Smart water bottle
-
స్మార్ట్ వాటర్ బాటిల్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఇది చాలా స్మార్ట్ వాటర్ బాటిల్. ఇందులో ఏ కొళాయి నీళ్లయినా పట్టుకుని, నిక్షేపంగా తాగవచ్చు. ఇది బ్రిటన్కు చెందిన ‘గ్రే ఆర్క్ టెక్’ రూపొందించిన సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ బాటిల్. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇందులో వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు నీటిలోని సూక్ష్మజీవులను సమూలంగా నాశనం చేసి, నీటిని క్షణాల్లోనే స్వచ్ఛంగా మారుస్తాయి. దీని వాక్యూమ్ సీల్డ్మూత వల్ల ఇందులోని నీళ్ల ఉష్ణోగ్రత ఇరవైనాలుగు గంటలకు పైగా స్థిరంగా ఉంటుంది. దీనిని ఫ్లాస్క్ మాదిరిగా వేడి లేదా చల్లని పానీయాల కోసం కూడా వాడుకోవచ్చు. మూత మీద ఉండే ఎల్ఈడీ డిస్ప్లేలో బాటిల్లోని పానీయం ఉష్ణోగ్రత కనిపిస్తూ ఉంటుంది. దీని ధర 98.41 పౌండ్లు (రూ.9,644). . -
నీరు తాగాలని గుర్తుచేస్తుంది!
వాషింగ్టన్: రోజుకు మీరు ఎంత నీరు తాగాలో చెప్పే సరికొత్త ‘స్మార్ట్’ వాటర్ బాటల్ ఇది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ తయారుచేసింది. ‘బ్లూఫిట్’ అనే ఈ సీసా మీ ఎత్తు, బరువు, వయస్సు, గాలిలో తేమ, ఉష్ణోగ్రత ఆధారంగా రోజుకు ఎంత నీరు తాగాలో చెబుతుంది. నిర్ణీత సమయంలో నీరు తాగాలంటూ సంకేతాలు పంపుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ను ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ వంటి స్మార్టఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని వివరాలు పొందుపరిస్తే సరి.. బ్లూటూత్ సాయంతో సీసా సమాచారం పంపుతుంది. అవసరాలను బట్టి ఎంత నీరు, ఎప్పుడెప్పుడు తాగాలో నిర్ణయించుకుని దీనిలో సెట్ చేసుకునే అవకాశముంది.