారి పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ మాస్ డ్రామాగా ఓ మూవీ రానుంది. ఈ సినిమా కోసమే విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా మేకోవర్ కానున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తన కొత్త మేకోవర్ ఆరంభిస్తారట విజయ్. ⇒ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన గత చిత్రం ‘ఏజెంట్’. ఈ స్పై మూవీ కోసం అఖిల్ స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేశారు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటించాల్సిన కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ అఖిల్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఫ్యాంటసీ అండ్ పీరియాడికల్ యాక్షన్ మూవీలో అఖిల్ హీరోగా నటిస్తారని, 11వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ ట్రైబల్ నాయకుడిగా అఖిల్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ్రపోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.ఈ సినిమాలోని తన గెటప్ కోసమే అఖిల్ మేకోవర్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త పోడవాటి జుట్టుతో, సరికొత్త ఫిజిక్‌తో అఖిల్ సరికొత్తగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ కోసమే అఖిల్ ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారట. దాదాపు రూ. వంద కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ హీరోలే కాదు... కథానుగుణంగా మేకోవర్ అవుతున్న హీరోలు మరికొందరు ఉన్నారు. -
భయపెడుతున్న బ్యూటీ.. చూపు తిప్పుకునే సమస్యే లేదు! (ఫోటోలు)
-
బీస్ట్ మోడ్‌లో హీరో సూర్య.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య42గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కంగువ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవలె ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం సూర్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. తన పాత్రకు తగ్గట్లు లుక్ మార్చుకునేందుకు బాగానే కష్టపడుతున్నాడు సూర్య. తాజాగా జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న సూర్య ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుంది. -
ఇండియన్ 2కు కాజల్ మేకోవర్.. మేకప్‌కు మూడున్నర గంటలు!
మేకప్ గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లోక నాయకుడు కమలహాసన్ పేరే. ఆయన పాత్రలకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, గెటప్పులకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. దశావతారం చిత్రంలో ఏకంగా 10 పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ పాత్రల కోసం ఆయన కేవలం మేకప్ కోసమే నాలుగైదు గంటలు వెచ్చించేవారు. ఇక ఇండియన్ చిత్రంలోని కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా మారిపోయి గుర్తు పట్టలేనంతగా అబ్బురపరిచారు. ఇక అదే చిత్రంలో నటి సుకన్య కూడా ఆయనకు సరి సమాన మేకప్‌తో మేకోవర్ అయ్యి నటించి నప్పించారు. 1996లో విడుదలైన ఆ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ –2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనేక ఒడుదుడుకుల మధ్య నాలుగేళ్లు గడిచిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటోంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియాస్నీ శంకర్, నటుడు సిద్ధార్థ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. 90 ఏళ్ల వృద్ధుడు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమలహాసన్ నటిస్తుండగా, ఆయనకు జంటగా నటి కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కాజల్ కూడా బామ్మ పాత్ర కోసం మేకోవర్ అవుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం తనూ మేకప్ కోసం రోజూ మూడున్నర గంటల సమయాన్ని ప్రత్యేకంగా వెచ్చిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది ఇండియన్ చిత్రంలో నటి సుకన్య నటించిన పాత్రకు సీక్వెల్ అని సినీ వర్గాలు భావిస్తున్నారు. చదవండి: హీరోయిన్ రితికా సింగ్‌కు చేదు అనుభవం తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? -
నటి సీత 55 ఏళ్ల వయసులోనూ ఎంత అందంగా ఉందో..
తమిళసినిమా: మనసుకు వయసుతో పని లేదంటారు. అయితే ఆలోచనలు, అలవాట్లపై ప్రభావం చూపుతాయి. నటి సీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1985లో పాండిరాజ్ దర్శకుడిగా, కథానాయకుడిగా పరిచయం అయ్యారు. అదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన నటి సీత. తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న లక్కీ హీరోయిన్. ఆ తరువాత ప్రముఖ నటులతో జతకట్టి పాపులర్ అయ్యారు. తెలుగు తదితర భాషల్లోనూ నటించారు. కాగా 1990లో నటుడు పార్తీపన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన పుదియపాదై చిత్రంలో ఆయనకు జంటగా సీత నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దీంతో నటనకు దూరమయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2001లో విడాకులు తీసుకున్నారు. నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అక్క, అమ్మ, పాత్రల్లో నటిస్తున్నారు. బుల్లితెర, తెలుగులోన నటిస్తున్న సీత 2010లో సురేష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలువ లేదు. నటనను కొనసాగిస్తున్న సీత వయసు జస్ట్ 55. తాజాగా ఆమె స్పెషల్ ఫొటో షట్ చేసుకుని ఆ ఫొటోలను సావజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ ఫొటోలను చూస్తే కొత్తవారు అనుకుంటున్నారు. ఇలా సీతను చూస్తే అందానికి వయసుకు సంబంధం ఉండదనిపిస్తోంది. తన అవయవ సంపదను తెలియచేయడానికే సీత ఈ ఫొటోలను సామాజిక మాద్యమాలకు విడుదల చేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Seetha PS (@seethaps67) -
కేదార్నాథ్ గోడలకు బంగారు తాపడం వద్దు
డెహ్రాడూన్: హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయ గర్భగుడి లోపలి గోడలకు బంగారు రేకుల తాపడం చేయడంపై తీర్థపురోహితుల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి. వెండి రేకుల స్థానంలో బంగారు రేకులను తాపడం చేయిస్తానంటూ మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు ముందుకు రాగా ఆలయ కమిటీ అనుమతించింది. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇది ఆలయ ఆచారాలకు విఘాతమంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. బంగారు రేకుల తాపడం కోసం చేపట్టే డ్రిల్లింగ్‌తో గర్భాలయ గోడలకు నష్టమన్నది వారి ఆందోళన. దీన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయేంద్ర అజయ్ కొట్టిపారేశారు. ‘‘బంగారు తాపడంలో తప్పేముంది? దీన్ని కావాలనే వ్యతిరేకిస్తున్నారు’’ అన్నారు. -
RC15 కోసం మేకోవర్.. రామ్‌చరణ్ అలా కనిపిస్తాడా?
క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే ఫిజిక్‌ని అలా మార్చుకోవడానికి రామ్‌చరణ్ వెనకాడరు. ఇంతకుముందు కొన్ని చిత్రాలకు మేకోవర్ అయిన చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇది యాక్షన్ ఓరియంటెడ్ మూవీ కావడంతో భారీ ఫైట్స్ ఉంటాయి. ఫైట్స్ చేయాలంటే ఫిట్‌గా ఉండాలి. ఆ ఫిట్నెస్ కోసం, ఒక స్పెషల్ లుక్‌లో కనిపించడానికే చరణ్ స్పెషల్ వర్కవుట్స్ చేస్తున్నారని టాక్. అలాగే వయసుపరంగా వివిధ దశల్లో కనిపిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగా ఫిజిక్‌ని మార్చుకుంటున్నారట. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌లో ఈ చిత్రం కొత్త షెడ్యల్‌ను ఆరంభించనున్నారు. -
Makeover Tips: టైమ్‌పాస్ కోసం చేరా.. 2 గంటలకు ఆరున్నర వేలు.. ఇలా చేస్తే
Makeover Tips: ఏ వేడుకకు ఏ డ్రెస్ వేసుకోవాలో సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం మనకు తెలిసిందే! అలాగే, ముఖం రోజంతా ఫ్రెష్‌గా కనిపించాలంటే ఏ మేకప్ వాడాలి?! కురులను కొంగొత్తగా సింగారించాలంటే ఏ స్టైల్‌ని ఫాలో అవ్వాలి?! అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మేకప్ ఆర్టిస్ట్ గురించిన వెతుకులాట తప్పదు. టాప్ టు బాటమ్ లుక్ స్టైల్‌గా, సంప్రదాయంగా, సందర్భానుసారంగా అతివల కలలకు మెరుగులు దిద్దే మేకోవర్ ఆర్టిస్ట్ విమలారెడ్డి చెబుతున్న వివరాలివి.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి ఆర్గానిక్ కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా క్లాసులు తీసుకున్న లెక్చరర్ విమలారెడ్డి హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉంటున్నారు. ఎనిమిదేళ్లుగా మేకోవర్ ఆర్టిస్ట్‌గా ఈ రంగంలో రాణిస్తున్నారు. బ్రైడల్, సీజనల్, సెలబ్రిటీ మేకోవర్‌పై వర్క్ చేస్తున్న విమలారెడ్డి తన గురించిన విశేషాలే కాదు, మేకప్ అండ్ హెయిర్‌కి సంబంధించిన వివరాలనూ తెలియజేశారు. ‘‘లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్న నేను పెళ్లయ్యాక ఆరు నెలలు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో పేపర్లో బ్యూటీ కోర్స్ ప్రకటన చూసి, టైమ్‌పాస్ కోసం వెళ్లి, చేరాను. ఆ తర్వాత తిరిగి లెక్చరర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఏడేళ్ల క్రితం నాతోపాటు కోర్సు చేసిన అమ్మాయి ఓ పెళ్లి ఫంక్షన్లో సాయంగా ఉండమని కోరితే వెళ్లాను. రెండు గంటలు సాయం చేస్తే ఆరున్నర వేల రూపాయలు వచ్చాయి. దీంతో కొన్నాళ్లు టీచింగ్ చేస్తూనే బ్యుటీషియన్గానూ ఆర్డర్స్ మీద బ్రైడల్ మేకప్ చేస్తుండేదాన్ని. నాకు నచ్చిన టైమ్‌లో వర్క్ చేయచ్చు. ఆర్థికంగానూ బాగుందనిపించింది. దీంతో పూర్తిగా మేకోవర్‌నే వృత్తిగా మార్చుకొని ఈ రంగంలోకి వచ్చాను. నాకు పెన్సిల్ ఆర్ట్ అంటే చిన్నప్పుటి నుంచి ఇష్టం ఉండేది. ఆ ఆర్ట్ మేకప్‌లో నాకుబాగా సాయపడింది. పెళ్లితో పాటు ఇతర సెలబ్రేషన్స్, సెలబ్రిటీస్తోనూ వర్క్ చేయడం నచ్చింది. కొన్ని షూట్స్ వల్ల అవకాశాలు కూడా బాగా వచ్చాయి. ఇటీవల ‘గ్రే’ తెలుగు మూవీకి మేకప్ ఆర్టిస్ట్‌గానూ చేశాను. 2019లో మేకప్ కాంపిటీషన్లో పాల్గొని, గెలుపొందాను. అలాగే, మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్‌కి సంబంధించిన క్లాసులూ తీసుకుంటున్నాను. కంటి మేకప్ యూనివర్సల్ సహజంగా కనిపించాలని, వేసవిలో కళ్ల వరకు మాత్రమే వాటర్‌ప్రూఫ్ మేకప్‌ని కోరుకునేవారున్నారు. పెదాలకు గ్లాసీ లిపిస్టిక్ వాడితే సరిపోతుంది. చాలావరకు మనవాళ్లందరికీ కళ్ల చుట్టూ, మూతిచుట్టూ, నుదుటిపైన కొద్దిపాటి నలుపు ఉంటుంది. వీటిని కవర్ చేసుకుంటే చాలు, ఎక్కువ మేకప్ లేకపోయినా చేయకపోయినా నీట్‌గా కనిపిస్తుంది. కళ్లు డల్‌గా కనిపించకుండా ఉండటానికి మస్కారా, లిప్‌స్టిక్ వేసుకుంటే చాలు ఫ్రెష్‌లుక్ కనిపిస్తుంది. చర్మరక్షణ ముఖ్యం పెళ్లి వంటి ముఖ్యమైన సందర్భాలు ఉన్నప్పుడు కొన్ని నెలల ముందే మమ్మల్ని సంప్రదిస్తుంటారు. వారి ఫొటోస్ మాకు పంపిస్తారు. వాళ్ల స్కిన్ టోన్ (ఆయిలీ, డ్రై, కాంబినేషన్ స్కిన్) ఏంటో కనుక్కొని అందుకు తగిన జాగ్రత్తలు చెబుతుంటాను. వాడాల్సిన ఫేస్‌వాష్, టోనర్, ఫేషియల్స్ గురించి మాత్రమే కాదు తీసుకునే ఆహారం, డెర్మటాలజిస్ట్‌ను కలవాల్సిన అవసరం, వ్యాయామాలు... దాదాపు 6 నెలల ముందే అన్నీ చెబుతాను. మాంసాహారం తగ్గించమని, జ్యూసులు, నీళ్లు, సలాడ్స్ ఎక్కువ తీసుకోమని చెబుతాను. అలాగే, లేట్ నైట్స్ ఆహారం తీసుకోవద్దని, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే మానేయమని చెబుతుంటాను. నెలకు ఒకసారి రెడీ మేడ్ మాస్క్ అయినా వేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఆరోగ్యం బాగుంటే చర్మం, జుట్టు కూడా బాగుంటుంది. అప్పుడు మేకోవర్ కూడా హెల్దీగా కనిపిస్తుంది. నాణ్యమైన ఉత్పత్తులు మేకప్, డ్రెస్, హెయిర్, జ్యువెలరీ .. ఇవన్నీ సెట్ చేయడానికి 3–4 గంటల సమయం పడుతుంది. మేకప్‌కి వాడే ప్రొడక్ట్స్ క్వాలిటీ బట్టి ధర ఉంటుంది. ఉపయోగించిన మేకప్ 12 నుంచి 16 గంటల వరకైనా తాజాగా ఉండే ఖరీదైన ప్రొడక్ట్స్ వచ్చాయి. వీటితో ఫినిషింగ్ మాత్రమే కాదు చర్మం కూడా బాగుంటుంది. కొన్ని ప్రొడక్ట్స్ ఉపయోగించినా మేకప్ చేసుకున్నట్టు తెలియదు. అంత నేచురల్‌గా ఉంటాయి. వేడుకల సమయాలను బట్టి మా వర్క్ ఉంటుంది. దీనిని అర్థం చేసుకునే కుటుంబం, పని పట్ల శ్రద్ధ, ఈ రంగంలో ఎదగాలన్న తపన ఉంటే ఈ రంగంలో ఎవరైనా రాణించవచ్చు’ అని వివరిస్తారు ఈ మేకోవర్ ఆర్టిస్ట్. – నిర్మలారెడ్డి నేటి మేకప్ ట్రెండ్స్ ►నేటి పెళ్లిళ్లలో చాలా వరకు వాటర్ ఫ్రూఫ్, గ్లాసీ, ట్రాన్స్పరెంట్ మేకప్ ఎక్కువ వాడుతున్నారు. ►పెళ్లి సమయంలో చమట పట్టే అవకాశం ఉంది. అలాగే, అప్పగింతలప్పుడు వారికి తెలియకుండానే ఏడ్చేస్తుంటారు. ►ఇలాంటప్పుడు మేకప్ చెదరకుండా, దాదాపు ఎనిమిది గంటల పాటు ఉండాలంటే వాటర్‌ఫ్రూఫ్ మేకప్ సరైన ఎంపిక అవుతుంది. ►నేచురల్‌గా హెల్దీ లుక్ కనిపించడంతో పాటు షైనీగా ఉండాలనుకునేవారు గ్లాసీ మేకప్‌ను ఎంచుకుంటారు. ►ట్రాన్స్పరెంట్ కూడా అలాంటిదే. లిప్‌స్టిక్ పెట్టుకొని తిన్నా, వేటికీ అంటుకోకుండా ఉంటుంది. ►వేసవిలో వీటిని ఎక్కువ కోరుకుంటారు. ►నార్మల్ కెమరాతో కాకుండా హెచ్డి కెమరా పిక్సల్ సైజ్ బాగుంటుంది. అలాగే, హెచ్డీ క్వాలిటీ మేకప్ కూడా ఉంది. ►చేతులతో ముఖాన్ని టచ్ చేయకుండా మెషిన్‌తో ప్రొడక్ట్స్ స్ప్రే చేస్తూ మేకప్ చేస్తాం. దీనిని ఎయిర్‌బ్రష్ మేకప్ అంటాం. ► చదవండి: Aishwarya Bhagyanagar: మూడు వందలకు పైగా డాన్స్ ప్రదర్శనలు.. అంతేకాదు చిత్రకారిణి కూడా! -
TSRTC: ఆర్టీసీ బస్సు.. అదరహో!
సాక్షి, హైదరాబాద్: చూడగానే తళతళ మెరిసేలా, ఎక్కగానే కళకళలాడేలా ఆర్టీసీ బస్సు కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. రంగులు, హంగులతో ప్రయాణికులను ఆకట్టుకునేలా ముస్తాబవుతోంది. కొత్తగా అనిపించేలా మురిపించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నింటికీ కొత్తగా రంగులేస్తున్నారు. ఎక్కడికక్కడ డిపోల్లో ఆర్టీసీ గ్యారేజీ సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. అప్పట్లో ఆదాయం కోసం ఆర్టీసీ బస్సులపై వాణిజ్య ప్రకటనలకు అవకాశం కల్పించారు. ఆ ప్రకటనలు వినాయిల్ షీట్లతో రూపొందించిన పోస్టర్లను బస్సులపై అతికించేవారు. దీంతో బస్సుల అసలు రంగులు ఏమిటో తెలుసుకోవడం గగనమయ్యేది. ప్రకటన గడువు తీరగానే ఆ పోస్టర్లను పీకేస్తుండటంతో దానికుండే జిగురు కొంత అలాగే ఉండిపోయి, దానికి దుమ్ము, ధూళి అంటుకుని బస్సులు అందవిహీనంగా కనిపిస్తూ వచ్చాయి. మరోవైపు ప్రకటనల కారణంగా, ఆ బస్సు ఎక్స్‌ప్రెస్సా, ఆర్డినరీనా అనేది తెలియకుండా పోయింది. దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. బస్సులపై ప్రకటనల విధానానికి చెక్ పెట్టారు. ఆ బస్సులన్నింటికీ కొత్త రంగులు వేసి కొత్తవాటిల్లా మెరిసేలా చేయాలని ఆదేశించారు. దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ ఉండగా బస్సులకు రంగులు మార్పించారు. ఇంకా అవే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుత రంగుల డిజైన్ బాగానే ఉందని ఎక్కువమంది అధికారులు అభిప్రాయపడటంతో వాటినే కొనసాగించాలని నిర్ణయించి, ఆ మేరకు రంగులేస్తున్నారు. సొంత డిపోల్లోనే.. ఆర్టీసీకి ప్రతి డిపోలో సొంత గ్యారేజీలున్నాయి. నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఎండీ ఆదేశాల మేరకు ఏ డిపో బస్సులకు ఆ డిపోలోనే సొంత సిబ్బందితో రంగులద్దిస్తున్నారు. ట్రిప్పులకు ఇబ్బంది లేకుండా రోజుకు ఒకటి, రెండు చొప్పున బస్సులను మాత్రమే డిపోలో ఉంచి రంగులేస్తున్నారు. దీంతో అన్ని బస్సులకు రంగుల ప్రక్రియ పూర్తి చేయటానికి డిసెంబర్ చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పట్లో రూ.4 కోట్ల దుబారా.. మహిళాప్రయాణికులకు వేధింపులు ఎక్కువయ్యాయనే ఫిర్యాదులు రావడంతో అధికారులు కొంతకాలం క్రితం సిటీ బస్సుల్లో ప్రత్యేక పార్టిషన్ తెరలు ఏర్పాటు చేశారు. అల్యూమినియం ఫ్రేములు అమర్చి దానికి డోర్ బిగించారు. మహిళలు ముందు వైపు పరిమితం కాగా, పురుషులు అటుగా వెళ్లేందుకు వీలులేకుండా చేయటం దీని ఉద్దేశం. ఈ ఫ్రేములు బిగించే పనిని డిపోల్లో గ్యారేజే సిబ్బందికి కాకుండా ఓ ఉన్నతాధికారి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఇందుకు రూ.4 కోట్లకుపైగా అప్పట్లో ఖర్చయినట్టు సమాచారం. ఈ విషయంలో అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తినా నాటి ఎండీ పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా ఫ్రేములు వినియోగంలో లేవు. దీంతో రూ.4 కోట్ల వ్యయం వృథాగా మారినట్టయింది. -
బిజీ అవుతున్న యువ నటుడు
‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించిన చరణ్‌దీప్ సూరినేని సరికొత్త మేకోవర్‌లో రెడీ అయ్యాడు. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించిన చరణ్‌దీప్‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు ఈ యువ నటుడు. తాజాగా ఈ చరణ్ న్యూలుక్లో ఆకట్టుకుంటున్నాడు. జుట్టు బాగా పెంచి, గడ్డంతో మెడ్రన్ లుక్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కల్కి’ చిత్రాల్లో నటిస్తున్నాడు చరణ్ దీప్. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘సీమరాజా’లో చరణ్ సూరినేని కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, మేకోవర్ గురించి చరణ్ సూరినేని మాట్లాడుతూ ‘రాజశేఖర్ గారి ‘పీఎస్వీ గరుడవేగ’లో పాజిటివ్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రాజశేఖర్ గారితో నటించే అవకాశాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్పించారు. రాజశేఖర్ గారు, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కిలో నేను పోలీస్ పాత్రలో నటిస్తున్నా. గరుడవేగలో నాది పాజిటివ్ క్యారెక్టర్ అయితే... కల్కిలో నెగిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాతో పాటు చిరంజీవిగారితో 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నా. ఆ పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పలేను. అయితే మంచి పాత్రలో నటిస్తున్నానని చెప్పగలను. అలాగే, తమిళంలోనూ నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికి ఓ పది సినిమాల్లో నటించాను. ప్రస్తుతం తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా. మరో మూడు నాలుగు భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ డిజిటల్ ఫ్లాట్ఫార్మ్ కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్‌లో నటించమని సంప్రదించారు. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా’ అన్నారు. -
అమెరికాకు మెగా హీరో.. అందుకేనా?
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన తేజ్ కెరీర్ స్టార్టింగ్‌లో పరవాలేదనిపించినా తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డాడు. ఇటీవల విడుదలైన తేజ్ ఐ లవ్ యు కూడా ఆకట్టుకోలేకపోవటంతో ఈ యంగ్ హీరో ఆలోచనలో పడ్డాడు. కథల ఎంపికతో పాటు లుక్ విషయంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు సాయి ధరమ్. అందుకే తన తదుపరి చిత్రంలో సరికొత్తగా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు ఈ మెగా హీరో. అందుకే మేకోవర్ కోసం అమెరికా వెళ్లనున్నాడట. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రలహరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాలో సాయి ధరమ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, రితికా సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
వీళ్లకు క్యారెక్టర్ ఉంది
ఒక్కర్నీ గుర్తుపట్టలేం!అందుకేనేమో అంత గుర్తింపు వచ్చింది.మేకప్ మేకోవర్..!ఇదో పెద్ద గేమ్. మనకు మన హీరో కనపడడు. రాసినవాళ్ల క్యారెక్టర్ కనబడుతుంది. మనల్ని మైమరిపించడానికిఈ గోల్డెన్ పాత్రలు సిల్వర్పూతలు పూయించుకుంటాయి. అదేనండీ.. సిల్వర్‌స్క్రీన్ పూతలు.మేకప్మేన్లు, టెక్నీషియన్లు..సైంటిస్టులు.. వీళ్లందరి ‘కళ’పూతమనకు అతుక్కుంటుంది.. మరచిపోలేని క్యారెక్టర్‌తో!! సాఫ్ట్‌గా కనిపించే కుర్రాడు... వైల్డ్‌గా మారిపోయాడు! తెల్లని మేని ఛాయతో తళుకులీనే భామ నీలంలో నిగనిగలాడింది! నెత్తిన కొమ్ములొచ్చిన వ్యక్తి ఒకరైతే... ఒళ్లంతా దద్దుర్లతో ఇంకొకరు.. అంతా మాయ... మేకప్ మాయ... బఫూన్ విలన్ చాక్లెట్ బాయ్ అని కొంతమంది కుర్రాళ్లను అంటుంటారు. అంటే ఏంటి? ఎప్పుడూ చేతిలో చాక్లెట్ ఉంటుందనా? ఊహూ.. ‘చాలా హ్యాండ్సమ్’గా ఉండేవాళ్లను అలా అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ యంగ్ స్టార్స్‌లో ‘బిల్ స్కార్స్‌గార్డ్’ అలాంటివాడే. ఎవరైనా ఇతన్ని హీరోగానే ఊహించుకోవాలే తప్ప ‘బఫూన్’లా ఊహించుకోవడం కష్టం. కానీ ఈ చాక్లెట్ బాయ్ గతేడాది రిలీజైన ‘ఇట్’ సినిమాలో ‘పెన్నీవైస్ ది డ్యాన్సింగ్ క్లౌన్’ క్యారెక్టర్ చేశాడు. బఫూన్లా కనిపించే విలన్ అన్నమాట. ఈ క్యారెక్టర్లోకి మారడం కోసం కేజీల కేజీల ఫౌండేషన్ పూసుకోవాల్సి వచ్చింది. మూడు నాలుగు గంటలు మేకప్‌కి పట్టేది. బుగ్గలకు ఎర్ర చార గీతలు, సాగిపోయిన పెదాలు, రంగు మారిన పళ్లు, నీరు లేక ఎండిపోయిన భూమిలా నుదురు మీద పగుళ్లు... స్కార్స్ భయంకరంగా మారిపోయాడు. సినిమాలో బాగా భయపెట్టాడు. తనకు ఈ మేకప్ ఎక్స్పీరియన్స్ ఓ భయంకరమైన అనుభవం అంటాడు స్కార్స్. కానీ ఈ అనుభవం బాగుందని కూడా అంటాడు. ఒళ్లంతా పెయింట్‌తో... హాలీవుడ్ హాట్ బ్యూటీ జెన్నీఫర్ లారెన్స్ పేషెన్స్ని టెస్ట్ చేసిన సినిమా ‘ఎక్స్–మెన్: ఫస్ట్ క్లాస్’. రాబోయే కాలంలో ఎలాంటి శక్తుల వల్ల మానవులకు ప్రమాదం వాటిల్లుతుందో ముందే గ్రహించి, తొమ్మిది శక్తుల గల వ్యక్తులతో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తుని ఎలా రూపకల్పన చేస్తారు? అనే పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. ఆ తొమ్మిది శక్తుల్లో మిస్టిక్ ఒకటి. అది జెన్నీఫర్ చేశారు. పసుపు రంగు కళ్లు, కొబ్బరి పీచుని తలపించే జుత్తు, నీలం రంగు ఒళ్లు.. మిస్టిక్‌గా మారడానికి జెన్నీఫర్కి 8 గంటలు పట్టింది. ఒళ్లంతా బ్లూ కలర్ పెయింట్ చేయించుకున్నారు. మేకప్ తీసేశాక ఒంటి మీద వచ్చిన ‘ర్యాషెస్’ ఈ సినిమా మిగిల్చిన తీయని గుర్తు అంటారు జెన్నీఫర్. అయితే ఇదే సినిమా సిరీస్‌లో వచ్చిన తదుపరి చిత్రాలు ‘ఎక్స్–మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’, ‘ఎక్స్–మెన్: అపోకలిప్స్’లకు మాత్రం ఆమె అంతలా కష్టపడలేదు. అప్పటికి బ్లూ కలర్ బాడీ సూట్ రావడంతో పెయింటింగ్ చేయించుకునే బాధ తప్పింది. ‘బతికిపోయాను రా బాబూ’ అని జెన్నీఫర్ అనుకునే ఉంటారు. బ్లూ టు గ్రీన్ గమోరా.. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’లో జోయీ సాల్డానా చేసిన పాత్ర ఇది. ఈ పాత్ర కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్, పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీ వాడదాం అనుకున్న దర్శక–నిర్మాతలతో ‘నో ప్రాబ్లమ్.. మేకప్‌కే వెళ్దాం’ అని అభయమిచ్చారట. ఒంటి నిండా గ్రీన్ కలర్ పూసుకున్నారామె. విశేషం ఏంటంటే గ్రీన్ కలర్ కంటే లోపల మరో రెండు మూడు లేయర్స్ మేకప్ ఉండేదట. శరీరం మొత్తం పచ్చగా మారటానికి సుమారు మూడు గంటలకు పైనే పట్టేదట. బుగ్గలు ఉబ్బెత్తుగా, నుదురు కొంచెం పెద్దదిగా కనిపించడం కోసం సిలికాన్ ప్రోస్థెటిక్స్ వాడారు. అయినా ఇలా రంగుల్లో మునిగిపోవడం జోయీకి కొత్తేం కాదు. ఆల్రెడీ ‘అవతార్’లో నీలంగా నెయిత్రీలా మారిపోయిన విషయం తెలిసిందే. అరగుండు అయినా ఓకే.. నెబూలా పైశాచికత్వానికి కేరాఫ్ అడ్రస్. అసూయ, ద్వేషం, పగ... వీటిని, నెబూలాని వేరు చేసి చూడలేం. అందుకే ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ సినిమాలో నెబూలా క్యారెక్టర్ని చాలెంజ్‌గా తీసుకున్నారు కరేన్ గిల్లన్. ఈ పాత్ర కోసం పొడవాటి తన జుట్టుని త్యాగం చేశారు. పోతే పోయింది.. పాత్రకన్నా ఎక్కువా? అనుకున్నారు. ఈ క్యారెక్టర్ కోసం కళ్లకు 22 మిల్లీమీటర్ కాంటాక్ట్ లెన్సులు వాడారు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ పార్ట్ 2 మాత్రం కరేన్కి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. టెక్నాలజీ త్వరగా డెవలప్ అవుతోంది కాబట్టి.. మేకప్‌కి 2 గంటలు కేటాయిస్తే సరిపోయింది. ఫస్ట్ పార్ట్‌కి గుండు చేయించుకున్న కరేన్ సెకండ్ పార్ట్‌కి అర గుండు చేయించుకున్నారు. సూట్ అంత సులువుగా రాదు బ్లాక్ పాంథర్ కామిక్స్ పరిచయం లేని వాళ్లు ఎవరైనా సడెన్‌గా ఎరిక్ కిల్మాంగర్ పాత్రను చూస్తే గగుర్పాటుకు గురి కావొచ్చు. ఒళ్లంతా దద్దుర్లతో కొంచెం జుగుప్సగా కనిపిస్తాడు. తాను చంపిన ఒక్కొక్కరి గుర్తుగా ఆ మార్క్‌ని పెట్టుకున్నారంటే అతనెంత క్రూయలో ఈపాటికి అర్థం అయిపోయుంటుంది. ‘బ్లాక్ పాంథర్’లో మైఖేల్ బి.జోర్డాన్ ఈ పాత్ర చేశారు. దీని కోసం స్పెషల్ సూట్ తయారు చేయించారు. ఆ సూట్ వేసుకోవడం, తీయడం అంత సులువు కాదు. సూట్ ఒంటికి అతుక్కుపోవడానికి వాడిన గమ్ ఓ పట్టాన ఒంటి నుంచి సూట్‌ని వేరు చేయనిచ్చేది కాదట. రిమూవ్ చేసిన తర్వాత ఒంటికి అంటుకుపోయిన జిగురు పోవడానికి కాసేపు ఆవిరి తొట్టెలో కూర్చునేవారట. ఏదైనా జిమ్ క్యారీ చేసేస్తా కారెక్టర్ ఏదైనా, ఆ క్యారెక్టర్‌ది ఎలాంటి బాడీ లాంగ్వేజ్ అయినా సరే ఈజీగా క్యారీ చేస్తా అంటారు జిమ్ క్యారీ. అలాంటి ప్రయోగమే చేశారు ‘హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్’ సినిమా కోసం. అందులో ఆయన పచ్చని రంగులో ఉన్న ఓ వింత జంతువు రూపంలో కనిపిస్తారు. ఈ పాత్రలా మారడానికి సుమారు మూడు గంటలు పట్టేదట. కదలకుండా మూడు గంటలు పాటు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చేదట. విశేషం ఏంటంటే సినిమాలో మేకప్ కోసమే జిమ్ కదలకుండా ఖాళీగా కూర్చున్న సమయాన్ని లెక్కేస్తే సుమారు 92 రోజులట. చిత్రాతిచిత్రంగా... ఆ ముఖం ఎరుపు, నలుపు రంగుల డిజైన్‌తో విచిత్రంగా ఉంటుంది. కొమ్ములు తిరిగిన మొనగాడు డార్త్ మౌల్. విచిత్రమైన కాంటాక్స్ లెన్స్‌తో చిత్రాతిచిత్రంగా కనిపిస్తాడు. ‘స్టార్ వార్స్: ఎపిసోడ్ 1 – థి ఫ్యాంథమ్ మెనేస్’ సినిమాలోని ఈ క్యారెక్టర్ రే పార్క్‌కి పెద్ద సవాల్. నటించడానికి కాదు.. మేకప్ ఓ పెద్ద చాలెంజ్. నిజానికి ఈ పాత్ర రూపం ఎలా ఉండాలనే విషయంపై యూనిట్తర్జన భర్జనలు పడిందట. ఫైనల్లీ ఒక పేపర్ మీద ఇంక్ జల్లి ఫోల్డ్ చేసి, తీసి చూసినప్పుడు డిజైన్ అటూ ఇటూ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి.. డార్త్ ముఖం అలానే ఉండాలనుకున్నారట. లెఫ్ట్, రైట్.. ఎరుపు, నలుపు డిజైన్‌తో ముఖాన్ని డిజైన్ చేశారు. వైల్డ్ ఏలియన్.. బోలెడన్ని లేయర్లు ఏలియన్స్ ఎలా ఉంటారు? విచిత్రంగా కనిపిస్తారు. ఒక మనిషి ఏలియన్లా మారాలంటే మామూలు విషయం కాదు. మూడు నాలుగు గంటలు ఈజీగా పట్టేస్తుంది. ‘స్టార్ ట్రెక్ బియాండ్’లో చేసిన పవర్ఫుల్ ఏలియన్ వార్ లార్డ్ క్యారెక్టర్ కోసం ఇడ్రిస్ ఎల్బా ఏలియన్‌గా మారారు. ఒక లేయర్.. ఆ పైన ఇంకో లేయర్.. ఇంకోటి... మరోటి.. ఇలా బాడీ మొత్తం మేకప్ లేయర్లే. నిజానికి ఇతగాడికి ‘క్లాస్ట్రోఫోబియా’ ఉంది. అంటే.. నిర్భంధిత పరిస్థితుల్లో ఉండలేకపోవడం. ఇక్కడ లేయర్ల చాటున నిర్భంధ స్థితిలో శరీరం ఉంటే.. అది ఏమాత్రం గుర్తుకు రానివ్వకుండా కెమెరా ముందు నటించడంలో ఇడ్రిస్ సక్సెస్ అయ్యారు. తన ఫోబియాని మరచిపోయేలా చేసిన ఘనత మేకప్‌దే అంటారు ఇడ్రిస్. మేమేం తక్కువ కాదు గుర్తు పట్టలేనంతగా మారిపోవడం హాలీవుడ్ నటులకే కాదు.. ఇండియన్ స్టార్స్‌కి కూడా సాధ్యమే. ‘భీష్మ’లో ఎన్టీఆర్ గురించి చెప్పుకున్నాం. భారతీయ నటుల్లో ముఖ్యంగా చెప్పాల్సింది కమలహాసన్ గురించి. ప్రయోగాలకు చిరునామా ఆయన. ‘ఇంద్రుడు–చంద్రుడు’ లో ఎత్తు పళ్లు, బాన పొట్టతో, ‘కల్యాణ రామన్’లో ఎత్తు పళ్లతో, ‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా, ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, ‘భారతీయుడు’లో వృద్ధ గెటప్‌లో... ఇలా మేకప్‌తో పూర్తిగా మారిపోయిన పాత్రలెన్నో కమల్ చేశారు. ఆయన చేసినన్ని ప్రయోగాలు రజనీకాంత్ చేయకపోయినా ‘రోబో’ సినిమా కోసం ఆయన మేకప్‌కి చాలా గంటలు వెచ్చించాల్సి వచ్చింది. చిట్టి క్యారెక్టర్ కోసం ప్రోస్థెటిక్ మేకప్ చేయించారు. ఈ సినిమా సీక్వెల్ ‘2.0’కి కూడా ఎక్కువగా మేకప్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతి జనరేషన్లో విక్రమ్‌ని చెప్పుకోవచ్చు. ‘కాశీ’లో అంధుడిగా, ‘శివపుత్రుడు’లో లోకం తెలియని అమాయకుడిగా... ఇవన్నీ ఒక ఎల్తైతే ‘ఐ’లో చేసిన పాత్ర మరో ఎత్తు అవుతుంది. ఆ సినిమాలో హెవీ ప్రోస్థెటిక్ మేకప్‌తో విచిత్రమైన ఆకారంలో కనిపించి, భేష్ అనిపించుకున్నారు విక్రమ్. ‘గజిని’ ఫేమ్ సూర్య అయితే ‘పేరళగన్’ అనే తమిళ సినిమాలో గూని ఉన్న వ్యక్తిగా మౌల్డ్ అయ్యారు. ‘24’లో విలనీ షేడ్ ఉన్న పాత్ర గెటప్ కూడా డిఫరెంట్‌గా ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇక, స్లిమ్‌గా ఉండే ‘అల్లరి’ నరేశ్ బండ బాబులా కనిపించిన చిత్రం ‘లడ్డూ బాబు’. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ‘మగధీర’లో రావు రమేశ్ చేసిన మాంత్రికుడి పాత్ర కూడా చెప్పుకోదగ్గదే.. ‘బాహుబలి’లో ప్రభాకర్ చేసిన కాలకేయుడు క్యారెక్టర్ మేకప్నీ విస్మరించలేం. రీసెంట్గా రిలీజైన ‘మహానటి’లో కీర్తీ సురేష్ ప్రోస్థెటిక్ మేకప్ చేసుకోవాల్సి వచ్చింది. సావిత్రి బాగా లావైన తర్వాత వచ్చే సీన్స్‌కి కీర్తీ ఈ మేకప్ చేసుకున్నారు. బాలీవుడ్ గురించి చెప్పాలంటే... ‘పా’ మూవీలో ప్రొజేరియా వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడిగా అమితాబ్ నటించారు. ఆ సినిమాలో అమితాబ్ 12 ఏళ్ల పిల్లవాడైనా.. చూడ్డానికి ఐదింతలు ఎక్కువ వయసున్న వ్యక్తిలా కనిపిస్తాడు. తక్కువ శారీరక ఎదుగుదల, వృద్ధ లక్షణాలు కనిపించడం కోసం అమితాబ్‌కి ప్రోస్థెటిక్ మేకప్ చేశారు. మరో హిందీ నటుడు అక్షయ్ కుమార్ ‘2.0’లో క్రౌమేన్గా కనిపించడం కోసం తీసుకున్న రిస్క్ తక్కువేం కాదు. ఈ సినిమాలో అతను పక్షి ప్రేమికుడు. అందుకని గెటప్ కూడా పక్షిని పోలినట్లే ఉంటుంది. ఈ గెటప్ కోసం మూడు నాలుగు గంటలు మేకప్‌కి కేటాయించారు. ఇలా ఇండియన్ మూవీస్‌లో ప్రయోగాలు చేస్తున్న తారలు చాలామందే ఉన్నారు. మంచి క్యారెక్టర్ కుదిరితే ‘మేమేం తక్కువ కాదు..’ అంటున్నారు. ఎన్టీఆర్ భీష్మ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు... ఇలా పౌరాణిక పాత్రలతో పాటు సాంఘిక పాత్రలను అలవోకగా చేసిన నటుడు నందమూరి తారక రామారావు. సాంఘిక చిత్రాల్లో వేసిన మారువేషాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. అయితే మారువేషంలో ఉన్నది ఎన్టీఆర్ అనీ, పౌరాణిక గెటప్స్‌లో ఉన్నప్పుడు అది ఎన్టీఆరే అని స్పష్టంగా తెలిసిపోయేది. ‘భీష్మ’ సినిమా మాత్రం ఇందుకు మినహాయింపు. ఆ సినిమాలో భీష్మ గెటప్‌లో ఉన్నది ఎన్టీఆర్ అని అప్పట్లో ఎవరూ గుర్తు పట్టలేకపోయారన్నది అక్షర సత్యం.. అది మేకప్ మహత్యం. నిజానికి తెరపై కనిపించే నటుల గురించి చెప్పుకుంటాం కానీ, వారలా కనిపించడానికి తెరవెనక కృషి చేసే మేకప్ నిపుణులను కూడా అభినందించాల్సిందే. – డి.జి. భవాని -
న్యూ లుక్‌లో నందమూరి హీరో
ఈ జనరేషన్ హీరోలు సినిమా కథ కథానాల మీదే కాదు.. సినిమాలో క్యారెక్టర్‌కు తగ్గ లుక్ కోసం కూడా చాలా శ్రమిస్తున్నారు. నందమూరి యంగ్ హీరో కల్యాణ్ రామ్ ప్రతీ సినిమాలో కొత్తగా కనిపించేందుకు కష్టపడుతున్నాడు. ఇటీవల ఎమ్మెల్యే సినిమా కోసం ఫార్మల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించిన కల్యాణ్ రామ్ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘నా నువ్వే’ సినిమాలో క్లాస్ లుక్‌లో ఆకట్టుకోనున్నాడు. నా నువ్వే తరువాత మరోసారి ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా చేయనున్నాడు కల్యాణ్ రామ్. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రఫ్ లుక్‌లోకి మారిపోయాడు కల్యాణ్ రామ్. స్టైలిష్ హెయిర్ స్టైల్, లైట్‌గా గెడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు ఈ నందమూరి హీరో. తాజాగా ఈ లుక్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
‘రాజధాని’ నయా (త)లుక్..
సాక్షి, న్యూఢిల్లీ: ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కొత్తరూపు సంతరించుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్ కండీషన్డ్ బోగీలతో ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు కొత్త అనుభూతి కలిగించనుంది. ‘ఆపరేషన్ స్వర్ణ్’లో భాగంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ బోగీలను అందంగా అలకరించారు. చూడముచ్చటైన లేతవర్ణ ప్రింటెడ్ పూల డిజైన్లను కిటికీలకు అతికించారు. బోగీ లోపల అధునాతన సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రపతిభవన్ లాంటి ప్రఖ్యాత కట్టాలను ప్రదర్శిస్తూ బోగీ లోపల ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. తెలుపు రంగు తువాళ్ల స్థానంలో పెద్ద సైజు నీలిరంగు టవల్స్ పెట్టారు. ప్రింటెడ్ బెడ్షీట్లు, అత్యంత నాణ్యమైన అద్దాలు, కొత్త చెత్తబుట్టలు, డిజిటల్ గడియారాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలను రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ట్విటర్ పేజీలో పెట్టారు. ‘ఆపరేషన్ స్వర్ణ్’లో భాగంగా రెండు నెలల క్రితం సెల్డా-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు 14 రాజధాని, 15 శాతాబ్ది రైళ్లలను ఆధునీకరిస్తామని రైల్వే శాఖ గతంలో ప్రకటించింది. -
హల్ చల్ చేస్తున్న 'డాడా-డింగ్'..!
దాదాపు పదిహేను రోజుల క్రితం కొత్తగా రిలీజైన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నైక్ కమర్షియల్ ఫీచరింగ్ యాక్టర్ దీపికా పదుకొనె సహా 10 మంది భారత క్రీడాకారిణులు నటించిన యాడ్.. వైరల్ గా మారింది. ఇది.. కేవలం పురుష ప్రపంచమే కాదని, మహిళల్లోనూ మహామహులు ఉన్నారని ఈ కొత్త యాడ్ నిరూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చినా... గట్టి పోటీని ఎదుర్కొని గగనతలాలను తాకిన మహిళా సాధికారతను ప్రపంచానికి చాటుతోంది. స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం నైక్.. రూపొందించి, తాజాగా విడుదల చేసిన బెస్ట్ కమర్షియల్ యాడ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ సృజనాత్మకత ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. డాడా-డింగ్ అనే టైటిల్ తో విడుదలైన యాడ్ లో 12 మంది క్రీడాకారిణులతోపాటు.., వారి ఫిట్ నెస్ ట్రైనర్లు అదరహో అనిపించారు. 3 నిమిషాల నిడివితో ఉన్న యాడ్.. గ్రామీణ మహిళా శక్తిని సాక్షాత్కరిస్తోంది. గ్రామీణ మహిళలు డైలీ లైఫ్ లో ఎంత కష్టిస్తారో ఈ వీడియో ప్రత్యక్షపరుస్తోంది. శతాబ్దాలుగా నాలుగ్గోడల మధ్యా ఎటువంటి గుర్తింపూ లేకుండా మిగిలిపోతున్న మహిళా శక్తిని ప్రతిబింబింస్తూ ఈ ప్రకటన రూపొందింది. దీన్ని మహిళలకు అంకితమిస్తూ.. దర్శకుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెటర్ హర్మాన్ ప్రీత్ కౌర్, హాకీ ప్లేయర్ రాణి రాం పాల్, ఫుట్ బాల్ ప్లేయర్ తన్వీ హంస్, మరో క్రికెటర్ స్మృతి మంధనా, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, ఫుట్ బాలర్ జ్యోతి, మరో క్రికెటర్ సుబ్బలక్ష్మి శర్మతో పాటు, స్ప్రింటర్ శ్వేతా హక్కే పర్సనల్ ట్రైనర్ శ్వేతా సుబ్బయ్య, సర్ఫర్ ఇషితా మాలవీయ, ఇన్ స్ల్రక్టర్, నమ్రతా పురోహిత్, ఫిట్ నెస్ ట్రైనర్ అర్మి కొథారె లతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమ తమ ఆటల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారిణులతో రూపొందిన యాడ్.. హల్ చల్ చేస్తోంది.