Rajdhani Express
-
ప్రీమియం రైళ్ల స్థానంలో ‘వందేభారత్’
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో ప్రీమియం కేటగిరీ రైళ్లుగా గుర్తింపు పొంది, దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు త్వరలో కనుమరుగు కాబోతున్నాయి. కొత్తగా ప్రారంభమై సూపర్ సక్సెస్ అయిన వందేభారత్ రైళ్లను వాటి స్థానంలో నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పగటి వేళ నడుస్తున్న చైర్‌కార్ కోచ్‌లతో కూడిన రెగ్యులర్ వందేభారత్ రైళ్లు శతాబ్ది స్థానాన్ని ఆక్రమించనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైళ్లను రాజధాని స్థానంలో నడపాలని ప్లాన్ చేస్తోంది. దీంతో ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు దశలవారీగా మాయం కానున్నాయి. అదే వేగంతో.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. వీలైనంత తొందరలో 400 వందేభారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే శాఖ వాటి తయారీపై దృష్టి సారించింది. చైర్‌కార్ కోచ్‌లతో ఉన్నందున వీటిని రాత్రి వేళ నడిపే వీలు లేదు. దీంతో ఉదయం నుంచి అర్ధరాత్రి లోపు గమ్యం చేరి, మళ్లీ సొంత స్టేషన్‌కు తిరిగి వచ్చేలా సమయాలను సెట్ చేశారు. ప్రస్తుతం శతాబ్ది రైళ్లు కూడా ఇదే తరహాలో చైర్‌కార్ కోచ్‌లతో పగటి వేళ నడుస్తున్నాయి. భారత తొలి ప్రధాని నెహ్రూ శతజయంతికి గుర్తుగా శతాబ్ది (వందేళ్లు) పేరుతో 1988లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. వచ్చే మార్చికి స్లీపర్ రైళ్లు.. తక్కువ దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య తిరుగుతున్న వందేభారత్ రైళ్లను దూరప్రాంతాల మధ్యా ప్రవేశపెట్టాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. వచ్చే మార్చి నాటికి తొలి రైలు పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని నగరం ఢిల్లీకి, దేశంలోని ప్రధాన నగరాలకు మధ్య అనుసంధానంగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో వీటిని నడపాలని భావిస్తోంది. 1969లో ఢిల్లీ–హౌరా మధ్య తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ప్రస్తుతం 18 రాజధాని రైళ్లు తిరుగుతున్నాయి. రాజధానిని తేజస్ రైళ్లుగా మార్చాలని నిర్ణయించి, తేజస్ రాజధాని పేరుతో ఏడు రైళ్లను రైల్వే శాఖ ఇప్పటికే ప్రారంభించింది. తాజాగా వాటి స్థానంలో వందేభారత్ స్లీపర్ కోచ్‌లను నడపాలని భావిస్తోంది. -
రాజధాని ఎక్స్ ప్రెస్ లో పొగలు..
-
గాయాలతో మొసలి.. 25 నిమిషాలు నిలిచిన రాజధాని ఎక్స్‌ప్రెస్
ముంబై: మొసలి పట్టాలపైకి రావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన వడోదర-ముంబై రైల్వే లైన్ మధ్య చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం రైలు పట్టాలపై గాయంతో బాధపడుతున్న మొసలి ప్రత్యక్షమైంది. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 25 నిమిషాల పాటు నిలిచిపోయింది. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మొసలిని పక్కకు తీసిన అనంతరం రైళ్ల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మిగతా రైళ్లు దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం కర్జన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. వన్యప్రాణుల కార్యకర్త హేమంత్ వద్వాన వచ్చి మొసలికి సపర్యలు చేసి పట్టాలపై నుంచి తొలగించాడు. ‘నాకు 3.15 నిమిషాలకు కర్జాన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ పట్టాలపై మొసలి ఉందని ఫోన్ చేశారు. మొసలి వలన రైలు ఆగడం ఆశ్చర్యమేసింది. స్టేషన్ నుంచి మేం మొసలి ఉన్న దగ్గరకు వెళ్లడానికి ఐదు నిమిషాలు పట్టింది.’ అని హేమంత్ తెలిపారు. ‘మొసలి తీవ్ర గాయాలతో బాధపడుతోంది. ఆలస్యంగా వెళ్లి ఉంటే మొసలి చనిపోయి ఉండేది’ అని మరో వన్యప్రాణి కార్యకర్త నేహ పటేల్ వివరించారు. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు ‘పట్టాలపై నుంచి మొసలిని తొలగించిన అనంతరం కిసాన్ రైలులో తరలించాం. అనంతరం అటవీ శాఖ అధికారులకు మొసలిని అప్పగించాం’ అని కర్జాన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సంతోశ్ శర్మ తెలిపారు. వన్యప్రాణి కార్యకర్తలంతా అగ్నివీర్ ప్రాణీణ్ ఫౌండేషన్ సభ్యులు. వారు ఇలా వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ఈ ఫౌండేషన్ సభ్యులు కాపాడుతారు. -
పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో హజరత్ నిజాముద్దిన్ – మడ్గావ్ రాజధాని సూపర్ ఫాస్ట్ స్పేషల్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ పట్టాలు తప్పింది. కోంకణ్ రైల్వేమార్గంపై ఉక్షీ – భోకేల మధ్య ఉన్న కురబుడే టన్నెల్ మధ్యలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కోంకణ్ రైల్వే పీఆర్వో సచిన్ దేశాయి అందించిన వివరాల మేరకు.. కరబుడే టన్నెల్లో శనివారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఊహించని విధంగా రైలు ఇంజిన్ చక్రం టన్నెల్ మధ్యలో నుంచి వెళ్లే సమయంలో పట్టాలు తప్పింది. చీకటి గుహలో ఉన్నామని తెలుసుకున్న ప్రయాణికులు అరుపులు కేకలు పెట్టారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అనంతరం యుద్ద ప్రతిపాదికపై పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది రైల్వే మార్గాన్ని పునరుద్దరించారు. అయితే సుమారు 7 గంటలపాటు ఈ కోంకణ్ మార్గంపై రైళ్ల రాకపోకలు స్థంబించిపోయాయి. చదవండి: ‘పిల్లలకు కోవిడ్ టీకా’పై మరింత డేటా రావాల్సి ఉంది -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
సాక్షి, హైదరాబాద్/బషీరాబాద్: ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకో (ఇంజన్)లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇంజన్లో మంటలు రావడాన్ని గమనించిన లోకో పైలెట్లు వెంటనే అప్రమత్తమయ్యా రు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వికారాబాద్–వాడీ మార్గంలో నవంద్గీ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి 8.40 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు నవంద్గీ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తినట్టు లోకో పైలెట్లు గుర్తించారు. అలాగే వెళితే మధ్యలో రైలు ఆగిపోయి ఇబ్బంది తలెత్తుతుందన్న ఉద్దేశంతో స్టేషన్లోనే నిలిపివేశారు. అప్పటికే ఇంజన్‌లోంచి దట్టంగా పొగలు వస్తున్నాయి. ఆ కొద్దిసేపటికే మంటలు కూడా లేచాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఇంజన్‌ను బోగీల నుంచి వేరు చేసి దూరంగా తీసుకెళ్లారు. స్టేషన్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైరింజన్ మంటలను ఆర్పివేసింది. తర్వాత అధికారులు సమీపంలోని తాండూరు స్టేషన్నుంచి వేరే ఇంజన్‌ను తెప్పించి రైలును పంపివేశారు. కారణం తెలియదు.. చిన్న ప్రమాదమే లోకోలో మంటలు చెలరేగటానికి కారణం తెలియదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ పేర్కొన్నారు. ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తిందని సిబ్బంది పసిగట్టి స్టేషన్లో రైలును ఆపారని, తర్వాత పొగలు వచ్చి స్వల్పంగా మంటలు చెలరేగాయని వెల్లడించారు. ఈ ప్రమాదం చిన్నదే అని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. తాండూరు నుంచి మరో లోకోను తెప్పించి రైలును పంపివేసినట్టు చెప్పారు. 35 నిమిషాలపాటు రైలు నిలిచిపోయిందని రైల్వే సిబ్బంది వెల్లడించారు -
ప్రయాణీకులకు షాకిచ్చిన ఐఆర్సీటీసీ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు భారీ షాకిచ్చింది. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, రాజధాని, శాతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను పెంచింది. నవంబర్ 14 నుంచి రాజధాని / శతాబ్ది /దురంతో రైళ్లలో ప్రామాణిక భోజనంపై క్యాటరింగ్ సేవల రేట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో తెలిపింది. కొత్త మెనూ, రేట్లు టికెటింగ్ విధానంలో 15 రోజుల తరువాత అందిస్తామని, పెంచిన రేట్లు సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి 120 రోజుల తరువాత వర్తిస్తాయని తెలిపింది. రేట్ల సవరణ తరువాత రాజధాని, దురంతో, శాతాబ్డి ఎక్స్‌ప్రెస్‌లలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ .15 కు పెంచారు. అదే స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ .20. ఇక భోజనం విషయానికొస్తే, దురంతో ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్‌లో లంచ్/ డిన్నర్‌కు రూ. 120 రూపాయిలు చెల్లించాల్సిందే. మునుపటి ధర. రూ.80. ఈ రైళ్లలో సాయంత్రం వేళలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో టీ ధర రూ.35 (రూ .6 పెంపు) అల్పాహారం రూ. 140, (రూ .7 పెంపు) లంచ్ డిన్నర్ రూ .245 (రూ .15 పెరిగింది) -
రాజధాని రైలు ఢీకొని నలుగురు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఇటవాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. ఇటవాలోని బాల్‌రాయ్ రైల్వేస్టేషన్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి హౌరా మార్గంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు వెలుతుండగా, మరో వైపు అవధ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉంది. ఈ సమయంలో అవతలివైపు చూసుకోకుండా పట్టాలు దాటుతుండగా అప్పటికే వేగంగా ఉన్న రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. బాధితులందరూ కౌషాంబి వాసులుగా తెలుస్తోంది. మృతులు రాజేంద్ర, పింటూ, జమ్హిర్ లాల్, భయ్యా లాల్‌గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
అయ్యయ్యో.. ఏసీ బోగీలు కనబడడం లేదు..!
రైళ్లలో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, నల్లాలు, కొన్ని సందర్భాల్లో వాష్ బేసిన్లు సైతం చోరీకి గురికావడం, ఏసీ రైళ్లలోనైతే చేతి తువాళ్లు, బ్లాంకెట్లు వంటివి మాయమవుతున్న ఘటనలు ఇతర దేశాల్లోనైతే ఆశ్చర్యంగా చూస్తారు కాని... ఇక్కడైతే ఇదంతా మామూలే అన్నట్టుగా మనవాళ్లు పెద్దగా పట్టించుకోరు. రైళ్లలో ప్రవేశపెట్టిన ‘బయో టాయ్లెట్ల’లోని స్టెయిన్లెస్స్టీల్ డస్ట్బిన్లు కూడా దొంగతనానికి గురవుతున్న జాబితాలో చేరిపోయాయి. అయితే తాజాగా ఏకంగా రైలు బోగీలే అవీ కూడా ఏసీ కోచ్‌లు కొన్ని కనిపించకుండా పోయాయనే వార్తలు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాయి. వీటి ప్రకారం రాంచీ–న్యూఢిల్లీల మధ్య నడిచే రాజధాని, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించిన కొన్ని కొత్త బోగీలు రాంచీ రైల్వే డివిజన్ యార్డు నుంచి మాయమై పోయాయి. ఈవిధంగా కొన్ని బోగీలకు బోగీలే కనబడకుండా పోవడం పెద్ద కలకలాన్నే సృష్టించింది. రాజధాని, సంపర్క్ క్రాంతి రైళ్లలో జతచేయాల్సిన ఈ బోగీలు మిస్ కావడంతో వాటి స్థానంలో పాత రైలు డబ్బాలతోనే రైల్వేశాఖ పని కానీచ్చేస్తోంది. ఇటీవల రాంఛీ నుంచి బయలుదేరాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మూడోబోగీలు కదలకుండా మొరాయించడంతో ప్రయాణీకులు పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు. అధునాతన సౌకర్యాలున్న రైళ్లుగా పరిగణిస్తున్న రాజధాని వంటి రైళ్ల కోసం తెప్పించిన కొత్త కోచ్‌లు ఏమయ్యయో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రైలు డబ్బాలు కనిపించకుండా పోవడం వెనక పెద్ద ముఠాయే పనిచేస్తున్నట్టు ఉందని సందేహాలు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. అంతకు ముందు కూడా ఒకటో రెండో ఇలాంటి ఘటనలు జరిగినా ఇప్పుడు ఏకంగా కొన్ని ఏసీ బోగీలే కనిపించకుండా పోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఏసీ బోగీలు కనబడకుండా పోయాయన్న వార్తలపై రాంచీ డివిజన్ అధికారి స్పందించినట్టు ఓ పత్రిక వెల్లడించింది. ‘తమ డివిజన్‌లోనే వీటిని ఉపయోగిస్తున్నట్టు మేము మార్క్ చేశాం. ఈ కోచ్‌లు ఉత్తరాది డివిజన్లో వినియోగంలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఈ ఏసీ బోగీలను తిరిగి తమకు అప్పగించాలంటూ ఉత్తరాది రైల్వేకి ఆగ్నేయ రైల్వే లేఖ రాసింది. త్వరలోనే అవి వెనక్కు వస్తాయని ఆశిస్తున్నాం’ ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. చిన్న చిన్న చోరీలు ఎక్కువే... 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం...2015లో రైళ్లలో చోటుచేసుకున్న చోరీ కేసులు 9.42 లక్షలుండగా, 2016లో ఈ సంఖ్య11 లక్షలకు చేరుకుంది. వీటిలో 2 లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 1.24 లక్షల కేసులతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో నిలిచాయి. 2016–17లో చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కోచింగ్ డిపో పరిధిలో 817 బయో టాయ్‌లెట్లున్నాయి. దీని పరిధిలో 3,601 స్టీల్ డస్ట్బిన్లు కనబడకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్లోని సీయల్దా కోచింగ్ డిపో పరిధిలో 1,304 బయో టాయ్లెట్లుండగా 3,536 చోరీకి గురైనట్టు అధికారులు తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘రాజధాని’ నయా (త)లుక్..
సాక్షి, న్యూఢిల్లీ: ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కొత్తరూపు సంతరించుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్ కండీషన్డ్ బోగీలతో ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు కొత్త అనుభూతి కలిగించనుంది. ‘ఆపరేషన్ స్వర్ణ్’లో భాగంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ బోగీలను అందంగా అలకరించారు. చూడముచ్చటైన లేతవర్ణ ప్రింటెడ్ పూల డిజైన్లను కిటికీలకు అతికించారు. బోగీ లోపల అధునాతన సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రపతిభవన్ లాంటి ప్రఖ్యాత కట్టాలను ప్రదర్శిస్తూ బోగీ లోపల ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. తెలుపు రంగు తువాళ్ల స్థానంలో పెద్ద సైజు నీలిరంగు టవల్స్ పెట్టారు. ప్రింటెడ్ బెడ్షీట్లు, అత్యంత నాణ్యమైన అద్దాలు, కొత్త చెత్తబుట్టలు, డిజిటల్ గడియారాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలను రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ట్విటర్ పేజీలో పెట్టారు. ‘ఆపరేషన్ స్వర్ణ్’లో భాగంగా రెండు నెలల క్రితం సెల్డా-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు 14 రాజధాని, 15 శాతాబ్ది రైళ్లలను ఆధునీకరిస్తామని రైల్వే శాఖ గతంలో ప్రకటించింది. -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణీకులకు డ్రగ్స్ ఇచ్చి..
న్యూఢిల్లీ: ముంబై-న్యూఢిల్లీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొందరు దుండగులు తమకు డ్రగ్స్ ఇచ్చి చోరికి పాల్పడినట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.12 లక్షల నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో రైలు ఆగినప్పుడు చోరి జరిగినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. రాజస్ధాన్‌లోని కోట స్టేషన్లో రైలులోని స్టాఫ్ మారారని, ఆ సమయంలో రైలులో సెక్యూరిటీ లేదని ఓ మహిళా ప్రయాణికురాలు చెప్పారు. తనకు చెందిన రూ.50 వేల నగదుతో పాటు కొన్ని విలువైన వస్తువులు మిస్సైనట్లు వెల్లడించారు. తమకు డ్రగ్స్ ఇవ్వడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయామని తెల్లవారే వరకూ అసలు స్పృహ లేదని తెలిపారు. దొంగతనం జరిగిందని ఓ మహిళ కేకలు వేసే వరకూ తమకు తెలియలేదని చెప్పారు. దాదాపు ఆరుగురు ప్రయాణికులకు చెందిన వస్తువులు చోరికి గురయ్యారని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం
గువాహటి: గువాహటి రైల్వే స్టేషన్లో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బోగీలోని సీటు కింద ఉన్న గోనె సంచిలో 15 కిలోల బరువైన బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి లుంబింగ్ ప్రాంతానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం రాజధానికి వెళ్లే అవథ్ ఎక్స్‌ప్రెస్‌లో కిలోన్నర బ్రౌన్‌షుగర్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. -
విమానం వద్దని.. రైల్లోనే వెళ్లిన ఎంపీ
తాను విమానాలలో ఎక్కకుండా విధించిన నిషేధాన్ని విమానయాన సంస్థలు ఎత్తేసినా, ఉస్మానాబాద్ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మాత్రం విమానం కాకుండా రైల్లోనే ప్రయాణిస్తున్నారు. తాజాగా ఆయన ముంబై నుంచి ఢిల్లీ వెళ్లేందుకు విమానం కాకుండా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలే ఎక్కారట. ఆయన ఆ రైలును ముంబై సెంట్రల్ స్టేషన్లో ఎక్కారో లేదా బోరివాలిలో ఎక్కారో తనకు తెలియదు గానీ, రైల్లోనే ఢిల్లీ వెళ్లారని.. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీలోనే ఉంటారని ఎంపీ సన్నిహిత సహచరుడైన జితేంద్ర షిండే మీడియాకు చెప్పారు. పార్లమెంటులో తీవ్ర గందరగళం అనంతరం పౌర విమానయాన మంత్రిత్వశాఖ గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా ఎయిరిండియాకు సూచించింది. దాంతో ఎయిరిండియాతో పాటు ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం ఆయనను తమ విమానాల్లోకి ఎక్కించుకోడానికి అభ్యంతరం ఏమీ లేదంటూ నిషేధాన్ని ఎత్తేశాయి. అయితే, ఆయన ముందుగానే రైల్లో టికెట్ రిజర్వు చేసుకున్నారని, ఆయనతో పాటు నలుగురైదుగురు సహాయకులు కూడా ఉన్నారని షిండే చెప్పారు. విమాన ప్రయాణంలో జరిగిన గొడవ మొత్తం ఇప్పుడు సర్దుమణిగిందని, ఆ గొడవ కారణంగా ఆయనేమీ విమాన ప్రయాణం మానుకోవడం లేదని అన్నారు. పుణె నుంచి గానీ, ముంబై నుంచి గానీ గైక్వాడ్ ఢిల్లీ వెళ్లే విమానాలు ఏవీ ఎక్కలేదని ఎయిరిండియా వర్గాలు కూడా నిర్ధారించాయి. -
ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం
పాట్నా: న్యూఢిల్లీ - పాట్నా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు పది మంది దోపిడీ దొంగలు బక్సర్ సమీపంలో రైల్లోకి ప్రవేశించి ప్రయాణికులపై దాడి చేశారు. వారి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలతో పాటు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పాట్నా రైల్వే పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఇన్స్పెక్టర్ సహా ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. -
కేంద్ర మంత్రికి ట్వీట్.. మహిళా ప్యాసింజర్ సేఫ్
భువనేశ్వర్: సోషల్ మీడియాను మనం వాడుకునే తీరును బట్టి అది మనకు అనుకూల, ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఓ మహిళా ప్రయాణికులరాలికి మాత్రం సోషల్ మీడియా పోస్ట్ ఎంతో మేలు చేసింది. ఎలా అంటారా.. న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ప్రయాణిస్తోంది. ఆ రైల్లోనే ఆమె ఉన్న కంపార్ట్మెంట్లో యాభైఏళ్ల ప్రయాణికుడు బని ప్రసాద్ మహంతి ప్రయాణిస్తున్నాడు. ఆ మహిళతో బని ప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకుండా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయంపై ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ పోస్ట్ చూసిన ఓ బాధిత మహిళ స్నేహితురాలు విషయాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లింది. తన స్నేహితురాలికి సాయం చేయాలని రైల్వే మంత్రికి ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన సురేశ్ ప్రభు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. నిందితుడు బని ప్రసాద్‌ను టీటీఈలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది టాటానగర్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని రైలు నుంచి దించేశారు. టాటానగర్ రైల్వే పోలీసులకు నిందితుడిని అప్పగించారు. వారు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు బని ప్రసాద్ ఒడిషాలోని ఖుర్దాకు చెందినవాడని రైల్వే పోలీసులు వివరించారు. -
రైల్లో శాకాహారంలో ఎముకలు.. లక్ష జరిమానా!!
దూరప్రయాణాలు చేయడానికి రాజధాని లాంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లయితే బాగుంటుందని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే, గువాహటి వెళ్లే రాజధాని రైల్లో ఇచ్చిన శాకాహార భోజనంలో ఎముక ముక్కలు కనిపించాయి. తికమ్ చంద్ జైన్ (65) తరచు రాజధానిలో వెళ్తుంటారు. ఆయన సెప్టెంబర్ 19న ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కి, అక్కడ తర్వాతి రోజుకు శాకాహారం కావాలని ఆర్డర్ ఇచ్చారు. కానీ, తనకు ఇచ్చిన కూరలో ఎక్కడో ఎముకలు వచ్చినట్లు అనుమానం వచ్చింది. తీరా చూస్తే నిజంగానే అందులో ఎముకలున్నాయి. దీంతో కేటరింగ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసి, ప్రధాన కార్యాలయానికి కూడా లిఖిత పూర్వక ఫిర్యాదు పంపారు. దాంతో ఆ రైల్లో కేటరింగ్ చేస్తున్న బృందావన్ ఫుడ్ వారికి రైల్వేశాఖ లక్ష రూపాయల జరిమానా విధించింది. దాంతోపాటు ఫిర్యాదును చాలా సీరియస్‌గా పరిగణించారు. ఇంతకుముందు గోవా ఎక్స్‌ప్రెస్‌లో సూప్‌లో బొద్దింక వచ్చింది. ఆ కేసులోనూ కేటరర్కు లక్ష రూపాయల జరిమానా విధించారు. -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన భారీ ముప్పు
బీహార్‌లోని గయ ప్రాంతంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆ రైలు వెళ్లాల్సిన ప్రాంతంలో రైలు పట్టాలను మావోయిస్టులు ధ్వంసం చేశారు. అయితే, ముందుగా వెళ్లిన పైలట్ ఇంజన్ ఈ విషయాన్ని గుర్తించడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. లేనిపక్షంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి ఉండేది. మంగళవారం రాత్రి మావోయిస్టులు ఇక్కడి రైలుపట్టాలను పేల్చేసినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇస్లాంపూర్- రఫీగంజ్ ప్రాంతాల మధ్య రైలు పట్టాలు ధ్వంసమై ఉన్నట్లు పైలట్ ఇంజన్ డ్రైవర్ అధికారులకు తెలిపాడు. ఈ పైలట్ ఇంజన్, న్యూఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-భువనేశ్వర్ రైళ్లకు ముందుగా వెళ్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శతాబ్డి, రాజధాని లాంటి రైళ్లు వెళ్లేముందు పైలట్ ఇంజన్ ఒకటి నడిపించాలని రైల్వే అధికారులు చేసని హెచ్చరిక పాటించడం వల్లే భారీ ప్రమాదం తప్పింది. ఔరంగాబాద్ జిల్లాలో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. పైలట్ రైలు ఇంజన్ పట్టాలు తప్పిందని రైల్వేబోర్డు ఛైర్మన్ అరుణేంద్రకుమార్ తెలిపారు. నాలుగు మీటర్ల పొడవున రైలు పట్టాలు ధ్వంసమైందని ఆయన అన్నారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ సంఘటనపై నివేదిక పంపాల్సిందిగా రైల్వే మంత్రి సదానందగౌడ ఆదేశించారు. -
'రాజధాని'లో వీరంగం సృష్టించిన ప్రయాణికుడు
న్యూఢిల్లీ - బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికులు వీరంగం సృష్టించాడు. దాంతో సదరు ప్రయాణికుడిపై తోటి ప్రయాణికులు టీసీకి ఫిర్యాదు చేశారు. టీసీ ప్రయాణికుడి వీరంగంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరంగం సృష్టించిన ప్రయాణికుడిని ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వే పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టాలు తప్పిన ‘రాజధాని’
బీహార్‌లో దుర్ఘటన నలుగురి మృతి, 23 మందికి గాయాలు చాప్రా/పాట్నా: బీహార్‌లో బుధవారం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో నలుగురు మృతిచెందగా, 23 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్ వెళ్తున్న ఈ రైలు సరణ్ జిల్లా చాప్రా సమీపంలోని గోల్డెన్‌గంజ్ స్టేషన్ వద్ద వేకువజామున 2.11 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ స్టేషన్ పాట్నాకు 75 కి.మీ దూరంలో ఉంది. దుర్ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పగా వీటిలో ఐదు బోల్తాపడ్డాయి. వీటిలో కొన్ని బోగీలు 700 అడుగుల దూరం ఎగిరిపడ్డాయి. ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన 13 మందిని పాట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రులకు తరలించారు. బీ-2 బోగీ నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను పంజాబ్, యూపీకి చెందిన వారిగా గుర్తించారు. సరణ్, చంపారన్ జిల్లాల్లో భద్రతా బలగాల ఆపరేషన్లకు నిరసనగా నక్సల్స్ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. నక్సల్స్‌ను నిందించడం తొందరపాటు: కేంద్రం ఈ దుర్ఘటన వెనుక మావోయిస్టుల హస్తముందా లేదా అనే దానిపై వివాదం రేగింది. ప్రమాద స్థలానికి 60 కి.మీ దూరంలోని తూర్పు చంపారన్ జిల్లా మోతిహరిలో మంగళవారం రాత్రి ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. 18 బోగీలు పట్టాలు తప్పిన గూడ్సు ప్రమాదానికి నక్సల్సే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌లోని తీర్హుత్, సరణ్ జిల్లాల్లో రైల్వే ఆస్తులకు మావోయిస్టులు నష్టం కలిగించే అవకాశాలున్నాయని నిఘావర్గాలుఇటీవల హెచ్చరించాయి. రైల్వే బోర్డు అధికారులు కుట్రకోణాన్ని గురించి మాట్లాడుతుంటే, కేంద్ర హోం, రైల్వే మంత్రులు మాత్రం తొందరపడి నిర్ణయానికి రాలేమని అంటున్నారు. ‘రాజధాని’ ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని రైల్వే మంత్రి సదానంద గౌడ, సహాయ మంత్రి మనోజ్ సిన్హాలు పరిశీలించారు. విద్రోహ కోణంపై దర్యాప్తు చేస్తామని గౌడ చెప్పారు. దుర్ఘటనకు ముందు పట్టాలపై పేలుడు సంభవించిందని, దాని వల్లే రైలు పట్టాలు తప్పి ఉండొచ్చని రైల్వే బోర్డు చైర్మన్ అనురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ‘రాజధాని’ రావడానికి 15 నిమిషాల ముందు కవిగురు ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో సురక్షితంగా వెళ్లిందని సరణ్ జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు. ప్రమాదానికి గురైన రైలుకు ముందు ముందు జాగ్రత్తగా పైలట్ ఇంజన్‌ను నడపకపోవడంపై రైల్వే పోలీసులు, తూర్పుమధ్య రైల్వే అధికారులు నిందించుకున్నారు. మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి రూ. 2 లక్షల చొప్పున, ప్రధాని రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని, కేబినెట్ సంతాపం ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రమాదంపై కేంద్ర కేబినెట్ విచారం వ్యక్తం చేసింది. విద్రోహ కోణంపై చర్చించి, ఆందోళన వ్యక్తం చేసింది. భేటీలో మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. -
'రాజధాని' మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
-
'రాజధాని' మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
న్యూఢిల్లీ : బీహార్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే శాఖా మంత్రి సదానంద గౌడ స్పందించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు మంత్రి సదానంద గౌడ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కటుంబాలకు రెండు లక్షలు...తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు..స్వల్పంగా గాయపడిన వారికి 20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదం వెనుక మావోల హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నామని చెప్పారు. కాగా బీహార్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి డిబ్రూగఢ్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ చాప్రా సమీపంలోని గోల్డెన్‌గఢ్ వద్ద పట్టాలు తప్పింది. బీ 7 నుంచి బీ 1 వరకు ఏడు బోగీలు పట్టాల నుంచి ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో మరో పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
పట్టాలు తప్పిన రైలు,ముగ్గురు మృతి
-
ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనస్వాగతం
ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకున్న నాయకులు నినాదాలతో మార్మోగిన కాజీపేట జంక్షన్ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఢిల్లీకి వెళ్లిని జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు.. బిల్లు ఆమోదం పొందిన తర్వాత విజయదరహాసంతో గురువారం ఢిల్లీ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకున్నారు. నాయకుల రాకను తెలుసుకున్న ఉద్యోగులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వారికి ఘనస్వాగతం పలికారు. ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణవాదులతో కాజీపేట రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. తెలంగాణ నినాదాలతో కాజీపేట జంక్షన్ ప్రాంగణం మార్మోగింది. తెలంగాణ రాష్ర్టం.. అమరులకు అంకితం కాజీపేట రైల్వే వీఐపీ లాంజ్‌లో ఉద్యోగ సంఘాల ఐకాస చైర్మన్ పరిటాల సుబ్బారావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరులకే అంకితం అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్, యావత్తు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కృషి ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని అన్నారు. తెలంగాణ ఉద్యోమంలో కలిసి వచ్చిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు కోలా రాజేష్‌గౌడ్, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి జగన్మోహ న్‌రావు, టీఎన్జీవోఎస్ సిటీ అధ్యక్షుడు రాంకిషన్‌నాయక్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ ఉన్నారు. కాజీపేట జంక్షన్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ కాజీపేట జంక్షన్ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా ఉద్యోగ సంఘాల నాయకుల ర్యాలీ నిర్వహించారు. కాజీపేట జంక్షన్ నుంచి చౌరస్తా, పాతీమానగర్ జంక్షన్, సుబేదారి మీదుగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. -
రేపట్నుంచి రాజధాని, శతాబ్ది, దురంతో రైలు ఛార్జీల పెంపు
రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి రైళ్లలో అయితే త్వరగా, సౌఖ్యంగా వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారా? అయితే మీ జేబుకు మాత్రం కాస్తంత భారం తప్పదు. ఎందుకంటే, ఆయా రైళ్లలోని కేటరింగ్ ఛార్జీలను రైల్వే శాఖ 2 నుంచి 4 శాతం వరకు పెంచుతోంది. ఈ పెంపు గురువారం నుంచి అమలులోకి రానుంది. ఈ రైళ్ల ఛార్జీలలోనే అందులో ఇచ్చే ఆహార పదార్థాల ఖర్చుకూడా కలిసుంటుందన్న విషయం తెలిసిందే. వాటి ఖరీదునే ఇప్పుడు పెంచారు. గడిచిన పది రోజుల్లో ప్రయాణికులపై భారం పెరగడం ఇది రెండోసారి. ఈనెల ఏడో తేదీనే రైల్వేశాఖ ఇంధన సర్దుబాటు పేరుతో ప్రయాణికుల ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందే ఈ రైళ్లకు టికెట్లు కొనుక్కున్నవాళ్లు మాత్రం మిగిలిన ఛార్జీని టీటీఈలకు చెల్లించాల్సి ఉంటుందని రైల్వేశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ తరహా రైళ్లలో కేటరింగ్ ఛార్జీలను 14 సంవత్సరాల తర్వాత పెంచుతున్నారు. చిట్టచివరి సారిగా వీటిని 1999లో పెంచారు. ఛార్జీ పెంచడమే కాదు, మెనూలో కొత్త కొత్త వెరైటీలు కూడా చేరుస్తున్నారు. ఏసీ -1, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో చేపల వేపుడు, స్టఫ్డ్ పరోటా, అన్ని తరగతుల వారికీ ఫ్లేవర్డ్ మిల్క్ కూడా ఇవ్వనున్నారు. అలాగే స్టఫ్ చేసిన రోల్స్ కూడా ఇస్తారు. వీటికి బదులు చాక్లెట్లు, టాఫీలు, పండ్ల రసాలను తొలగించారు. ఉదయం, సాయంత్రం ఇచ్చే టీ ధరను 30-4౦ శాతం వరకు తగ్గించినా, టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనాల ధరను మాత్రం 50-60 శాతం పెంచారు. రాజధాని, దురంతో రైళ్లలో కొత్తగా కాంబో మీల్‌ను ప్రవేశపెడుతున్నారు. వీటి ధరలు మామూలు భోజనంతో పోలిస్తే సగమే ఉంటాయట!! -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
దిబ్రుగఢ్ : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం అనూహ్యరీతిలో మంటలు చెలరేగాయి. రైలు గౌహతీ మీదుగా దిబ్రుగఢ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజిన్లు సంఘనాస్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా మంటలు రాజుకోవడంతో ... అందరూ భయపడిపోయారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు ప్యాంట్రీ కారు బోగిని రైలు నుంచి వేరు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. . ఈ అగ్ని ప్రమాదంలో ఎవ్వరూ మృతిచెందినట్టుగానీ, గాయపడినట్టుగానీ ఇంకా సమాచారం తెలియలేదు. అయితే, ప్యాంట్రీ కారు కాబట్టి కేవలం ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. అసోంలోని మోరిగాం జిల్లా దరంతుల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. -
రాజదాని ఎక్స్‌ప్రెస్‌లో అనూహ్యరీతిలో మంటలు