New Product
-
బ్లూటూత్ మౌత్‌పీస్ - నిశ్శబ్దంగా మాట్లాడుకోవచ్చు!
బయట రణగొణ ధ్వనుల మధ్య ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడాల్సి వస్తే, బిగ్గరగా మాట్లాడాల్సి వస్తుంది. ఆఫీసులో అందరూ నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్నప్పుడు ఫోన్ వస్తే, మన మాటల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు. అంతేకాదు, ఒక్కోసారి గోప్యమైన మాటలు మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఏర్పడవచ్చు. అందరిలో ఉన్నప్పుడు మాట్లాడటం కష్టం. ఇకపై అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్లూటూత్ మౌత్‌పీస్‌ను మూతికి మాస్కులా తొడుక్కుని ఇంచక్కా మాట్లాడుకోవచ్చు. దీనిని మూతికి తొడుక్కుంటే, మీరేం మాట్లాడుతున్నారో మీ పక్కన కూర్చున్నవారికి కూడా వినిపించదు. స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ ఆన్ చేసుకుని, ఈ స్పీకర్ మూతికి పెట్టుకుని ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. (ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!) జపాన్‌కు చెందిన ‘షిఫ్టాల్’ కంపెనీ ఈ బ్లూటూత్ మౌత్‌పీస్‌ను ‘మ్యూటాక్’ పేరిట రూపొందించింది. దీనిని ఈ ఏడాది చివరిలోగా మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ధర 200 డాలర్ల (రూ.16,537) వరకు ఉండవచ్చని అంచనా. -
మోటరోలా ఎన్విజన్ఎక్స్ 4కే టీవీ
బెంగళూరు: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ మోటరోలా ‘ఎన్విజన్ ఎక్స్’ పేరుతో 4కే క్యూఎల్ఈడీ గూగుల్ టీవీని విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని ఆవిష్కరించింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, మెరుగైన ఆడియో, వీడియో, గేమింగ్ సామర్థ్యాలతో అందుబాటు ధరలకే దీన్ని తీసుకొచ్చినట్టు మోటరోలా తెలిపింది. ఎన్విజన్ ఎక్స్ కింద 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్ సైజులతో రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 55 అంగుళాల ధర రూ. 30,999 కాగా, 65 అంగుళాల ధర రూ. 39,999. ఆరంభ ఆఫర్ కింద 55 అంగుళాల టీవీపై రూ.5,000, 65 అంగుళాల టీవీపై రూ. 10,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు మోటరోలా ప్రకటించింది. క్యూఎల్ఈడీ డిస్ప్లే క్వాంటమ్ గ్లో టెక్నాలజీతో ఉంటుందని, రంగులను అద్భుతంగా చూపిస్తుందని, దృశ్యాలు సహజంగా అనిపిస్తాయని తెలిపింది. 3డీ సరౌండ్ సౌండ్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో వస్తుందని పేర్కొంది. -
సమయం ఆదా చేసే 'అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్' - ధర ఎంతంటే?
ఈ ఫొటోలో కనిపిస్తున్నది త్రీడీ ప్రింటర్. హాంకాంగ్‌కు చెందిన త్రీడీ ప్రింటర్ల తయారీ సంస్థ ‘ఎనీ క్యూబిక్’ దీనిని తాజాగా రపొందించింది. ఈ అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్ మోడల్ పేరు ‘ఎనీక్యూబిక్ కోబ్రా2’. ఇది మిగిలిన త్రీడీ ప్రింటర్లతో పోల్చుకుంటే 70 శాతం వేగంగా కోరుకున్న వస్తువులను ముద్రించగలదు. దీనిని పది నిమిషాల్లోనే అసెంబుల్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న 4.5 అంగుళాల టచ్ స్క్రీన్ ద్వారా ప్రింట్ చేయాలనుకున్న వస్తువుల తీరుతెన్నులను సవరించుకోవచ్చు. ఇది లెవిక్యూ-2.0 ఆటో లెవెలింగ్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ఈ ప్రింటర్ సెకనుకు 250 మిల్లీమీటర్ల వేగంతో వస్తువులను ముద్రిస్తుంది. ప్రాజెక్టులు, వర్క్‌షాపుల కోసం అనువుగా ఉండేలా దీనిని రపొందించారు. స్వల్పవ్యవధిలోనే ప్లాన్లు, డిజైన్లు చేయాలనుకునే ఇంజినీర్లకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీని ధర 499 డాలర్లు (ర. 41,098) మాత్రమే! -
పత్తి పంట కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ ప్రత్యేక బ్రాండ్
ముంబై: పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ (జీఏవీఎల్) తాజాగా పత్తికి సంబంధించి ’పయ్నా’ పేరిట ప్రత్యేక బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. హిట్వీడ్, హిట్వీడ్ మాక్స్, మాక్స్కాట్ అనే మూడు కలుపు నిర్వహణ ఉత్పత్తులను ఈ బ్రాండ్ కింద విక్రయించనున్నట్లు సంస్థ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ విభాగం సీఈవో రాజవేలు ఎన్కే తెలిపారు. ఇవి కలుపు మొక్కల సమస్యను తగ్గించి, ప్రారంభ దశల్లో పత్తి పంట ఏపుగా ఎదిగేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. తద్వారా అధిక దిగుబడులను పొందేందుకు తోడ్పడగలవని వివరించారు. -
అదనపు రాబడికి బంగారం లాంటి పథకం..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా గోల్డ్ పేరిట వినూత్న, దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ఆవిష్కరించింది. ఇటు వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు అదనపు రాబడి అందుకోవాలనుకునే వారికి అనువైనదిగా ఇది ఉంటుందని సంస్థ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా తెలిపారు. ఇది జీవిత బీమా కవరేజీతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. (కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు) ఐసీఐసీఐ ప్రు గోల్డ్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇమీడియట్ ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ విత్ బూస్టర్, అలాగే డిఫర్డ్ ఇన్కమ్ వీటిలో ఉన్నాయి. మొదటి దానిలో పాలసీ జారీ చేసిన 30 రోజుల తర్వాత నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక రెండో వేరియంట్లో ప్రతి ఐదో ఏటా అదనంగా గ్యారంటీడ్ ఆదాయాన్ని కూడా అందుకోవచ్చు. మూడోదైన డిఫర్డ్ ఇన్కమ్ వేరియంట్లో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వినియోగదారులు ఆదాయాన్ని ఎప్పటి నుంచి పొందాలనుకుంటున్నది తామే నిర్ణయించుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్న రెండో ఏడాది నుంచే లేదా 13 ఏళ్ల తర్వాత నుంచైనా ఆదాయాన్ని అందుకోవడం ప్రారంభించవచ్చు. చెల్లింపులను సాధారణంగా తీసుకోవడానికి బదులుగా సేవింగ్స్ వాలెట్లో జమ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని కావాలంటే పూర్తిగా లేదా పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం ఆఫ్సెట్ సదుపాయంతో తమ భావి ప్రీమియంలను కూడా ఈ మొత్తం నుంచి చెల్లించవచ్చు. (Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?) -
కొత్త ప్రొడక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించిన రాథ టీఎంటీ
-
కోరమాండల్ గ్రోశక్తి ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా గ్రోశక్తి ప్లస్ అనే ఉత్పాదనను బుధవారం ప్రవేశపెట్టింది. జింక్‌తోపాటు నత్రజని, భాస్వరం, పొటాషియంతో ఈ ఎరువు తయారైంది. సంక్లిష్ట ఎరువుల్లో అత్యధిక పోషకాలు, ఎన్పీకే ఎరువుల్లో అధిక భాస్వరం గ్రోశక్తి ప్లస్ కలిగి ఉందని కంపెనీ తెలిపింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల వంటి పంటలకు ఇది అనుకూలం అని వివరించింది. ఎన్‌ఫోస్ టెక్నాలజీతో రూపొందిన ఈ ఉత్పాదన ద్వారా పంటలకు సమతుల పోషకాలు అందుతాయని కోరమాండల్ మాతృ సంస్థ మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. -
నూతన ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు
మేధో సంపత్తి హక్కుల సాధన సదస్సులో కలెక్టర్ కాంతిలాల్ దండే పాతగుంటూరు: నూతన ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ పరిశ్రమలు సాధించి అభివృద్ధి దిశగా వ్యాపార వర్గాలు కృషిచేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నగరంపాలెంలోని కేఅండ్ఎం హోటల్లో శనివారం మేధో సంపత్తి హక్కుల సాధనపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు సదస్సుకు అధ్యక్షత వహించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ నూతన ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు ప్రోత్సహించాలని సూచించారు. ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎ.సుధాకర్ మాట్లాడుతూ నూతన పరిశ్రమలను ఏర్పాటు చేసే వారు ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని చలానా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టుకోవచ్చని చెప్పారు. 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ఆన్లైన్లో దరఖాస్తు చేసినపుడు కారణాలు తెలుపకుండా రిజెక్ట్ అని మెసేజ్ సెల్ఫోన్లో వస్తుంది. అందుకు గల కారణాలను ఫోన్లోనే పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ముందుగా çకృష్ణా పుష్కరాలను విజయవంతం చేశారని కలెక్టర్ కాంతిలాల్ దండేను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్ఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ ఎల్ ఎన్ కుమార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్ పి.ప్రసాదరావు. వెంకటేశన్ రాజమణి పాల్గొన్నారు. -
మూడేళ్లకే బైక్ మార్చేస్తున్నారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వ్యూహం అంటూ లేకుండా వాహన రంగంలో నిలదొక్కుకోలేం. బజాజ్ ఆటో భారతీయ కంపెనీయే. కానీ మేం ఇక్కడితో పరిమితం కాలేదు. 30కి పైగా దేశాలకు వాహనాలను సరఫరా చేస్తున్నాం. మా దృష్టి భారత్‌తోసహా అన్ని మార్కెట్లపైనా ఉంటుంది. ఒక దేశం కోసం అంటూ వాహనాలను తయారు చేయం’ అని అంటున్నారు బజాజ్ ఆటో కంపెనీ, మోటార్ సైకిల్ విభాగపు ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్. సరికొత్త డిస్కవర్ 125 బైక్‌ను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కస్టమర్ల అభిరుచులు, కంపెనీ భవిష్యత్ కార్యాచరణ, మార్కెట్ తీరుతెన్నులు ఆయన మాటల్లోనే.. మూడేళ్లయితే చాలు.. దక్షిణాదివారైనా, ఉత్తరాదివారైనా మోటార్ సైకిళ్ల విషయంలో భారతీయ కస్టమర్ల అభిరుచులు దాదాపు ఒకేలా ఉన్నాయి. స్టైల్, మంచి పవర్ ఉన్న బైక్‌లపై మక్కువ పెరుగుతోంది. గతంలో ఒకసారి బైక్ కొంటే ఏడెనిమిదేళ్లు వాడేవారు. ఐదేళ్ల క్రితం వరకు ఈ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మూడు నాలుగేళ్లకే వాహనం మారుస్తున్నారు. రెండేళ్లుగా సెంటిమెంట్ బాగోలేదు. ఉద్యోగం ఉంటుందో లేదో అన్న ఆందోళనలో ఉంటే కొత్త బైక్ కొనలేరుగా. అందుకే ద్విచక్ర వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉంది. వచ్చే ఏడాది వృద్ధి ఖాయం. ఎక్సైజ్ డ్యూటీని 12 నుంచి 8 శాతానికి కుదించడం మంచి పరిణామం. కొత్త ప్రభుత్వం ఈ తగ్గింపు సుంకాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. మా వాహనాల ధరను రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు తగ్గించాం. స్కూటర్ తెచ్చే ఆలోచనే లేదు.. ప్రపంచంలో అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో 80 శాతం మోటార్ సైకిళ్లే. ప్రపంచ వ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విభాగంలో బ జాజ్‌కు 10 శాతం వాటా ఉంది. అందుకే మోటార్ సైకిల్ కంపెనీగా మాత్రమే మేం కొనసాగుతాం. స్కూటర్ తయారు చేసే ఆలోచన ఏ మాత్రం లేదు. ఏటా 48 లక్షల బైక్‌లను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. ప్లాంట్ల యుటిలైజేషన్ 85 శాతం. ఇందులో ఎగుమతుల వాటా 33 శాతం. దేశంలో మోటార్ సైకిళ్లలో 22 శాతం వాటా బజాజ్‌కు ఉంది. కొత్త డిస్కవర్ 125 రాకతో ఇది 30 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఆ మూడింటిపైనే.. క్రూయిజర్ బైక్ అయిన అవెంజర్ 220 హోట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. ప్రస్తుతానికి అవెంజర్ బ్రాండ్‌లో ఈ ఒక్క మోడల్‌నే కొనసాగిస్తాం. కొత్త వేరియంట్లు ఏవైనా పల్సర్, ప్లాటినా, డిస్కవర్.. ఈ మూడు బ్రాండ్లలో మాత్రమే విడుదల చేస్తాం. ఏపీలో ఎక్కువ కాబట్టే.. దేశంలో నెలకు 1.6 లక్షల బైక్‌లు 125 సీసీ సామర్థ్యం గలవి అమ్ముడవుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 17 శాతముంది. ఈ కారణంగానే భారత్‌లో తొలిసారిగా కొత్త డిస్కవర్ 125ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించాం. 100 సీసీ బైక్‌లు కేవలం మైలేజీకే పరిమితం. 7.5-8 హార్స్‌పవర్‌ను ఇవి మించడం లేదు. మైలేజీ మినహా మరే ఇతర ప్రయోజనం లేదు. 20 ఏళ్లుగా ఈ విభాగంలో పెద్దగా సాంకేతిక అభివృద్ధి జరగలేదు. అధిక సామర్థ్యం గల బైక్ కొనాలని ఉన్నా ఖర్చు ఎక్కువని, మైలేజీ రాదని కస్టమర్లు మిన్నకుండి పోతారు. వీరికోసమే స్టైల్, పవర్, మైలేజీ కలిగిన కొత్త డిస్కవర్ 125ను పరిచయం చేశాం. 11.5 పీఎస్ పవర్, మైలేజీ 76 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలోమీటర్లు. డ్రమ్ బ్రేక్ మోడల్ ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో రూ.49,075. డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంది. ఆరు రకాల ఆకర్షణీయ రంగుల్లో ఇది లభిస్తుంది. -
15 హీరో టూవీలర్ల ఆవిష్కరణ
గుర్గావ్: టూ-వీలర్ దిగ్గజం హీరోమోటోకార్ప్ 15 కొత్త వాహనాలను గురువారం ఆవిష్కరించింది. వీటన్నింటినీ వచ్చే ఏడాది మార్చి కల్లా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. కంపెనీ ఆవిష్కరించిన కొత్త వాహనాల్లో కరిజ్మా ఆర్, జెడ్‌ఎంఆర్, స్ప్లెండర్ ఐ-స్మార్ట్‌లతో పాటు ప్లెజర్ స్కూటర్ మోడల్లో కొత్త వేరియంట్ కూడా ఉంది. ఈ 15 కొత్త ఉత్పత్తుల్లో అధిక భాగం ప్రస్తుత పండుగల సీజన్లోనే మార్కెట్లోకి తేనుంది. మరో 35 వాహనాలు: హోండాతో భాగస్వామ్యం నుంచి వీడి సొంతంగా ప్రస్థానం ప్రారంభించి రెండేళ్లే అయిందని ముంజాల్ చెప్పారు. మూడేళ్లలో 50 కొత్త ఉత్పత్తులను అందిస్తామని 2011లోనే ప్రకటించామని, ఇప్పుడు 15 కొత్త వాహనాలనందిస్తున్నామని చెప్పారు., మరో 35ను రానున్న సంవత్సరాల్లో తీసుకొస్తామ న్నారు. డాన్ కన్నా చౌక బైక్ ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో తక్కువ ఖరీదున్న బైక్ హెచ్ఎఫ్ డాన్(ధర రూ.37,000)అని, దీనికంటే తక్కువ ధరకు లభ్యమయ్యేలా కొత్త బైక్‌ను అందించనున్నామని పవన్ ముంజాల్ వివరించారు. ఇక హోండాతో విడివడిన తర్వాత తాము సొంతంగా రూపొందించిన తొలి బైక్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తామని తెలిపారు.