డెహ్రాడూన్: హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడి లోపలి గోడలకు బంగారు రేకుల తాపడం చేయడంపై తీర్థపురోహితుల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి. వెండి రేకుల స్థానంలో బంగారు రేకులను తాపడం చేయిస్తానంటూ మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు ముందుకు రాగా ఆలయ కమిటీ అనుమతించింది.
ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇది ఆలయ ఆచారాలకు విఘాతమంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. బంగారు రేకుల తాపడం కోసం చేపట్టే డ్రిల్లింగ్‌తో గర్భాలయ గోడలకు నష్టమన్నది వారి ఆందోళన. దీన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయేంద్ర అజయ్ కొట్టిపారేశారు. ‘‘బంగారు తాపడంలో తప్పేముంది? దీన్ని కావాలనే వ్యతిరేకిస్తున్నారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment