pantry car
-
రైల్వే కిచెన్‌లో ఎలుకల సంచారం.. అధికారుల స్పందన ఇది..!
ముంబయి: రైల్వేలలో ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆహారంలో అపరిశుభ్రమైన వస్తువులు రావడం తరచూ చూస్తుంటాం. కానీ తాజాగా రైల్వే కిచెన్(ప్యాంట్రీ)లో ఏకంగా ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మడగావ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. రైల్వే కిచెన్‌లో ఎలుకలు సంచరిస్తున్న వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను మడగావ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ఈ దృశ్యాలను చూశానని ఆ ఘటనపై ఇలా పేర్కొన్నాడు. '11099 నెంబర్‌గల మడ్గావ్ ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్ 15న ప్రయాణిస్తున్నాను. అప్పటికే మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలస్యమైంది. రైలు వెనుకభాగంలోకి వెళ్లి చూస్తే ప్యాంట్రీలో ఎలుకలు దర్శనమిచ్చాయి. ఆహార పదార్థాలను ఎలుకలు తింటూ కనిపించాయి.' అని ఆ యూజర్ తెలిపాడు. View this post on Instagram A post shared by RF Drx. Mangirish Tendulkar (@mangirish_tendulkar) ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసుకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని ఆ ప్రయాణికుడు తెలిపాడు. రైల్వే ట్రాక్‌పై ఉండే ఎలుకలు లోపలికి దూరి ఉండవచ్చని సాధారణంగా మాట్లాడి నిరుత్సాహపరిచాడు. ఆ తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మీనాకు ఫిర్యాదు చేస్తే ప్యాంట్రీ మేనేజర్‌తో మాట్లాడామని వెల్లడించారు. అయితే.. రైలు కోచ్‌లలో లోపాల కారణంగానే ఎలుకలు లోపలికి ప్రవేశిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చివరికి రైల్వే పెద్దలు ఈ ఘటనపై స్పందించి.. తగు నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్యాంట్రీలో శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. The matter is viewed seriously and suitable action has been taken.Pantry Car Staff have been sensitised to ensure hygiene and cleanliness in the pantry car. The concerned have been suitably advised to ensure effective pest and rodent control measures which is being ensured. — IRCTC (@IRCTCofficial) October 18, 2023 ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు -
కదిలే రైలు నుంచి ప్యాసింజర్‌ను తోసేసిన సిబ్బంది
లక్నో: రైల్వే ప్యాంట్రీ సిబ్బంది దాష్టికానికి తెగపడ్డారు. కదిలే రైలు నుంచి ఓ వ్యక్తిని బయటకు తోసేశారు. వాటర్ బాటిల్ విషయంలో అతను వాళ్లతో వాగ్వాదానికి దిగగా.. పాన్ మసాలా రైలులో ఉమ్మేశాడంటూ సిబ్బంది అతనిపై దాడికి దిగారు. ఉత్తర ప్రదేశ్ లలిత్పూర్ దగ్గర శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వాటర్ బాటిల్ విషయంలో చెలరేగిన గొడవ.. చిలికి చిలికి దుమారం రేపింది. ఆ కోపంలో సిబ్బంది.. సదరు ప్రయాణికుడిపై కక్ష కట్టారు. పాన్ మసాలా ఉమ్మేశాడంటూ గొడవ పెట్టుకుని.. చితకబాది బయటకు తోసేశారు. రవి యాదవ్(26) అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. జిరోలి దగ్గరకు చేరుకోగానే ప్యాంట్రీ స్టాఫ్‌తో అతనికి గొడవ మొదలైంది. వాటర్ బాటిల్ కొనుగోలు మొదలై.. రైలులో పాన్ మసాలా ఉమ్మేశారనే కారణంతో గొడవ పెద్దది అయ్యింది. ఈ తరుణంలో లలిత్పూర్ స్టేషన్ దగ్గర రవి యాదవ్ సోదరిని సిబ్బంది దించేశారు. అయితే అతన్ని మాత్రం దిగకుండా అడ్డుకున్నారు. ఈలోపు రైలు కదిలింది. బలవంతంగా అతన్ని ఆపేసి.. రైలులోనే దాడి చేశారు. ఆపై అతన్ని పట్టాలపైకి విసిరేశారు. స్థానికులు రవిని గమనించి.. ఆస్పత్రికి తరలించారు. ప్రాణపాయ స్థితి నుంచి బయటపడినట్లు ఝాన్సీ పోలీసులు వెల్లడించారు. రవి ఫిర్యాదు మేరకు ప్యాంట్రీ సిబ్బందిపై కేసు నమోదు చేసుకుని.. ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. -
గొల్లప్రోలు వద్ద రైలులో అగ్నిప్రమాదం
-
యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, తూర్పు గోదావరి: యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలులోని వంటచేసే బోగీలో(ప్యాంట్రీ కార్) మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయడపడ్డారు. ప్రమాదం జరగడంతో ఐదు గంటలుగా రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. ప్రమాదానికి గురైన రైలును మరికాసేపట్లో గొల్లప్రోలు నుంచి పిఠాపురం తరలించనున్నారు. గొల్లప్రోలు స్టేషన్ వద్ద రెండు రైల్వే లైన్లు మాత్రమే ఉండటంతో.. ప్రస్తుతం ఒకే లైన్ ద్వారా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో విజయవాడ-విశాఖపట్నం మద్య రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు రైల్వే అధికారుల తీరుపై మండిపడుతున్నారు. -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
దిబ్రుగఢ్ : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం అనూహ్యరీతిలో మంటలు చెలరేగాయి. రైలు గౌహతీ మీదుగా దిబ్రుగఢ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజిన్లు సంఘనాస్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా మంటలు రాజుకోవడంతో ... అందరూ భయపడిపోయారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు ప్యాంట్రీ కారు బోగిని రైలు నుంచి వేరు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. . ఈ అగ్ని ప్రమాదంలో ఎవ్వరూ మృతిచెందినట్టుగానీ, గాయపడినట్టుగానీ ఇంకా సమాచారం తెలియలేదు. అయితే, ప్యాంట్రీ కారు కాబట్టి కేవలం ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. అసోంలోని మోరిగాం జిల్లా దరంతుల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. -
రాజదాని ఎక్స్‌ప్రెస్‌లో అనూహ్యరీతిలో మంటలు