Crime: వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ, అంతలోనే.. | Delhi Boy Snatches Money Garland From Bride Groom Caught | Sakshi
Sakshi News home page

వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ, అంతలోనే.. అంతా షాక్‌!

Published Sat, Jan 28 2023 8:54 PM | Last Updated on Sat, Jan 28 2023 8:54 PM

Delhi Boy Snatches Money Garland From Bride Groom Caught - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

క్రైమ్‌: పెళ్లి సంబురంలో ఉన్న ఆ వరుడికి ఒక్కసారిగా షాక్‌ తగిలింది. మెడలో కరెన్సీ నోట్ల దండతో గుర్రమెక్కి ఊరేగాలనుకుంటే.. ఆ ఫీట్‌ బెడిసి కొట్టింది. రయ్‌మని దూసుకొచ్చిన ఓ కుర్రాడు.. ఆ నోట్ల దండతో ఉడాయించాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. 

ఢిల్లీ మాయాపూరి ప్రాంతంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సరాసరి ఆ పెళ్లి బృందం నేరుగా పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల సాయంతో బృందాలను పంపించి.. సాయంత్రంకల్లా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని 14 ఏళ్ల కుర్రాడికి గుర్తించారు. చోరీకి ముందు ఆ దండలో మొత్తం 329 నోట్లు ఉన్నాయట. అయితే.. పోలీసులు మాత్రం 500 నోట్లు 79 మాత్రమే రికవరీ చేయగలిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement