రైల్వే కిచెన్‌లో ఎలుకల సంచారం.. అధికారుల స్పందన ఇది..! | Viral Video Shows Rats Tasting Food Inside Indian Railways Pantry, Railways Responds On It - Sakshi
Sakshi News home page

రైల్వే కిచెన్‌లో ఎలుకల సంచారం.. అధికారుల స్పందన ఇది..!

Published Thu, Oct 19 2023 11:38 AM | Last Updated on Thu, Oct 19 2023 12:03 PM

Video Shows Rats In Train Pantry Railways Responds - Sakshi

ముంబయి: రైల్వేలలో ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆహారంలో అపరిశుభ్రమైన వస్తువులు రావడం తరచూ చూస్తుంటాం.  కానీ తాజాగా రైల్వే కిచెన్‌(ప్యాంట్రీ)లో ఏకంగా ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మడగావ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. 

రైల్వే కిచెన్‌లో ఎలుకలు సంచరిస్తున్న వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను మడగావ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ఈ దృశ్యాలను చూశానని ఆ ఘటనపై ఇలా పేర్కొన్నాడు. '11099 నెంబర్‌గల మడ్గావ్ ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్ 15న ప్రయాణిస్తున్నాను. అప్పటికే మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలస్యమైంది. రైలు వెనుకభాగంలోకి వెళ్లి చూస్తే ప్యాంట్రీలో ఎలుకలు దర్శనమిచ్చాయి. ఆహార పదార్థాలను ఎలుకలు తింటూ కనిపించాయి.' అని ఆ యూజర్ తెలిపాడు. 

ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసుకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని ఆ ప్రయాణికుడు తెలిపాడు. రైల్వే ట్రాక్‌పై ఉండే ఎలుకలు లోపలికి దూరి ఉండవచ్చని సాధారణంగా మాట్లాడి నిరుత్సాహపరిచాడు. ఆ తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మీనాకు ఫిర్యాదు చేస్తే ప్యాంట్రీ మేనేజర్‌తో మాట్లాడామని వెల్లడించారు. అయితే.. రైలు కోచ్‌లలో లోపాల కారణంగానే ఎలుకలు లోపలికి ప్రవేశిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చివరికి రైల్వే పెద్దలు ఈ ఘటనపై స్పందించి.. తగు నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్యాంట్రీలో శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు.

ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement