ముంబై: పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ (జీఏవీఎల్) తాజాగా పత్తికి సంబంధించి ’పయ్‌నా’ పేరిట ప్రత్యేక బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. హిట్‌వీడ్, హిట్‌వీడ్ మాక్స్, మాక్స్‌కాట్ అనే మూడు కలుపు నిర్వహణ ఉత్పత్తులను ఈ బ్రాండ్ కింద విక్రయించనున్నట్లు సంస్థ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ విభాగం సీఈవో రాజవేలు ఎన్‌కే తెలిపారు.
ఇవి కలుపు మొక్కల సమస్యను తగ్గించి, ప్రారంభ దశల్లో పత్తి పంట ఏపుగా ఎదిగేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. తద్వారా అధిక దిగుబడులను పొందేందుకు తోడ్పడగలవని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment