బయట రణగొణ ధ్వనుల మధ్య ఉన్నప్పుడు ఫోన్‌లో మాట్లాడాల్సి వస్తే, బిగ్గరగా మాట్లాడాల్సి వస్తుంది. ఆఫీసులో అందరూ నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్నప్పుడు ఫోన్ వస్తే, మన మాటల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు. అంతేకాదు, ఒక్కోసారి గోప్యమైన మాటలు మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఏర్పడవచ్చు. అందరిలో ఉన్నప్పుడు మాట్లాడటం కష్టం. ఇకపై అలాంటి ఇబ్బందేమీ ఉండదు.
ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్లూటూత్ మౌత్‌పీస్‌ను మూతికి మాస్కులా తొడుక్కుని ఇంచక్కా మాట్లాడుకోవచ్చు. దీనిని మూతికి తొడుక్కుంటే, మీరేం మాట్లాడుతున్నారో మీ పక్కన కూర్చున్నవారికి కూడా వినిపించదు. స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ ఆన్ చేసుకుని, ఈ స్పీకర్ మూతికి పెట్టుకుని ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు.
(ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!)
జపాన్‌కు చెందిన ‘షిఫ్టాల్’ కంపెనీ ఈ బ్లూటూత్ మౌత్‌పీస్‌ను ‘మ్యూటాక్’ పేరిట రూపొందించింది. దీనిని ఈ ఏడాది చివరిలోగా మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ధర 200 డాలర్ల (రూ.16,537) వరకు ఉండవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment