Neha Shetty Looks Charming In Different Mixing Color Saree Price - Sakshi
Sakshi News home page

డీజే టిల్లు ఫేమ్ నేహా ధరించిన అల్లికల చీర ధర ఎంతంటే..!

Published Sun, Aug 20 2023 8:49 AM | Last Updated on Sun, Aug 20 2023 1:10 PM

Neha Shetty Looks Charming In Different Mixing Color Saree Price - Sakshi

‘సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా..’ పాటలో ఇటీవల డాన్స్‌తో అదరగొట్టిన నటి నేహా శెట్టి... ఫ్యాషన్‌లోనూ అంతే రీతిలో అదరగొడుతోంది.. ఈ ఫ్యాషన్‌  బ్రాండ్స్‌తో!
చిన్నప్పుడే డిఫరెంట్‌ డిఫరెంట్‌ డ్రెస్‌లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్‌ చేసే టైమ్‌లో ఫ్యాషన్‌పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్‌ మొత్తం నేనే చూసుకుంటా.

పౌల్మీ అండ్‌ హర్ష్‌
ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్‌తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. చేతితో చేసే అల్లికలకే ప్రాధాన్యం. అందుకే, లేట్‌గా వచ్చినా లేటేస్ట్‌గా ఉంటాయి వీరి డిజైన్స్‌. ప్రస్తుతం భారత్‌తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌ లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. నేహా శెట్టి ధరించిన పౌల్మీ అండ్‌ హర్ష్‌ బ్రాండ్‌ చీర ధర రూ. 42,800/-

అభిలాష ఫైన్‌ జ్యూయల్స్‌
పదేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్‌. వ్యవస్థాపకురాలు.. అభిలాష. నగల పట్ల, నగల డిజైన్స్‌ పట్ల తనకున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూలరీ బ్రాండ్‌ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్‌ వంటి ప్రపంచ నగరాలకూ విస్తరించారు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. 

--దీపిక కొండి

(చదవండి: అందంతో కట్టిపడేస్తున్న అమైరా ధరించిన చీర ధర వింటే షాకవ్వాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement