
ఆ వరుడు అడిగిన అదనపు కట్నం ఆ అమ్మాయి తండ్రి ఇవ్వలేనన్నాడు. కోపంతో ఎలాగైనా అమ్మాయి కుటుంబం పరువు తీయాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. పెళ్లిరోజే పీటలపైకి తప్పతాగి వచ్చాడు. తాగి వచ్చినోడు ఆ మత్తులో వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. ఇక అంతే.. అతని చెంప చెల్లుమంది..
రవీంద్ర కుమార్(26)కు రాధా దేవికి ఈ నెల 22వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపుతో పెళ్లి కొడుకు కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య కట్నం విషయంలో గొడవలు జరిగాయి. దీంతో ఎలాగైనా పెళ్లిలో వధువు కుటుంబాన్ని అందరి ముందు అవమానించాలని రవీంద్ర భావించాడు. ఊరేగింపు కంటే ముందే స్నేహితులతో ఫుల్‌గా మద్యం సేవించాడు.
తీరా పెళ్లి మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా.. వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. తూగుతున్న అతన్ని లాగి అతని చెంప మీద కొట్టింది. తన చేతిలో దండ కింద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో పెళ్లి మండపం కాస్త రణరంగంగా మారింది.
बरेली: दूल्हे ने दुल्हन की बेस्ट फ्रेंड को पहना दी वरमाला, दुल्हन ने मारा दूल्हे को थप्पड़, लौट गई बारात.!#UttarPradesh #UPNews #Bareilly #UPPolice pic.twitter.com/WZssqNzG5T
— Bansal News (@BansalNewsMPCG) February 25, 2025
Video Credits: Bansal News
ఇరువర్గాలు కుర్చీలు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాధాదేవి తండ్రి ఫిర్యాదు మేరకు.. అదనపు కట్నం డిమాండ్, ఉద్దేశపూర్వకంగానే రాధాదేవిని అవమానించారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎపిసోడ్‌లో వరుడు, అతని స్నేహితులపై మరో కేసు నమోదయ్యింది. కల్తీ మద్యం కొనుగోలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది.