దూరప్రయాణాలు చేయడానికి రాజధాని లాంటి ఎక్స్ప్రెస్ రైళ్లయితే బాగుంటుందని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే, గువాహటి వెళ్లే రాజధాని రైల్లో ఇచ్చిన శాకాహార భోజనంలో ఎముక ముక్కలు కనిపించాయి. తికమ్ చంద్ జైన్ (65) తరచు రాజధానిలో వెళ్తుంటారు. ఆయన సెప్టెంబర్ 19న ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కి, అక్కడ తర్వాతి రోజుకు శాకాహారం కావాలని ఆర్డర్ ఇచ్చారు. కానీ, తనకు ఇచ్చిన కూరలో ఎక్కడో ఎముకలు వచ్చినట్లు అనుమానం వచ్చింది. తీరా చూస్తే నిజంగానే అందులో ఎముకలున్నాయి.
దీంతో కేటరింగ్ మేనేజర్కు ఫిర్యాదు చేసి, ప్రధాన కార్యాలయానికి కూడా లిఖిత పూర్వక ఫిర్యాదు పంపారు. దాంతో ఆ రైల్లో కేటరింగ్ చేస్తున్న బృందావన్ ఫుడ్ వారికి రైల్వేశాఖ లక్ష రూపాయల జరిమానా విధించింది. దాంతోపాటు ఫిర్యాదును చాలా సీరియస్గా పరిగణించారు. ఇంతకుముందు గోవా ఎక్స్ప్రెస్లో సూప్లో బొద్దింక వచ్చింది. ఆ కేసులోనూ కేటరర్కు లక్ష రూపాయల జరిమానా విధించారు.
రైల్లో శాకాహారంలో ఎముకలు.. లక్ష జరిమానా!!
Published Wed, Sep 24 2014 7:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement