
రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం, నలుగురు మృతి
రైల్వే అధికారుల అలసత్వం మరోసారి అమాయక ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంది. బీహార్ రాష్ట్రంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఢిల్లీ నుంచి డిబ్రూగఢ్ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ చాప్రా సమీపంలోని గోల్డెన్‌గఢ్ వద్ద పట్టాలు తప్పింది. బీ 7 నుంచి బీ 1 వరకు ఏడు బోగీలు పట్టాల నుంచి ఒరిగిపోయాయి.
ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై సమాచారమందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఊహించని ప్రమాదంతో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.