స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసా? | Gray Arch Tech Smart Water Bottle Reviews | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసా?

Published Sun, Dec 11 2022 11:40 AM | Last Updated on Sun, Dec 11 2022 11:46 AM

Gray Arch Tech Smart Water Bottle Reviews - Sakshi

ఇది చాలా స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌. ఇందులో ఏ కొళాయి నీళ్లయినా పట్టుకుని, నిక్షేపంగా తాగవచ్చు. ఇది బ్రిటన్‌కు చెందిన ‘గ్రే ఆర్క్‌ టెక్‌’ రూపొందించిన సెల్ఫ్‌ క్లీనింగ్‌ వాటర్‌ బాటిల్‌. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది.

 ఇందులో వెలువడే అల్ట్రావయొలెట్‌ కిరణాలు నీటిలోని సూక్ష్మజీవులను సమూలంగా నాశనం చేసి, నీటిని క్షణాల్లోనే స్వచ్ఛంగా మారుస్తాయి. 

దీని వాక్యూమ్‌ సీల్డ్‌మూత వల్ల ఇందులోని నీళ్ల ఉష్ణోగ్రత ఇరవైనాలుగు గంటలకు పైగా స్థిరంగా ఉంటుంది. దీనిని ఫ్లాస్క్‌ మాదిరిగా వేడి లేదా చల్లని పానీయాల కోసం కూడా వాడుకోవచ్చు. మూత మీద ఉండే ఎల్‌ఈడీ డిస్‌ప్లేలో బాటిల్‌లోని పానీయం ఉష్ణోగ్రత కనిపిస్తూ ఉంటుంది. దీని ధర 98.41 పౌండ్లు (రూ.9,644).  .
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement