wearing
-
ఒళ్లు కనిపించేలా దుస్తులు.. ఢిల్లీ కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ:ఒళ్లు కనిపించేలా పబ్లిక్ ప్లేసుల్లో చిన్న దుస్తులు వేసుకోవడంపై ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు తాజాగా కీలక తీర్పు చెప్పింది. అదేమీ నేరం కాదని స్పష్టం చేసింది. బార్లో చిన్న దుస్తులు వేసుకుని డ్యాన్సులు చేసిన ఏడుగురు బార్ డ్యాన్సర్లపై ఉన్న కేసును కొట్టేసింది. ఇక ముందు కేవలం డ్యాన్సులు చేసినందుకు కాకుండా డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురైతేనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.ఢిల్లీలోని ఓ బార్లో యువతులు చిన్న దుస్తులు వేసుకుని అశ్లీల నృత్యాలు చేశారని అదే సమయంలో బార్ వైపు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురయ్యాయ అన్నదానిని పోలీసులు నిరూపించలేకపోయాడని కోర్టు పేర్కొంది.పోలీసుల ఫిర్యాదు,వాంగ్మూలాలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షులు కూడా బార్‌కు ఎంజాయ్ చేయడానికి వెళ్లామే తప్ప తమకు ఏమీ తెలియదని చెప్పారని కోర్టు పేర్కొంది. -
బ్లాక్ చుడిదార్‌లో సితార క్యూట్ లుక్!
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల కుమార్తె సీతార పలు యాడ్లలో తండ్రితో కలిసి సందడి చేసింది. ప్రముఖ ఆభరణాల అడ్వర్టైస్మెంట్లో కూడా మోడల్స్ ఎవరూ ఆమె ముందు సరిపోరేమో అన్నంతగా స్టన్నింగ్ లుక్‌తో మిస్మరైజ్ చేసింది. ఈసారి ప్రముఖ బ్రాండెండ్ చుడిదార్‌తో న్యూలుక్‌తో మనముందుకు వచ్చింది. సీతార స్టార్ కిడ్ ఫల్గుణి షేన్ పీకాక్ లగ్జరీ దుస్తులతో తళుక్కుమంది. చెప్పాలంటే ఆమె పేరుకు తగ్గట్టు ఆ బ్లాక్ కలర్ డ్రస్‌లో రాత్రిపూట కనిపించే స్టార్‌లో కాంతిలీనుతోంది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) సీక్విన్డ్ బ్లాక్ కుర్తాపై సిల్వర్ గులాబీతో కూడిన అంచులు. దానిపై చక్కగా తీర్చిదిద్ధిన ఎంబ్రాయిడరీ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సాంప్రదాయ ఆకర్షణను తలపించేలా వెండి ముత్యాల వరుసతో తీర్చిదిద్దారు ఆ డ్రస్‌ని. అందుకు తగ్గట్టు జుట్టుని కూడా వేవ్స్ మాదిరిగా చక్కగా వదిలేశారు. ఈ లుక్క్‌లో సీతార అంతకు మించి అన్నంతగా అదిరిపోతోంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. వివాహశైలికి అద్దం పట్టేలా మింట్ గ్రీన్ లెహంగాతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇది శాటిన్-సిల్క్ త్రీ-పీస్ సిల్హౌట్‌పై బంగారుపు దారాలతో డిజైన్ చేసి ఉంది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) లెహంగాపై గోల్డ్ యాక్సెంట్లలో పూల మోటిఫ్‌లతో చక్కగా రూపొందించారు. ఇక ఈ డ్రస్‌కి తగ్గట్టు సితార ట్రాన్సపరేంట్ ఎంబ్రాయిడర్ నెట్ దుప్పటా, పచ్చలతో పొదిగిన బంగారు హారం, కంకణాలు, ఝంకాలు ధరించింది. ఈ లుక్‌లో సితారను చూస్తే పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతకుముందు ఆరెంజ్ లెహంగాను ధరించింది. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) ఆ లెహంగాపై సింపుల్ ఎంబ్రాయిడరీ డిజైన్, షార్ట్ హ్యాండ్స్‌తో కూడిన బ్లౌజ్, సీక్వెన్డ్ దుప్పటతో మెరిసింది. అందుకు తగ్గట్లు నెక్కి ధరించిన నగ ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆ స్టన్నింగ్ లుక్‌లో కట్టిపడేస్తున్న సీతార ఫోటోలను చూసేయండి. (చదవండి: నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే! ఏకంగా 18 కిలోలు) -
వజ్రాలు, వైఢూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకులు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. ఆ వేడుకల్లో కళ్లు చెదిరే రేంజ్లో లగ్జరీయస్‌గా జరిగింది. ఆ వేడుకలు యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అతిథులు భోజనం దగ్గర నుంచి ధరించే బట్టల వరకు ప్రతీది ఓ సెన్సెషన్ అయ్యింది. ఆ వేడుకుల్లో నీతా అంబానీ తనయ ఇషా అంబానీ ధరించి వస్త్రాలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. అంబానీ బిడ్డ కాబట్టి ఆ రేంజ్‌లోనే ఉంటాయి కానీ అంతకు మించి 'వేరేలెవెల్' అన్నట్లు ఉండటంతోనే నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె లెహంగాపై ధరించిన బ్లౌజ్‌కి సంబంధించిన వీడియోని చూసి అంబానీ బిడ్డ ఆ మాత్రం ఉంటుందిలే అని అంటున్నారు. మూడు రోజుల వేడుకల్లో చివరి రోజు చక్కటి లెహంగాతో అలరించారు ఇషా. అందులో ఆమె ధరించిన బ్లౌజ్ ప్రతి ఒక్కరిని స్టన్ అయిపోయేలా చేసింది. ఆ బ్లౌజ్‌ని మనం చెవులకు ధరించే జూకాలతో డిజైన్ చేశారు. కేవలం బంగారుపు జూకాలు కాదండోయ్. బంగారంతో పొదగబడిన వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్‌ని డిజైన్ చేసింది ప్రముఖ డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లా. ఆ బ్లౌజ్లో ఉన్న ప్రతి ఆభరణం చాలా కళాత్మకంగా ఉంటుంది. View this post on Instagram A post shared by FlixZon (@flixzonofficial) డిజైనర్ సందీప్ 2012లో 'ఇండియ ఫెంటాస్టిక్"లో ప్రదర్శించిన ఐకానిక్ బ్లౌజ్‌లను తలదన్నేలా ఐషా ధరించిన బ్లౌజ్‌ని తీర్చిదిద్దడం విశేషం. ఆ బ్లౌజ్‌పై ఇంత బరువైన నగలను చాల పొదినిగ్గా అమర్చడమే కాకుండా చూసేందుకు బండగా కనిపించకుండా ఎలా బ్లౌజ్పీస్పై అమర్చారా? అనిపించేలా తేలికైన ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు. ఆ జాకెట్ డిజైన్ నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే. అయితే అంతలా ఖరీదైన వజ్రాలు, కెంపులు, రత్నాలతో రూపొందిన బ్లౌజ్ ధర ఏకంగా కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఆ జాకెట్‌నే తమ్ముడి పెళ్లిలో ధరించి సందడి చేశారు ఇషా. ఆ అత్యంత లగ్జరీయస్ జాకెట్ డిజైన్ చేసిన విధానానికి సంబంధించిన వీడియోని నెట్టింట్ పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by FlixZon (@flixzonofficial) (చదవండి: షాపు షట్టర్లో కోటు చిక్కుకుపోడంతో పాపం ఆ మహిళ..!) -
స్టన్నింగ్ లుక్‌తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..
దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆమె ఈ మధ్య హిందీ ఇండస్ట్రీ వైపే ఫోకస్ చేసింది. రకుల్ ప్రీత్ చాలా కూల్‌గా హిందీ సినిమాల్లో తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇక ఆమె ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో.. తన అందాన్ని హైలైట్ చేసే ఫ్యాషన్‌కీ అంతే ప్రాధాన్యం ఇస్తుంది రకుల్ ప్రీత్ సింగ్! తన ఫ్యాషన్ ప్రాధాన్యంలో ఆమె లిస్ట్ చేసుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ.. జ్యూలరీ బ్రాండ్: మియార ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మియార..1960 నుంచీ వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని.. నేడు ఇద్దరు సోరీమణులు కలసి అంతర్జాతీయ బ్రాండ్‌గా నిలబెట్టారు ‘మియార’గా! విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్‌కి మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ ఈ బ్రాండ్ అనీ పేరుంది. డిజైన్‌ను బట్టే ధర. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. అభినవ్ మిశ్రా.. పేరుకు ఇది దేశీ బ్రాండ్ కానీ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించింది. ఖరీదైనది కూడా! దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కనీసం ఒక్కసారైనా ఈ డిజైనర్ వేర్‌ను ధరించి ఉంటారు. ప్రతి కస్టమర్‌కి నచ్చేలా.. నప్పేలా ట్రెడిషనల్, ట్రెండీ, ఫ్యాషనబుల్ డిజైన్స్‌ను అందించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. దేశంలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. రకుల్ ధరించిన అభినవ్ మిశ్రా..చీర బ్రాండ్ ధర రూ. 70,000. ఇక రకుల్ ఫ్యాషన్ పరంగా ..నా దృష్టిలో ఫ్యాషన్ అనేది ఒక సహజ పక్రియ. మనం ధరించే దుస్తులు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అందుకే నేను ఎప్పుడూ నా కంఫర్ట్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాను! అని అంటోంది. -దీపిక కొండె (చదవండి: ఈ ఫోటో కనిపిస్తున్నది రాయి మాత్రం కాదు! అది ఏంటంటే..) -
డీజే టిల్లు ఫేమ్ నేహా ధరించిన అల్లికల చీర ధర ఎంతంటే..!
‘సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా..’ పాటలో ఇటీవల డాన్స్‌తో అదరగొట్టిన నటి నేహా శెట్టి... ఫ్యాషన్‌లోనూ అంతే రీతిలో అదరగొడుతోంది.. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో! చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్‌లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్ చేసే టైమ్‌లో ఫ్యాషన్‌పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా. పౌల్మీ అండ్ హర్ష్ ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్‌తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. చేతితో చేసే అల్లికలకే ప్రాధాన్యం. అందుకే, లేట్‌గా వచ్చినా లేటేస్ట్‌గా ఉంటాయి వీరి డిజైన్స్. ప్రస్తుతం భారత్‌తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్ లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. నేహా శెట్టి ధరించిన పౌల్మీ అండ్ హర్ష్ బ్రాండ్ చీర ధర రూ. 42,800/- అభిలాష ఫైన్ జ్యూయల్స్ పదేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. అభిలాష. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తనకున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూలరీ బ్రాండ్‌ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ విస్తరించారు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. --దీపిక కొండి (చదవండి: అందంతో కట్టిపడేస్తున్న అమైరా ధరించిన చీర ధర వింటే షాకవ్వాల్సిందే!) -
టమాటాల దండతో రాజ్యసభకు ఆప్ ఎంపీ.. వీడియో వైరల్..
ఢిల్లీ: దేశంలో టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా కిలో టమాటాలు రూ.200 పైనే అమ్ముడుపోయాయి. టమాటా ధరల పెరుగుదల రాజకీయంగా కూడా వార్తల్లో నిలిచింది. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. అటు పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు టమాటా మంచి ఆయుధంగా కూడా మారింది. తాజాగా రాజ్యసభ సమావేశాలకు వెళ్లి ఆప్ ఎంపీ వినూత్నంగా నిరసన తెలిపారు. టమాట ధరల పెరుగుదలతో ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా రాజ్యసభకు సరికొత్తగా నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు నిరసనగా టమాటా దండను మెడలో వేసుకుని రాజ్యసభకు వెళ్లారు. ఇందుకు రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్ కుమార్ ప్రవర్తించిన తీరు ఎంతో బాధకలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభా గౌరవ మర్యాదలు కాపాడాలని అన్నారు. సదరు సభ్యునిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ग़रीब लोगों का ख़ून चूस रही 'Modi की महंगाई डायन'‼️ Modi सरकार का ध्यान महंगाई की तरफ आकर्षित करने के लिए टमाटर और अदरक की माला पहन कर संसद पहुँचे AAP MP @DrSushilKrGupta pic.twitter.com/FkLEQxQAe7 — AAP (@AamAadmiParty) August 9, 2023 కాగా.. ధరల పెరుగుదలకు నిరసనగా ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రాజ్యసభకు వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంపై విమర్శలు చేసింది. ఇదీ చదవండి: 'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్.. -
బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని కొట్టడంతో బాలిక ఆత్మహత్య
రాంచీ: ఝార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. నుదుటిపై బొట్టు పెట్టుకుని వచ్చిందని బాలికను ఉపాధ్యాయుడు కొట్టాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానవీయ ఘటన ధన్‌బాద్‌లోని తెతుల్ మరిలో జరిగింది. ఈ ఘటనపై బాలల హక్కుల జాతీయ కమిషన్ ఛైర్పర్సన్ ప్రియాంక్ కనుంగో స్పందించారు. దర్యాప్తు నిమిత్తం తమ టీం ధన్‌బాద్‌కు వెళ్తుందని ట్వీట్ చేశారు. చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ చీఫ్ ఉత్తమ్ ముఖర్జీ కూడా ఈ ఘనటపై స్పందించారు. పాఠశాలకు సీబీఎస్ఈ బోర్డు గుర్తింపు కూడా లేదని చెప్పారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన టీచర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇది తీవ్రమైన ఘటన అని అన్నారు. జిల్లా విద్యాశాధికారిని కలిసి ఆయన దృష్టికి తెచ్చామని చెప్పారు.బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించామని ఆయన చెప్పారు. బాలిక మృతిపై బాధిత తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల యాజమాన్యంపై ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు -
విచిత్రమైన తలపాగ.. ఫ్యాన్ హెల్మెట్ ధరించిన వ్యక్తి: వీడియో వైరల్
సృజనాత్మకతకు కాసింత మేథస్సును జోడించి కొత్త కొత్త ఆవిష్కరణలను సృష్టించిన వారెందరో ఉన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు తాము ఎదర్కొంటున్న సమస్యల నుంచి పుట్టుకొచ్చినవే. అచ్చం అలానే ఇక్కడొక సామాన్య వ్యక్తి తన సమస్యకు చెక్‌పెట్టే ఒక వినూత్న ఆవిష్కరణకు నాంది పలికాడు. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక బాబాజీ ఫ్యాన్‌తో కూడిన హెల్మట్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఎందుకలాగా అంటే..ఆయన ఎండలో వెళ్లినప్పడూ ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడేవారు. అదీగాక సాధువులు, బాబాజీలు పాదాచారులగా బిక్షటన చేసి జీవిస్తుంటారు. అలా వారికి నచ్చిన ప్రాంతాలకు తరలిపోతూ...ఇక అక్కడే ఏ ఆశ్రమాలకో వెళ్లి జపాలు, ధ్యానాలు వంటివి చేస్తుంటారు. అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఆ బాబాజీ పాదాచారిగా వెళ్తుంటే బయట ఎండ ధాటికి తట్టుకోలేక ఒక వినూత్న ఆవిష్కరణకు తెరలేపారు. అదే సోలార్ శక్తితో పనిచేసే ప్యాన్ హెల్మట్. ఆ వ్యక్తి ఒక హెల్మట్కి ఫ్యాన్, సోలార్ ప్లేట్ అమర్చి హెల్మట్ మాదిరిగా ధరించాడు. చూసేందుకు తలపాగ మాదిరిగా ఉంది. ఎంతటి ఎండలోనైనా హాయిగా చల్లటి గాలిని ఆశ్వాదిస్తూ వెళ్లేలా రూపొందించాడు. జనాలు కూడా ఆ బాబా తెలివికి మంత్రముగ్దులయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS — Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022 (చదవండి: ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే లవ్‌లో పడ్డా: లవ్ స్టోరీ వైరల్) -
మాస్క్ ధరించండి! అన్నందుకు.. కాల్చి చంపేశాడు
జర్మన్: మాస్క్ ధరించాలని చెప్పినందుకు ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ క్యాషియర్ని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. జర్మనీ కరోనా దృష్ట్యా వ్యాక్సినేషన్ ఉద్యమం ప్రారంభమైంది. అందులో భాగంగా అక్కడ ఉండే జర్మన్లందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే మారియో ఎన్ అనే వ్యక్తి సిక్స్ ప్యాక్ బీర్‌ను కొనుగోలు చేసేందుకు ఒక స్టోర్‌కి వెళ్లాడు. అప్పుడు ముసుగు ధరించాడు. ఆ తర్వాత కొనుగోలు అయిపోయింది కదా అని మాస్క్ తీసేసి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చాడు. అక్కడ క్యాషియర్‌గా పనిచేస్తున్న 20 ఏళ్ల విద్యార్థి మాస్క్ ధరించండి అని చెప్పాడు. అంతే కోపంతో అతని నుదిటి పై పాయింట్ బ్లాక్‌లో గన్‌పెట్టి పేల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జర్మనీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడు మారియో అక్రమంగా తుపాకి కలిగి ఉన్నందుకు జర్మన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అంతేగాదు హత్యానేరం రుజువుకావడంతో జర్మన్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. (చదవండి: ఉక్రెయిన్‌దే విజయమా? రష్యా ఓడిపోవడం ఖాయమా?) -
స్కర్ట్ వేసుకున్న స్టార్ హీరో.. వరల్డ్‌వైడ్‌గా చర్చ
Brad Pitt Explains On Why He Wore Skirt On Bullet Train Red Carpet: ఇప్పటివరకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన దుస్తులు ధరించి ట్రోలింగ్‌కు గురి కావడం చూశాం. తాజాగా ఇలాంటి డిఫరెంట్ వేర్‌తో దర్శనమిచ్చి వైరల్‌గా మారాడు ఓ స్టార్ హీరో. హాలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో బ్రాడ్ పిట్ ఒకరు. యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఆస్కార్ విన్నర్. ఈ హీరో కూడా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటాడు. బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పలు దేశాల్లో ప్రీమియర్ షోలను వేస్తున్నారు. ఇలానే కొన్ని వారాల క్రితం బెర్లిన్‌లో 'బుల్లెట్ ట్రైన్' ప్రీమిర్ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్‌పై స్కర్ట్ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రాడ్ పిట్. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్, బూట్లు, వదులుగా ఉండే నార షర్ట్, జాకెట్‌తో దర్శనమిచ్చిన బ్రాడ్ పిట్ లుక్ వరల్డ్‌వైడ్‌గా వైరల్ అయింది. బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్‌పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా లాస్ ఏంజెల్స్‌తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్. చదవండి: సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్ ఈ ప్రీమియర్ షోకు సాధారణ దుస్తుల్లో వచ్చన బ్రాడ్ పిట్.. 'బెర్లిన్‌లో అలా ఎందుకు చేశానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అనిపించింది' అని స్కర్ట్ వేసుకోవడంపై వివరణ ఇచ్చాడు. అలాగే తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'నేను రిటైర్ అవుతున్నాననే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. ప్రస్తుతం నేను మిడిల్ ఏజ్‌లో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను అంతే' అని పేర్కొన్నాడు. చదవండి: 4కె ప్రింట్‌తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా.. -
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్‌కు బై బై?
సాక్షి, బెంగళూరు: బైక్ మీద వెళ్లేవారు క్షేమం కోసం శిరస్త్రాణం తప్పక ధరించాలి. కొంత మంది నాణ్యమైన ఐఎస్ఓ ధృవీకృత హెల్మెట్లను వాడితే మరికొందరు చీప్‌గా దొరికే వాటితో సర్దుకుపోవచ్చు. ఇక తలను పూర్తిగా కాకుండా సగం మాత్రమే కప్పి ఉంచే శిరస్త్రాణాలను వాడడం పెరిగిపోతోంది. ఈ హాఫ్ హెల్మెట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ముప్పును ఆపలేవని నిమ్హాన్స్, పోలీసులు చేపట్టిన అధ్యయనంలో తేలింది. బెంగళూరులో నమోదైన రోడ్డు ప్రమాదాల గణాంకాలను గమనిస్తే మృతుల్లో ఎక్కువమంది హాఫ్ హెల్మెట్లను ధరించిన వారు ఉన్నారు. ముఖం భాగాల్లో గట్టి దెబ్బలు తగిలే ప్రమాదాన్ని ఇవి ఏమాత్రం తగ్గించలేవని వెల్లడైంది. జాగృతి తరువాత జరిమానా యోచన.. ఐటీ నగరంలో 15 చోట్ల 90 వేల ద్విచక్రవాహనదారులను పరిశీలించగా నాణ్యత లేని హాఫ్ హెల్మెట్లను ఎక్కువ మంది ధరిస్తున్నట్లు గుర్తించారు. 60 శాతం మంది చవక రకం హెల్మెట్లనే వాడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం హెల్మెట్ల వినియోగంపై 15 రోజుల పాటు అవగాహన కల్పించాలని పోలీసు శాఖ యోచన చేస్తోంది. అనంతరం హాఫ్ హెల్మెట్లను ధరించేవారికి జరిమానాలు విధించాలని ఆలోచిస్తున్నట్లు భావిస్తోంది. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) -
మంగళసూత్రం గురించి తెలిపిన ప్రియాంక.. అది ప్రత్యేకమైన క్షణం
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత హాలీవుడ్లో అడుగు పెట్టి అందరి మన్ననలు పొందుతోంది. పలు చిత్రాల్లో నటించి హాలీవుడ్లో సైతం మంచి పాపులారిటీని దక్కించుకుంది. అనంతరం 2018లో రాజస్థాన్‌లో పాప్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. అయితే తాను ఎక్కడికెళ్లినా, ఎంత ఎత్తుకి ఎదిగినా తనతోపాటే ఇండియా, భారతదేశ సంస్కృతి ఉంటుందని ఇటీవల చెప్పుకొచ్చింది ప్రియాంక. తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఏ ఒక్కరూ తక్కువ చేయకుండా ఎప్పటికప్పుడూ ఎదుగుతూ ముందుకు సాగుతోంది. (చదవండి: ప్రియాంక చోప్రా అరుదైన ఘనత.. 30కిపైగా) అయితే తాజాగా ప్రియాంక తాను మొదటి సారి మంగళ సూత్రం ధరించినప్పుడు కలిగిన అనుభూతిని చెప్పుకొచ్చింది. ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళసూత్రం విలువ గురించి తెలిపింది. 'నేను మంగళ సూత్రం మొదటి సారి ధరించడం నాకు గుర్తుంది. ఎందుకంటే దాని విలువ ఏంటో, దాని అర్థం ఏంటో చెబుతూ నన్ను పెంచారు. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. ఒక ఆధునిక మహిళగా, దాని ధరించడం వల్ల వచ్చే పరిణామాలను కూడా నేను అర్థం చేసుకున్నాను. మంగళ సూత్రాన్ని నల్లని పూసలతో చేసేవారు. చెడును దూరం చేసి, మిమ్మల్ని రక్షించడానికి నలుపు చిహ్నంగా ఉంటుంది. మంగళ సూత్రం ధరించడం నాకు ఇష్టమా కాదా, అది పితృస్వామ్య వ్యవస్థకి నిదర్శనమా అనేది నాకు తెలియదు. ఈ వాదనలో నేను మధ్యలో ఉంటాను. సాంప్రదాయాన్ని గౌరవించి కొనసాగించండి. అలాగే మీరు ఎవరో, మీకు ఏం కావాలో తెలుసుకోండి. అందుకోసం నిలబడండి.' అంటూ తన మదిలోని భావాలను తెలిపింది ప్రియాంక. (చదవండి: ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఇంట్లో మాస్కు ధరించకపోతే కరోనా రిస్కు
వాషింగ్టన్: ఇంట్లోనే ఉంటున్నాంకదా మాస్కు ధరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా? అలా చేయడం కరోనాను చేజేతులా ఆహ్వానించడమే అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఆరుబయటి కంటే ఇంట్లో, ఆఫీసుల్లో, సమావేశపు గదుల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని చెబు తున్నారు. మాస్కు ధరించకుండా ఇంట్లో ఇతరుల తో మాట్లాడితే సార్స్–కోవ్–2 వైరస్ ముప్పు ఎన్నోరెట్లు ఎక్కువగా పొంచి ఉంటుందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ వివరాలను జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించారు. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు ఇంట్లో (ఇన్డోర్) ఉన్నప్పుడు కూడా మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం చాలా ఉత్తమమని వెల్లడయ్యింది. మాట్లాడుతునప్పుడు నోటిలోంచి తుంపర్లు బయటకు వస్తుంటాయి. ఇందులో కంటికి కనిపించని వివిధ పరిమాణాల్లోని సూక్ష్మమైన వైరస్ రేణువులు ఉంటాయి. చిన్న పరిమాణంలోని రేణువులు గాలిలో ఎక్కువ సేపు ఉండలేవు. కాస్త పెద్ద పరిమాణంలోని వైరస్ డ్రాప్లెట్స్ జీవిత కాలం ఎక్కువేనని, ఇవి గాలిలో చెప్పుకోదగ్గ దూరం వరకూ త్వరగా వ్యాప్తి చెందుతా యని అధ్యయనంలో గుర్తించారు. మాట్లాడుతున్నప్పుడు నోటిలోంచి వెలువడే వైరస్ రేణువులు కొన్ని నిమిషాలపాటు గాల్లోనే ఎగురుతూ ఉంటాయని, పొగలాగే ఇవి కూడా సులభంగా వ్యాప్తి చెందుతాయని యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్, డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ ప్రతినిధి, అధ్యయనకర్త అడ్రియాన్ బాక్స్ చెప్పారు. భవనాల్లో(ఇండోర్) గాలి త్వరగా బయటకు వెళ్లదు కాబట్టి కరోనా రిస్కు అధికంగా ఉంటుందని వెల్లడించారు. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచించారు. అమెరికాలో బార్లు, రెస్టారెంట్లు కరోనా వ్యాప్తికి కేంద్రాలు మారాయని గుర్తుచేశారు. మాట్లాడుతున్నప్పుడు కచి్చతంగా మాస్కు ధరించాలని చెప్పారు. ఇంట్లోకి గాలి ధారాళంగా వచ్చేలా, బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. -
హృదయానికి హత్తుకుందాం...
బట్టలు కట్టుకోవడం తెలుసు... మూటలు కట్టుకోవడం తెలుసు... పిల్లల్ని కట్టుకోవడం తెలుసా... సరదాగా ఉంది కదూ... నిజమే... పిల్లల్ని కట్టుకోవడం... ఈ మాట వినగానే తల్లిదండ్రుల మనసు పరవశిస్తుంది... నవమాసాలు కడుపులో మోసిన పాపాయి భూమి మీద పడగానే ఉయ్యాలలో నిదురిస్తుంది. తల్లి గుండె మీద నిదురిస్తుంది. అమ్మ కాళ్ల మీద నిదురిస్తుంది. మరి అమ్మ బయటకు వెళ్లినప్పుడు. అప్పుడు కూడా అమ్మ గుండెల మీదే పరవశంగా, ప్రశాంతంగా నిదురిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఎంఎస్ఎల్ సంస్థ ఈ సదుపాయం కల్పిస్తోంది. నడుముకి పిల్లవాడిని కట్టుకున్న ఝాన్సీరాణి రూపం అందరికీ గుర్తే. అలా కట్టుకునే యుద్ధం కూడా చేసింది. కూలివారు సైతం పిల్లలను నడుముకి కట్టుకుని పనిచేసుకోవడం భారతదేశంలో చాలాకాలంగా ఒక సంప్రదాయం. పేదరికంతో కొన్నిసార్లు, అవసరం కోసం కొన్నిసార్లు ఇలా నడుముకి బిడ్డను బిగించి కట్టుకోవడం చూస్తూనే ఉంటాం. కారణం ఏమైనా ఇది పటిష్టమైన తల్లిబిడ్డల బంధానికి ప్రతీక.చాలా సంస్థలు బేబీవేరింగ్ను ఉత్పత్తి చేస్తునే ఉన్నాయి. అయితే ఇప్పుడు ముంబైకి చెందిన ఆరుగురు మహిళలు లాభాపేక్షలేకుండా బ్రాండ్ న్యూట్రల్ స్లింగ్ లైబ్రరీని ప్రారంభించారు. దీని పేరు ‘ముంబై స్లింగ్ లైబ్రరీ’ (ఎంఎస్ఎల్). ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ బేబీవేరింగ్ దొరుకుతాయి. ఈ బేబీవేరింగ్ను, పిల్లల ఆటవస్తువులను కొనలేనివారు అద్దెకు కూడా తీసుకోవచ్చు. పిల్లలకు చుట్టే వస్త్రాలు, పిల్లలను ఆడించే గిలక్కాయలు, మెత్తగా ఉండే పరుపులు... వంటి పిల్లలకు కావలసిన అన్ని వస్తువులు ఈ లైబ్రరీలో అద్దెకు దొరుకుతాయి. అనేక కంపెనీలు సైతం పిల్లలకు సంబంధించిన అనేక ఉత్పత్తులను వీరికి డొనేట్ చేస్తున్నారు. అన్మోల్ బేబీ యజమాని, ఆర్కిటెక్ట్ అయిన రష్మీ భటియా గాజ్రా జూలై, 2014లో ఈ సంస్థను రూపొందించారు. ‘‘కొత్త పేరెంట్స్... పిల్లలను ఎలా ఆడించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపడం కోసం రూపుదిద్దుకుంది ఎంఎస్ఎల్’’ అంటారు రష్మీ. పిల్లలను ఎత్తుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు చేతిలో నుంచి జారిపోతుంటారు. ఒక్కోసారి చెయ్యి నొప్పి వచ్చి, చెయ్యి మార్చుకోవలసి వస్తుంది. చంటిపిల్లల్ని శరీరానికి కట్టుకుంటే ఎంత బావుంటుందోనని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది పిల్లలను ఇలా కట్టుకుని బజారుకి వెళ్లడం, పనులు చేసుకోవడం చూస్తున్నాం. మరింత సౌకర్యంగా ఈ అవకాశాన్ని ఎంఎస్ఎల్ కల్పిస్తోంది.ఈ సంస్థలో.. రష్మీతో పాటు, ఆర్కిటెక్ట్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ యమన్ బెనర్జీ కోరగావోంకర్, లాక్టేషన్ కౌన్సెలర్ అలోక్ మెహతా గంభీర్, మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రాచీ షా దేధియా, ఇంజనీర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ కోశలి దాల్వి, ఎంబీఏ హెచ్ఆర్ మేనేజ్మెంట్ షర్మిలా డిసౌజా.. భాగస్వాములు. ఇది ఏ విధంగా సహాయపడుతుంది... గిరిజన సంస్కృతి నుంచి విదేశీ సంస్కృతి వరకు బేబీవేరింగ్ అలవాటుగా వస్తోంది. ఇందులో పసిపిల్లలను భద్రంగా పట్టుకోవడం వల్ల, వాళ్లు సురక్షితంగా, భద్రంగా ఉన్న భావనతో హాయిగా చిరునవ్వులు చిందిస్తూ నిద్రిస్తారు. అంతేకాదు... ఇందులో పిల్లలకు కావలసిన ప్రాథమిక అవసరాలన్నీ తీరుతాయి. ప్రీటెర్మ్ బేబీలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కంగారూలాగ పొట్టలో దాచుకుంటే, వారి శరీరానికి తల్లి శరీరం తగులుతుంటే వెచ్చగా పడుకుంటారు, భద్రత భావనతో త్వరగా కోలుకొంటారు. బిడ్డకు తల్లి పాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక బిడ్డను అక్కున చేర్చుకోవడం వల్ల, తల్లి నుండి సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. ఇదొక అందమైన, ఆనందకరమైన అనుభవం. తల్లిపాలు, పాలు మాన్పించడం, తప్పటడుగులు వేసే సమయంలో ఇచ్చే ఆహారం, ఫిట్నెస్... వంటివి కూడా తెలియపరుస్తారు. బేబీ వేరింగ్ ఉత్పాదనలకు సంబంధించి కొత్త పేరెంట్స్‌లో ఎన్నో సందేహాలు! పసిపిల్లలు పాడైపోతారా, నడక అలవాటు చేసుకోలేరా, పిల్లల కాళ్లు పాడైపోతాయా, తల్లులకు వీపు నొప్పి వస్తుందా... అంటూ కొందరు తల్లులు సందేహాలు అడుగుతుంటారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే వారికి ఇటువంటి అనుమానాలు కలిగి, ఆ అపోహలనే నమ్ముతుంటారని అంటారు రష్మీ. ఇలాంటి అనేక అనుమానాలను నివృత్తి చేస్తుంటారు రష్మీ, భాగస్వాములైన ఆమె స్నేహితులు. ‘‘మేం చేస్తున్న పని కంటే, ప్రేమను పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అభిరుచితో మొదలుపెట్టిందే ఈ ప్రాజెక్టు. మా కంపెనీకి చాలా బేబీ వేరింగ్ బ్రాండ్స్ నుంచి సహకారం లభించింది. ఇక మేం వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అంటారు ప్రాచీషా. రెండేళ్ల కాలంలో ముంబై, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ కంపెనీ 40 సమావేశాలు ఏర్పాటు చేసింది. 50 రకాల బేబీవేరింగ్ ఉత్పత్తులు పరిచయం చేసింది. – డా. వైజయంతి -
సీటు బెల్టు ధరిస్తేనే సురక్షితం
అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్) : ప్రస్తుతం సీటు బెల్టు ధరించకపోవడం వలన తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందువల్ల వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఆదేశాల మేరకు శనివారం అర్బన్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి ముఖ్య కూడళ్లలో, నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ఇతర ముఖ్య ప్రదేశాల్లో సీటుబెల్టు వాడకంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అర్బన్ ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది కారులో సీటు బెల్టు ధరించని వారికి అవగాహన కల్పించారు. మోరంపూడి జాతీయ రహదారి వద్ద సీటు బెల్టు ధరించిన వారికి తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు, ఇన్స్పెక్టర్ కనకారావులు గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 3,413 కార్లను ఆపి అవగాహన కల్పించారు. అర్బన్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఎం.రజనీకాంత్, ఆర్.గంగాధర్, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రవాణా శాఖాధికారుల సైతం మోరంపూడి జాతీయరహదారి కూడలిలో రవాణాశాఖాధికారులు సీటు బెల్టుధరించడంపై అవగాహన కల్పించారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు కార్లను ఆపి సీటు బెల్టు ధరించాలని సూచించారు. -
మహిళపై దౌర్జన్యం..ముగ్గురు అరెస్ట్!
పూనెః యువతిపై దాడికి దిగిన ఐదుగురు యువకుల్లో ఎట్టకేలకు పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. తనపై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వారం రోజులుగా ఓ మహిళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించేందుకు, ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసేందుకు అంగీకరించలేదు. చివరికి ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు పది రోజులక్రితం జరిగిన ఘటనలో పూనేకు చెందిన 22 ఏళ్ళ మహిళా అడ్వర్ టైజింగ్ ఎగ్జిక్యూటివ్ పై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారు. కారులో ఉన్న ఆమెను జుట్టు పట్టుకొని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. తమ కుటుంబాల్లోని మహిళలు, బాలికలు ఎవ్వరూ కురచ దుస్తులు వేసుకోకూడదని, పర పురుషులతో కలసి ప్రయాణించకూడదని బెదిరింపులకు కూడ పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తనపై జరిగిన దాడిని గురించి ఫిర్యాదు చేసేందుకు వారం రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. అయితే ఏ ఒక్కరూ ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. మహిళ ఫిర్యాదు స్వీకరించని ముగ్గురు పోలీసులపై కూడ తాము చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ రష్మి సుక్లా తెలిపారు. మే 1వ తేదీన ఇద్దరు మగ కొలీగ్స్ తో కలసి కారులో వెడుతున్నబాధితురాలు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన సమయంలో మరో కారులో వెడుతున్న ఐదుగురు యువకులు ఆమెపై వేధింపులకు దిగారు. కారును చుట్టుముట్టి, తెరచి ఉన్న విండోనుంచి ఉమ్ము వేయడమే కాక, డోర్ తెరచి ఆమెను బలవంతంగా కారు నుంచి బయటకు లాగి, ఆమె అపార్ట్ మెంట్ కు ముందే తీవ్రంగా కొట్టి అక్కడినుంచి జారుకున్నారు. ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెనక్కు వచ్చి, సహాయంకోసం తన బంధువులకు, మిత్రులకు ఫోన్ చేస్తున్న ఆమెను బెదిరింపులకు పాల్పడ్డారు. నీ ఇల్లు అడ్రస్ తెలిసిందని, తర్వాత నీ సంగతి చూస్కుంటామని, నువ్వు ఎవరితో చెప్పుకున్నా లాభం లేదని, తమకు ఎంతో మంచి పరిచయాలు ఉన్నాయని బెదిరించారని బాధితురాలు తెలిపింది. అయితే ఇంత జరిగినా ఘటనలో ఎటువంటి సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ దొరకక పోవడం విశేషం. -
'అది ప్రసారమైతే నా పరువు పోయేది'
టీవీల్లో వార్తలు చదివేవాళ్లు ఎప్పుడూ నల్లకోటే వేసుకుంటారెందుకు? సాధారణ దుస్తులు ధరిస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు జవాబులు చెప్పుకునేముందు నల్లకోటు వేసుకోకపోవడం వల్ల ఓ యాంకరమ్మ పడ్డ పాట్లేంటో చూద్దాం.. లాస్ ఏంజిల్స్ కేంద్రంగా నడిచే కేటీఎల్ఏ 5 అనే న్యూస్ ఛానెల్లో వాతావరణ వార్తలు చదివే లిబర్టే చాన్ అనే యాంకర్.. నల్లకోటు లేకుండా ఇంటినుంచే వేసుకొచ్చిన తెల్లగౌనులోనే వార్తలు చదివేందుకు సిద్ధమైంది. గ్రీన్ మ్యాట్ ముందు నించొని, ఏయే నగరాల్లో ఎంతెంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో చదివేప్రయత్నం చేసింది. అయితే ఔట్ పుట్ వీడియోలో పట్టణాల తాలూకు టెంపరేచర్లు ఆమె దుస్తులపై పడి, శరీరకొలతలను చూపుతోందా!? అన్నట్లు ఛాతి, నడుం, కిందిభాగాల్లో నంబర్లు కనిపించాయి. విషయాన్ని గమనించిన కెమెరామెన్.. పరుగున వెళ్లి నలుపు రంగు కోటును అందించాడు. ఎడిటింగ్ లో కట్ చేశారుగానీ ఆ వీడియో అలానే ప్రసారమయ్యేదుంటే నా పరువు పోయేదేనని యాంకరమ్మ చెప్పింది. రెండు రోజుల కింద జరిగిన ఈ తంతంగాన్ని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు కెమెరామన్. యాంకర్లు నల్లకోట్లు వేసుకుంటే తప్ప వాళ్ల వెనకుండే గ్రీన్ మ్యాట్ లో దృశ్యాలను ఎఫెక్టివ్ గా ప్రసారం కావు. లైటింగ్. ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ ల ప్రాధాన్యంతో నడిచే గ్రీన్ మ్యాట్ మీద షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నీడ(షాడో) లు రాకుండా చూసుకోవటం, లైటింగ్ సెట్ చేసాక సాఫ్ట్ వేర్ ను మరోసారి పరిశీలించడం వంటి జాగ్రలు పాటిస్తారు. గ్రీన్ లేదా బ్లూ మ్యాట్ లో దృశ్యాలు ప్రసారం చేసేటప్పుడు డోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ , ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్ వేర్ లను వినియోగిస్తారు. చిన్నచిన్న మార్పులతో టీవీ ప్రసారాలు, సినిమా షూటింగ్ లకు వాడేది ఈ సాఫ్ట్ వేర్లే. దీని పనితీరు కూడా లైటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టే ఇబ్బందులు తలెత్తకుండా న్యూస్ రీడర్లు నల్లకోట్లు ధరిస్తారు. -
ఏపీలో నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
-
ఏపీలో నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. ఏపీలో ఆ రోజు ఉదయం నుంచే రవాణా శాఖ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. హెల్మెట్ ధరించని వారిపై మొదటి సారి జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. గతంలో ఈ నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. చివరకు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. వాహనదారులు హెల్మెట్ వాడటాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని సూచించింది. దీంతో ఈ నిబంధన కార్యరూపం దాల్చింది. -
తెల్లకోటుల వల్లే రోగాలు విస్తరిస్తున్నాయి
బెంగళూరు: భారతీయ వైద్యులు,వైద్య విద్యార్థులు, ఇతర వైద్య సిబ్బంది ధరించే పొడుగు చేతుల తెల్లగౌనులవల్లే ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నా యంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థి. అందుకే వీటిని నిషేధించాలని స్థానిక వైద్య కళాశాలకు చెందిన ఎడ్మండ్ ఫెర్నాండెజ్ వాదిస్తున్నారు. వారు వేసుకొనే తెల్లగౌనుల వల్ల ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తున్నాయని ఇటీవల ఒక సర్వే తేల్చిందంటున్నారు. దీని వల్లే రోగులకు అనివార్యమైన హాని కలుగుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసిందంటున్నారు. దీనికి సంబంధించి అన్ని ఆస్పత్రులలోను ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటచేయాలని ఫెర్నాండెజ్ కోరుతున్నారు. 19వ శతాబ్దం నుంచి సాంప్రదాయకంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ తెల్లకోటులను ధరిస్తున్నారని తెలిపారు. వైద్యులు, నర్సులు ధరించే యాప్రాన్లు వ్యాధులను విస్తరింపచేసే వాహకాలుగా పనిచేస్తాయనే విషయాన్ని భారతీయులు గమనించాలని కోరారు. తెల్లగౌనులను నిషేధించాలంటూ 2007లో అమెరికా ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని, దీన్ని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఆమోదించిందన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అమలుచేయడానికి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాలు నిరాకరించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యులు ధరిస్తున్నతెల్ల గౌనుల కంటే చూడచక్కని దుస్తులు, ముఖంపైన చిరునవ్వు ముఖ్యమని ఆయనంటున్నారు. దీంతో పాటు వైద్యుడి పేరు తెలిపేలా బ్యాడ్జ్ కూడా ధరించాలని ఆయన సూచిస్తున్నారు. ఇప్పటికైనా భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని ఫెర్నాండెజ్ కోరుతున్నారు.