‘రాజధాని’ నయా (త)లుక్.. | Mumbai-Delhi Rajdhani train gets a makeover | Sakshi
Sakshi News home page

‘రాజధాని’లో సౌకర్యాలు సూపర్‌

Published Thu, Feb 15 2018 3:25 PM | Last Updated on Thu, Feb 15 2018 3:26 PM

Mumbai-Delhi Rajdhani train gets a makeover - Sakshi

ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు కొత్తరూపు (రైల్వే శాఖ ట్విటర్‌ ఫొటోలు)

సాక్షి, న్యూఢిల్లీ: ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు కొత్తరూపు సంతరించుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్‌ కండీషన్డ్‌ బోగీలతో ఈ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు కొత్త అనుభూతి కలిగించనుంది. ‘ఆపరేషన్‌ స్వర్ణ్‌’లో భాగంగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బోగీలను అందంగా అలకరించారు. చూడముచ్చటైన లేతవర్ణ ప్రింటెడ్‌ పూల డిజైన్లను కిటికీలకు అతికించారు.

బోగీ లోపల అధునాతన సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రపతిభవన్‌ లాంటి ప్రఖ్యాత కట్టాలను ప్రదర్శిస్తూ బోగీ లోపల ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. తెలుపు రంగు తువాళ్ల స్థానంలో పెద్ద సైజు నీలిరంగు టవల్స్‌ పెట్టారు. ప్రింటెడ్‌ బెడ్‌షీట్లు, అత్యంత నాణ్యమైన అద్దాలు, కొత్త చెత్తబుట్టలు, డిజిటల్‌ గడియారాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలను రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ట్విటర్‌ పేజీలో పెట్టారు.

‘ఆపరేషన్‌ స్వర్ణ్‌’లో భాగంగా రెండు నెలల క్రితం సెల్డా-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు 14 రాజధాని, 15 శాతాబ్ది రైళ్లలను ఆధునీకరిస్తామని రైల్వే శాఖ గతంలో ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement