New Delhi - Dibrugarh Rajdhani Express
-
ప్రతి రైలుకూ భద్రత కల్పించలేం
''వెళ్లే వచ్చే ప్రతి రైలుకూ మేం రక్షణ కల్పించలేం''... రాజధాని ఎక్స్ప్రెస్ ప్రమాదం గురించి ప్రస్తావించినప్పుడు తూర్పు మధ్య రైల్వే జనరల్ మేనేజర్ మధురేష్ కుమార్ స్పందన ఇదీ!! మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శతాబ్ది, రాజధాని లాంటి ప్రీమియం రైళ్లు ఏవైనా వెళ్తుంటే దానికి ముందుగా ఒక 'పైలట్ ఇంజన్' వెళ్లాలి. రైలు వెళ్లే మార్గం సురక్షితంగా ఉందా, లేదా అనే విషయాన్ని ఈ పైలట్ ఇంజన్ పరీక్షించాలి. ఇది తప్పనిసరిగా చేయాల్సిన ప్రక్రియ. కానీ, బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి ముందు ఈ పరీక్ష చేయలేదు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు కూడా అంగీకరించారు. అయితే ఇంత ప్రమాదం జరిగి, ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినా.. రక్షణ కల్పించే విషయంలో మాత్రం జనరల్ మేనేజర్ చాలా బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారని బాధితులు అంటున్నారు. న్యూఢిల్లీ నుంచి అసోం వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ బీహార్లో పట్టాలు తప్పి, ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. బీహార్లోనే జరిగిన మరో సంఘటనలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రాజధాని సంఘటన వెనుక నక్సల్స్ హస్తం ఏమైనా ఉందేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం ఇది నక్సల్స్ పని అనడం తొందరపాటు అవుతుందని వ్యాఖ్యానించారు. -
'రాజధాని' మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
-
'రాజధాని' మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ : బీహార్లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే శాఖా మంత్రి సదానంద గౌడ స్పందించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు మంత్రి సదానంద గౌడ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కటుంబాలకు రెండు లక్షలు...తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు..స్వల్పంగా గాయపడిన వారికి 20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదం వెనుక మావోల హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నామని చెప్పారు. కాగా బీహార్లో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి డిబ్రూగఢ్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ చాప్రా సమీపంలోని గోల్డెన్గఢ్ వద్ద పట్టాలు తప్పింది. బీ 7 నుంచి బీ 1 వరకు ఏడు బోగీలు పట్టాల నుంచి ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో మరో పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం, నలుగురు మృతి
రైల్వే అధికారుల అలసత్వం మరోసారి అమాయక ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంది. బీహార్ రాష్ట్రంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఢిల్లీ నుంచి డిబ్రూగఢ్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ చాప్రా సమీపంలోని గోల్డెన్గఢ్ వద్ద పట్టాలు తప్పింది. బీ 7 నుంచి బీ 1 వరకు ఏడు బోగీలు పట్టాల నుంచి ఒరిగిపోయాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై సమాచారమందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఊహించని ప్రమాదంతో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.