రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు | Fire in pantry car of Dibrugarh-New Delhi Rajdhani Express | Sakshi
Sakshi News home page

రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు

Published Tue, Oct 15 2013 9:48 AM | Last Updated on Wed, Sep 5 2018 9:51 PM

రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు - Sakshi

రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు

దిబ్రుగఢ్ : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం అనూహ్యరీతిలో మంటలు చెలరేగాయి. రైలు గౌహతీ మీదుగా దిబ్రుగఢ్ నుంచి న్యూఢిల్లీకి  వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజిన్లు సంఘనాస్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా మంటలు రాజుకోవడంతో ... అందరూ భయపడిపోయారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు ప్యాంట్రీ కారు బోగిని రైలు నుంచి వేరు చేశారు.

దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. . ఈ అగ్ని ప్రమాదంలో ఎవ్వరూ మృతిచెందినట్టుగానీ, గాయపడినట్టుగానీ ఇంకా సమాచారం తెలియలేదు. అయితే, ప్యాంట్రీ కారు కాబట్టి కేవలం ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. అసోంలోని మోరిగాం జిల్లా దరంతుల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement