smart technology
-
ఈ గిటార్ చాలా స్మార్ట్ గురూ..!.. ధర ఎంతంటే?
ఫొటోలో కనిపిస్తున్న గిటార్ సాదాసీదా గిటార్ కాదు. ఇది చాలా స్మార్ట్ గిటార్. చైనాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఎన్యా ఇంటర్నేషనల్’ ఇటీవల ఈ ఆల్ ఇన్ వన్ స్మార్ట్ గిటార్‌ను మార్కెట్లోకి తెచ్చింది. బిల్టిన్ ప్రీయాంప్, 50 వాట్ల బ్లూటూత్ స్పీకర్ ఈ గిటార్ ప్రత్యేకతలు. ఈ గిటార్ వాయిస్తున్నప్పుడు బ్లూటూత్ స్పీకర్ ద్వారా ఇతర సంగీత పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిని స్మార్ట్‌ఫోన్ యాప్‌కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సోలో కచేరీలకు, గ్రూప్ బ్యాండ్ కార్యక్రమాలకు కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది నాలుగు రంగుల్లో దొరుకుతోంది. దీని ధర 900 డాలర్లు (రూ.74,007) మాత్రమే చదవండి👉 రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం ఆమోదిస్తే.. త్వరలో -
స్మార్ట్ వాటర్ బాటిల్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఇది చాలా స్మార్ట్ వాటర్ బాటిల్. ఇందులో ఏ కొళాయి నీళ్లయినా పట్టుకుని, నిక్షేపంగా తాగవచ్చు. ఇది బ్రిటన్‌కు చెందిన ‘గ్రే ఆర్క్ టెక్’ రూపొందించిన సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ బాటిల్. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇందులో వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు నీటిలోని సూక్ష్మజీవులను సమూలంగా నాశనం చేసి, నీటిని క్షణాల్లోనే స్వచ్ఛంగా మారుస్తాయి. దీని వాక్యూమ్ సీల్డ్మూత వల్ల ఇందులోని నీళ్ల ఉష్ణోగ్రత ఇరవైనాలుగు గంటలకు పైగా స్థిరంగా ఉంటుంది. దీనిని ఫ్లాస్క్ మాదిరిగా వేడి లేదా చల్లని పానీయాల కోసం కూడా వాడుకోవచ్చు. మూత మీద ఉండే ఎల్ఈడీ డిస్ప్లేలో బాటిల్లోని పానీయం ఉష్ణోగ్రత కనిపిస్తూ ఉంటుంది. దీని ధర 98.41 పౌండ్లు (రూ.9,644). . -
సాగుకు ‘టెక్’ సాయం..!
బెంగళూరు: దేశీయంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం వివిధ స్థాయిల్లో గణనీయంగా పెరుగుతోంది. దీనితో ఇటు దిగుబడులు, అటు రైతాంగానికి రాబడులు మెరుగుపడుతున్నాయి. సాంకేతికత వినియోగంతో వచ్చే రెండు దశాబ్దాల్లో వ్యవసాయంలో గణనీయంగా మార్పులు రాగలవని, సాగు రంగం ముఖచిత్రం మారిపోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులు నిత్యం ఎదుర్కొనే పలు సవాళ్ల పరిష్కారానికి అగ్రి–టెక్ సంస్థలు రూపొందిస్తున్న అనేకానేక స్మార్ట్ సొల్యూషన్స్ ఇందుకు దోహదపడనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు వంటి మెషీన్ లెర్నింగ్ సొల్యూషన్లు, కచ్చితమైన వ్యవసాయ టెక్నిక్‌లు .. నాట్లు మొదలుకుని పంట రక్షణ, సాగు, కోతల దాకా అన్ని దశల్లోనూ రైతాంగానికి ప్రస్తుతం ఉపయోగపడుతున్నాయి. వాతావరణాన్ని అంచనా వేయడానికి జీఐఎస్ మ్యాప్‌లు, శాటిలైట్ డేటాను ఉపయోగించడం, క్రిమిసంహారకాలను జల్లేందుకు కొత్త విధానాలు పాటించడం మొదలైనవి అమల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రి–టెక్ స్టార్టప్ సంస్థలకు పుష్కలంగా పెట్టుబడులు కూడా అందుతున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్‌టెక్, అగ్రిటెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అయిన అగ్‌ఫండర్ నివేదిక ప్రకారం 2020లో దేశీ అగ్రి ఫుడ్ స్టార్టప్‌లలోకి 1.1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కన్సల్టెన్సీ సంస్థ బెయిన్ అండ్ కో అంచనా ప్రకారం 2025 నాటికి అగ్రి–లాజిస్టిక్స్, ఉత్పత్తి కొనుగోళ్ళు, ఎరువులు మొదలైన వాటి వినియోగం విలువ దాదాపు 30–35 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. అర్ధ శతాబ్ద ఫలితాలు.. రెండున్నర దశాబ్దాల్లో జినోమిక్స్ సహాయంతో ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్), ఇతర పరిశోధన సంస్థలతో కలిసి .. కరువు, తెగుళ్లను సమర్థంగా ఎదుర్కొనే వినూత్న శనగల వెరైటీలను రూపొందించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇవి సాధారణ స్థాయి కన్నా 15–28 శాతం అధిక దిగుబడులు అందించాయి. ఇలాంటి టెక్నాలజీల ఊతంతో వ్యవసాయ రంగంలో గత అర్ధశతాబ్దం పైగా కాలంలో వచ్చిన అభివృద్ధిని .. రాబోయే 25 ఏళ్లలోనే సాధించే అవకాశాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ) డైరెక్టర్ జనరల్ రామ్ కౌండిన్య తెలిపారు. సాంకేతికత అనేది రైతుల జీవితాలను సులభతరంగాను, సాగును లాభదాయకంగాను మార్చగలదని, ఆహార ఉత్పత్తిని పెంచగలదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, జన్యు మార్పిడి (జీఎం) పంటలతో వంట నూనెల దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉందని సౌత్ ఏషియా బయోటెక్నాలజీ సెంటర్ వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఏటా 2.2–2.3 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగం ఉంటోందని, ఇందులో 1.5 కోట్ల టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. అదే బయోటెక్నాలజీ తోడ్పాటుతో దేశీయంగా సోయాబీన్, పొద్దుతిరుగుడు పువ్వు, ఆవ గింజల దిగుబడులను పెంచుకోగలిగితే దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గుతుందని వివరించాయి. దిగుమతయ్యే నూనెల్లో సింహభాగం జీఎం పంటల ద్వారా ఉత్పత్తి చేసినవే ఉంటున్నాయని, అయితే దేశీయంగా మాత్రం ఇలాంటి పంటలకు అంతగా ప్రోత్సాహం ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నాలజీ వినియోగంపై వ్యవసాయ రంగ నిపుణులు ఆశావహంగా ఉన్నప్పటికీ .. విధానపరమైన, నియంత్రణపరమైన అంశాలతో అవాంతరాలు ఎదురుకావచ్చని, వీటిని అధిగమిస్తే సాగు మరింత లాభసాటిగా మారగలదని అభిప్రాయపడ్డారు. -
ఏపీలో మొబైల్ టవర్ల ఏర్పాటులో కమీషన్ల వేట
-
‘టవర్లు’ ఎక్కిన అవినీతి!
సెంట్రల్ విజిలెన్స్ నిబంధనలకూ విరుద్ధంగా.. సింగిల్ టెండర్‌పై పనులు అప్పగించడం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు కూడా విరుద్ధమని, ఈ నేపథ్యంలో సింగిల్ టెండర్‌ను రద్దుచేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించాల్సిందిగా న్యాయ శాఖ సైతం సూచించింది. తొలిసారి టెండర్లలో సింగిల్ టెండర్ వస్తే పనులు అప్పగించరాదని, అయినా ఈ భారీ ప్రాజెక్టుకు పోటీ లేకుండా అప్పగించడం సరైన పద్ధతి కాదని కూడా స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే.. ఈ భారీ ప్రాజెక్టును దక్కించుకున్న సంస్థకు లబ్ధిచేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ సర్కార్‌కు మాత్రం ఏటా రూ.18కోట్లు ఆదాయం మాత్రమే వస్తుందని అధికారులు చెబుతున్నారు. సాక్షి, అమరావతి : స్మార్ట్ టెక్నాలజీ పేరుతో రాష్ట్రంలో పెదబాబు, చినబాబు చెలరేగిపోతున్నారు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి మరీ ప్రాజెక్టుల పేరుతో ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలను ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతూ అక్కడి నుంచి మళ్లీ సొంత జేబుల్లోకి కమీషన్ల రూపంలో మళ్లించుకుంటున్నారు. ఇందుకు రాష్ట్ర ఖజానాను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా మొబైల్ టవర్ల ఏర్పాటు ముసుగులో కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ వేశారు. రూ.2వేల కోట్ల కాంట్రాక్టును అస్మదీయులకు అడ్డగోలుగా కట్టబెట్టారు. ఇంత భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా వచ్చే ఆదాయం ఎంతా అంటే.. కేవలం రూ.18కోట్లే. అంటే 0.9శాతం అన్న మాట. కమీషన్ల కోసం టవర్లెత్తుతున్న ‘ముఖ్య’నేత బాగోతం వివరాల్లోకి వెళ్తే.. సింగిల్ విండో తరహాలో అన్ని రకాల సేవలను మొబైల్ టవర్ల ద్వారా పొందాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 12వేల టవర్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.2వేల కోట్లతో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టును అనుకున్నదే తడవుగా తమ అనుకూలురకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేశారు. కానీ, వీటి ఏర్పాటుకు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఆర్థిక, న్యాయ శాఖ తప్పుబడుతున్నప్పటికీ ‘ముఖ్య’నేత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తుండడపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తాను చేయాల్సిన పనులను వదిలేసి, ‘ప్రైవేట్’ పనులను నెత్తినెత్తుకోవడంపై గతంలోనే ఉన్నతాధికార యంత్రాంగం పలు సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. టీవీలకు సెటాప్ బాక్సులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పంపిణీ చేయడాన్ని తప్పుబట్టింది. ఇప్పుడు మొబైల్ సంస్థలు ఏర్పాటుచేసుకోవాల్సిన టవర్లను రాష్ట్ర ప్రభుత్వం భుజానకెత్తుకోవడాన్నీ వారు తప్పుబడుతున్నారు. అంతేకాదు.. ఈ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన టెండరు నిబంధనలన్నీ ఆదిలోనే నీరుగార్చారంటూ ఆర్థిక శాఖ తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేసింది. కనీసం నిబంధనలను కూడా పాటించకపోవడంతో రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందని హెచ్చరించింది. అలాగే, టవర్ల ఏర్పాటుకు సింగిల్ టెండర్ వచ్చినందున మొత్తం సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్)ను రూపొందించి ప్యాకేజీలుగా విడదీసీ మళ్లీ టెండర్లను ఆహ్వానించాలని, అప్పుడు ఎక్కువ బిడ్లు వస్తాయని సూచించింది. న్యాయ శాఖ కూడా సింగిల్ టెండర్ విధానాన్నీ తప్పుబట్టింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల మేరకు కూడా సింగిల్ టెండర్‌పై పనులను ఇవ్వరాదని, తొలిసారి సింగిల్ టెండర్ వస్తే దాన్ని రద్దుచేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వానికి న్యాయ శాఖ సూచించింది. కానీ, ‘ముఖ్య’నేత.. ఆర్థిక, న్యాయ శాఖల సూచనలను, అభ్యంతరాలను బేఖాతరు చేశారు. సింగిల్ టెండర్‌గా వచ్చిన పేస్ పవర్ సిస్టమ్స్ అండ్ లైనేజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు రూ.2,000 కోట్ల విలువైన మొబైల్ టవర్ల ఏర్పాటు ప్రాజెక్టును అప్పగించేశారు. పేస్ అండ్ లైనేజ్ సంస్థలతో కలిసి ఏపీ టవర్స్ లిమిటెడ్ సంస్థ పనిచేస్తుంది. ఇందులో ఏపీ టవర్స్ లిమిటెడ్‌కు 30.33 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన స్థలాల్లో మొబైల్ టవర్లను ఏర్పాటుచేయనున్నారు. అడుగడుగునా ఉల్లంఘనలు.. మొబైల్ టవర్ల ఏర్పాటుకు పిలిచిన టెండర్ల నిబంధనలన్నింటినీ పూర్తిగా నీరుగార్చారని ఆర్థిక శాఖ సోదాహరణంగా వివరించింది. ఉదా.. – ప్రాజెక్టు వ్యయమైన రూ.2,000కోట్లలో బిడ్ సెక్యురిటీగా 0.5 శాతం అంటే రూ.10కోట్లు ఉండాల్సి ఉండగా.. కేవలం కోటి రూపాయలు మాత్రమే పెట్టారని ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. – అలాగే, పెర్ఫార్మెన్స్గ్యారెంటీగా ప్రాజెక్టు వ్యయంలో ఐదు శాతం అంటే రూ.100కోట్లు ఉండాల్సి ఉండగా కేవలం రూ.20 కోట్లే పెట్టారని ఎత్తి చూపింది. – సాంకేతిక అనుభవం విషయంలోనూ.. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 6000 మొబైల్ టవర్లు ఏర్పాటుచేసి ఉండాల్సి ఉండగా కేవలం 3000 టవర్లనే బిడ్‌లో పేర్కొనడాన్ని తప్పుపట్టింది. – అలాగే, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వార్షిక టర్నోవర్.. ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం అంటే 500 కోట్ల రూపాయలు నిబంధన విధించాల్సి ఉండగా కేవలం రూ.350 కోట్లు ఉంటే చాలని పేర్కొనడాన్ని కూడా తప్పుపట్టింది. ..ఇలా మొత్తం మీద బిడ్ నిబంధనలను నీరుగార్చినందున డీపీఆర్‌ను మళ్లీ రూపొందించి మరోసారి టెండర్లను ఆహ్వానించడం ద్వారా ఎక్కువమందికి బిడ్లు దాఖలు చేసే వెసులబాటును కల్పించాలని ఆర్థిక శాఖ సూచించింది. -
స్మార్ట్ సాంకేతికతతోనే బంగారు భవిష్యత్తు
- సంస్కృతీ విద్యాసంస్థల అంతర్జాతీయ సదస్సులో వక్తులు - ఎస్ఎస్బీలో ఘనంగా స్మార్ట్ సదస్సు ప్రారంభం పుట్టపర్తి టౌన్ : అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ సాంకేతికతను అలవర్చుకున్నప్పుడే ఆధునిక మానవుడు ఉజ్వల భవిష్యత్తును పొందగలడని వివిధ దేశాల నిర్మాణ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఆధునిక కాలంలోఅభివృద్ధి చెందిన దేశాల పట్టణీకరణ, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్ సిటీస్ టెక్నాలజీపై సంస్కృతీ విద్యాసంస్థలలో రెండురోజుల అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. విద్యాసంస్థల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ముఖ్య అతిథిగా విచ్చేసిన జపాన్‌లోని టోక్యో యూనివర్శిటీ డైరెక్టర్ అజ్బే బ్రౌన్ జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం అజ్బే బ్రౌన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడి ప్రభుత్వాలు స్మార్ట్ పరిజ్ఙానంతో తక్కువ ఖర్చుతో నిర్మాణాలు, భద్రత, మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే భారతదేశంలో నిర్మాణ రంగంలో స్మార్ట్ టెక్నాలజీ వినియోగం అత్యవసరమన్నారు. పారిస్‌కు చెందిన నిర్మాణ రంగ నిపుణురాలు క్లారిసెస్టన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే స్మార్ట్ నగరాల సాంకేతికత, ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మార్పులకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను అందించే దిశగా విద్యార్థులు ముందడుగు వేయాలని కొలరాడో స్టేట్ యూనివర్శిటీకి చెందిన బో బ్లాడ్జెట్ సూచించారు. ఆధునిక మానవుని అవసరాలకు అనుగుణంగా యువత నూతన అవిష్కరణలవైపు దృష్టి సారించాలని వర్క్‌బెంచ్ ప్రాజెక్ట్స్ సీఈఓ పవన్‌కుమార్ అన్నారు. బెంగళూరుకు చెందిన సామాజిక అవిష్కరణల నిపుణుడు అభిజిత్ సిన్హా మాట్లాడుతూ నీటి అవసరం లేని మూత్రాశాలలను, తక్కువ ఖర్చుతో నిర్మించగలిగే అంబులెన్స్‌లను రూపొందించే కృషి చేస్తున్నామన్నారు. కళాశాలలో ఇంజనీరింగ్ విభాగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వియన్నా యూనివర్శిటీ సైంటిస్ట్ పౌల్స్పెసిబెర్గ్, స్మార్ట్ డిజైనర్ చోలే జిమ్మర్మెన్, మంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ నిపుణుడు చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ బాటలో షియోమీ
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న షియోమీ 'స్మార్ట్’ బాట పట్టింది. భారత్‌లో స్మార్ట్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్, పవర్ బ్యాకప్, యాక్సెసరీస్‌ను విక్రయిస్తున్న ఈ సంస్థ వినూత్న స్మార్ట్ ఉపకరణాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చేయనుంది. టీవీలు, రౌటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, మస్కిటో రెపెల్లెంట్, ఎలక్ట్రికల్ బైసికిల్, డ్రోన్, బూట్లు, రైస్ కుకర్, ల్యాప్‌టాప్‌ల వంటి స్మార్ట్ ప్రొడక్ట్స్‌ను సైతం కంపెనీ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి వీటిని దశలవారీగా ఇక్కడి మార్కెట్లోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు షియోమీ ఇండియా హెడ్ మను జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రతి ఉపకరణాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించవచ్చని తెలిపారు. వేటికవే ప్రత్యేకం.. షియోమీ వాటర్ ప్యూరిఫయర్‌లో నాలుగు ఫిల్టర్లుంటాయి. ఏది పాడైనా వెంటనే కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌కు, అలాగే కంపెనీ కేంద్ర కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఒక్క క్లిక్‌తో ఫిల్టర్‌ను ఆర్డరివ్వొచ్చు. టెక్నీషియన్ అవసరం లేకుండానే అయిదు నిముషాల్లో బిగించొచ్చు కూడా. ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశామో చెప్పే షూస్, బియ్యం రకం, వంటకాన్నిబట్టి సమయానుకూలంగా వండే రైస్ కుకర్, ఏడు కిలోల బరువున్న మడవగలిగే ఎలక్ట్రికల్ బైసికిల్, వెంట తీసుకెళ్లగలిగే మస్కిటో రెపెల్లెంట్ కస్టమర్ల మదిని చూరగొంటాయని కంపెనీ తెలిపింది. చైనాలో షియోమీ స్మార్ట్ టీవీలకు 4.40 లక్షల గంటల కంటెంట్ అందుబాటులో ఉంది. భారత్‌లో కంటెంట్ సిద్ధమవగానే టీవీలను ప్రవేశపెట్టనుంది. మరో రెండు ప్లాంట్లు.. కంపెనీ ప్రతి మూడు నెలలకు 10 లక్షలకుపైగా స్మార్ట్ఫోన్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం శ్రీసిటీలోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో షియోమీ కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన యూనిట్లో మొబైళ్లను తయారు చేస్తున్నారు. మరో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు పలు రాష్ట్రాలతో కంపెనీ సంప్రదిస్తోంది. ప్రతి స్మార్ట్‌ఫోన్ 4జీ, ఎల్టీఈ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. అలాగే అంతర్జాతీయంగా లభించే మోడళ్లకు పలు మార్పులు చేసి భారత్‌లో విడుదల చేస్తోంది. గతంలో స్మార్ట్ఫోన్లను చైనాలో విడుదలైన 6-9 నెలలకు భారత్‌కు తీసుకువచ్చేవారు. ఇప్పుడు రెండు నెలలలోపే ప్రవేశపెడుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను తెరుస్తామని మను జైన్ చెప్పారు. -
సామాన్యుడికి మేలుచేయని టెక్నాలజీ వృథా
స్మార్ట్ టెక్నాలజీలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కావడం సరికాదని, మన పల్లెలు కూడా వాటి ప్రయోజనాలను పొందాలని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. స్మార్ట్ టెక్నాలజీలపై హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ పొందిన అతి తక్కువ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని ఆయన చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో అన్ని ఇళ్లకూ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటల్ లిటరసీ మిషన్ అనే మరో ప్రధాన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం చేపట్టిందని, దీని ద్వారా ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి డిజిటల్ అక్షరాస్యత కల్పించడం తమ లక్ష్యమని అన్నారు. సామాన్యుడికి ప్రయోజనం కలిగించని టెక్నాలజీ వృథాయేనని వ్యాఖ్యానించారు. స్మార్ట్ సిటీల నిర్మాణం మంచిదే అయినా, పల్లెలే దేశానికి వెన్నెముక అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రైతులకు కూడా సాయం చేసేందుకు తమ ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటోందని కేటీఆర్ చెప్పారు. Smart Technologies need not necessarily be restricted to Cities alone. Our villages should also benefit from Smart Tech: KTR at #NCST — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 We are one of the first states to have a ambitious fiber optic grid, connecting all the houses in the state: KTR at #NCST — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 Telangana has also embarked on another major initiative - Digital Literacy mission, to make one person per family Digitally literate: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 Technology that does not benefit the common man would be futile: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 While Smart Cities are good, we should also remember that India still lives in the villages: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 Our government is using smart technology to help our farmers: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015