'రాజధాని' మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా | Sadananda Gowda announces 2 Lakhs ex-gratia for Delhi-Dibrugarh Rajdhani Express derails | Sakshi
Sakshi News home page

'రాజధాని' మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా

Published Wed, Jun 25 2014 11:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

'రాజధాని' మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా

'రాజధాని' మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా

న్యూఢిల్లీ : బీహార్లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే శాఖా మంత్రి సదానంద గౌడ  స్పందించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో  మృతి చెందినవారి కుటుంబాలకు మంత్రి సదానంద గౌడ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కటుంబాలకు రెండు లక్షలు...తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు..స్వల్పంగా గాయపడిన వారికి 20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదం వెనుక మావోల హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నామని చెప్పారు.

కాగా  బీహార్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి డిబ్రూగఢ్‌ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ చాప్రా సమీపంలోని గోల్డెన్‌గఢ్‌ వద్ద  పట్టాలు తప్పింది. బీ 7 నుంచి బీ 1 వరకు  ఏడు బోగీలు పట్టాల నుంచి ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో మరో పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement