రాజధాని రైలు ఢీకొని నలుగురు మృతి | Four Dead after Rajdhani Express hits in Etawah | Sakshi
Sakshi News home page

రాజధాని రైలు ఢీకొని నలుగురు మృతి

Published Mon, Jun 10 2019 12:02 PM | Last Updated on Mon, Jun 10 2019 4:20 PM

Four Dead after Rajdhani Express hits in Etawah - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఇటవాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. ఇటవాలోని బాల్‌రాయ్ రైల్వేస్టేషన్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి హౌరా మార్గంలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు వెలుతుండగా, మరో వైపు అవధ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉంది. ఈ సమయంలో అవతలివైపు చూసుకోకుండా పట్టాలు దాటుతుండగా అప్పటికే వేగంగా ఉన్న రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ ఢీకొట్టింది. బాధితులందరూ కౌషాంబి వాసులుగా తెలుస్తోంది. మృతులు రాజేంద్ర, పింటూ, జమ్హిర్‌ లాల్‌, భయ్యా లాల్‌గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement