gold plated tapi
-
కేదార్నాథ్ గోడలకు బంగారు తాపడం వద్దు
డెహ్రాడూన్: హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయ గర్భగుడి లోపలి గోడలకు బంగారు రేకుల తాపడం చేయడంపై తీర్థపురోహితుల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి. వెండి రేకుల స్థానంలో బంగారు రేకులను తాపడం చేయిస్తానంటూ మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు ముందుకు రాగా ఆలయ కమిటీ అనుమతించింది. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇది ఆలయ ఆచారాలకు విఘాతమంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. బంగారు రేకుల తాపడం కోసం చేపట్టే డ్రిల్లింగ్‌తో గర్భాలయ గోడలకు నష్టమన్నది వారి ఆందోళన. దీన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయేంద్ర అజయ్ కొట్టిపారేశారు. ‘‘బంగారు తాపడంలో తప్పేముంది? దీన్ని కావాలనే వ్యతిరేకిస్తున్నారు’’ అన్నారు. -
భూమిపూజకు బంగారు పూత తాపీ, వెండి గమేళా
తెనాలి: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు అతి ముఖ్యమైన సామగ్రి తెనాలి నుంచి సమకూరనుంది. బంగారు, వెండి నాణేలు, నవరత్నాలుగా పిలుచుకునే వైఢూర్యం, పుష్యరాగం, పచ్చ, నీలం, కెంపు, వజ్రం, గోమేధికం, పగడం, ముత్యంను తుళ్లూరు తహశీల్దారు సుధీర్ బాబు తెనాలి నుంచి కొనుగోలు చేశారు. అలాగే భూమిపూజకు అవసరమైన గమేళా, తాపీని అంగలకుదురుకు చెందిన వెంకట్రామయ్య వెండితో తయారు చేయించటం విశేషం. కిలో వెండితో వెండి గమేళా, తాపీ చేయించి, తాపీకి బంగారుపూత పూయించారు.