ఢిల్లీ: దేశంలో టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా కిలో టమాటాలు రూ.200 పైనే అమ్ముడుపోయాయి. టమాటా ధరల పెరుగుదల రాజకీయంగా కూడా వార్తల్లో నిలిచింది. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. అటు పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు టమాటా మంచి ఆయుధంగా కూడా మారింది. తాజాగా రాజ్యసభ సమావేశాలకు వెళ్లి ఆప్ ఎంపీ వినూత్నంగా నిరసన తెలిపారు.
టమాట ధరల పెరుగుదలతో ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా రాజ్యసభకు సరికొత్తగా నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు నిరసనగా టమాటా దండను మెడలో వేసుకుని రాజ్యసభకు వెళ్లారు. ఇందుకు రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్ కుమార్ ప్రవర్తించిన తీరు ఎంతో బాధకలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభా గౌరవ మర్యాదలు కాపాడాలని అన్నారు. సదరు సభ్యునిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ग़रीब लोगों का ख़ून चूस रही 'Modi की महंगाई डायन'‼️
— AAP (@AamAadmiParty) August 9, 2023
Modi सरकार का ध्यान महंगाई की तरफ आकर्षित करने के लिए टमाटर और अदरक की माला पहन कर संसद पहुँचे AAP MP @DrSushilKrGupta pic.twitter.com/FkLEQxQAe7
కాగా.. ధరల పెరుగుదలకు నిరసనగా ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రాజ్యసభకు వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంపై విమర్శలు చేసింది.
ఇదీ చదవండి: 'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్..
Comments
Please login to add a commentAdd a comment