Bluetooth
-
ఈ–త్రీవీలర్స్‌లోకి టీవీఎస్..
టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల రంగంలోకి ప్రవేశించింది. ఎక్స్‌పోలో భాగంగా కింగ్ ఈవీ మ్యాక్స్‌ను పరిచయం చేసింది. ఇది భారత్‌లో బ్లూటూత్‌తో అనుసంధానించిన తొలి ఎలక్ట్రిక్ త్రీ–వీలర్. స్థిర సాంకేతికతతో పట్టణ మొబిలిటీని పెంచే లక్ష్యంతో దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్‌తో తయారైంది. ఇది స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వాహన స్థితిగతులను తెలియజేస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని టీవీఎస్ తెలిపింది. 3 గంటల 30 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. 51.2 వోల్ట్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. ఎక్స్ షోరూం ధర రూ.2.95 లక్షలు.ఇదీ చదవండి: టిక్‌టాక్ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..! మళ్లీ స్కోడా డీజిల్ కార్లువాహన తయారీలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా అయిదేళ్ల తర్వాత భారత్‌లో డీజిల్ ఇంజన్స్‌ను మళ్లీ ప్రవేశపెడుతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా సూపర్బ్ డీజిల్ కారును ప్రదర్శించింది. కొడియాక్ డీజిల్ సైతం త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారతీయ కస్టమర్లు ఇప్పటికీ డీజిల్ కార్లను డిమాండ్ చేస్తున్నారని స్కోడా ఇండియా హెడ్ పీటర్ యానిబా తెలిపారు. ‘స్కోడా కార్ల విక్రయాల్లో గతంలో 80 శాతం యూనిట్లు డీజిల్ విభాగం కైవసం చేసుకుంది. హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా అమ్మకాల్లో గణనీయ భాగం డీజిల్ వాహనాలు సమకూరుస్తున్నాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్, బీఎండబ్ల్యూలకు కూడా అంతే. కాబట్టి లగ్జరీ, ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్ల మధ్యలో ఉన్న స్కోడా ఈ మార్పు నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతుంది. మేము కచి్చతంగా డిమాండ్‌ను నెరవేర్చడానికి చూస్తున్నాం’ అని వివరించారు. -
ఇయర్‌రింగ్స్‌తో కుట్ర చేయొచ్చా? ట్రంప్-హారిస్ డిబేట్‌పై ఒకటే చర్చ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు తమ ప్రచారంతో దూసుకుతున్నారు. ఈ తరుణంలో ఏబీసీ మీడియా నిర్వహించిన డిబేట్‌పై ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. డిబేట్లో ట్రంప్‌పై హారిస్‌పై చేయి సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ట్రంప్ మద్దతు దారులు హారిస్‌పై మండిపడుతున్నారు. కుట్రపూరితంగా కమలా హారిస్ తన ముత్యాల చెవిపోగుల ముసుగులో ఆడియో హెడ్ఫోన్లను వినియోగించారని మండిపడుతున్నారు. ట్రంప్ సైతం డిబేట్లో హారిస్ ఈ తరహా చెవిపోగులు ధరించడం అనవసరమన్నారు. కమలా హారిస్ తన ముత్యాల చెవిపోగుల ముసుగులో ఆడియో హెడ్ఫోన్లను వినియోగించారని డిబేట్లో కలిగి ఉన్నారని వాదించిన ట్రంప్ మద్దతుదారులు ఎక్కువగా కుట్ర సిద్ధాంతాన్ని అనుసరించారు. ఆమె చెవిపోగులు నిజానికి ఐస్‌బాచ్ సౌండ్ సొల్యూషన్స్ నోవా హెచ్1 ఆడియో చెవిపోగులు అని ఊహాగానాలు వచ్చాయి, ఇది బ్లూటూత్ పరికరం ఆభరణాల వలె కనిపిస్తుంది. 🚨🚨KAMALA HARRIS EXPOSED FOR WEARING EARPIECE IN DEBATE *PROOFShe is seen wearing an earring developed by Nova Audio Earrings first seen at CES 2023. This earring has audio transmission capabilities and acts as a discreet earpiece.Kamala Harris confirms claims that a… pic.twitter.com/1y60rUdJT0— ELECTION2024 🇺🇸 (@24ELECTIONS) September 11, 2024ఈ నేపథ్యంలో టెక్ కంపెనీ ఐస్‌బాచ్ ఎండీ మాల్టే ఐవర్సెన్ స్పందించారు.హారిస్ మా ఉత్పత్తులలో ఒకదాన్ని ధరించారో లేదో మాకు తెలియదు.కానీ ఆమె ధరించిన ఇయర్రింగ్స్ బాగున్నాయని సెలవిచ్చారు. డిబేట్‌పై అనేక వాదనలు తెరపైకి వస్తున్నప్పటికీ టిఫనీ అండ్ కో అనే సంస్థ ఇయర్రింగ్స్ ధర సుమారు 800కి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఐస్‌బాచ్ విక్రయించే బ్లూటూత్ ధర సుమారు 625 డాలర్లుగా ఉంది. హారిస్ గతంలో బ్లూటూత్ ఇయర్పీస్ల వినియోగంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచార సమయంలో వైర్డు ఇయర్‌బడ్‌లను ఉపయోగించారు. ఇలా ప్రతి సారి ఆమె ధరించే ఆభరణాల చుట్టూ ఊహాగానాలు, రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. కాగా, హారిస్ ట్రంప్ టీవీ డిబేట్, టేలర్ స్విప్ట్‌పై ఎలోన్ మస్క్ కామెంట్స్ చర్చ కొనసాగుతూనే ఉంది. నీల్సన్ డేటా ప్రకారం, ఏబీసీ మీడియా నిర్వహించిన డిబేట్‌ను 67.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి : మోదీ నా మంచి స్నేహితుడు : పుతిన్ -
బ్లూటూత్ మౌత్‌పీస్ - నిశ్శబ్దంగా మాట్లాడుకోవచ్చు!
బయట రణగొణ ధ్వనుల మధ్య ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడాల్సి వస్తే, బిగ్గరగా మాట్లాడాల్సి వస్తుంది. ఆఫీసులో అందరూ నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్నప్పుడు ఫోన్ వస్తే, మన మాటల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు. అంతేకాదు, ఒక్కోసారి గోప్యమైన మాటలు మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఏర్పడవచ్చు. అందరిలో ఉన్నప్పుడు మాట్లాడటం కష్టం. ఇకపై అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్లూటూత్ మౌత్‌పీస్‌ను మూతికి మాస్కులా తొడుక్కుని ఇంచక్కా మాట్లాడుకోవచ్చు. దీనిని మూతికి తొడుక్కుంటే, మీరేం మాట్లాడుతున్నారో మీ పక్కన కూర్చున్నవారికి కూడా వినిపించదు. స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ ఆన్ చేసుకుని, ఈ స్పీకర్ మూతికి పెట్టుకుని ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. (ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!) జపాన్‌కు చెందిన ‘షిఫ్టాల్’ కంపెనీ ఈ బ్లూటూత్ మౌత్‌పీస్‌ను ‘మ్యూటాక్’ పేరిట రూపొందించింది. దీనిని ఈ ఏడాది చివరిలోగా మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ధర 200 డాలర్ల (రూ.16,537) వరకు ఉండవచ్చని అంచనా. -
కళ్లకు గంతలు కాదు.. హైటెక్ మసాజర్
ఫొటోలో కనిపిస్తున్న యువతి కళ్లకు తెల్లని గంతలు తొడుక్కున్నట్లు కనిపిస్తోంది కదూ! ఆమె కళ్లకు తొడుకున్నది గంతలు కాదు, హైటెక్ మసాజర్. అమెరికన్ కంపెనీ ‘ట్రూరెల్’ రూపొందించిన ‘ఐ మసాజర్’. ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. అలసిన కళ్లను సుతారంగా మర్దన చేస్తుంది. కళ్ల చుట్టూ తగినంత నులివెచ్చదనాన్ని కలిగిస్తుంది. (Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?) ఇందులోని ఎస్టీవీ టెక్నాలజీ ద్వారా కోరుకున్న రీతిలో వైబ్రేషన్స్, పల్సింగ్ సృష్టించి, తగినంత వెచ్చదనాన్ని, గాలి పీడనాన్ని కలిగించి కళ్ల అలసటను ఇట్టే మటుమాయం చేస్తుంది. ఇది అడ్జస్టబుల్ హెడ్‌సెట్‌తో లభిస్తుంది. తల పరిమాణానికి తగినట్లుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోని ప్లేలిస్ట్‌లో ఉన్న పాటలను వింటూ, కళ్లకు మర్దన తీసుకుంటూ, హాయిగా సేదదీరవచ్చు. దీని ధర 105 డాలర్లు (రూ.8,678) మాత్రమే. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) -
బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ ‘రిథమ్’ సన్‌గ్లాసెస్: భారీ తగ్గింపుతో
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కనెక్ట్ గ్యాడ్జెట్స్ రిథమ్ పేరుతో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ సన్‌గ్లాసెస్‌ను ఆవిష్కరించింది. ఎండ నుంచి రక్షణతోపాటు ఫోన్ కాల్స్ అందుకోవచ్చు. పాటలు వినొచ్చు. స్పెషల్ లాంచ్ ఆఫర్ ధర రూ. 1,999. నాలుగు గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. మార్కెట్లోకి విడుదల చేసిన 3 రోజుల్లోనే 20,000 యూనిట్లు విక్రయించామని కంపెనీ కో-ఫౌండర్ ప్రదీప్ యెర్రగుంట్ల తెలిపారు. రిథమ్ అంతర్నిర్మిత మైక్రోఫోన్ స్పీకర్లతో వస్తుంది. ఇది మ్యూజిక్, ఇన్కమింగ్ కాల్స్‌కు సులభంగా మారడానికి వీలు కల్పిస్తుందనీ, ముఖ్యంగా సన్ గ్లాసెస్‌ను తీయకుండానే వాల్యూమ్‌ను సర్దుబాటు చేయవచ్చు. వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు అని ప్రదీప్ తెలిపారు. రిథమ్ కేవలం 38 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులోని 120mAh బ్యాటరీ నాలుగు గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందన్నారు. త్వరలోనే మరో ఐదు మోడళ్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వచ్చే త్రైమాసికంలో 5 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మరోవైపు దీని అసలు ధర రూ. 6,999. అయితే ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా, 1,999 రూపాయలకే అందిస్తోంది. -
Smart Bottle: ఈ బాటిల్ కేవలం నీళ్లకే కాదు.. మ్యూజిక్ కూడా.. ధర రూ.3,257
ప్రతి ప్రయాణంలో మంచి నీళ్లు ఎంత అవసరమో.. స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాల్లో ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. 3 ఇన్ 1 స్మార్ట్ ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ అందుకు సై అంటుంది. ఒక వాటర్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ని అందించడమేంటీ అనేగా మీ డౌటనుమానం? అదే దీని స్పెషాలిటీ. దీనిలో మ్యూజిక్ స్పీకర్స్, డాన్సింగ్ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. వేడి నీళ్లు కావాలంటే వేడి నీళ్లు, చన్నీళ్లు కావాలంటే చన్నీళ్లూ ఇందులో నిలవ చేసుకోవచ్చు. 12 గంటల పాటు వేడి నీళ్లను వేడిగా, 24 గంటల పాటు చన్నీళ్లను చల్లగా ఉంచుతుంది. వైర్ లెస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ఉండటంతో.. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ చేసుకుని నచ్చిన పాటను పెట్టుకోవచ్చు. ఈ బాటిల్‌ని పార్టీల్లో, యోగా చేసే సమయాల్లో, వ్యాయామం చేసేటప్పుడు, క్యాంపింగ్ లేదా అవుట్ డోర్‌కి వెళ్లినప్పుడు వెంట పెట్టుకుంటే.. చక్కగా కావల్సిన మ్యూజిక్ వింటూ దాహం తీర్చుకోవచ్చు. ఇలాంటి బాటిల్‌ని మన సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు గిఫ్ట్‌గా కూడా ఇవ్వచ్చు. ఆరోగ్య స్పృహ ఉన్న ఆత్మీయులకు ఇలాంటి బాటిల్ బహుమతిగా ఇవ్వడం కూడా బాగుంటుంది. ధర: 42 డాలర్లు (రూ.3,257) -
ఎస్ఐ స్కాం: అవును, బ్లూటూత్ వాడాను
బనశంకరి: బ్లూటూత్ పరికరం ఉపయోగించి పరీక్షలో సమాధానాలు రాశాను. ఇందుకోసం రూ. 40 లక్షలను ముట్టజెప్పాను అని ఎస్ఐ పోస్టుల స్కాంలో పట్టుబడిన అభ్యర్థి సునీల్ చెప్పాడు. అతన్ని సీఐడీ అధికారులు విచారించగా అక్రమాలను బయటపెట్టాడు. ఆర్డీ పాటిల్ బ్లూటూత్ పరికరం ద్వారా సమాధానాలు చెప్పాడని, ఇందుకోసం రూ.40 లక్షలు తీసుకున్నాడని సునీల్ చెప్పాడు. ఈ పరీక్షలో సునీల్ ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. అదనపు డీజీపీపై బదిలీ వేటు ఎస్ఐ ఉద్యోగాల భర్తీలో భారీ కుంభకోణం ఐపీఎస్‌లకు ఇబ్బందిగా మారింది. పోలీస్ నియామక విభాగం అదనపు డీజీపీ అమృత్‌పౌల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఆంతరిక భద్రత విభాగానికి పంపించింది. ఇందుకు స్కామే కారణమని సమాచారం. త్వరలో మరికొందరు ఐపీఎస్‌లనూ బదిలీ చేయవచ్చని సమాచారం. అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు ఇటీవల మైసూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కర్ణాటక విశ్వవిద్యాలయం జియాగ్రఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్ ను బుధవారం మల్లేశ్వరం పోలీసులు అరెస్ట్‌చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే అరెస్టైన గెస్ట్ లెక్చరర్ సౌమ్య విచారణలో ఇచ్చిన సమాచారంతో నాగరాజ్‌ను అరెస్టుచేశారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం) -
ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం
బనశంకరి: ఎస్ఐ పోస్టుల కుంభకోణంలో ఎన్వీ సునీల్‌కుమార్ అనే వ్యక్తిని సీఐడీ అరెస్ట్‌చేసి బెంగళూరుకు తీసుకువచ్చింది. ముఖ్య నిందితుడు రుద్రేగౌడ పాటిల్ ద్వారా బ్లూ టూత్‌లో సమాధానాలు విని సునీల్ పరీక్ష రాశాడు. దివ్యా హగరగి ఆధీనంలో ఉన్న కలబురిగి జ్ఞానజ్యోతి స్కూల్లో అతడు పరీక్షకు హాజరయ్యాడు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టయ్యారు. డీకేతో నిందితురాలి ఫోటో ఎస్ఐ స్కాంలో పరారీలో ఉన్న నిందితురాలు దివ్యా హగరగి కేపీసీసీ అద్యక్షుడు డీకే.శివకుమార్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. ఆమె బీజేపీ నాయకురాలని, ఆమె ఇంటికి హోంమంత్రి జ్ఞానేంద్ర వెళ్లి సన్మానం పొందారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండగా, ఈ ఫోటోలు రావడం విశేషం. గెస్ట్ లెక్చరర్ విచారణ మరోవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మైసూరుకు చెందిన గెస్ట్ లెక్చరర్ సౌమ్యను బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం ఒకటవ ఏసీఎంఎం కోర్టులో ఆమెను హాజరుపరిచారు. గతనెల 14 తేదీన భూగోళ శాస్త్రం పరీక్ష రోజున ఉదయమే పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన సౌమ్య మొబైల్ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటోలు తీసుకుని లీక్ చేసింది. ఆమె వద్ద ఉన్న ప్రశ్నలు క్రమపద్ధతిలో లేనట్లు తెలిసింది. ఆమె మొబైల్‌ను తనిఖీ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేదానిపై విచారణ సాగుతోంది. పేపర్ లీక్ స్కాంలో మైసూరు వర్సిటీలో జాగ్రఫీ గెస్ట్ లెక్చరర్ సౌమ్యా పైన కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ శివప్ప మంగళవారం తెలిపారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. (చదవండి: హత్యకు కుట్ర, ముగ్గురి అరెస్ట్) -
స్మార్ట్ ప్రెషర్ కుకర్.. బ్లూ టూత్ కనెక్ట్‌తో!
వంటరాకున్నా వండి పెట్టే మెషిన్ ఇంట్లో ఉంటే.. ఆ సౌకర్యమే వేరప్పా అనిపిస్తుంది కదూ! అలాంటిదే ఈ మేకర్ (స్మార్ట్ ప్రెషర్ కుకర్). స్మార్ట్ ఫోన్ లో దానికి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఈ స్మార్ట్ కుకర్కి బ్లూ టూత్ సాయంతో కనెక్ట్ చేసుకోవాలి. 600 వంటలకు పైగా రెసిపీలతో పాటు.. ఎలా చెయ్యాలో దేని తర్వాత ఏం వెయ్యాలో, ఎంత మోతాదులో వెయ్యాలో.. ఇలా అన్నిటినీ వివరించే వీడియోలు అందుబాటులో ఉంటాయి. కొలత కొలిచే కప్పులతో అవసరం లేదు. నాలుగు ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సెన్సార్లు.. పదార్థాలను కచ్చిత పరిమాణంలో కొలుస్తాయి. వండే వంటకాన్ని బట్టి ఎంత వాటర్ అవసరమో కూడా అడిగి తీసుకుంటుంది. దీనికి టైమ్ సెట్ చెయ్యాల్సిన పనిలేదు. టెంపరేచర్ తగ్గించడం, పెంచుకోవడంతో సంబంధం లేదు. దీని మెనులో ప్రతి వారం అదనంగా 5 రెసిపీలు చేరుతూ ఉంటాయి. ప్రెషర్ కుకర్, స్లో కుకర్, స్మార్ట్ కుకర్, స్టీమర్.. ఇలా చాలా రకాలుగా దీన్ని వినియోగించుకోవచ్చు. స్టీమ్ బాస్కెట్, స్టీమ్ ర్యాక్, సిలికాన్ లిడ్ (మూత), ప్రెషర్ లిడ్లతో పాటు రెండు గ్యాస్కట్లూ ఈ కుకర్ తోడుగా లభిస్తాయి. భలే బాగుంది కదూ! ధర 204 డాలర్లు (రూ.15,233) -
వారెవ్వా... ఏమి విగ్గు! వామ్మో ఏం తెలివిరా బాబోయ్.. వైరల్ వీడియో
ఏం బుర్రరా నీది..! అని అసాధారణ ప్రతిభాపాటవాలు, అమోఘ నైపుణ్యం కనబరుస్తున్న వారిని ప్రశంసిస్తుంటాం. ఇదిగో ఈ ఫొటోలో కనపడుతున్న వ్యక్తి తెలివితేటలను చూసి.. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. నెటిజన్లు కూడా.. విస్తుపోయారు. కాకపోతే చదువుల్లో ఇతనికున్న ప్రతిభను చూసి కాదు... వక్రమార్గంలో సబ్ఇన్స్పెక్టర్ పరీక్షను గట్టెక్కడానికి సదరు మహాశయుడు ఎంచుకున్న హైటెక్ కాపీయింగ్ పద్ధతిని చూసి. ఇంతకీ ఏం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల సబ్–ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి పోటీ పరీక్షలు జరిగాయి. ప్రభుత్వోద్యోగం... అందులోనా క్రేజీ జాబ్. మనోడు బాగా ఆలోచించి... కాపీయింగ్ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ బ్లూ టూత్ రిసీవర్‌ను విగ్గులో అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా క్రాపు బాగా తగ్గించుకొని తన తలపై ఈ విగ్గును జాగ్రత్తగా అతికించుకున్నాడు. అత్యంత సూక్ష్మమైన... బయటికి కనిపించని రెండు ఇయర్ఫోన్లను చెవుల్లోకి జొప్పించాడు. కంటికి కనిపించంనంత సూక్ష్మమైన తీగలతో ఈ బ్లూ టూత్ నుంచి ఇయర్ఫోన్లను కనెక్ట్ చేశాడు. దిలాసాగా నడుచుకుంటూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లబోతుండగా... అందరినీ చెక్ చేసినట్లే పోలీసులు మనోడిని కూడా మెటల్ డిటెక్టర్‌తో పరీక్షించారు. తల దగ్గరికి రాగానే బీప్.. బీప్.. అని శబ్దం వస్తోంది. నిశితంగా పరిశీలించిన పోలీసులు విగ్గు గుట్టును రట్టుచేశారు. విగ్గును తొలగించడం, లోపలున్న బ్లూటూత్ పరికరం, చెవుల్లోని సూక్ష్మమైన ఇయర్ఫోన్లను అతికష్టం మీద పోలీసులు వెలికితీయడం చూసి... వామ్మో ఏం తెలివిరా బాబోయ్... అంటూ నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పంచుకోగా... వైరల్‌గా మారింది. గూఢచారి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కొందరు సరదాగా అతనికి సూచించారు. #UttarPradesh mein Sub-Inspector की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️😊😊😊@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry — Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021 -
కనెక్ట్ ఎస్‌డబ్ల్యు1 ప్రో స్మార్ట్‌వాచ్
హైదరాబాద్: యాక్సెసరీస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కనెక్ట్ గ్యాడ్జెట్స్ ఎస్‌డబ్ల్యు1 ప్రో స్మార్ట్‌వాచ్‌ను ప్రవేశపెట్టింది. 10.5 మిల్లీమీటర్ల మందం, 1.72 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ కర్వ్డ్ ట్రూ వ్యూ లార్జ్ డిస్ప్లే, 180 ఎంఏహెచ్ బ్యాటరీతో రూపొందించింది. ధర రూ.3,999. అంతరాయం లేని, మెరుగైన కాల్స్ కోసం డ్యూయల్ బ్లూటూత్ మల్టీ పాయింట్ టెక్నాలజీతో జోడించినట్టు కనెక్ట్ సీవోవో ప్రదీప్ తెలిపారు. (చదవండి: అదిరిపోయే ఫీచర్స్ గల 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా!) బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సీజన్, ఈసీజీ తెలుసుకోవచ్చు. ఫిమేల్ అసిస్టెన్స్, బ్రెత్ మోడ్, వెదర్ రిపోర్ట్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటరింగ్, గెశ్చర్ కంట్రోల్, ఏడు రకాల స్పోర్ట్స్ మోడ్స్, వాటర్ ప్రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాయిదాల్లోనూ కొనుగోలు చేయవచ్చు. (చదవండి: ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!) -
చెప్పుల్లో బ్లూటూత్ పెట్టుకుని పరీక్షలు.. ధర రూ.6 లక్షలు!
జైపూర్: రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ బట్టబయలైన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక ఓ పెద్ద కథే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అజ్మీర్‌లోని కిషన్గఢ్లో ఒక అభ్యర్థి బ్లూటూత్ పరికరాన్ని తన చెప్పులలో దాచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి పట్టుబడగా, ఇటువంటి ఘటనలే రాజస్తాన్ వ్యాప్తంగా ఆదివారం వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో సహా కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ బ్లూటూత్-అమర్చిన చెప్పులు కొనుగోలుకు రూ. 6 లక్షల వరకు చెల్లించినట్లు నిందితులు తెలిపారు. భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ హైటెక్ మాస్ కాపీ తెర వెనుక ఎవరెవరూ ఉన్నారో తెలుసుకోవడానికి పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన తర్వాత పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న చెప్పులను తొలగించాలని అజ్మీర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ప్రేమించిన యువతి చెల్లి అవుతుందని తెలిసి.. -
ఒక్కసారిగా పేలిన బ్లూటూత్ హెడ్‌ఫోన్.. ఆగిన గుండె
జైపూర్: వైర్లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఒక్కసారిగా పేలి ఆ శబ్ధానికి ఓ బాలుడు గుండె ఆగిపోయింది. ఆ పేలుడుతో బాలుడు మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. గుండెపోటుతో బాలుడు మృతి చెందడం దేశంలోనే మొదటిగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా చౌము మండలం ఉదయ్‌పుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేశ్ శుక్రవారం ఒకరితో బ్లూటూత్ హెడ్‌ఫోన్ వేసుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా బ్లూటూత్ పేలిపోయింది. క్షణకాలంలో జరిగిన ఘటనతో బాలుడి గుండె ఆగిపోయి ((కార్డియాక్ అరెస్ట్) అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు సిద్ధివినాయక ఆస్పత్రికి తరలించారు. బ్లూటూత్ పేలడంతో చెవులకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు డాక్టర్ ఎన్ఎన్ రుండ్లా తెలిపారు. ‘గుండెపోటుతో బాలుడు మృతి చెందడం బహుశా దేశంలో ఇదే మొదటి కేసు అయ్యింటుంది’ అని వైద్యులు రుండ్లా వివరించారు. అయితే ఇలాంటి ఘటనే రెండు నెలల కిందట ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. జూన్ నెలలో 38 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి బ్లూటూత్ పేలి మృతి చెందాడు. బ్లూటూత్ పరికరం పేలుడుతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ పేలిన బ్లూటూత్ పరికరం ఏ కంపెనీదో? ఎందుకు పేలుతుందో అనే వివరాలు తెలియడం లేదు. అకస్మాత్తుగా వీటి పేలుళ్లు జరుగుతుండడంతో ప్రజలు బ్లూటూత్ వినియోగించేందుకు భయపడుతున్నారు. -
హీరో గ్లామర్‌లో కొత్తగా ఈ ఫెసిలిటీ కూడా
ముంబై: లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోహోండా గ్లామర్ 125 సీసీ బైక్‌లో మరొ అధునాత ఫీచర్‌ని హీరో మోటర్ కార్ప్ జోడించింది. మార్కెట్లో గ్లామర్‌కి పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు సవాల్ విసిరింది. బ్లూటూత్ ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న 125 సీసీ సెగ్మెంట్లో హీరో గ్లామర్ది ప్రత్యేక స్థానం. మైలేజీ, మెయింటనెన్స్, స్టైలింగ్ విషయంలో బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్లోకి వచ్చిన తక్కువ కాలంలోనో ఎక్కువ అమ్మకాలు సాధించింది. డిజిటల్ డిస్ప్లేతో ఆదిలోనే ఆకట్టుకుంది. కాగా తాజాగా గ్లామర్ బైక్‌కి బ్లూటూత్ ఫీచర్‌ని యాడ్ చేసింది హీరో మోటర్ కార్ప్. టీజర్ రిలీజ్ రైడింగ్‌లో ఉన్నప్పుడు మోబైల్‌కి వచ్చే కాల్స్ వివరాలు చూసుకునేందుకు వీలుగా బ్లూటూత్ ఫీచర్‌ని హీరో మోటర్ కార్ప్ జత చేసింది. దీనికి తగ్గట్టుగా మీటర్ కన్సోల్‌లో డిజిటల్ డిస్ప్లే సైజుని కూడా పెంచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను హీరో మోటర్ కార్ప్ లాంఛ్ చేసింది. మరిన్ని హంగులు బ్లూ టూత్ ఫీచర్‌తో పాటు గ్లామర్ 125 సీసీలో ఎల్ఈడీ ల్యాంప్‌ను మరింత ఆకర్షణీయంగా హీరో మోటర్ కార్ప్ మార్చింది. హెచ్ ఆకారంలోకి హెడ్‌ల్యాంప్‌ని డిజైన్ చేసింది. అదే విధంగా స్పీడో మీటర్ కన్సోల్‌ని ప్తూర్తిగా డిజిటల్‌గా మార్చింది. ప్రస్తుతం మార్కెట్లో హీరోహోండా గ్లామర్ 125 సీసీ ధర రూ.78,900 (ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్)గా ఉంది. అప్‌గ్రేడ్ చేసిన గ్లామర్ 125 సీసీని ఈ ఆగస్టులోనే మార్కెట్లో రిలీజ్ కానుంది. Always stay connected. Get ready for a revolutionary ride... Coming Soon. pic.twitter.com/Tmy2DbSFDe — Hero MotoCorp (@HeroMotoCorp) July 25, 2021 -
సరికొత్త ఫీచర్లతో హీరో మాస్ట్రో ఎడ్జ్ 125...!
ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా తన 125సీసీ మోడళ్లను పెంచాలని యోచిస్తోంది. ఇటీవల గ్లామర్ బైక్‌కు అప్డేట్ తెచ్చిన కొన్ని రోజులకే స్కూటీ డివిజన్లో మాస్ట్రో ఎడ్జ్ 125ను అప్డేట్ చేస్తూ సరికొత్త ఫీచర్లతో మాస్ట్రో ఎడ్జ్ 125 బైక్‌ను హీరో మోటార్ కార్ప్ రిలీజ్ చేసింది. ఈ బైక్‌ను సరికొత్తగా రెండు రకాల కలర్ వేరియంట్లతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. కస్లమర్లకు ప్రిస్మాటిక్ ఎల్లో, ప్రిస్మాటిక్ పర్పుల్ కలర్ వేరియంట్స్ రూపంలో న్యూ మాస్ట్రో ఎడ్జ్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. న్యూ మాస్ట్రో ఎడ్జ్ 125 బైక్ బ్లూటూత్ కనెక్టివిటీని, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై- టర్న్ నావిగేషన్, డిజిటల్ స్పీడో మీటర్, కాల్ ఆలర్ట్‌తో రానుంది. మాస్ట్రో ఎడ్జ్ 125 డ్రమ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 72,250, డిస్క్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 76,500, కనెక్టెడ్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 79,750గా నిర్ణయించారు. ఈ ధరలు ఢిల్లీ నగరంలో అందుబాటులో ఉంటాయి. మాస్ట్రో ఎడ్జ్ 125 'ఎక్స్సెన్స్ టెక్నాలజీ'తో 124.6 సిసి బిఎస్ 6 కంప్లైంట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోటారుతో రానుంది. ఇంజన్ 9బీహెచ్పీ సామర్థ్యంతో 7,000 ఆర్‌పీఎమ్‌ను అందిస్తోంది. 5,500 ఆర్పీఎమ్ వద్ద గరిష్టంగా 10.4ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది.టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి యాక్సెస్ 125, హోండా గ్రాజియా 125 అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 బైక్‌లకు పోటిగా నిలవనుంది. -
ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లతో ప్రమాదమా?
కాలిఫోర్నియా: ఇప్పటికే ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఫోన్లు అక్టోబర్ ఏడవ తేదీన భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. సంప్రదాయబద్ధమైన ఇయర్ ఫోన్లకు బదులుగా ‘ఎయిర్‌పాడ్స్’గా పిలిచే వైర్లెస్ ఇయర్ ఫోన్లను ఇందులో ప్రవేశపెట్టడం విప్లవాత్మకమార్పుగా ఐఫోన్ కంపెనీ అభివర్ణిస్తోంది. ఇది వైర్లెస్ యుగానికి నాంది పలికేందుకు తొలి ముందడుగుగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా వ్యాఖ్యానించారు. ఈ సిరీస్ ఐఫోన్లలో ఉపయోగిస్తున్న వైర్లెస్ ఎయిర్‌పాడ్స్ పూర్తిగా బ్లూటూత్ టెక్నాలజీపైనే పనిచేస్తాయి. ఎయిర్‌పాడ్స్‌లో బ్లూటూత్ కారణంగా విడుదలయ్యే రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. చెవికి సమీపంలో ఉండే మెదడు రక్తప్రసరణకు ఈ రేడియేషన్ అవరోధం కలిగిస్తుందని, దీనివల్ల మెదడుపై దుష్ప్రభావం ఉంటుందని ‘యుసి బెర్క్లీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ ప్రొఫెసర్ డాక్టర్ జోయెల్ మోస్కోవిట్జ్ హెచ్చరించారు. అయితే ఎయిర్‌పాడ్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ (పౌనపుణ్యం) ఎంతుంటుందో ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. కానీ ఎఫ్‌సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే రేడియేషన్ ఉంటుందని వీటిని తయారు చేసిన ఆపిల్ కంపెనీ ఇంజనీర్లు తెలియజేస్తున్నారు. మానవ ఆరోగ్యానికి హానికలిగించే రేడియేషన్, అయస్కాంత తరంగాలను నిరోధించేందుకు అనుగుణంగా ఎఫ్‌సీసీ మార్గదర్శకాలు లేవని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలు తేల్చారని డాక్టర్ జోయెల్ హెచ్చరించారు. ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను వాడడం అంటే ఓ మైక్రోవేవ్‌ను చెవులో పెట్టుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మైక్రోవేవ్ నుంచి వెలువడే రేడియేషన్ కన్నా తమ ఎయిర్‌పాడ్స్ నుంచి తక్కువ స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుందని ఆపిల్ ఇంజనీర్లు సమర్థిస్తున్నారు. బ్లూటూత్ స్పీకర్లను దూరంగా ఉండి విన్నా కొంత రేడియేషన్ ప్రభావానికి మనం గురవుతామని, అలాంటప్పుడు నేరుగా, అందులో మెదడుకు దగ్గరగా విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ ముప్పు ఉంటుందని ఆయన అన్నారు. కార్డుతో పనిచేసే ఇయర్ ఫోన్లే అన్నింటికన్నా ఉత్తమమన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. -
ఇలా డ్రైవింగ్ చేసినా ప్రమాదమే!
లండన్: డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడడం ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. అయితే చాలామంది బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వంటివి పెట్టుకొని మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇది మరింత ప్రమాదకరమంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని ఏదో ఊరికే చెప్పేయకుండా రెండు రకాల వీడియో ఆధారిత పరిశోధనల ద్వారా రుజువు చేశాడు లండన్‌కు చెందిన గ్రాహం హోల్. హ్యాండ్ ఫ్రీ పరికరాలు ఉపయోగించి ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు అయోమయ స్థితిలోకి వెళ్లిపోవడం, ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి మొదటి పరిశోధన ద్వారా నిరూపించగా..., ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారి మెదడుపై తీవ్ర ఒత్తిడి పెరిగి, అప్పుడు కాకపోయినా ఆ తదుపరి ప్రమాదాలబారిన పడడం రెండో పరిశోధన ద్వారా రుజువు చేశాడు. -
ఐ ఫోన్ 7లో కొత్త లీక్..!
ఆపిల్ మొబైల్ అంటేనే ఒక క్రేజ్..! మరి ఆ క్రేజీ థింగ్ లో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే.. ప్రస్తుతం వస్తున్న లీక్ లు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇచ్చిన ఇంటర్వూలో రాబోయే రోజుల్లో ఐఫోన్ 7 లేకుండా ఉండలేరు అని చెప్పకనే చెప్పారు. మరి అది నిజమయ్యేలానే ఉంది. ఈ లీకులను చూస్తోంటే.. ఆపిల్ హెడ్ ఫోన్స్ ను మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కనిపించిన చిత్రాల్లో హెడ్ ఫోన్స్ పెట్టే 3.5 ఎమ్ఎమ్ జాక్ ను లేకుండా ఫోన్ కనిపించింది. దీనికి బదుల ప్రత్యేకంగా ఫోన్ కోసం తయారుచేసిన బీట్స్ బ్లూటూత్ హెడ్ సెట్ ను విక్రయించే విషయం ఆలోచిస్తోందని మరో లీక్..! కెమెరాలో కూడా మార్పులకు సిద్ధమవుతున్నట్లు మరో లీక్ లో వెల్లడైంది. రెండు ఐసైట్ కెమెరాలను ఫోన్ లో వాడనున్నట్లు తెలిసింది. ఏదేమైనా కొత్త డిజైనింగ్ తో కనిపిస్తున్న ఐఫోన్ 7 వినియోగదారులకు కొత్త అనుభవాన్ని మిగులుస్తుందని ఆశిద్దాం. -
స్పీకర్ బటన్ నొక్కి దొరికి పోయాడు
ముంబై: బ్లూటూత్‌తో పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడో ప్రబుద్ధుడు. ఇంతకీ అతను అసలు అభ్యర్థి కాడని, డమ్మీ అని తేలింది. ఔరంగాబాద్ రీజియన్ యావత్మల్ జిల్లా పుసద్‌లోని శ్రీరామ్ అసెగావ్కర్ విద్యాలయంలో.. గ్రామ అకౌంటెంట్ ఉద్యోగం కోసం పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, ధరంసింగ్ మొబైల్ ఫోన్‌తో ప్రశ్నపత్రం ఫొటో తీసి బ్లూటూత్ ద్వారా హాలు బయట ఉన్న తన మిత్రుడికి పంపించాడు. ధరంసింగ్ కదలికలపై అనుమానం రావడంతో ఇన్విజిలేటర్ పి.ఎన్.రాథోడ్ కొద్దిసేపు గమనించాడు. దీంతో గాభరా పడ్డ సింగ్ కంగారులో బ్లూటూత్ బటన్‌కు బదులుగా స్పీకర్ బటన్ నొక్కడంతో పెద్ద శబ్దంతో మాటలు వినిపించసాగాయి. దీంతో సోదా చేయగా అతని జేబులో మొబైల్‌ఫోన్, ఇయర్ ఫోన్లు దొరికాయి. -
సులువైన ఫైల్ ట్రాన్స్ఫర్లకు...
భలే ఆప్స్ ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్‌కు ఫైళ్లు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు బ్లూటూత్ మొదలుకొని అనేక రకాల అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రతిదాంట్లోనూ సైజుపై ఎంతో కొంత పరిమితి ఉంటుంది. ఇన్ఫినెట్తో ఈ సమస్య లేదు. ఫోన్లతోపాటు అవసరమైతే మీ కంప్యూటర్‌కు కూడా ఫైళ్లు ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యం ఉంది దీంట్లో. మీరు డౌన్లోడ్ చేసుకున్న మూవీని మిత్రులందరికీ పంచాలంటే... లేదా ఫొటోలు, డాక్యుమెంట్లనైనా ఈ అప్లికేషన్ సాయంతో అతివేగంగా (డ్రాప్‌బాక్స్, వాట్సప్‌ల కంటే 30 రెట్లు ఎక్కువ) ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. రెండు జీబీల సైజున్న మూవీలను కూడా 10 నిమిషాల్లోపు ట్రాన్స్ఫర్ చేయవచ్చునని, బీబీసీ మొదలుకొని, ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి కూడా తమ అప్లికేషన్నే వాడుతున్నాయని కంపెనీ చెబుతోంది. -
హైటెక్ పద్దతిలో ఆర్ఆర్బి పేపర్ లీక్
-
హైటెక్ పద్దతిలో ఆర్ఆర్బి పేపర్ లీక్:34 మంది అరెస్ట్
హైదరాబాద్: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షను హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే క్వార్టర్స్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్న ముఠాని పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని 24 మందితోపాటు పరీక్ష రాసే 10 మంది అభ్యర్థులను అరెస్ట్ చేశారు. ఈ పరీక్షకు చైతన్యపురి, దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్, సరూర్ నగర్‌లోని చైతన్య జూనియర్ కాలేజీ, తిరుమలగిరిలోని గౌతమి మోడల్ స్కూల్ కేంద్రాలుగా ఉన్నాయి. ఓ రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో ఈ మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష రాసే అభ్యర్థులు మెడలో తాయిత్తు రూపంలో డివైజ్, చెవిలో బ్లూటూత్‌తో మాస్ కాపీయింగ్ చేశారు. మాస్ కాపీయింగ్ చేస్తున్న పది మంది అభ్యర్థులను చైతన్యపురి, తిరుమలగిరిలలో ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 34 మందిని అరెస్ట్ చేశారు. ** -
సరిగా కూర్చోబెడుతుంది..!
చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు, ఇంట్లో అయితే అమ్మానాన్నలు సరిగా కూర్చోవడం గురించి చెబుతారు. ‘సిట్ రైట్’ అంటూ గద్దిస్తూనే పద్ధతిగా కూర్చోవడాన్ని నేర్పిస్తారు. అయితే వయసొచ్చాక, బాధ్యతల్లో పడిపోయాక... ఆఫీసుల్లోనూ, ఇంట్లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు మన శరీరాన్ని మనమే నిర్లక్ష్యం చేస్తాం. ఇష్టం వచ్చిన యాంగిల్స్‌లో కూర్చొంటూ దాన్ని కష్టపెడతాం. అయితే సరిగా కూర్చోవడంలో ఎంతో సౌలభ్యం ఉంటుంది. పద్ధతిగా కూర్చోకపోవడం వల్ల ఎన్నో నష్టాలుంటాయి. మరి ఇలాంటి సమయంలో మనల్ని సరిగా కూర్చోవడానికి తగిన విధంగా తీర్చిదిద్దేవాళ్లెవరైనా ఉంటే బావుటుందనిపిస్తుంది. ఇలాంటి అవసరాన్ని తీర్చడానికే వచ్చింది ‘లుమోబ్యాక్’ అనే గాడ్జెట్. దీన్ని ధరిస్తే చాలు... పద్ధతిగా, ఒద్దికగా కూర్చోవడం అనే విద్యను ప్రాక్టీస్ చేస్తున్నట్టే. శరీరానికి అనవసరమైన శ్రమను నిరోధిస్తున్నట్టే. ఈ గాడ్జెట్ బ్లూటూత్ ద్వారా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అయ్యి పనిచేస్తుంది. బెల్ట్‌లా ఉండే దీన్ని నడుముకు కట్టుకొంటే చాలు ఇది ఎప్పటికప్పుడు కూర్చొన్న యాంగిల్ సరైనదో కాదో తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌కు సిగ్నల్స్ పంపుతూ వైబ్రేషన్స్ ద్వారా సరిగా కూర్చోమని సలహాలు ఇస్తుంటుంది. సరిచేసుకొనేంత వరకూ వదలదు. ఆఫీసు లో పనిచేస్తున్నప్పుడైనా, మరే పనిచేస్తున్ననప్పుడైనా ఇది తన పని తాను చేసుకుపోతుంటుంది. శరీరానికి ఇబ్బంది కలిగించని కోణంలో కూర్చోమని సూచిస్తుంటుంది. ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ సరైన పద్ధతిలో కూర్చోవడం నేర్పించే ఈ గాడ్జెట్ నేటి జీవనశైలికి ఉపయోగపడేదని చెప్పవచ్చు. గాడ్జెట్‌తో పాటు ఏదో ఒక ఐఓఎస్ డివైజ్ చేతిలో ఉన్నప్పుడే దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. -
విగ్ పెట్టి... కాపీ కొట్టి!
సూరి(పశ్చిమబెంగాల్): బీఏ చదువుతున్న ఓ విద్యార్థి పరీక్షల్లో కాపీ కొట్టేందుకు వెరైటీగా ఆలోచనను అమలు చేశాడు. పరీక్ష రోజు తలపై విగ్, చెవులకు బ్లూటూత్ పరికరం పెట్టుకుని అది కనిపించకుండా విగ్‌తో కవర్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా పరీక్షా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. బ్లూటూత్ హెడ్సెట్ సాయంతో మొబైల్ ఫోన్ ద్వారా వేరొకరితో మాట్లాడుతూ చకచక రాసేస్తున్నాడు. ఆ సమయంలో విద్యార్థి కొన్నిసార్లు పైకి పెద్దగా మాట్లాడడంతో ప్రిన్సిపాల్ మోండాల్‌కు అనుమానం వచ్చింది. వచ్చి ఆరా తీస్తే విగ్, బ్లూటూత్ హెడ్సెట్, కాపీ అన్నీ బయటపడ్డాయి. పశ్చిమబెంగాల్లోని బీర్భమ్ జిల్లా సూరిలోని విద్యాసాగర్ కాలేజీలో ఇది జరిగింది. విద్యార్థి రఫీఖుల్ ఇస్లామ్‌ను పరీక్షల నుంచి బహిష్కరించారు. -
భలే యాప్స్
స్మార్ట్‌ఫోన్ మరింత స్మార్ట్‌గా! ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ పాలిట గూగుల్ ప్లే ఒక కల్పతరువు. అది నిత్యజీవితంలో ఉపయోగపడే ఎన్నో అప్లికేషన్లను అందిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకూ ఆ కల్పతరువు అందించిన మిలియన్ల సంఖ్యలోని గేమ్, సర్వీస్ అప్లికేషన్లను వాడుకొంటున్నారు యూజర్లు. ఇలాంటి నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. అప్లికేషన్లు క్రాష్ కావడం, స్టార్టప్ విషయంలో నెమ్మదితనం, డాటా ట్రాన్స్ఫర్, అప్లోడింగ్, డౌన్లోడింగ్ విషయంలో ఫోన్ మందగమనంలో సాగడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అసౌకర్యాన్ని నిరోధించడానికి కూడా కొన్ని అప్లికేషన్లున్నాయి. సదుపాయవంతంగా ఉన్న సరికొత్త అప్లికేషన్లివి... బ్లూటూత్‌కు 40 రెట్ల వేగం ‘షేర్ఇట్’ సాధారణంగా దగ్గరలోనే ఉన్న డివైజ్‌లలోకి డాటాను ట్రాన్స్ఫర్ చేయడానికి బ్లూటూత్‌ను ఉపయోగిస్తాం. అలాంటి బ్లూటూత్ వేగానికి 40 రెట్లు ఎక్కువ స్పీడ్‌తో డాటా ట్రాన్స్ఫర్ చేయడానికి అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి తెలుసా? వాటిలో ముఖ్యమైనది షేర్ఇట్. ఈ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసిన రెండు డివైజ్‌ల మధ్య వంద ఎమ్బీ డాటాను కేవలం 24 సెకెన్ల లోనే ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఒకే సమయంలో ఐదు డివైజ్‌లకు డాటాను ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిక్చర్లు, వీడియోలు, మ్యూజిక్ఫైల్స్, డాక్యుమెంట్స్, కాంటాక్ట్స్ అప్లికేషన్లను కూడా ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెట్వర్క్, డివైజ్‌ల వేగంతో పని లేకుండా డాటాను మార్చుకోవడానికి ఇంతకన్నా ఉత్తమమైన అప్లికేషన్ మరోటి లేదు. ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన రెండు డివైజ్‌లను ఆటోమెటిక్‌గా బ్లూటూత్లాగే గుర్తిస్తాయి. డాటా సింకింగ్‌కు ఒక వరం... సింక్ఇట్ మొబైల్‌ను మార్చినప్పుడు లేదా ఉన్నట్టుండి మొబైల్ పోయినప్పుడు... లాస్ అయ్యే డాటాతో ఉన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమస్యలను నిరోధించడానికి ఉత్తమమైన మార్గం సింక్ఇట్. ఈ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకొంటే... ఫోన్లోని డాటా ఎప్పటికప్పుడు అందులో సింక్ అవుతూ క్లౌడ్‌లో సేవ్ అవుతూ ఉంటుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌లోని డాటాకు సెక్యూరిటీ ఉంటుంది. మరో మొబైల్ డివైజ్ నుంచి సింక్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా స్మార్ట్‌ఫోన్‌లో డాటా లాస్‌తో ఇబ్బంది పడిన వారికే ఈ అప్లికేషన్ గొప్పతనం తెలుస్తోంది. కాబట్టి ఈ అప్లికేషన్‌తో వరప్రదమైనదని చెప్పడానికి వెనుకాడనక్కర్లేదు! స్మార్ట్‌ఫోన్‌కు సురక్ష... సెక్యూర్ఇట్ వైరస్ల విషయంలో మాల్వేర్ విషయంలో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎంత భద్రంగా ఉందని అనుకొంటున్నారు? మీ డివైజ్‌కు వైరస్ల బెడద లేదని మీకు ఎంత విశ్వాసం ఉంది? ఒకవేళ ఈ సెక్యూర్ఇట్ అప్లికేషన్‌ను గనుక ఇన్స్టాల్ చేసుకొంటే ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉండవచ్చు. కేవలం యాంటీ వైరస్లాగా మాత్రమే కాదు, ఈ అప్లికేషన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వైరస్‌ను మాత్రమేగాక మొబైల్‌కు వచ్చే స్పామ్ మెయిల్స్‌ను, కాల్స్‌ను ప్రివెంట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్అయిన అప్లికేషన్ల పనితీరును కూడా సమీక్షిస్తూ ఉంటుంది. అన్యూజ్డ్ అప్లికేషన్ల గురించి మీకు వివరిస్తుంది. అప్లికేషన్లు క్రాష్ కాకుండా నిరోధిస్తుంటుంది. ఓవరాల్‌గా స్మార్ట్‌ఫోన్ పనితీరును మరింత స్మార్ట్‌గా, స్మూత్‌గా మారుస్తుంది ఈ అప్లికేషన్. -
రిస్ట్ వాచ్...బ్లూటూత్ ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల సందర్భంగా చేతి గడియారానికి అమర్చిన బ్లూటూత్ ద్వారా ఫోన్లో సమాధానాలు కాపీ కొడుతూ విశాఖలో ఓ విద్యార్థి చిక్కాడు. గురువారం ద్వితీయ ఏడాది ద్వితీయ భాష పేపరు పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి రిస్ట్ వాచ్‌లోని బ్లూటూత్ సహాయంతో ఫోన్లో సమాధానాలు వింటూ దొరికిపోయినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. విశాఖపట్నం బుచ్చిరాజుపాలెంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఈ విద్యార్థి పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చిక్కిన విద్యార్థి పేరు తపస్య అని తెలిసింది. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని అధికారులను రామశంకర్ నాయక్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాలున్న చోట జిరాక్స్ యంత్రాలను ఇన్స్పెక్షన్ అధికారులు కచ్చితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. గురువారం పరీక్షకు 46,943 మంది (5. 24 శాతం)గైర్హాజరు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేశామన్నారు. -
నీరు తాగాలని గుర్తుచేస్తుంది!
వాషింగ్టన్: రోజుకు మీరు ఎంత నీరు తాగాలో చెప్పే సరికొత్త ‘స్మార్ట్’ వాటర్ బాటల్ ఇది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ తయారుచేసింది. ‘బ్లూఫిట్’ అనే ఈ సీసా మీ ఎత్తు, బరువు, వయస్సు, గాలిలో తేమ, ఉష్ణోగ్రత ఆధారంగా రోజుకు ఎంత నీరు తాగాలో చెబుతుంది. నిర్ణీత సమయంలో నీరు తాగాలంటూ సంకేతాలు పంపుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ వంటి స్మార్టఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని వివరాలు పొందుపరిస్తే సరి.. బ్లూటూత్ సాయంతో సీసా సమాచారం పంపుతుంది. అవసరాలను బట్టి ఎంత నీరు, ఎప్పుడెప్పుడు తాగాలో నిర్ణయించుకుని దీనిలో సెట్ చేసుకునే అవకాశముంది.