వాషింగ్టన్: రోజుకు మీరు ఎంత నీరు తాగాలో చెప్పే సరికొత్త ‘స్మార్ట్’ వాటర్ బాటల్ ఇది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ తయారుచేసింది. ‘బ్లూఫిట్’ అనే ఈ సీసా మీ ఎత్తు, బరువు, వయస్సు, గాలిలో తేమ, ఉష్ణోగ్రత ఆధారంగా రోజుకు ఎంత నీరు తాగాలో చెబుతుంది. నిర్ణీత సమయంలో నీరు తాగాలంటూ సంకేతాలు పంపుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ఐఫోన్ వంటి స్మార్‌టఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలు పొందుపరిస్తే సరి.. బ్లూటూత్ సాయంతో సీసా సమాచారం పంపుతుంది. అవసరాలను బట్టి ఎంత నీరు, ఎప్పుడెప్పుడు తాగాలో నిర్ణయించుకుని దీనిలో సెట్ చేసుకునే అవకాశముంది.