
అందం కోసం ఆభరణాలను ధరించడం మామూలే కాని, అవే ఆభరణాలు అందంతోపాటు ఆరోగ్యాన్ని, టెక్నాలజీని అందిస్తే భలే బాగుంటుంది కదూ! అయితే, ఈ గాడ్జెట్స్ మీ కోసం..
థర్మామీటర్‌చెవిపోగు
శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగపడే థర్మామీటర్ చేసే పనిని చేస్తుంది ఈ చెవిపోగు. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో షిర్లీ, జుయే, యుజియా అనే ముగ్గురు విద్యార్థులు రూపొందించిన ఈ చెవిపోగుతో శరీర ఉష్ణోగ్రతను సులభంగా తెలుసుకోవచ్చు. డ్యూయల్ సెన్సర్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ యాంటెనాతో తయారైన ఈ చెవిపోగు బ్యాటరీలతో పనిచేస్తుంది. దీనిని ధరించిన వ్యక్తి ఉష్ణోగ్రతతో పాటు, పరిసరాల ఉష్ణోగ్రతలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి, మొబైల్‌కు సమాచారం ఇస్తుంది.
పీరియడ్స్ మూడ్ స్వింగ్స్‌కు చెక్
అమ్మాయిలకు ప్రతినెలా వచ్చే పీరియడ్స్‌లో విపరీతమైన కడుపునొప్పితో పాటు, మూడ్ స్వింగ్స్ కుదురుగా ఉండనివ్వవు. ఇప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది ఈ ‘ఫెమ్‌టెక్ బీబీ రింగ్’. ఇదొక స్మార్ట్ రింగ్, సాధారణ హెల్త్ ట్రాకర్ మాదిరిగానే ఇందులోనూ, వివిధ సెన్సర్లతో పాటు, ఎమోషన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది.
పీరియడ్స్ సమయంలో దీనిని ధరిస్తే ప్రతినెలా భావోద్వేగాల్లో వచ్చే మార్పులను పరిశీలించి సమాచారం ఇస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని, మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు.
బైస్కోప్ గాగుల్స్
కళ్లకు ధరించే కళ్లజోడు స్మార్ట్‌గా మారిపోయిన విషయం తెలిసిందే! అయితే, మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని, కావాల్సిన సమాచారాన్ని కళ్లజోడు అద్దాలపైనే చూసే వీలు కల్పించే వీటి లేటెస్ట్ వెర్షన్ వచ్చేసింది. వాటిలో ఒకటి మినీ ప్రొజెక్టర్‌లా పనిచేసే ఈ ఐఎన్‌ఎమ్‌ఓ2 వైర్‌లెస్ గ్లాసెస్.
వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలతో ఎప్పుడైనా సరే కావాల్సిన సమాచారాన్ని మీ కళ్ల ముందు ఇన్విజిబుల్ స్క్రీన్ వేసి చూపిస్తుంది. మల్టీమీడియా హెడ్‌సెట్ సాయంతో వాయిస్ కమాండ్స్‌తో ఆపరేట్ చేయవచ్చు. కేవలం వంద గ్రాముల బరువుతో, సౌకర్యవంతంగా ఉండే దీని ధర 599 డాలర్లు (అంటే రూ.52,302) మాత్రమే!
‘లబ్‌డబ్’ లవ్ లాకెట్
ప్రేమికులు తరచు చెప్పుకునే మాట.. ‘నా హృదయ స్పందన నువ్వేనని’. మరి ఇప్పుడు మీ ప్రియమైన వారి గుండె చప్పుడును ఎల్లప్పుడూ మీరు వినేందుకు వీలుగా రూపొందించినదే ఈ లాకెట్. ఇదొక లవ్ లాకెట్. దీనిని ధరించిన వారు తమ గుండె చప్పుడును తమ ప్రియమైన వ్యక్తితో పంచుకోవచ్చు. ఇందుకోసం రెండు లాకెట్లను నేరుగా ఇద్దరు వాడుకోవచ్చు.
ఒకరి వద్దే లాకెట్ ఉంటే, మొబైల్ యాప్‌లో వారి కాంటక్ట్‌ను సేవ్ చేసుకొని వాడాలి. లాకెట్‌లో ఉండే బటన్‌ను నొక్కినప్పుడు, మీరు ఎంచుకున్న వారికి మీ గుండె చప్పుడు ఆడియోను చేరవేస్తుంది. ధర రూ. పది నుంచి ఇరవై వేల వరకు ఉంది. వివిధ రంగుల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment