రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం అనూహ్యరీతిలో మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. గౌహతీ మీదుగా దిబ్రుగఢ్ నుంచి న్యూఢిల్లీకి రైలు వెళ్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజిన్లు సంఘనాస్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశారు. అసోంలోని మోరిగాం జిల్లా దరంతుల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరైనా మృతిచెందారా, గాయపడ్డారా అన్న వివరాలు ఇంకా తెలియలేదు. విషయం తెల్సుకున్న వెంటనే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుంటున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.