garland
-
వధువు స్నేహితురాలి మెడలో వరమాల, చివరికి..
ఆ వరుడు అడిగిన అదనపు కట్నం ఆ అమ్మాయి తండ్రి ఇవ్వలేనన్నాడు. కోపంతో ఎలాగైనా అమ్మాయి కుటుంబం పరువు తీయాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. పెళ్లిరోజే పీటలపైకి తప్పతాగి వచ్చాడు. తాగి వచ్చినోడు ఆ మత్తులో వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. ఇక అంతే.. అతని చెంప చెల్లుమంది..రవీంద్ర కుమార్(26)కు రాధా దేవికి ఈ నెల 22వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపుతో పెళ్లి కొడుకు కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య కట్నం విషయంలో గొడవలు జరిగాయి. దీంతో ఎలాగైనా పెళ్లిలో వధువు కుటుంబాన్ని అందరి ముందు అవమానించాలని రవీంద్ర భావించాడు. ఊరేగింపు కంటే ముందే స్నేహితులతో ఫుల్‌గా మద్యం సేవించాడు.తీరా పెళ్లి మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా.. వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. తూగుతున్న అతన్ని లాగి అతని చెంప మీద కొట్టింది. తన చేతిలో దండ కింద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో పెళ్లి మండపం కాస్త రణరంగంగా మారింది.बरेली: दूल्हे ने दुल्हन की बेस्ट फ्रेंड को पहना दी वरमाला, दुल्हन ने मारा दूल्हे को थप्पड़, लौट गई बारात.!#UttarPradesh #UPNews #Bareilly #UPPolice pic.twitter.com/WZssqNzG5T— Bansal News (@BansalNewsMPCG) February 25, 2025Video Credits: Bansal Newsఇరువర్గాలు కుర్చీలు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాధాదేవి తండ్రి ఫిర్యాదు మేరకు.. అదనపు కట్నం డిమాండ్, ఉద్దేశపూర్వకంగానే రాధాదేవిని అవమానించారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎపిసోడ్లో వరుడు, అతని స్నేహితులపై మరో కేసు నమోదయ్యింది. కల్తీ మద్యం కొనుగోలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. -
చెప్పుల దండతో ఎన్నికల ప్రచారానికి..
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలు సాగిస్తున్నారు. యూపీలోని అలీగఢ్‌లో ఓ అభ్యర్థి చేస్తున్న ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎవరి మెడలోనైనా చెప్పుల దండను వేశారంటే వారిని అవమానించారని అర్థం. ఇటువంటి ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే అలీగఢ్‌లో స్వతంత్ర అభ్యర్థి పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పూల దండకు బదులు చెప్పుల దండ వేసుకుని ఓట్లు అడగటాన్ని చూసి, స్థానికులంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పండిట్ కేశవ్ దేవ్‌కు ఎన్నికల సంఘం చెప్పు గుర్తును కేటాయించింది. ఈ నేపధ్యంలో కేశవ్ తన మెడలో ఏడు చెప్పులతో కూడిన దండతో ప్రచారం సాగిస్తున్నాడు. అవినీతిని అరికడతానంటూ అందరికీ చెబుతున్నాడు. పండిట్ కేశవ్ దేవ్ సమాచారం హక్కు(ఆర్టీఐ) కార్యకర్త. ఆయన భారతీయ హిందూ రాష్ట్ర సేన, అవినీతి నిరోధక సేన అనే సంస్థలను కూడా నడుపుతున్నారు. కేశవ్ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. అలీఘర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో అంటే ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. #WATCH | Aligarh, UP: Independent candidate from Aligarh Pandit Keshav Dev has been allotted 'slippers' as the election symbol. After which, he was seen carrying out the election campaign wearing a garland of 7 slippers around his neck. (08.04) pic.twitter.com/V0Hm8JYRmC — ANI (@ANI) April 8, 2024 -
అయోధ్యలో లక్షల్లో తులసి మాలల విక్రయాలు!
శ్రీరాముడు కొలువైన నగరమైన అయోధ్య(యూపీ)లో రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఆలయ నిర్మాణంలో యువత భాగస్వాములవుతున్నారు. వారంతా సనాతన సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక సందర్భాలలో యువత ఆలయాలకు చేరుకుని, పూజలు చేస్తుండటం మరింతగా కనిపిస్తోంది. కార్తీకమాసంలో అయోధ్యకు దాదాపు 30 లక్షల మంది రామభక్తులు తరలివచ్చారు. వీరిలో గరిష్ట సంఖ్యలో యువత ఉన్నారు. మరోవైపు అయోధ్యలో తులసి మాలల వ్యాపారం జోరుగా సాగుతోంది. లక్షల సంఖ్యలో తులసి మాలలు విక్రయమవుతున్నాయి. యువత తులసి మాలలు ధరించేందుకు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు, భక్తుల రద్దీ మరింతగా పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే యువత తులసిమాల వేసుకోవాలని భావిస్తున్నారన్నారు. కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు తులసి మాలలను కొనుగోలు చేశారని వ్యాపారులు చెబుతున్నారు. తులసి మాలలను చేతితో తయారు చేసే భువన్ దేవి మాట్లాడుతూ తన భర్తతో పాటు చాలా కాలంగా తాను ఈ పనిలో నిమగ్నమయ్యానని, ఇప్పుడు యువత అమితంగా తులసిమాలలకు ఆకర్షితులు కావడం చూస్తున్నానని అన్నారు. గత ఏడాది కాలంగా తులసి, రోజా, రుద్రాక్ష మాలలను యువతీయువకులు కొనుగోలు చేస్తున్నారన్నారు. తులసి మాల ధారణతో మనస్సు, వాక్కు రెండింటికీ స్వచ్ఛత లభిస్తుందని చెబుతారు. తులసి మాల ధరించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెంపొందుతుందని, భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని అనుభూతి చెందుతారని భక్తులు నమ్ముతారు. తులసి మాల మనశ్శాంతిని అందిస్తుందని కూడా అంటారు. తులసి మాల ధరించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: భారత్ పొరుగు దేశాల్లో మరోమారు భూ ప్రకంపనలు -
నా పెళ్లి నా ఇష్టం
పెళ్లిలో పెళ్లికొడుకు మెడలో పూలదండ కనిపించడం సాధారణమే. హరియాణ రాష్ట్రం ఖురేషీపూర్ గ్రామానికి చెందిన ఈ వరుడు మాత్రం సంప్రదాయానికి భిన్నంగా ఖరీదైన కొత్తరకం దండ తయారు చేయించాడు. దీని అర్థం... ఖరీదైన పువ్వులతో దండ తయారు చేయించాడు అని కాదు. అది కరెన్సీ దండ. 20 లక్షల అయిదు వందల నోట్లతో తయారు చేయించిన ఈ వరుడి దండ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌పై నెటిజనులు రకరకాలుగా స్పందించారు. కొందరు ‘ఆహా! అద్భుతం’ అంటే– మరికొందరు ‘ఏమిటీ అతి’ అని చురకలు అంటించారు. ‘ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఫిర్యాదు చేస్తాం’ అని కొందరు బెదిరించారు. ఎవరి స్పందన ఎలా ఉన్నా ఈ వీడియో క్లిప్ 15 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ మధ్య వచ్చిన ‘కీడా కోలా’ సినిమాలో హీరో బార్బీ డాల్ మీద మనసు పడతాడు. పెళ్లంటూ చేసుకుంటే బార్బీ డాల్నే చేసుకుంటానని ప్రతినపూనుతాడు. అది సినిమా కాబట్టి నవ్వుకుంటాం. ‘నిజజీవితంలో ఇంత సీన్ ఉంటుందా!’ అనుకుంటాం. అయితే బ్రెజిల్‌కు చెందిన రోచా మోరీస్ వివాహవేడుకను చూస్తే ‘నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి’ అనే వాస్తవం బోధపడుతుంది. రోచా ‘మార్సెల్’ను పెళ్లి చేసుకుంది. సదరు ఈ మార్సెల్ మానవమాత్రుడు కాదు. ఓ బొమ్మ. 40 మంది గెస్ట్‌లతో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. -
టమాటాల దండతో రాజ్యసభకు ఆప్ ఎంపీ.. వీడియో వైరల్..
ఢిల్లీ: దేశంలో టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా కిలో టమాటాలు రూ.200 పైనే అమ్ముడుపోయాయి. టమాటా ధరల పెరుగుదల రాజకీయంగా కూడా వార్తల్లో నిలిచింది. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. అటు పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు టమాటా మంచి ఆయుధంగా కూడా మారింది. తాజాగా రాజ్యసభ సమావేశాలకు వెళ్లి ఆప్ ఎంపీ వినూత్నంగా నిరసన తెలిపారు. టమాట ధరల పెరుగుదలతో ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా రాజ్యసభకు సరికొత్తగా నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు నిరసనగా టమాటా దండను మెడలో వేసుకుని రాజ్యసభకు వెళ్లారు. ఇందుకు రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్ కుమార్ ప్రవర్తించిన తీరు ఎంతో బాధకలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభా గౌరవ మర్యాదలు కాపాడాలని అన్నారు. సదరు సభ్యునిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ग़रीब लोगों का ख़ून चूस रही 'Modi की महंगाई डायन'‼️ Modi सरकार का ध्यान महंगाई की तरफ आकर्षित करने के लिए टमाटर और अदरक की माला पहन कर संसद पहुँचे AAP MP @DrSushilKrGupta pic.twitter.com/FkLEQxQAe7 — AAP (@AamAadmiParty) August 9, 2023 కాగా.. ధరల పెరుగుదలకు నిరసనగా ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రాజ్యసభకు వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంపై విమర్శలు చేసింది. ఇదీ చదవండి: 'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్.. -
అమ్మవారికి నిమ్మకాయ దండలెందుకు వేస్తారు?
అమ్మవారికి నిమ్మకాయల దండలెందుకు వేస్తారు? గుమ్మడి కాయను ఎందుకు బలి ఇస్తారు?..నిజానికి మాములు రోజుల్లోనే కాదు బోనాలప్పుడూ, కొన్ని ప్రత్యేక పండుగల్లో అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పించడం, నిమ్మకాయల దండలు వేసి అర్చించడం వంటివి చేస్తాం . ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు ? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది. మనమొకసారి పరిశీలిస్తే, లక్ష్మీ దేవికి , సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండాలు వేసే ఆచారం కనిపించదు . కానీ శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది. శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది . నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. లయకారుని శక్తి కదా అమ్మవారు. కాలస్వరూపమై, దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది. దేవి సత్వ స్వరూపమే అయినా సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవీ స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా, రాత్రిపూట నగర సంచారం / గ్రామ సంచారం చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తారు . అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. శిరస్సుకి ప్రతిగానే ఈ కూష్మాండం.. "కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం". వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా ! రాజులు మాంసాహారాన్ని, బ్రాహ్మణులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాఖాహారాన్ని తీసుకుంటారు . మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె ‘బలిప్రియ’. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సుకి ప్రతీక కూష్మాండం (గుమ్మడికాయ ). అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ‘ఓ బలిదానమా ! నా భాగ్యమువలన కూష్మాండ రూపంలో ఉన్నావు (గుమ్మిడికాయ రూపంలో ). అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి, నా ఆపదలను నశింపజేయి’. అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. అదేవిధంగా నిమ్మకాయ దండలని సమర్పించడము కూడా ! రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి, శాంతిస్తారని చెబుతారు. అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు. కానీ ఈ సంప్రదాయాన్ని ఇళ్ళల్లో చేసుకొనే పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి . ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో వాడకపోవడం మంచిది. ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే, మీరు తయారు చేసి, గుడిలో ఉన్న దేవతకి సమర్పించి, మీ పేరిట అర్చన చేయించుకొని, అక్కడ చేసిన అర్చనలో నుంచి నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధానికి, వాహనానికి కట్టుకోండి. దానివలన దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. శత్రుపీడలు నివారించబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి . దుష్టశక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదు.!! (చదవండి: జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?) -
Crime: వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ, అంతలోనే..
క్రైమ్: పెళ్లి సంబురంలో ఉన్న ఆ వరుడికి ఒక్కసారిగా షాక్ తగిలింది. మెడలో కరెన్సీ నోట్ల దండతో గుర్రమెక్కి ఊరేగాలనుకుంటే.. ఆ ఫీట్ బెడిసి కొట్టింది. రయ్‌మని దూసుకొచ్చిన ఓ కుర్రాడు.. ఆ నోట్ల దండతో ఉడాయించాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఢిల్లీ మాయాపూరి ప్రాంతంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సరాసరి ఆ పెళ్లి బృందం నేరుగా పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల సాయంతో బృందాలను పంపించి.. సాయంత్రంకల్లా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని 14 ఏళ్ల కుర్రాడికి గుర్తించారు. చోరీకి ముందు ఆ దండలో మొత్తం 329 నోట్లు ఉన్నాయట. అయితే.. పోలీసులు మాత్రం 500 నోట్లు 79 మాత్రమే రికవరీ చేయగలిగారు. -
వరుడి మెడలో నోట్ల దండ.. పక్కన ఫ్రెండ్ ఏం చేశాడంటే!
ఇటీవల పెళ్లి వీడియోలు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో వరుడు, వధువు డ్యాన్స్‌లు, లేదా వింత ఆచారాలు పాటించడం లాంటివి వల్ల వైరల్‌గా మారి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో వరుడి మెడలోని కరెన్సీ దండ నుంచి కొన్ని నోట్లను అతడి స్నేహితుడు దొంగిలించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందులో.. పెళ్లి తతంగం జరుగుతూ ఉంటుంది. అక్కడ కూర్చున్న వరుడి మెడలో బంధువులు కరెన్సీ దండలను వేసుంటారు. పెళ్లి కొడుకు అతిథులు ఏదో చెప్తుంటే బుద్ధిగా వింటుంటాడు. ఆ సమయంలో పక్కన కుర్చీలోనే కూర్చొన్న అతడి స్నేహితుడు ఆ కరెన్సీ దండల నుంచి చోరీకి ప్లాన్ వేస్తాడు. అనుకున్నదే తడువుగా అమలుకు ప్రయత్నిస్తాడు. అంతలో వరుడు అతని స్నహితుడి వైపు తలతిప్పి చూస్తాడు. ఆ వ్యక్తి వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా తన చేతిని వెనక్కి లాక్కుంటాడు. అయితే వరుడు పెళ్లి తంతులో మళ్లీ బిజీ కావడంతో ఈ సారి కొన్ని నోట్లు దొంగలించి మెల్లగా తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అయితే ఇదంతా ఆ పరిసరాల్లో ఉన్న ఒకరు వారి ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా మిశ్రమంగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఆ గర్వం తలకెక్కింది.. ఇప్పుడు నేనేంటో తెలిసొచ్చింది: కచ్చా బాదామ్ సింగర్ -
తప్పతాగి వధువుకి బదులు కాబోయే అత్త మెడలో..
పెళ్లిలో వరుడు చేసిన బిత్తిరి పనికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. అతగాడి అవతారం చూసి.. పెళ్లినాడే ఇలా ఉంటే.. ఇక జీవితాంతం ఎలా ఉంటాడు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వరుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇంతకు అతగాడు వెలగబెట్టిన ఆ ఘనకార్యం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే. నిరంజన్ మహామాత్ర అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పెళ్లి జరుగుతుంటుంది. ఇక వరుడు తప్పతాగి మంటపానికి చేరుకుంటాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో.. వధువుకి బదులు ఆమె తల్లి.. అంటే కాబోయే అత్త మెడలో దండ వేయబోతాడు. పక్కనున్న వారు ప్రమాదాన్ని గ్రహించి పెళ్లికొడుకుని పక్కకు జరపుతారు. ఆ తర్వాత వరుడి స్నేహితులు అతడిని పట్టుకుని.. వధువు మెడలో వరమాల వేయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఫుల్లుగా తాగి ఉండటంతో వధువు మెడలో వరమాల వేయకుండానే స్టేజీ మీదే పడిపోతాడు. పెళ్లికి వచ్చిన వారంతా వరుడి బిత్తరి చర్యకు షాక్ అయ్యారు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. ఇక పాతదే అయినా ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా ‘‘వీడికిందే పోయే కాలం.. పెళ్లి నాడు కూడా తప్పతాగి వచ్చాడు’’ అంటూ విమర్శిస్తున్నారు. చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్.. వైరల్ వీడియో View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు వద్దన్నా జరుగుతూనే ఉన్నాయి. అయితే కరోనా నేపథ్యంలో కొత్త తరహాలో వివాహాలు జరుగుతున్నాయి. మొన్న ఒకచోట పీపీఈ కిట్లు ధరించి ఓ జంట వివాహం చేసుకోగా.. నిన్న మై విలేజ్‌షో నటుడు అనిల్ వినూత్నంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జంట మరీ కొత్తగా చేసుకున్నారు. బొంగుల పెళ్లి అని ఎవరైనా అంటారు. ఇక్కడ అదే నిజమైంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు బొంగుల సహాయంతో ఒకరినొకరు దండలు మార్చుకున్నారు. బొంగులు అంటే వెదురు కర్రలు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెళ్లిని అత్యంత జాగ్రత్తల నడుమ చేసుకున్నారు. అందంగా ముస్తాబు చేసిన కల్యాణ మండపంపై అంతే అందంగా ముస్తాబైన వధూవరులు ముఖానికి మాస్క్‌లు ధరించారు. పెళ్లికి వచ్చినవారు కూడా మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ హాజరయ్యారు. అయితే దండలు మార్చుకునే సమయంలో వెదురు కర్రలు ఉపయోగించారు. కర్రల సహాయంతో వరుడు వధువు మెడలో.. ఆమె అతడి మెడలో దండలు వేసుకున్నారు. కొత్తగా దండలు మార్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు దీన్ని చూసి నవ్వుతుండగా.. మరికొందరు ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇదేం పెళ్లి రా నాయన. కొన్నాళ్లు ఆగలేకపోయావా?’ ఒకరు, ‘మరి పిచ్చి ముదిరింది’ అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే చదవండి: 10 రోజుల కష్టంతో తండ్రి శవం సాధించిన బాలుడు #कोरोना में शादियां सफलतापूर्वक संपन्न कराने के लिए इवेंट मैनेजर्स को क्या क्या जुगाड़ू समाधान निकालना पड़ता है.... 😅😅 pic.twitter.com/2WOc9ld0rU — Dipanshu Kabra (@ipskabra) May 2, 2021 -
250 కేజీల యాపిల్ దండతో..
సాక్షి, బెంగళూరు: తిహార్ జైలు నుంచి విడుదలై సొంత గడ్డకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు డీకే శివకుమార్‌కు ఘనస్వాగతం లభించింది. శనివారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కార్యకర్తలు పూల మాలలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 250 కేజీల యాపిల్ పండ్లతో తయారు చేసిన భారీ దండను క్రేన్ సహాయంతో గాల్లోకి లేపి ఆయనకు అలంకరించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి హల్చల్ చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కేపీసీసీ కార్యాలయం వరకు తీసుకెళ్లారు. అక్కడ తన మద్దతుదారులను ఉద్దేశించి శివకుమార్ ప్రసంగించారు. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సెప్టెంబర్ 3న ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో అదేరోజు సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. 57 ఏళ్ల శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందారు. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు బెంగళూరు రూరల్, రామనగర, మాండ్య ప్రాంతాల్లో గట్టి పట్టుంది. ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రాంతాల్లలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన వారు ఆయనకు సంఘీభావంగా ర్యాలీలు, ధర్నాలు చేశారు. కర్ణాటక స్పెషల్ యాపిల్ దండ యాపిల్స్ స్వాగతం పలకడం కర్ణాటకలో ట్రెండ్‌గా మారింది. గతంలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామిలతో పాటు పలువురు అగ్రనేతలు భారీ యాపిల్ దండలతో స్వాగతాలు అందుకున్నారు. బాదం పప్పు దండలతో కూడా రాజకీయ నాయకులను స్వాగతించడం కన్నడిగులు మొదలుపెట్టారు. ఇదంతా చూసినవారు ఇదేం పిచ్చి అంటూ కామెంట్లు చేస్తుంటారు. -
ఐఐటీ విద్యార్థికి మోదీ స్పెషల్ గిఫ్ట్
ధన్‌బాద్ : ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరగా ఉంటారు. తనకు కానుక ఇవాలని ఐఐటీ విద్యార్థి ఓ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించగా అతడి కోరికను మోదీ తీర్చారు. ఆ విద్యార్థి కోరిన కానుకతో పాటు, ఒక లేఖను కూడా పంపించారు. ఇప్పుడు ఆ విద్యార్థి ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇంతకీ విషయమేమిటంటే.. పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. ఆ పర్యటనలో మోదీ బంగారు వర్ణంలో ఉన్న మాల ధరించారు. మోదీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన రబేశ్ కుమార్ సింగ్ అనే విద్యార్థి ఆ మాలను చూసి ముచ్చటపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఆ మాల తనకు కావాలంటూ ట్విటర్ వేదికగా మోదీకి తన మనసులోని మాట చెప్పాడు. ఇందుకు స్పందించిన మోదీ.. ప్రధాని కార్యాలయం (పీఎంవో) ద్వారా మాలతో పాటు, ఒక లేఖను కూడా పంపించారు. ‘ట్విటర్లో నీ మెసేజ్ చదివాను. పంచాయితీరాజ్ దినోత్సవం రోజు నేను ఆ మాల ధరించాను. ఇప్పుడు ఆ మాలతో పాటు ఈ లేఖను కూడా నీకు పంపిస్తున్నాను. నీవు మంచి భవిష్యత్తు పొందాలని ఆశిస్తున్నానంటూ’ రబేశ్కు మోదీ లేఖ రాశారు. కానుకను అందుకున్న రబేశ్.. ‘మీ నుంచి కానుకతో పాటు, లేఖ కూడా అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇంత మంచి బహుమతి, సందేశాన్నిచ్చిన మీకు కృతఙ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు. प्रधानमंत्री @narendramodi जी नमस्ते आप को पंचायती राज दिवस पर सुन रहा था, बहुत ही सुन्दर उद्बोधन आप के गले में सोने के रंग जैसा माला देखा बहुत ही अच्छा लगा, क्या ये माला मुझे सकता है | #PanchayatiRajDay pic.twitter.com/rbcrs8hwaXpic.twitter.com/5M5KttA6dL — Rabesh Kumar Singh (@RabeshKumar) April 24, 2018 आप का उपहार और स्नेह भरा पत्र पाकर मन प्रफुल्लित हो गया | इस माला रूपी उपहार और शुभकामना संदेश के लिए, आप का कोटि कोटि धन्यवाद #प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी 🙏@narendramodi @PMOIndia हम सब आम लोगों तक आप का ये स्नेह अएसे ही पहुँचता रहे 🙏#जय_हिन्द #जय_भारत #भारत_माता_की_जय pic.twitter.com/1F1i0UEwYi — Rabesh Kumar Singh (@RabeshKumar) May 2, 2018 -
బీజేపీ నేత మెడలో చెప్పుల దండ
-
బీజేపీ నేతకు అవమానం.. మెడలో చెప్పుల దండ
సాక్షి, భోపాల్ : ఓ బీజేపీ నేతకు తీవ్ర అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు అనూహ్యంగా బూట్ల దండ వేసి స్వాగతం పలికారు. దీంతో అప్పటి వరకు హుషారుగా ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అనంతరం అది వారి కోపం మాత్రమేనని, తననుంచి వారు ఏదో కోరుకుంటున్నారని, అందుకే తమ అసంతృప్తిని అలా వ్యక్తం చేశారని అన్నారు. తానెప్పుడూ వారి బిడ్డనేనని, వారి అవసరాలు తీర్చేందుకు మరింత బాగా పనిచేస్తానని అన్నారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో థామ్నోడ్ అనే ప్రాంతంలో దినేశ్ శర్మ అనే బీజేపీ నేత ప్రచారానికి వెళ్లారు. ప్రతి ఇంటికి ఓట్లు అడిగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి చెప్పులతో దండను తీసుకొచ్చి వేయబోయాడు. దీంతో ఆయన వాటిని పక్కకు పడేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి అంతే తన ప్రయత్నాన్ని కొనసాగించడంతో ఇక తప్పదని చెప్పుల దండ వేయించుకున్నాడు. అనంతరం ఆ దండ వేసిన వ్యక్తి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉందని, ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే తాను ఇలా చేశానని అన్నారు. ఇక దండ వేయించుకున్న బీజేపీ నేత దినేశ్ మాత్రం ఆ చర్యపట్ల తనకు ఎలాంటి కోపం లేదని అన్నారు. అయితే, ఈ సమస్యపై తాము మాట్లాడబోతున్నామని చెప్పారు. -
అరగుండు, చెప్పులదండ, నగ్నంగా..
ముంబై: ఆకలేసి తప్పు చేసిన ఇద్దరు మైనర్ బాలురు పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ముంబైలోని ఉల్హస్ నగర్లో శనివారం ఉదయం ఈ ఉందంతం చోటు చేసుకుంది. స్థానిక షాపులోంచి తినుబండారాలను దొంగిలించిన ఇద్దరు మైనర్ బాలుళ్ల పట్ల ఆ షాపు షాపు యజమాని అవమానకరంగా, నిర్దయగా ప్రవర్తించారు. బాలుర మెడలో చెప్పుల దండ వేసి, నగ్నంగా ఊరేగించారు. పొలీసులు అందించిన సమాచారం ప్రకారం 8,9 సం.రాల ఇద్దరు అబ్బాయిలు మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్‌ను దొంగిలించారు. ఇది గమనించిన పఠాన్, అతని ఇద్దరుకు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20) వీళ్లపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. అనంతరం అరగుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి, వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత జరుగుతున్నా ఆ పిల్లల్ని కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ దృశ్యాలను స్థానినికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధితుల తల్లదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఉల్హస్ నగర్, హిల్ లైన్ పోలీసు స్టేషన్, సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితులను కోర్టుముందు హాజరు పర్చి, సోమవారం వరకు రిమాండ్ చేసినట్టు చెప్పారు. -
హెల్మెట్ ధరించనివారికి పూలదండ!
బంజారాహిల్స్ : హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్నవారిని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పూల దండలు వేసి ఘనంగా సత్కరించారు. సోమవారం శ్రీకృష్ణానగర్‌లో హెల్మెట్ ధారణపై యూసుఫ్‌గూడ కార్పొరేటర్ సంజయ్‌గౌడ్‌తో కలిసి అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్లు ధరించకుండా వాహనాలు నడుపుతున్నవారిని ఆపి... దాని వల్ల కలిగే నష్టాలను వివరించారు. హెల్మెట్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. చట్టపరంగా తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. -
అమెరికాలో భారీ వరదలు
-
అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నేడు
-
అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నేడు
వైఎస్సార్సీపీ నిర్ణయం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న జగన్ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను టీడీపీ అసెంబ్లీ వేదికగా రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ శాసనసభాపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, ముత్తిరేవుల సునీల్ ప్రకటించారు. గురువారం సాయంత్రం వారు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని చర్చకు రానీయకుండా అంబే డ్కర్ మహాశయుని గురించి, రాజ్యాంగం గురించి చర్చిద్దామని ఉన్నపళంగా టీడీపీ ప్రతిపాదించడంపట్ల వారు తీవ్రంగా మండిపడ్డారు. అంతేగాక వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్రెడ్డికి, తమ పార్టీ ఎమ్మెల్యేలకు అంబేడ్కర్ అంటే గౌరవం లేదంటూ టీడీపీ నేతలు మాట్లాడుతుండడాన్ని తప్పుపట్టారు. తమకు, తమ నేత జగన్‌కు అంబేడ్కర్ అంటే అపారమైన గౌరవముందని, ఆ మహాశయుడు రచించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గతనెల 26న రాష్ట్రవ్యాప్తంగా జరిపి ఆయన ఆశయాల్ని స్మరించుకోవడమే అందుకు నిదర్శనమని తెలిపారు. నిజానికి అంబేడ్కర్‌ను రాజకీయంగా వాడుకోజూసింది టీడీపీయేనని వారు స్పష్టం చేశారు. మహిళల అభ్యున్నతికి అంబేడ్కర్ తపించార ని, అలాంటి మహానుభావుడ్ని అడ్డంపెట్టి మహిళల మాన,ప్రాణాలను భక్షించిన కాల్‌మనీ రాకెట్‌పై చర్చించకుండా అడ్డుపడ్డారని వారన్నారు. వాస్తవానికి కాల్‌మనీపై చర్చించి దోషుల్ని శిక్షించేలా నిర్ణయం తీసుకునిఉంటే అది అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అయ్యేదన్నారు. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇరుక్కుని చిక్కుల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు అంబేడ్కర్‌ను అడ్డు పెట్టుకున్నది టీడీపీయేనన్నారు. ఇటీవలి జనచైతన్యయాత్రల సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో మంత్రి రావెల కిషోర్‌బాబు బూటుకాళ్లతోనే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారని(కల్పన ఆ ఫొటోను చూపుతూ..) దీన్ని బట్టి టీడీపీ వారికి ఆ మహనీయుడంటే ఎంత భక్తి, గౌరవముందో అర్థమవుతోందన్నారు. రావెల, పీతల సుజాత ఇద్దరూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నేడు అంబేడ్కర్ విగ్రహానికి జగన్ పాలాభిషేకం ఇదిలా ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లడానికి ముందు ఉదయం 8.15 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో పాల్గొంటారని సునీల్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారన్నారు.