Sustainable Development
-
సుస్థిర ప్రభుత్వం వల్లే దేశ ప్రగతి, ప్రపంచ కితాబు: మోదీ
మెహసానా: దేశమంతటా ప్రస్తుతం కనిపిస్తున్న శరవేగమైన ప్రగతి, ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న ప్రశంసలకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటమే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సోమవారం గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఖెరాలు వద్ద రూ.5,950 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఓపెన్ టాప్‌కార్‌లో రోడ్ షో చేశారు. తర్వాత మాట్లాడారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఎన్నెన్ని అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవచ్చో, ఎంతటి ప్రగతి సాధించవచ్చో చెప్పేందుకు గుజరాతే ఉదాహరణ అన్నారు. ‘‘మీ నరేంద్ర బాయ్ ఎలాంటివారో మీకు బాగా తెలుసు. మీరు నన్ను ప్రధానిగా కాకుండా మీ సొంత నరేంద్ర బాయ్‌గా చూస్తారు. నేనేదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చి తీరతానని కూడా మీకు తెలుసు’’ అన్నారు. -
Seshanka Binesh: పేదపిల్లల గుండెచప్పుడు
శశాంక బినేశ్... మంచి వక్త. సామాజిక కార్యకర్త... ఓ విజేత. ‘మీ తరఫున మేము మాట్లాడుతాం’ అంటోంది. ‘మీ ఆరోగ్యాన్ని మేము పట్టించుకుంటాం’ అంటోంది. ‘ఉద్యోగినులకు అండగా ఉంటాను’ అంటోంది. ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ కోసం పని చేస్తాను’ ... అని ప్రకృతికి భరోసా ఇస్తోంది. శశాంక బినేశ్ సొంతూరు హైదరాబాద్, చందానగర్. బీఫార్మసీ తర్వాత యూకేకి వెళ్లి ‘లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ’ నుంచి ఫార్మసీలో పీజీ చేశారామె. ఇండియాకి వచ్చి కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ అది సంతృప్తినివ్వలేదు. ‘‘సొంతంగా ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలనే ఆలోచన చాలా గట్టిగా ఉండేది. ఈ లోపు మరో ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో డిజిటల్ మార్కెటింగ్ మీద మంచి పట్టు వచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు. ఇంట్లోనే ఒక గదిలో సొంతకంపెనీ ‘వి హాంక్’ మొదలుపెట్టాను. ఇప్పుడు ప్రతి వ్యాపారమూ బ్రాండింగ్ మీదనే నడుస్తోంది. బ్రాండ్‌కి ప్రమోషన్ కల్పించే పని మేము చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే... మీ గురించి, మీ వ్యాపారం గురించి మేము హారన్ మోగిస్తామన్నమాట’’ అంటూ తన సేవా ప్రయాణాన్ని వివరించే ముందు ఉపాధి కోసం తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన విషయాన్ని చెప్పారామె. ‘సామాజిక కార్యకర్తగా ఈ పనులు ఇప్పుడు కొత్తగా చేస్తున్నవి కావు, మా ఇల్లే నేర్పించింది’’ అన్నారు శశాంక బినేశ్. తాత... నాన్న... నేను! నా చిన్నప్పుడు చందానగర్ నగరంలో భాగం కాదు, గ్రామం. మా తాత మందగడ్డ రాములు గ్రామానికి ఉప సర్పంచ్, సర్పంచ్‌గా ఊరికి సరీ్వస్ చేశారు. పేదవాళ్లు నివసించే శాంతినగర్ కాలనీ వాళ్లకు ఇళ్లు, కరెంటు వంటి సౌకర్యాలు ఆయన హయాంలోనే వచ్చాయి. మా నాన్న విక్రమ్ కుమార్ ఇప్పటికీ శ్రామికుల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉన్నారు. నా అడుగులు కూడా అటువైపే పడ్డాయి. యూకేలో చదువుకుంటున్నప్పుడు పార్ట్‌టైమ్ జాబ్... షెఫీల్డ్ నగరంలో ఒక వృద్ధాశ్రమంలో. పెద్దవాళ్లకు ఒళ్లు తుడవడం, దుస్తులు మార్చడం, వీల్‌చెయిర్‌లో తీసుకెళ్లడం వంటి పనులు చేశాను. ఆ ఉద్యోగం... జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసింది. ఇండియాలో మా నాన్న తన స్నేహితులతో కలిíసి 2007లో నాదర్గుల్ దగ్గర ఒక ట్రస్ట్ హోమ్ స్థాపించారు. ఆ హోమ్ కోసం పని చేయడం మొదలుపెట్టాను. ఇక డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో సినీనటి సమంత, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని తో పరిచయమైంది. అప్పటినుంచి ‘ప్రత్యూష సపోర్ట్’ స్వచ్ఛంద సంస్థతో పని చేస్తున్నాను. పేదపిల్లలకు వైద్యసహాయం అందించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాను. ఇప్పటివరకు 650కి పైగా సర్జరీలు చేయించగలిగాను. స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీతో కలిసి హెచ్ఐవీ పిల్లలకు ‘విష్ ట్రూ కమ్’ ప్రోగ్రామ్, అనాథ పిల్లలకు ‘వింగ్స్ ఆఫ్ హోప్’ ద్వారా విమాన ప్రయాణాలు చేయించడం వంటి పనులతో సేవాకార్యక్రమాల్లో ఉండే సంతృప్తిని ఆస్వాదించాను. పేదరికం... అనారోగ్యం... రెండూ శాపాలే! నా సర్వీస్‌ని ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు తనం, అనారోగ్యాల నిర్మూలనల మీదనే కేంద్రీకరించడానికి బలమైన కారణమే ఉంది. పేదరికమే ఒక శాపమైతే, అనారోగ్యం మరొక విషాదం. ఈ రెండూ కలిస్తే ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. పిల్లలకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు పడే గుండెకోతను చెప్పడానికి ఏ భాషలోనూ మాటలు దొరకవు. సమాజంలో ఇన్ని సమస్యలుంటే ఇవి చాలవన్నట్లు మనుషులు ఒకరినొకరు కులాల పరంగా దూరం చేసుకోవడం మరొక విషాదం. భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నన్ని రోజులూ నాకు కులాల గురించి తెలియదు. ఇంటర్‌కి మా వాళ్లు ర్యాంకుల ప్రకటనలతో హోరెత్తించే కాలేజ్‌లో చేర్చారు. బీసీ వర్గానికి చెందిన నేను అక్కడ వివక్షను చూశాను, ఎదుర్కొన్నాను కూడా. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన ఈ తరంలో కూడా ఇలా ఉంటే మా నానమ్మ, ఇంకా ముందు తరాల వాళ్లు ఎంతటి వివక్షకు లోనయ్యారో కదా అనే ఆలోచన మెదలుతుండేది. మా ట్రస్ట్ హోమ్‌లో కులం లేని సమాజాన్ని సృష్టించగలిగాను. నేను లీగల్ గార్డియన్‌గా ‘జములమ్మ’ అనే అమ్మాయిని దత్తత చేసుకున్నాను. ఆ అమ్మాయి కులమేంటో చూడలేదు. వైద్యసహాయం అందిస్తున్న వారి కులాలూ చూడం. నేను రక్తదాతల సంఘం సభ్యురాలిని కూడా. రక్తం అవసరమైన పేషెంట్లు రక్తదాత కులాన్ని చూడరు. సమంత చూపిన బాట! మేము పేషెంట్‌కి వైద్యసహాయం కోసం ఎంపిక చేసుకునేటప్పుడు త్రీ పార్టీ ఫండింగ్ విధానాన్ని అవలంబిస్తుంటాం. మూడింట ఒకవంతు మేము సహాయం అందిస్తాం, ఒక వంతు పేషెంట్ కుటుంబీకులు, ఒక వంతు హాస్పిటల్ వైపు నుంచి బిల్లులో తగ్గింపు ఉండేటట్లు చూస్తాం. సరీ్వస్ విషయంలో సమంత ప్రభావం నా మీద ఎంతగా ఉందంటే... ఆమె చేనేతల ప్రమోషన్ కోసం పని చేస్తున్న సమయంలో నా వంతుగా ప్రకృతికి ఉపకరించే పని చేయాలని స్టూడియో బజిల్ హ్యాండ్లూమ్ క్లోతింగ్ బిజినెస్ పెట్టాను. ఇన్నేళ్ల నా సరీ్వస్‌లో లెక్కకు మించిన పురస్కారాలందుకున్నాను. కానీ వాల్మీకి ఫౌండేషన్ నుంచి ఈ ఏడాది అందుకున్న ‘సేవాగురు’ గుర్తింపు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. మావారు బినేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ‘వి హాంక్’ కోసమే పూర్తి సమయం పని చేయడం కూడా నాకు అందివచి్చన అవకాశం అనే చెప్పాలి. నన్ను నేను మలచుకోవడంలో బినేశ్ నాకు పెద్ద సపోర్ట్’’ అన్నారు శశాంక బినేశ్. ‘పోష్’ చైతన్యం మహిళలు పని చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా ‘సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. ధనలక్ష్మీ బ్యాంకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలిని. చాలా మంది మహిళలకు తమ పని ప్రదేశంలో అలాంటి కమిటీ ఉందనే సమాచారమే ఉండడం లేదు. ఇందుకోసం అవగాహన సదçస్సుల ద్వారా మహిళలను చైతన్యవంతం చేయడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. సమస్య ఎదురైతే గళం విప్పాలనే తెగువ లేకపోవడం కంటే గళం విప్పవచ్చనే చైతన్యం కూడా లేకపోవడం శోచనీయం. నేను ధైర్యంగా ఇవన్నీ చేయడానికి మా నాన్న పెంపకమే కారణం. ‘ఆడవాళ్లు మానసికంగా శక్తిమంతులు. ఎన్ని అవాంతరాలెదురైనా అనుకున్న పనిని మధ్యలో వదలరు’ అని చెప్పేవారాయన. ‘మహిళ ఒకరి మీద ఆధారపడి, ఒకరి సహాయాన్ని అరి్థంచే స్థితిలో ఉండకూడదు. తన కాళ్లమీద తాను నిలబడి, మరొక మహిళకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండాలి. సమాజం గురించి భయపడి వెనుకడుగు వేయవద్దు. జీవితం పట్ల నీ నిర్ణయం ప్రకారం ముందుకే వెళ్లాలి. నువ్వు విజయవంతమైతే సమాజమే నిన్ను అనుసరిస్తుంది’ అని చెప్పేవారు. నేను సాటి మహిళలకు చెప్పే మంచి మాట కూడా అదే. – శశాంక బినేశ్, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
సచివాలయ వ్యవస్థ : పేదజనానికి ప్రగతిపథం
ప్రపంచ దేశాలతో సుస్థిర అభివృద్ధి గమనంలో పోటీ పడుతున్న భారతదేశం స్వాతంత్య్ర శతాబ్ది 2047 నాటికి అగ్రస్థానంలో నిలవాలని పరితపిస్తోంది. అధిక ఆదాయ స్థితిసాధనకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి శక్తిమంతంగా పని చేస్తోంది. ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనలో మునిగిపోయాయి. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్ వెల్లడించిన జాతీయ బహుముఖ పేదరిక సూచిక (ఎంపీఐ)తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో పేదరికం రేటు 11.77 శాతం నుంచి 6.06 శాతానికి తగ్గింది. గ్రామాల్లో పేదరికం తగ్గింపు రేటు సగానికి పైగా దిగింది. పోషకాహారం, శిశు, కౌమార దశ మరణాలు; ప్రసూతి ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగు నీరు, విద్యుత్, గృహాలు, ఆస్తులు, బ్యాంకు ఖాతాల గణాంకాలను వినియోగించి నీతి ఆయోగ్ తాను ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ అనుసరించని పాలనా పద్ధతుల్ని జగన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమాన్ని పొందవచ్చో తెలియజేసే వాలంటీరు వ్యవస్థ పేద ప్రజల వెంట నడుస్తోంది. అర్హులయిన లబ్దిదారులంతా నవరత్నాలతో పాటు ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తున్న మిగతా ప్రభుత్వ పథకాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింతగా చేరువ చేసింది. దీంతో ప్రజాపాలనలో రెట్టింపు వేగం పెరిగింది. మానవ వనరుల సంపదకు పునాదివేయడానికి వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ మూలస్తంభాలని ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 67 శాతానికి పైగా ప్రజలు ఈ రంగంలో నిమగ్నమై జీవిస్తున్నారు. కాబట్టి వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడానికి సుస్థిర విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో 70 శాతం మంది సన్నకారు రైతులకు ‘రైతు భరోసా’తో రబీ, ఖరీఫ్ పంటల్లో బాసటగా నిలుస్తుంది. పంటలు విఫలమయితే తదుపరి పంటపనులకు ముందుగానే రైతులకు బీమా అందిస్తోంది. పాడి, మత్స్య పరిశ్రమలకు తగిన సహకారం లభించింది. రాష్ట్ర అభివృద్ధిలో ఈ పరిశ్రమల వాటా పెరిగింది. ప్రభుత్వం స్వయం ఉపాధి, సాంప్రదాయ వృత్తుల నేత కార్మికులు, టైలర్లు, డ్రైవర్లు తదితర చేతివృత్తిదారులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు సకాలంలో రుణ సహాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయం. ‘‘అందుకు నేను నా వంతు కృషి చేస్తున్నాను. నిజానికి నేను చేయలేనిది చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడం. మీరు నా ప్రభుత్వం నుండి లబ్ది పొందితేనే నాకు ఓటు వేయండి అనే నినాదంతో రేపటి ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తాను. నాకు ప్రజలు అద్భుత ఫలితాలు అందిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’’ అంటున్నారు ఆయన. పేద ప్రజలను ప్రగతిపథంలో నడిపిస్తున్న ఆయన అభివృద్ధి, సంక్షేమ పాలన మీద ఆయనకున్న నమ్మకం ఇది. – జి. యోగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్, 95028 12920. -
AP Students Visits White House: అమెరికా వైట్‌హౌజ్‌లో ఏపీ విద్యార్థులు.. అరుదైన అవకాశం (ఫొటోలు)
-
వైట్ హౌస్‌లో ఏపీ విద్యా ప్రభ
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్య సమితిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బుధవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను సందర్శించారు. ఇప్పటి వరకు వైట్‌హౌస్‌ను బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు.. తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపలి ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పించారు. విద్యార్థులను వైట్ హౌస్ భద్రత సిబ్బంది శ్వేత సౌధం మొత్తం తిప్పారు. భవనంలో ప్రతి ఒక్క విభాగం పని విధానాన్ని అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా భవనంలో కలియదిరిగారు. అక్కడి విభాగాలు, సిబ్బంది పనితీరు, సెక్యూరిటీ సిస్టం, అధ్యక్షుడు నివసించే భవనం, కార్యాలయం పని విధానాలను తెలుసుకున్నారు.ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లబ్ధిపొందిన వారే చెప్పడం సమంజసమని భావించిన ప్రభుత్వం.. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇలా దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మన రాష్ట్రం నుంచే ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో యునైటెడ్ నేషన్స్‌లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ సమన్వయంతో, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పర్యవేక్షణలో విద్యార్థుల బృందం ఈనెల 14న అమెరికాకు వెళ్లింది. ఈ బృందంలో మాల శివలింగమ్మ, (తండ్రి సోమనాథ్ రైతు కూలీ, తల్లి గంగమ్మ), మోతుకూరి చంద్రలేఖ (ఏఎస్ఆర్ జిల్లా,తండ్రి రామారావు ఆటో డ్రైవర్), గుండుమోగుల గణేష్ అంజన సాయి (పశ్చిమ గోదావరి జిల్లా, తండ్రి గోపీ, కౌలు రైతు), దడాల జ్యోత్స్న (కాకినాడ జిల్లా, తండ్రి సింహాచలం సెక్యూరిటీ గార్డు), చాకలి రాజేశ్వరి (నంద్యాల జిల్లా, తండ్రి దస్తగిరి లారీ డ్రైవర్), పసుపులేటి గాయత్రి (ఏలూరు జిల్లా, తండ్రి రమేష్, తల్లి కూలీలు), అల్లం రిషితారెడ్డి (విజయనగరం జిల్లా, తండ్రి రామకృష్ణారెడ్డి మెకానిక్), వంజివాకు యోగేశ్వర్ (తిరుపతి జిల్లా, తండ్రి నాగరాజు కేబుల్ ఆపరేటర్), షేక్ అమ్మాజన్(శ్రీ సత్యసాయి జిల్లా, తల్లి షేక్ ఫాతిమా వ్యవసాయ కూలీ), సామల మనస్విని (పార్వతీపురం మన్యం జిల్లా, తల్లి కృష్ణవేణి) ఉన్నారు. ఈ నెల 15 నుంచి ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలిలో జరిగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ) సదస్సుతో పాటు కొలంబియా యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్‌లో రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’, విద్యా సంస్కరణలపై వీరు ప్రసంగించారు. న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో నిర్వహించిన ఎస్డీఎస్ సర్విస్ సదస్సు, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో సైతం పాలుపంచుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా, సంక్షేమ పథకాలను వివరించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాలను సందర్శించి భారత్‌కు తిరుగుపయనమయ్యారు. సీఎంకు విద్యార్థుల కృతజ్ఞతలు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి సదస్సు కోసం రాష్ట్రం తరఫున బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికైనందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తాము నేర్చుకున్న అంశాలను రాష్ట్రంలోని విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. పేద కుటుంబాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తమను ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్‌కుమార్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. -
మిగిలిపోయిన కూరగాయలతో ప్యాకింగ్ పేపర్స్, ఆదర్శంగా నిలుస్తున్న మాన్య
పర్యావరణ పరిరక్షణ గురించి మాటలు కాదు, చేతల్లో చూపించండి అని గ్రేటాథన్ బర్గ్ గళం విప్పింది. ఈ మాటను తూ.చ. తప్పకుండా ఆచరిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది మాన్యా. అందుకే మాన్యను ‘అంతర్జాతీయ యూత్ ఇకో– హీరో’ అవార్డు వరించింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించే ఎనిమిది నుంచి పదహారేళ్ళలోపు వయసు వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పదిహేడు మంది యువతీ యువకులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా మన దేశం నుంచి మాన్యహర్షను ఏరికోరి ఈ అవార్డు వరించింది. మాన్య చేపట్టిన ‘సన్‌షైన్ ప్రాజెక్టుకు గానూ ఇంతటి గుర్తింపు లభించింది. 27 దేశాలు, 32 అమెరికా రాష్ట్రాల్లో... ఇరవై ఏళ్లుగా పర్యావరణం గురించి కృషిచేస్తోన్న... 339 మందిని గుర్తించి వారిలో పదిహేడు మందికి ఇకో హీరో అవార్డులు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన పదిహేడేళ్ళ మాన్య గోల్డెన్ బీ ఆఫ్ విబ్జిఆర్ హైస్కూల్లో చదువుతోంది. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం. మాన్యకు నాలుగేళ్లు ఉన్నప్పుడు నానమ్మ రుద్రమ్మ మాన్యతో మొక్కను నాటిస్తూ... ‘‘ప్రకృతినీ, పర్యావరణాన్నీ ప్రేమగా చూసుకోవాలి. మనతో పాటు మొక్కలు, జంతువులను బతకనిస్తే మనం బావుంటాము’’ అని ఆమె మాన్యకు చెప్పింది. అప్పటినుంచి మాన్యకు పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనేది. లాక్డౌన్ సమయంలో... కరోనా వైరస్ చెడు చేసినప్పటికీ సరికొత్త పనులు చేయడానికి కొంతమందికి వెసులుబాటు కల్పించింది. ఈ వెసులు బాటును వాడుకున్న మాన్య.. పిల్లల కోసం ‘సన్‌షైన్’ అనే మ్యాగజైన్‌ను ప్రారంభించింది. ప్రింట్, డిజిటల్ కాపీల ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ఈ మ్యాగజైన్‌ను బెంగళూరులోని మాంటిస్సోరి, ఇతర స్కూళ్లల్లోని పిల్లలకు ఉచితంగా అందిస్తోంది. వివిధ కార్యక్రమాలను పరిచయం చేస్తూ పర్యావరణ ప్రాధాన్యత గురించి వివరిస్తోంది. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్ క్యాంపెయిన్’, ‘పేపర్ మేకింగ్ వర్క్‌షాప్’, ‘పిల్లలు నీటిని ఎలా కాపాడగలరు?’, ‘న్యూఇండియా సస్టెయినబుల్ క్యాంపెయిన్’,ప్లాస్టిక్ ఫ్రీ జూలై రైటింగ్ కాంపిటీషన్’, ఎర్త్‌డే రోజు పెయింటింగ్ పోటీల వంటివాటిని మ్యాగజైన్ ద్వారా నిర్వహిస్తూ పర్యావరణంపై చక్కని అవగాహన కల్పిస్తోంది. తన యూట్యూబ్ ఛానెల్లో కూడా పర్యావరణ కార్యక్రమ వీడియోలు షేర్ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పీల్స్‌తో పేపర్స్.. అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు వంటింట్లో మిగిలిపోయే కూరగాయ తడి వ్యర్థాలను ప్యాకింగ్ పేపర్స్‌గా మారుస్తోంది. కూరగాయ తొక్కలను ఉపయోగించి, పెన్సిల్స్, పేపర్లు రూపొందిస్తోంది. ఇప్పటిదాకా రెండు వందలకు పైగా వెజిటేబుల్ పీల్ పేపర్లను తయారు చేసింది. ఇందుకోసం వంటింట్లో మిగిలిపోయిన వ్యర్థాలు, పండుగల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సేకరించి, వాటిని గ్రైండ్ చేసి పేపర్‌గా మార్చడం విశేషం. పాత జీన్స్ ప్యాంట్లను డెనిమ్ పేపర్లుగా తీర్చిదిద్దుతోంది. మాన్యా స్వయంగా తయారు చేయడమే గాక, వర్క్‌షాపుల ద్వారా పేపర్ల తయారీ గురించి పిల్లలకు నేర్పిస్తోంది. అనేక అవార్డులు.. నాలుగున్నరవేలకు పైగా మొక్కలను నాటి, ఏడువేల మొక్కలు పంపిణీ చేసింది. ఐదువేల విత్తనాలను నాటింది. ఎనిమిదివేలకు పైగా ఆర్గానిక్, కాటన్ సంచులను పంచింది. సిటీ, హైవే రోడ్లు, నీటి కుంటలను శుద్ధిచేసే కార్యక్రమాలను చేపట్టింది. వీటన్నింటికి గుర్తింపుగా మాన్యకు అనేక అవార్డులు వచ్చాయి. వెజిటేబుల్ పేపర్‌కు గ్రీన్ ఇన్నోవేటర్, జల వనరుల మంత్రిత్వ శాఖ 2020 సంవత్సరానికి గాను ‘వాటర్ హీరో’, ఎర్త్డాట్ ఓ ఆర్జీ ఇండియా నెట్వర్క్ నుంచి రైజింగ్ స్టార్, హ్యూమానిటేరియన్ ఎక్స్‌లెన్స్ అవార్డులు వచ్చాయి. పృథ్వి మేళా, అక్షయ్కల్ప్ రీసైక్లింగ్ మేళా, లయన్స్ క్లబ్, బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్, బైజూస్ పేపర్ బ్యాగ్ డే వంటి కార్యక్రమాల్లో పర్యావరణంపై ప్రసంగించింది. ఇవన్నీగాక మాన్య ప్రకృతిమీద ఏడు పుస్తకాలు రాసింది. 2019 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగెస్ట్ పోయెట్, ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుంది. ‘‘ఈ అవార్డు నా కృషిని గుర్తించి మరింత స్ఫూర్తిని ఇచ్చింది. భవిష్యత్‌లో నా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తాను’’ అని చెబుతూ ఎంతోమందిని ఆలోచించేలా చేస్తోంది మాన్య. -
పత్తి పంట కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ ప్రత్యేక బ్రాండ్
ముంబై: పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ (జీఏవీఎల్) తాజాగా పత్తికి సంబంధించి ’పయ్నా’ పేరిట ప్రత్యేక బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. హిట్వీడ్, హిట్వీడ్ మాక్స్, మాక్స్కాట్ అనే మూడు కలుపు నిర్వహణ ఉత్పత్తులను ఈ బ్రాండ్ కింద విక్రయించనున్నట్లు సంస్థ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ విభాగం సీఈవో రాజవేలు ఎన్కే తెలిపారు. ఇవి కలుపు మొక్కల సమస్యను తగ్గించి, ప్రారంభ దశల్లో పత్తి పంట ఏపుగా ఎదిగేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. తద్వారా అధిక దిగుబడులను పొందేందుకు తోడ్పడగలవని వివరించారు. -
Global Buddhist Summit: భవ్య ప్రగతికి బుద్ధుని బోధనలే మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: గౌతమ బుద్ధుని బోధనలను ఆచరించి సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని ప్రధాని మోదీ అభిలషించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు బుద్ధుడి బోధనలు చక్కని పరిష్కారాలు చూపగలవని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ సెషన్లో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ‘ యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత అతివాదం, వాతావరణ మార్పులు.. ఇలా ఎన్నో అంతర్జాతీయ సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటికి గౌతముని సద్గుణ బోధనలు పరిష్కార మార్గాలు చూపుతాయి’ అని అన్నారు. పర్యావరణ మార్పు సమస్యకు సంపన్న దేశాలే కారణమంటూ విమర్శించారు. బుద్ధుడు చూపిన మార్గం భవిష్యత్, సుస్థిర పథం. గతంలోనే ఆయన చూపిన మార్గంలో వెళ్లిఉంటే ఇప్పుడీ ప్రపంచానికి ప్రకృతి విపత్తులు దాపురించేవే కాదు. సంకుచిత భావన నుంచి విస్తృత సమ్మిళిత ప్రపంచ భావన దిశగా మళ్లడం అత్యావశ్యకం. బుద్ధుని నుంచే భారత్ స్ఫూర్తి గౌతముడి ఉపదేశాలను భారత్ ఆచరిస్తోంది. పెను భూకంపంతో కుప్పకూలిన తుర్కియేసహా పలు దేశాలకు ఆపన్నహస్తం అందించింది. బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరించడమంటే సమస్యల నుంచి సమాధానం వైపునకు పయనించడమే’ అని అన్నారు. సదస్సుకు 30 దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు తదితరులు వచ్చారు. -
ఐక్యరాజ్య సమితి చర్చల్లో నిత్యానంద ‘యూఎస్‌కే’ ప్రతినిధి
ఐక్యరాజ్యసమితి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్థాపించిన దేశం ‘కైలాస’ ఐక్యరాజ్యసమితి చర్చల్లో పాలుపంచుకుంది. జెనీవాలో సుస్థిర అభివృద్ధి అంశంపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఈ నెల 24న చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధినంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ చర్చలో పాల్గొని, ప్రసంగించారు. హిందూ మతాన్ని, ఆచార సంప్రదాయాలను ప్రచారం చేస్తున్న నిత్యానందను భారతదేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. యూఎస్‌కే తరఫున ఇయాన్ కుమార్ అనే వ్యక్తి కూడా చర్చల్లో పాల్గొన్నారు. అత్యాచారం, అపహరణ కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో 2019లో నిత్యానంద దేశ విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలో ఉంటూనే ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ దీవిని తన సొంత కైలాస దేశమని, 200 కోట్ల మంది హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించారు. ఐరాస గుర్తింపు పొందాలంటే భద్రతా మండలి, సర్వప్రతినిధి సభ ఆమోదం ముందుగా అవసరం. 193 దేశాల జాబితాలో యూఎస్‌కే లేదు. అయితే, జెనీవా చర్చలో పాల్గొన ద్వారా ఐరాస గుర్తింపు లభించిందనే తప్పుడు అభిప్రాయం కల్పించేందుకు యూఎస్‌కే ప్రయత్నించిందని పరిశీలకులు అంటున్నారు. -
లక్ష్యం.. వాస్తవ ప్రగతి
ప్రగతి అనేది వాస్తవ రూపంలో ఉండాలి.. అందమైన అంకెల రూపంలో చూపడం కాదు. ప్రతి అంశంలోనూ సాధించాల్సిన ప్రగతిపై క్షేత్ర స్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేపట్టాలి. వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో, లక్ష్య సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుంది. ఎస్డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, తాగునీటిపై శ్రద్ధ చూపాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది పనితీరును మండలాల వారీగా ఆయా విభాగాలకు చెందిన అధికారులు పర్యవేక్షించేలా ఎస్‌వోపీలను రూపొందించాలని సూచించారు. మండల స్థాయిలో అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వాధికారులు నెలకు రెండుసార్లు ఆయా సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తూ సిబ్బంది సమర్థత పెంచాలని నిర్దేశించారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి ఎప్పటికప్పుడు నమోదు గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తెచ్చింది. అలాంటి సచివాలయాలపై నిరంతర పర్యవేక్షణ, ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం చాలా కీలకం. లేదంటే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుంది. నిశిత దృష్టి, జవాబుదారీతనం.. ఆధార్ కార్డు నంబరు, వివరాలతో సహా డేటాను నిక్షిప్తం చేయడంతోపాటు వచ్చిన మార్పులు చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలి. ఏమైనా సమస్యలుంటే సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలి. ఉదాహరణకు రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. వారికి సరైన ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. తద్వారా ఆ సమస్య ఇక పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలి. సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. వివిధ ప్రభుత్వ విభాగాల తరపున గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు. నిర్దేశిత లక్ష్యాల సాధనకు సచివాలయాలను చోదక శక్తిలా వినియోగించుకునేలా సిబ్బందిని çపూర్తి స్ధాయిలో భాగస్వాములుగా చేయాలి. సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్‌వోపీలను మరోసారి పరిశీలించి అవసరమైతే మార్పుచేర్పులు చేయాలి. సమర్థత పెంచేలా సచివాలయాల సందర్శన.. మండల స్థాయిలో ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన అధిపతి ప్రతి నెలా రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తూ సమర్థత పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సిబ్బంది ఎఫిషియన్సీ పెంపొందించేలా చూడాలి. ఆయా శాఖలకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారు? ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఎలా కృషి చేస్తున్నారో పరిశీలన చేయాలి. ప్రతి విభాగంలోనూ పర్యవేక్షణ ఉండాలి. ఏ విభాగంలోనైనా సంబంధిత అధికారి లేకుంటే ఆయా విభాగాలకు మండలాలవారీగా వెంటనే నియమించాలి. వీలైనంత త్వరగా దీన్ని చేపట్టాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందికి సరైన మార్గ దర్శకత్వం లభిస్తుంది. అవగాహన కలుగుతుంది. ఎప్పటికప్పుడు వివరాల నమోదు సమగ్రంగా జరుగుతుందో లేదో పర్యవేక్షణ ఉంటుంది. లక్ష్యాల సాధన దిశలో మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, జేసీలు పరిశీలన చేయాలి గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతోంది? అనే విషయంపై జేసీలు, కలెక్టర్లు పరిశీలన చేయాలి. సచివాలయాలను తమవిగా భావించాలి. ప్రతి స్థాయిలోనూ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకు పడతాయి. దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తుంది. ప్రతి నెలా వివరాలు నమోదు వ్యవసాయం, విద్య, మహిళ, శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాలపై మనం ఖర్చు చేస్తున్నట్లు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయడం లేదు. వీటిపై సమగ్ర పర్యవేక్షణ అవసరం. ప్రగతి లక్ష్యాల సాధనపై నెల రోజులకు ఒకసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలి. డ్రాపౌట్స్ ఉండకూడదు పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూడదు. డ్రాపౌట్స్ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు. సచివాలయాల వారీగా, వలంటీర్ల వారీగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాపౌట్ గురించి సమాచారం అందితే అధికారులు వెంటనే స్పందించాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరు పరిశీలించాలి. ఎవరైనా వరుసగా మూడు రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరా తీయాలి. పిల్లలు బడికి రాకపోతే తప్పనిసరిగా ఎస్ఎంఎస్ పంపాలి. ఇవన్నీ కచ్చితంగా జరిగాలి. కళ్యాణమస్తుతో.. కళ్యాణమస్తు పథకం ద్వారా లబ్ధి పొందేందుకు నిర్దేశించిన అర్హతలు బాల్య వివాహాల నివారణ, అక్షరాస్యత పెరిగేలా దోహదం చేస్తాయి. వధూవరుల కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించాం. పెళ్లి కుమార్తె కనీస వయసు 18 ఏళ్లు, పెళ్లి కుమారుడి కనీస వయస్సు 21 ఏళ్లుగా నిర్దేశించినందున ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. రానున్న రోజుల్లో మంచి ఫలితాలు విద్య సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయి. ఇంగ్లీషు మీడియం సహా పలు సంస్కరణల ద్వారా పరిస్థితులను సమూలంగా మార్చేసే మహా యజ్ఞాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు ఉజ్వల భవిష్యత్తు కలిగిన తరాలుగా సమాజానికి అందుతాయి. చదువుల యజ్ఞం కొనసాగుతుంది.. ఇంగ్లీషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలే ఇంగ్లీషు మీడియంలో చదవాలి, పేద బిడ్డలు మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదవకూడదనే వైఖరిని పదేపదే చాటుకుంటున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు అందకూడదన్నదే వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. తద్వారా చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది. సమీక్షలో సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, పాఠశాల మౌలిక వసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ జె.నివాస్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ.సిరి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు. -
ప్రతినెలా డేటా అప్లోడ్ చేయాలి: సీఎం జగన్
-
ప్రగతి అనేది వాస్తవ రూపంలో ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే.. అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో.. లక్ష్యాల సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ప్రతి అంశంలోకూడా సాధించాల్సిన ప్రగతిపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాంగానికి, సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సీఎం వైఎస్ జగన్ మాటల్లో.. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో మన ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో గొప్ప వ్యవస్థను తీసుకొచ్చింది. అలాంటి సచివాలయాల నుంచి నిరంతర పర్యవేక్షణ, చేస్తున్న ప్రగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం చాలా ముఖ్యమైన అంశం. లేకపోతే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుంది. ప్రగతి అనేది కేవలం అందమైన అంకెల రూపంలో చూపడం కాదు, అవి వాస్తవాలుగా కనిపించాలని స్పష్టం చేశారాయన. ► ఆధార్ కార్డు నంబరు, వివరాలతో సహా డేటా నిక్షిప్తం చేయడంతోపాటు ... వచ్చిన మార్పులను చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలి. ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలి. ఉదాహరణకు.. రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. ఆడపడుచులకు సరైన ఆహారం అందుతుందా? లేదా? అనేదానిపై గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వంలో వివిధ విభాగాల తరపున గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారు. తాము అనుకుంటున్న లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాలను చోదక శక్తిలా వాడుకుని అందులోని సిబ్బందిని పూర్తి స్ధాయిలో భాగస్వాములు చేయాలి. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఉండాలి. అలాగే.. ► సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణకు మండలాల వారీగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉండాలి. వీరు సచివాయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలి. దీనికి సంబంధించి ఎస్ఓపీలను రూపొందించుకోవాలి. ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన విభాగాధిపతి ప్రతినెలలో రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. ఆ శాఖకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఏరకంగా పనిచేస్తున్నారు? ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఏ రకంగా పనిచేస్తున్నారు? అనేది పరిశీలన చేయాలి. దీనివల్ల సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం లభించడంతో పాటు అవగాహన కల్పించగలుగుతారు. ఎప్పటికప్పుడు వివరాల నమోదు కూడా సమగ్రంగా జరుగుతుందా? లేదా? అన్నదానిపై కూడా పరిశీలన, పర్యవేక్షణ జరుగుతుంది. అంతేకాదు.. ► లక్ష్యాల సాధన దిశలో మనం ఎక్కడున్నామో కూడా తెలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతుంది? అనే విషయంపై జేసీలు, కలెక్టర్లు కూడా పరిశీలన చేయాలి. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. అంతేకాదు ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకుపడతాయి. దేశంలో రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఓనర్షిప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించుకోవాలి. వీలైనంత త్వరగా ఈ అధికారుల నియామకం కావాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్ఓపీలను మరోసారి పరిశీలించి వాటిలో మార్పులు, చేర్పులు అవసరమైతే చేయండి. నెలకు కనీసం రెండు సచివాలయాలను ప్రభుత్వ విభాగాధిపతులు పర్యవేక్షించాలి. కలెక్టర్లు, జేసీలు ఎలా పర్యవేక్షణ చేస్తున్నారో కూడా పరిశీలన చేయాలి. వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో మనం ఖర్చు చేస్తున్నట్టుగా దేశంలో ఏ ప్రభుత్వంకూడా ఖర్చు చేయడంలేదు. అందుకనే ఓనర్షిప్ తీసుకుని వాటిని సమగ్రంగా పర్యవేక్షణ చేయాల్సి అవసరం ఉంది. ప్రగతి లక్ష్యాల సాధనపై ప్రతి నెల రోజులకోసారి వివరాలు నమోదు కావాలి. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలి. పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా ఉండకూదు. డ్రాప్‌అవుట్స్ అన్న మాట ఎక్కడా వినిపించకూడదు. సచివాలయాల వారీగా, వాలంటీర్ల వారీగా పర్యవేక్షణ చేయాలి. ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలి. ఎక్కడైనా డ్రాప్‌అవుట్ జరిగిన ఘటన తెలిస్తే.. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరును పరిశీలించాలి. పిల్లలు ఎవరైనా వరుసగా 3 రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరాతీయాలి. పిల్లలు స్కూలుకు రాకపోతే కచ్చితంగా ఎస్ఎంఎస్లు పంపాలి. ఇది కచ్చితంగా జరిగేలా చూడాలి. ► కళ్యాణమస్తుకోసం నిర్దేశించిన అర్హతలు బాల్యవివాహాల నివారణ, అక్షరాస్యత పెంపుకోసం తోడ్పాటు నందిస్తాయి. వధూవరుల కనీస విద్యార్హత పదోతరగతిగా నిర్ణయించాం, అంతేకాదు పెళ్లికూతురు కనీస వయస్సు 18 ఏళ్లు, పెళ్లికొడుకు కనీస వయస్సు 21 సంవత్సరాలను పాటించాలని చెప్పాం. అలాగే.. ఎస్డీజీ లక్ష్యాల్లో పర్యావరణం, పరిశుభ్రత అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాయు కాలుష్యం నివారణ, రక్షిత తాగునీరు అంశాలపైకూడా దృష్టిపెట్టాలి. విద్యారంగం సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలు వలన రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ► విద్యారంగంలో మనం చేపట్టిన సంస్కరణలు అన్నవి గొప్ప భవిష్యత్తు తరాలను అందిస్తాయి. ఇంగ్లిషుమీడియం సహా మనం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు అమలుద్వారా పరిస్థితులను మార్చాలన్న మహాయజ్ఞాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని అమలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. వీటి ఫలితాలు అన్నవి..మంచి భవిష్యత్తు తరాలుగా సమాజానికి అందుతాయి. ఇంగ్లిషు మాధ్యమానికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు నిరంతరం కథనాలు రాస్తున్నాయి. వారి పిల్లలు మాత్రం ఇంగ్లిషుమీడియంలో చదుకోవాలి, పేదవాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లిషు మీడియంలో చదవకూడదన్న వారి వైఖరిని పదేపదే బయటపెడుతున్నారు. పేదవాళ్ల పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో చదువులు అందకూడదన్నది వారి ధ్యేయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞం కొనసాగుతుంది. స్కూళ్ల నిర్వహణలో ఉత్తమ విధానాలు పాటించడం ద్వారా నాణ్యమైన చదువులు ఉచితంగా అందుతాయి. దీనివల్ల చదువుల కోసం చేస్తున్న ఖర్చు భారం నుంచి ఆయా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి. అంతిమంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం నెరవేరుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్పందనను మరింత మెరుగు పర్చండి ఇక వినతుల పరిష్కారంలో మరింత మెరుగైన వ్యవస్థ ‘స్పందన’కు మెరుగైన రూపంపై అధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. వ్యక్తులకు సంబంధించిన సమస్యలతోపాటు, కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాం. ఒక నిర్ణీత సమయం పెట్టుకుని వాటిని శరవేగంగా పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచాం. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. స్పందనతోపాటు.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దృష్టిపెట్టాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాటిని పరిష్కరించేందుకు నిధులు కూడా కేటాయించాం. ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయా? అనేదానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. స్పందన కార్యక్రమాన్ని మెరుపరిచేలా ఆలోచన చేయాలి. ► సమస్యల పరిష్కారంలో అంకితభావానికి నిదర్శనంగా మనం నిలవాలి: ప్రజల సమస్యలను తీర్చాలన్నదే మన ఉద్దేశం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా, అంకిత భావంతో, కృతనిశ్చయంతో మనం ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశాం. మనం అంతా కలిసికట్టుగా గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సమస్యల పరిష్కారంకోసం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో వృత్తి నైపుణ్యం పెంచడం, నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించడం అనే అంవాలపై దృష్టిసారించాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలనుకూడా పరిశీలించి అందులో ఎక్కడైనా స్వీకరించదగ్గవి ఉంటే… వాటిని కూడా స్వీకరించాలి. ► పథకాలు కావొచ్చు, రెవిన్యూ రికార్డులకు సంబంధించిన అంశాలు కావొచ్చు.. ఇలా ఏదైనా కావొచ్చు. కాని ఏ ఒక్కరూ కూడా అర్హులైన వారు మిగిలిపోకూడదు, అలాగే సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోవద్దు అన్నదే దీని ఉద్దేశం. ఈ విధానం ఎలా ఉండాలి? ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి? అన్నదానిపై ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి. సీఎంఓ, ఇతర ఉన్నతాధికారులతో కూడిన అధికారయంత్రాంగ వ్యవస్థకు ప్రజలు చేర్చిన ఫిర్యాదులు, వినతులకు పరిష్కారాలు చూపడమే ఉద్దేశంగా ఈ ఆలోచన. స్పందన కార్యక్రమంకన్నా మరింత మెరుగ్గా, సమర్థవంతంగా దీన్ని నిర్వహించాలన్నది ఉద్దేశం. అధికారులంతా కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇప్పటివరకూ అమలవుతున్న స్పందన కార్యక్రమాన్ని మైక్రోస్థాయిలోకూడా పరిశీలనచేసి.. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి. వినతుల పరిష్కారంలో ప్రజల సంతృప్తికి పెద్దపీట వేయాలి అని అధికారులతో సీఎం జగన్ చెప్పారు. చదవండి: సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. -
ఫిష్ ఆంధ్రా.. ఫిట్ ఆంధ్రా..
సాక్షి, పశ్చిమగోదావరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మత్స్య, ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో ఆక్వా రైతులు, ఔత్సాహికులకు సబ్సిడీ అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మత్స్యశాఖ అధికారులు ఈ పథకంపై మత్స్యకార సొసైటీలు, రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. మొత్తం 14 రకాల ఆక్వా సంబంధిత ఉత్పత్తులకు ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి. చేపలు, రొయ్యల వినియోగాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2,50,045 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రతి ఏటా 17,15,362 టన్నుల ఆక్వా ఉత్పత్తి జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2024 వరకు ఐదేళ్ల కాలానికి గాను రూ.20,050 కోట్లు పీఎంఎంఎస్వై పథకానికి కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.9407 కోట్లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.4880 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ.5763 కోట్లుగా ఉంది. ప్రోత్సాహకాలు ఇలా.. పీఎంఎంఎస్వై పథకంలో 14 అంశాలకు సంబంధించిన వివిధ పథకాలు ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఎంచుకున్న యూనిట్లకు కేంద్రం 36 శాతం, రాష్ట్రం 24 శాతం కలిపి 60 శాతం సబ్సిడీని అందిస్తున్నాయి. లబ్ధిదారులు 40 శాతం చెల్లించాలి. ఇతరులకు కేంద్రం 24 శాతం, రాష్ట్రం 16 శాతం కలిపి మొత్తం 40 శాతం సబ్సిడీ అందిస్తున్నాయి. లబ్ధిదారులు 60 శాతం నగదు చెల్లించాలి. యూనిట్ల విషయానికి వస్తే చేప, రొయ్య పిల్లల నర్సరీకి రూ.7 లక్షలు, రిజర్వాయర్లలో కేజ్ కల్చర్‌కు రూ.3 లక్షలు, ఆక్వా ల్యాబ్ ఏర్పాటుకు రూ.25 లక్షలు, బతికిన చేపల అమ్మకాల యూనిట్‌కు రూ.20 లక్షలు, చేపల రవాణా రిఫ్రిజిరేటెడ్ వాహనానికి రూ.25 లక్షలు, ఫిష్ కియోస్క్ యూనిట్‌కు రూ.10 లక్షలు, రోజుకు 20 టన్నుల ఆక్వా ఉత్పత్తులు చేసే కర్మాగారానికి రూ.2 కోట్లు సైతం అందించనున్నారు. ఫలిస్తున్న సీఎం జగన్ కల.. ప్రపంచంలోనే చేపల ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంది. సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సరఫరా అవుతోంది. మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేసి ఫిష్ ఆంధ్రా పేరుతో తాజా చేపలు, పీతలు, రొయ్యలను విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 101 వివిధ యూనిట్లకు గాను మొత్తం రూ.327.60 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో రాష్ట్ర వాటా రూ.131.04 లక్షలు, కేంద్ర వాటా రూ.196.56 లక్షలుగా ఉంది. ఈ పథకం ద్వారా మంజూరైన వాహనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పథకంపై అవగాహన కలిగిస్తున్నాం... పీఎంఎంఎస్వై పథకంపై రైతులకు మత్స్య శాఖ ద్వారా అవగాహన కలిగిస్తున్నాం. ఈ పథకాలకు భూమి వివరాలు, ఆధార్ కార్డు, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు, రుణ మంజూరుకు బ్యాంకు నుంచి జారీ చేసిన పత్రం, లబ్ధిదారుని వాటా భరించు డిక్లరేషన్ పత్రం ఉండాలి. మరిన్ని వివరాలకు కావాల్సినవారు స్థానిక మత్స్యశాఖ కార్యాలయాల్లో సంప్రదించాలి. – ఈశ్వర చంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, ఏలూరు -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సీఎం జగన్ సమీక్ష
-
నవరత్నాలు.. సుస్థిర అభివృద్ధికి మార్గాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని అభివృద్ధి చెందిన దేశాల ప్రజల స్థాయికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్న కార్యక్రమాలతో పాటు ఇతర మేనిఫెస్టో అంశాలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ 17 లక్ష్యాలు, వాటికి అనుగుణంగా 487 రకాల ప్రజల జీవన ప్రమాణాల అంచనా అంశాలపై గ్రామ స్థాయి వరకు ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు, తద్వారా ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లి, పేదల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఏపీఎస్ఐఆర్డీ) ద్వారా ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 16 వరకు మొత్తం 81 అంశాలపై ఈ శిక్షణ ఇస్తారు. సుస్థిర అభివృద్ధి్ద లక్ష్యాలకు నవరత్నాల అనుసంధానం ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్న విధంగా ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 1.25 యూఎస్ డాలర్లు ఖర్చు చేసే స్థాయిలో ఉంచడం, పురుషులతో సమానంగా మహిళలూ ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండడం, అందరికీ విద్య వంటి లక్ష్యాల సాధనకు ఒక్కొక్క లక్ష్యానికి వాటితో లింకు ఉన్న నవరత్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది. బడి వయసు పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలా అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టింది. పురుషులతో సమానంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడంతో పాటు ఆయా కుటుంబాలను పేదరికానికి దూరం చేసేందుకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలను అమలుచేస్తోంది. ఇలా మొత్తం నవరత్నాల కార్యక్రమాలు ఒక్కొక్క సుస్థిర అభివృద్ధి్ద లక్ష్యాల సాధనలో భాగంగా చేసింది. నవరత్న కార్యక్రమాల ద్వారా గత 34 నెలల్లో రూ. 1.34 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలోనే పేదలకు అందించింది. పనితీరే కొలమానం.. ఐక్యరాజ్యసమితి ప్రమాణాలకు అనుగుణంగా శాఖలవారీగా ఐఏఎస్ అధికారుల పనితీరుకు సైతం ప్రభుత్వం గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. శాఖల్లో చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా వారి పనితీరు అంచనా వేస్తోంది. సీఎం, సీఎస్‌లు వీరి పనితీరును సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. ప్రతి దాంట్లో ఓ మార్పునకు సంకేతంగా సీఎం నిర్ణయాలు రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక అంశాల్లో ప్రతి దాంట్లో ఓ బలమైన మార్పు తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవరత్న కార్యక్రమాలు అందులో భాగమే. చదువుకునేందుకు ఎక్కువ మంది పిల్లలను పాఠశాలకు రప్పించడం కోసం లమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. అది కూడా సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో ఒకటి. నాడు– నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెంచడానికి ప్రభుత్వం ఆన్లైన్ శిక్షణ ఇస్తోంది. – జె.మురళి, ఏపీఎస్ఐఆర్డీ, డైరెక్టర్ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పేదరిక నిర్మూలన ప్రధాన అంశం. ప్రతి వ్యక్తి రోజుకు 1.25 డాలర్లు అంటే మన కరెన్సీలో కనీసం రూ. 95 తన కోసం ఖర్చు పెట్టుకోవడం. ఆ స్థాయిలో కూడా ఖర్చు పెట్టలేని వ్యక్తుల కుటుంబాన్ని బీపీఎల్ కుటుంబంగా పేర్కొంటారు. అందరికీ ఆహారం మరో ప్రధాన అంశం. ఐదేళ్ల లోపు పిల్లలు ఉండే బరువు వంటివి దీనికి కొలమానం. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన మానసిక స్థితి నాణ్యమైన విద్య పురుషులు, మహిళల సమానత్వం తాగడానికి పరిశుభ్రమైన నీరు, పరిశుభ్ర వాతావరణం విద్యుత్ సౌకర్యం మౌలిక వసతుల కల్పన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక పురోగతి అసమానతలు తొలగింపు పట్టణీకరణ ప్రజలలో కొనుగోలు శక్తి, ఉత్పత్తి అవకాశాలు పర్యావరణ పరిరక్షణ మత్స్య సంపద పర్యావరణ పరిరక్షణ భూ పరిరక్షణ శాంతి. న్యాయం, బలమైన వ్యవస్థలు లక్ష్యాల సాధనకు వివిధ సంస్థలతో ఒప్పందాలు (చదవండి: విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు...సొరంగ ‘మార్గం) -
సుస్థిరాభివృద్ధికి నాలుగు స్తంభాలు
సాక్షి, అమరావతి: కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ సుస్థిరాభివృద్ధిని సాధించే దిశగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. మానవ సామర్థ్యం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధికి మద్దతు, సామాజిక భద్రత లక్ష్యాలను నవరత్నాలతో ఏకీకరణ చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకుంటున్నట్లు తెలిపారు. సుస్థిరాభివృద్ధికి ఈ నాలుగు స్తంభాలు కీలకం అని చెప్పారు. శుక్రవారం ఆయన వార్షిక బడ్జెట్ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్డీజీ ఇండియా 2020–21 నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు–పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి – సముద్ర జలజీవుల పరిరక్షణ వంటి అంశాల్లో రాష్ట్రం 5వ స్థానంలో ఉందన్నారు. నాడు–నేడు, జగనన్న అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ వైద్య శాలలు, వైద్య కళాశాలలు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మానవ సామర్థ్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం, వైఎస్సార్ జలకళ, రహదారుల అభివృద్ధి, కొత్త ఓడరేవులు, నౌకాశ్రయాలు, వ్యవసాయం–పాడి పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పన, జగనన్న కాలనీలు, వైఎస్సార్ హౌసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంత్రి బుగ్గనకు బడ్జెట్ పత్రాలతో కూడిన బ్యాగ్‌ను అందజేస్తున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు జీవనోపాధి విషయానికి వస్తే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ జలకళ, ధరల స్థిరీకరణ నిధి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాల శీతలీకరణ కేంద్రాలు, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ వంటి పథకాలతో రాష్ట్రంలో 62 శాతం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం సమగ్ర దృష్టితో అభివృద్ధి చేస్తోందన్నారు. సామాజిక భద్రతలో భాగంగా వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 61.74 లక్షల మందికి ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్ చొప్పున వృద్ధాప్య ఫించన్ అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ వంటి సంక్షోభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఇందుకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు చెప్పారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. వ్యవసాయానికి పెద్ద పీట ►వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటి వరకు రూ.20,117.59 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ కింద నేరుగా రైతుల ఖాతాలో జమ చేశాం. ఈ పథకం కోసం 2022–23 ఏడాదికి రూ.3,900 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. ►వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద గత ప్రభుత్వ బకాయిలను కూడా కలిపి ఇప్పటి వరకు రూ.3,702.02 కోట్లు రైతుల ఖాతాలో వేశాం. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.1,802 కోట్లు కేటాయిస్తున్నాం. ►వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద గత ప్రభుత్వ బకాయిలతో కలిపి ఇప్పటికే రూ.1,185 కోట్లు ఇవ్వగా, బడ్జెట్లో వచ్చే ఏడాది కోసం రూ.500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలకు రూ.50 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి కేంద్ర కేటాయింపులకు అదనంగా రూ.500 కోట్లు, వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలకు రూ.50 కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ.5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్ద పీట వేయడంతో పాటు పశు సంవర్థక, మత్స్య అభివృద్ధికి రూ.1,568.83 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వైద్య రంగానికి గత ఏడాది కంటే 11.23 శాతం అధికం ►నీతి ఆయోగ్ వైద్య సూచిక 2021 నివేదిక ప్రకారం రెండేళ్ల క్రితం నాల్గవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది. రూ.1,000 కంటే ఎక్కువ ఖర్చు అయ్యే చికిత్సలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ►ఇప్పటికే 1.4 కోట్ల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు జారీ చేశాం. దీంతో 2019–20లో ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే కుటుంబాల శాతం 74.6 నుంచి 2021–22 నాటికి 91.27 శాతానికి చేరుకుందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4వ విడత నివేదికలో పేర్కొంది. ►వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.489.61 కోట్లు, ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ బాధితులకు రూ.732.16 కోట్లు చికిత్స వ్యయాన్ని ప్రభుత్వం భరించింది. 2022–23లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.300 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ►104లను మండలానికి ఒకటి చొప్పున 292 నుంచి 656కు పెంచాం. 560 వైఎస్సార్ పట్టణ క్లినిక్‌లను మంజూరు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం సీతమ్మపేట, పార్వతీపురం, ఆర్‌సీవరం, బుట్టాయిగూడెం, దోర్నాలలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు పాడేరులో గిరిజన వైద్య కళాశాల మంజూరు చేశాం. ►2022–23 సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,384.26 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇది గత బడ్జెట్ ప్రతిపాదన కంటే 11.23 శాతం అధికం. చిన్నారుల సంక్షేమమే లక్ష్యం ►గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు పోషకాహార నాణ్యత పెంపునకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలపై కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల కంటే రూ.1,560 కోట్లు అదనంగా వ్యయం చేశాం. ►కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతను ప్రభుత్వం స్వీకరించింది. ఒక్కో చిన్నారికి రూ.10 లక్షల చొప్పున 298 మందికి పరిహారం ఇచ్చాం. వైఎస్సార్ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా కౌమార దశలో ఉన్న బాలికలకు నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ నా‹ప్కిన్లను ఉచితంగా అందిస్తున్నాం. మహిళా పక్షపాతం ►కేవలం రెండేళ్లలో లింగ సమానత్వ సూచీలోరాష్ట్ర ప్రభుత్వం 12 ర్యాంకులు మెరుగు పరుచుకొని 5వ స్థానానికి చేరుకుంది. వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.12,757.97 కోట్లు స్వయం సహాయక సంఘాలకు విడుదల చేశాం. ఈ పథకానికి 2022–23లో రూ.6,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ►స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు రూ.1,789 కోట్లు చెల్లించగా, బడ్జెట్లో రూ.800 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. చేయూత పథకానికి రూ.4,235.95 కోట్లతో పాటు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.4,322.86 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సంక్షేమ ప్రభుత్వం ►పేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఎన్నికలకు ముందు కొంత మందికి పెన్షన్ పెంచిన వారికి ఇప్పుడు మాట్లాడటానికి అర్హత లేదు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వడానికి వైఎస్సార్ పింఛన్ పథకం కోసం 2022–23 సంవత్సరానికి రూ.18,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ►వైఎస్సార్ బీమా పథకం కోసం రూ.372.12 కోట్లు, వైఎస్సార్ వాహన మిత్ర కోసం రూ.260 కోట్లు, వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.200 కోట్లు, తోపుడు బండ్ల వారి కోసం జగనన్న తోడుకు రూ.25 కోట్లు, రజకులు–కుట్టుపని–నాయిబ్రాహ్మణులకు జగనన్న చేదోడు కోసం రూ.300 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం కోసం రూ.590 కోట్లు, వైఎస్సార్ లా నేస్తం కు రూ.15 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ►అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి, షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసం రూ.18,518 కోట్లు, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక కోసం రూ.6,145 కోట్లు, వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక కోసం 29,143 కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం రూ.3,661 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,537 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. -
సుస్థిర ఇంధన వనరులతోనే సుస్థిరాభివృద్ధి
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులు తగినంతగా ఉన్న భారత్, హరిత హైడ్రోజన్‌కు ప్రపంచ హబ్‌గా మారగలదని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిర ఇంధన వనరులతో మాత్రమే సుస్థిరాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నామన్నారు. ‘సుస్థిరాభివృద్ధికి ఇంధనం’అంశంపై శుక్రవారం జరిగిన వెబినార్‌లో ప్రధాని మాట్లాడారు. హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ ఎరువులు, శుద్ధి కర్మాగారాలు, రవాణా రంగంతో సంబంధం కలిగి ఉందన్నారు. ఇందులోకి ప్రవేశించే ప్రైవేట్ రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. సుస్థిర ఇంధన వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు లక్ష్యాలను విధించుకుందన్నారు. 2070 నాటికి ఉదార్గాలను సున్నా స్థాయికి తీసుకురావడం, 2030 నాటికి మృత్తికేతర విద్యుత్ సామర్థ్యాన్ని 500 గిగావాట్లు సాధించడం, మన విద్యుత్ ఉత్పత్తిలో సగం మృత్తికేతర వనరుల ద్వారా పొందడం లక్ష్యమని వివరించారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే మాడ్యూళ్ల తయారీకి బడ్జెట్లో రూ.19,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇధనాల్ ఉత్పత్తిని పెంచేందుకు చక్కెర మిల్లులను ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ దిశగా ఎదురయ్యే సవాళ్లను మనం అవకాశాలు మార్చుకుంటున్నామని పేర్కొన్నారు. వెబినార్‌లో విదేశాంగ, పెట్రోలియం, సహజవాయువు, పర్యావరణ శాఖల మంత్రులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన విశాఖ; అన్నింటా స్టార్‌గా..
సువిశాల సాగరతీరం.. ఎటుచూసినా కనువిందు చేసే సోయగాలు.. అడుగడుగునా ఆహ్లాదం.. ఇవి కేవలం విశాఖకే సొంతం. అందుకే ఎంతోమంది అందమైన ఈ మహానగరంలో జీవించాలని కోరుకుంటారు. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన సుందరనగరి నీతి ఆయోగ్ ప్రకటించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచికలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంక్‌ను, జాతీయస్థాయిలో 18వ ర్యాంకును సాధించింది. మొత్తం 14 విభాగాల్లో పరిశీలించగా.. 12 విభాగాల్లో 60 శాతానికిపైగా మార్కులు సాధించి.. హైదరాబాద్‌ను సైతం వెనక్కు నెట్టింది. సాక్షి, విశాఖపట్నం: నీతి ఆయోగ్ ఇటీవల వెల్లడించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచిక ర్యాంకుల్లో విశాఖ సత్తా చాటింది. దేశంలోని రాష్ట్రాల రాజధానులు, 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు కలిపి మొత్తం 56 నగరాలకు ర్యాంకులు ఇవ్వగా.. విశాఖ 18వ ర్యాంకు సొంతం చేసుకుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఎన్సీఆర్బీ, జిల్లాస్థాయి విద్యా సమాచారం, వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వాల నుంచి అందిన అధికారిక సమాచారం ఆధారంగా మొత్తం 14 విభాగాల్లో 77 కొలమానాల్ని ప్రాతిపదికగా తీసుకుని నీతిఆయోగ్ ఈ ర్యాంకులు ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించిన నగరాలకు పురోగతిని బట్టి 100 వరకు మార్కులు ఇచ్చారు. 100 మార్కులు సంపాదించిన నగరాలు ఇప్పటికే లక్ష్యాలను చేరుకున్నట్లుగా నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 65–99 మార్కులు సాధించిన నగరాలు ఫ్రంట్ రన్నర్‌గా, 50–64 మార్కులు సాధించినవి కాస్త మంచి పనితీరు కనబరిచినట్లు, 0–49 మార్కులు సాధించిన నగరాలు వెనుకబడినట్లు పేర్కొంది. 68.14 మార్కులతో విశాఖపట్నం ఫ్రంట్ రన్నర్ జాబితాలో నిలిచింది. ప్రశాంతతకు పట్టుగొమ్మగా పేరొందిన నగరంలో విపత్కర పరిస్థితులు తలెత్తవనే నమ్మకమే విశాఖని దేశంలోని మెట్రో సిటీలతో పోటీపడేలా చేస్తోంది. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్ అందర్నీ ఆకర్షిస్తోంది. (చదవండి: ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు: సీఎం వైఎస్ జగన్) అందరూ హాయిగా జీవించేలా.. విశాఖ నగరం సామాన్యుడికి స్వాగతం పలుకుతుంది.. బిలియనీర్‌కి రెడ్ కార్పెట్ వేస్తుంది. నెలకు రూ.3 వేల వేతనంతో జీవించే సగటు జీవి దర్జాగా బతకగల సౌకర్యాలున్నాయి. నెలకు రూ.3 లక్షల వేతనం తీసుకునే ఉద్యోగి విలాసంగా జీవించే ఆధునికతా విశాఖ నగరం సొంతం. అందుకే.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా భాసిల్లుతున్నట్లే విశాఖ మహానగరం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని సొంతం చేసుకుంది. ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలే కాదు.. తమిళనాడు నుంచి కాశ్మీరం వరకు, రాజస్థాన్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు.. అనేక ప్రాంతాలవారు ఇక్కడ నివసిస్తున్నారు. సిటీకి సలాం చేస్తున్నారు. ప్రతి 100 మందిలో 10 మంది వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన సెటిలర్సే ఉన్నారంటే.. విశాఖ ఎలా విశాల నగరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న జనం) మహా నగరాలతో పోటీపడుతూ... ద్వితీయశ్రేణి నగరమే అయినా విశాఖ.. మహా నగరాలతో పోటీపడేలా మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలను సొంతం చేసుకుంది. నౌకా వాణిజ్యానికి, పర్యాటకరంగానికి కేంద్ర బిందువైంది. విస్తరిస్తున్న రియల్ రంగం, సినీ స్టూడియోల నిర్మాణంతో నగరం బ్రాండ్ విలువ క్రమంగా పెరుగుతోంది. కొలువుల విషయంలోనూ విశాఖ పోటీపడుతోంది. పారిశ్రామిక రంగాల్లోను, అరకు వ్యాలీ, సింహాచలం, రుషికొండ, రామకృష్ణ, భీమిలీ బీచ్‌లతో విశాఖ అందాలు, పర్యాటక, హోటల్ రంగాల్లో కొత్త కొలువులను సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత ఐటీ రంగానికి అనువైన ప్రాంతంగా సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు భావిస్తుండటం కూడా స్టార్టప్ కంపెనీల రాకకు ఊతమిస్తోంది. ఆ రెండింటిలో మినహా.. అన్నింటా స్టార్‌గా.. నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లోని 14 విభాగాల్లో విశాఖ నగరం సత్తా చాటింది. రెండు విభాగాలు మినహాయిస్తే.. మిగిలిన అన్నింటిలోను వైజాగ్ తన ప్రత్యేకతని చాటుకుంది. క్లీన్‌వాటర్ అండ్ శానిటేషన్, మంచి జీవన ప్రమాణాల విభాగంలో ఏకంగా 80కి పైగా మార్కులు సొంతం చేసుకుంది. క్లీన్ ఎనర్జీ విషయంలో అత్యల్పంగా 40 మార్కులు సాధించింది. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల్లో వెనుకబడిన విశాఖ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అందుకే ఈ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనలో 46 మార్కులకే పరిమితమైంది. మెట్రో నగరమైన హైదరాబాద్‌తోపాటు విజయవాడ నగరంతో పోలిస్తే.. విశాఖ అన్ని విభాగాల్లోను పైచేయి సాధించింది. 100 మార్కులకుగాను వైజాగ్‌కు 68.14 మార్కులు లభించాయి. 66.93 మార్కులతో హైదరాబాద్ 22వ ర్యాంకులో, 65.07 మార్కులతో విజయవాడ 30వ ర్యాంకులో ఉన్నాయి. -
ఫార్ములా వన్ రేసులు.. సంచలన నిర్ణయం
అసలే ఇంధన ధరలు మండిపోతున్నాయి. దీనికితోడు ఆ ఇంధనాల వల్ల కాలుష్యం పెరిగి పర్యావరణానికి మరింత హాని చేస్తోంది. ఈ తరుణంలో వచ్చే ఫార్ములా వన్ సీజన్ కోసం ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్) సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అత్యున్నత ఆటో రేసింగ్ ఫార్ములా వన్ తరపున ఎఫ్ఐఏ అభినందనీయమైన నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్లో స్థిరమైన ఇంధనాలు(sustainable fuels).. అదీ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. తద్వారా కాలుష్యాన్ని తగ్గించే పనిలో పడింది. ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి ఈ10 ఫ్యూయల్ ఉపయోగించనున్నారు. అయితే ఇప్పటిదాకా ఉపయోగిస్తున్న ఇంధన వనరుల వ్యాపార ఒప్పందాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించనుంది. 2022 ఎఫ్‌వన్ సీజన్ మార్చ్ 20న బహ్రయిన్లో మొదలై.. నవంబర్ 20న అబుదాబిలో ముగియనుంది. ఇక చాలా ఏళ్లుగా రేసింగ్‌లో ఉపయోగించే ఇంధనాల వల్ల కాలుష్యం పెరుగుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ఇంధనాల్లో ఇథనాల్ మిక్సింగ్ మోతాదును పెంచాలని నిర్ణయించారు. రానున్న పదేళ్లకల్లా జీరో కార్బన్ లక్క్ష్యంగా పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఎఫ్ఐఏ. 2025, 2026 నాటికల్లా 100 శాతం స్థిరమైన ఇంధనాలు (sustainable fuels) ఉపయోగ సాధన దిశగా ఎఫ్ఐఏ అడుగులు వేస్తోంది. చదవండి: ఫార్ములా వన్.. సెంచరీ విక్టరీల వీరుడు ఎవరో తెలుసా? -
మౌలిక, విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి అవశ్యం
న్యూఢిల్లీ: భారత్ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి, చిన్న పట్టణాల్లో ఉపాధి కల్పనకు మౌలిక, విద్య, ఆరోగ్య సంరక్షణా రంగాలతోపాటు డిజిటల్ ఎకానమీకి ఊపును ఇవ్వడానికి మరింత కృషి జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 48వ నేషనల్ మేనేజ్మెంట్ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... గతం భవిష్యత్తుకు బాట కావాలి మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించుకోవాలి. పటిష్టమైన, సమగ్రమైన, స్థిరమైన వృద్ధికి పరిస్థితులను సృష్టించుకోవాలి. సంక్షోభం కలిగించిన నష్టాన్ని పరిమితం చేయడం మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో ఇటువంటి సవాళ్లను ఎదుర్కొని, సుస్థిర వృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నం పక్కా ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి. మధ్యకాలిక పెట్టుబడులు, పటిష్ట ఫైనాన్షియల్ వ్యవస్థలు, వ్యవస్థాగత సంస్కరణల ప్రాతిపదికన స్థిర వృద్ధి ప్రణాళికలను రూపొందించాలి. ఈ దిశలో విద్యా, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, భౌతిక, డిజిటల్ ఇన్‌ఫ్రాలపై మరిన్ని పెట్టుబడులు అవసరం. పోటీని, ఇందుకు సంబంధించి చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రోత్సహించడానికి అలాగే మహమ్మారి ప్రేరిత అవకాశాల నుండి ప్రయోజనం పొందడానికి కార్మిక, ఉత్పత్తి మార్కెట్లలో మరింత సంస్కరణలను తీసుకుని రావాలి. గిడ్డంగి, వ్యవ‘సాయం’ కీలకం గిడ్డంగి, సరఫరా చైన్ల పటిష్టత, వ్యవసాయం ప్రత్యేకించి ఉద్యానవన రంగం విలువల పెంపునకు కృషి తత్సంబంధ మౌలిక సదుపాయాల కల్పన చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, సమగ్రాభివృద్ధికి ఎంతో అవసరం. కొన్ని రంగాల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత పథకం (పీఐఎల్) తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన చొరవ. దీనివల్ల ప్రయోజనాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ప్రైవేటు వినయోగం పెరగాలి కరోనా మహమ్మారి అటు అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలలో పేదలపై తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి సవాళ్లు తొలగిపోయిన తర్వాత సుస్థిర పురోభివృద్ధిని సాగించేలా మన ప్రయత్నం ఉండాలి. మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో పడిపోయిన ప్రైవేటు వినియోగం పునరుద్ధరణ జరగాల్సి ఉంది. వృద్ధిలో ఈ విభాగం ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రస్తుతం ప్రపంచాభివృద్ధికి దేశాల మధ్య సమన్వయ సహకారం అవసరం అన్న అంశాన్ని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యాక్సినేషన్ పురోగతిపై అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని కలుపుకుని పోవడం ఒక పెద్ద సవాలే. ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత లాభం జరుగుతుంది. అయితే ఇది కార్మిక మార్కెట్లో మందగమనానికి దారితీసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో శ్రామిక శక్తికి కీలక నైపుణ్యం, శిక్షణ అవసరం. బిలియన్ డాలర్(రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు (యూనికార్న్) 60కు చేరడం ఈ విషయంలో భారత్ పోటీ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. డిజిటల్, ఈ–కామర్స్, ఫార్మా వెలుగులు భారత్ డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. ఇదే ధోరణి కొనసాగే వీలుంది. క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ ట్రబుల్షూటింగ్, డేటా అనలటిక్స్, వర్క్‌ప్లేస్ ట్రాన్స్ఫార్మేషన్, సప్లైచైన్ ఆటోమేషన్, 5జీ మోడరనైజేషన్, సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాల పెంపు వంటి విభాగాల్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దేశంలో భారీగా విస్తరిస్తున్న రంగాల్లో ఈ–కామర్స్ ఒకటి. వృద్ధి చెందుతున్న మార్కెట్, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, కోవిడ్ సవాళ్ల నేపథ్యంలో వినియోగదారు ప్రాధాన్యతల్లో మార్పు వంటి అంశాలు ఈ–కామర్స్ పురోగతికి దోహదపడుతున్నాయి. డిజిటల్ రంగం పురోగగతికి కేంద్రం డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్–అప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు వంటి ఎన్నో చర్యలను తీసుకుని వచి్చంది. దేశంలో పురోగమిస్తున్న రంగాల్లో ఔషధ విభాగం ఒకటి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి ద్వారా భారత్ ఈ విషయంలో తన సత్తా చాటింది. ఇంకా గవర్నర్ ఏమన్నారంటే... è గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లో భారత్ వాటా గణనీయంగా పెరుగుతోంది. ఇది దేశీయ లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు లాభించే అంశం. è ఎగుమతుల రంగం పురోగమిస్తోంది. 2030 నాటికి బారత్ ఇంజనీరింగ్ ఎగుమతుల లక్ష్యం 200 బిలియన్ డాలర్లు. దీని లక్ష్య సాధనకు కృషి జరగాలి. è దేశంలో ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్ పాత్ర కీలకం. ఇటీవల కాలంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలూ ఈ విషయంలో పురోగమిస్తున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. -
3వ స్థానంలో తెలంగాణ
ఆకలి తీర్చడంలో.. ఆకలి తీర్చే అంశంలో తెలంగాణ 36 స్కోరుతో 16వ స్థానంలో నిలిచింది. గోవా (76), మిజోరం (75), కేరళ (74) తొలి 3 స్థానా ల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 29.3% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. గర్భిణు ల్లో 49.8%మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. 6–59 నెలల వయసు గల చిన్నారుల్లో 37.8% మంది రక్తహీనత తో, 4 ఏళ్ల లోపు బాలల్లో 30.8 % బరువులోపంతో బాధపడుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో తెలంగాణ మూడో ర్యాంకును సాధించింది. భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సూచీ–2019 నివేదికను నీతిఆయోగ్ సోమవారం ఇక్కడ విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు–2030 అమలు దిశగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతి ఆధారంగా ఈ నివేదిక రూ పొందించింది. తొలిసారిగా 2018లో ఈ సూచీని రూపొందించిన నీతిఆయోగ్.. ఈ సూచీ రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచాలని ఆకాంక్షించింది. 2018లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ 2019లో 67 స్కోరుతో మూడో స్థానానికి ఎగబాకింది. ఇక దేశ సగటు స్కోరు 60గా ఉంది. పేదరిక నిర్మూలనలో.. పేదరిక నిర్మూలనలో 72 స్కోర్‌తో తమిళనాడు నంబర్‌వన్‌గా నిలవగా, 52 స్కోరుతో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో 66.40% మంది ఏదో ఒక వైద్య బీమా పథకంలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో 84.40% మంది కి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద పని లభిస్తోంది. అర్హులైన వారిలో 12.2% మహిళలకు ప్రసూ తి ప్రయోజనాలు లభిస్తున్నాయి. 1.5% రాష్ట్ర జనా భా కచ్చా గృహా ల్లో నివాసముంటోంది. రాష్ట్రంలో వైద్యుల కొరత మంచి ఆరోగ్యం, ప్రజాశ్రేయస్సులో 82 స్కోరుతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ 66 స్కోరుతో 7వ స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో మాతృత్వ మరణాల రేటు (ఎంఎంఆర్) ప్రతి లక్ష మందికి 76గా నమోదైంది. ఆస్పత్రుల్లో ప్రసవాలు 71.8 శాతం జరుగుతున్నాయి. ఐదేళ్లలోపు బాలల మరణాల రేటు ప్రతి 1,000 మందికి 32గా ఉంది. 0–5 ఏళ్ల పిల్లలో టీకాలన్నీ వేయించుకున్న వారు 70.1%ఉన్నారు. ప్రతి లక్ష మందిలో క్షయవ్యాధిగ్రస్తులు 142 మంది ఉన్నారు. ప్రతి 1000 మందిలో కొత్తగా హెచ్ఐవీ సోకినవారు 0.26 మంది ఉన్నారు. ప్రతి 10 వేల జనాభాకు 44.5 మంది వైద్యులు, నర్సులుండాల్సి ఉండగా, తెలంగాణలో 11 మంది మాత్రమే ఉన్నారు. ఉన్నత విద్యలో ప్రవేశాలు అంతంతే.. నాణ్యమైన విద్యలో హిమాచల్‌ప్రదేశ్, కేరళ తొలి 2 స్థానాల్లో ఉండగా.. తెలంగాణ 9వ ర్యాంకు సాధించింది. 1–10వ తరగతి వరకు ప్రవేశాల రేటు తెలంగాణలో 82.54% ఉంది. ప్రాథమికోన్నత విద్య స్థాయి లో 22.49% డ్రాపౌట్స్ నమోదయ్యాయి. ఇక 18 నుంచి 25 ఏళ్ల మధ్య వారిలో కేవలం 36.2 % మంది ఉన్నత విద్య ప్రవేశాలు పొందుతున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను బోధించేవారిలో 46.95% మాత్రమే సుశిక్షితులున్నారు. 16 లక్ష్యాలు.. 2011 నుంచి డేటా 2011 జనగణనను, నాలుగైదేళ్ల క్రితం నుంచి 2019 వరకు గల గణాంకాలను ఆధారంగా దాదాపు 62 అంశాలను పరిగణనలోకి తీసుకుని 16 లక్ష్యాలకు స్కోరు కేటాయించారు. కేంద్ర గణాంకాలు, పథక అమలు శాఖ, గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్, ఐక్యరాజ్యసమితి సహకారంతో నీతిఆయోగ్ ఈ సూచిని రూపొందిం చింది. వివిధ స్కోర్ల ఆధారంగా 4 కేటగిరీ లుగా రాష్ట్రాలను విభజించింది. 0 నుంచి 49 స్కోరు సాధించిన రాష్ట్రాలను ఆశావహులు(ఆస్పిరెంట్), 50 నుంచి 64 స్కోరు సాధించిన రాష్ట్రాలను క్రియాశీలురు (పర్ఫార్మర్), 65 నుంచి 99 స్కోరు సాధించిన రాష్ట్రాలను ముందు వరస (ఫ్రంట్ రన్నర్)గా, 100 స్కోరు సాధించిన రాష్ట్రాలను సాధకులు (అచీవర్)గా విభజించింది. 2018లో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఫ్రంట్రన్నర్లో నిలిచాయి. ఈసారి 8 రాష్ట్రాలు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో చోటు సాధించాయి. వీటిలో తెలంగాణతో పాటు కర్ణాటక, సిక్కిం, గోవా కూడా ఉన్నాయి. కేరళ (70) మొదటిస్థానంలో, హిమాచల్ ప్రదేశ్ (60) రెండోస్థానంలో నిలిచింది. -
రిలయన్స్ నుంచి 'సస్టైనబుల్ ఫ్యాషన్'
సాక్షి, ముంబై: టెలికాం రంగంలో ఇటీవల జియో సాధించిన విజయం నుంచి పొందిన స్ఫూర్తితో.... పర్యావరణహిత (సస్టెయినబుల్) దుస్తులను సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ముందుకు వచ్చింది. 'సస్టైనబుల్ ఫ్యాషన్'కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్ఐఎల్ పెట్రోకెమికల్స్ విభాగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విపుల్ షా మాట్లాడుతూ పర్యావరణహిత నుంచి ఫ్యాషన్ ను తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామనీ, ఇదొక సుస్థిరదాయక కార్యక్రమని అన్నారు. తాము ఈ సస్టైనబుల్ ఫ్యాషన్‌ను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని.. ఇది కూడా ఒక రకమైన కార్పోరేట్ సామాజిక బాధ్యత కిందకే వస్తుందన్నారు. రిలయన్స్ పెట్రో ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడంలో ప్రపంచం మొత్తంలో తొలి కంపెనీ తమదే అన్నారు. భారతదేశంలో పెట్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసే ఏకైక కంపెనీ రిలయన్స్ మాత్రమేనని, ఏటా రెండు బిలియన్ల మేరకు ఉపయోగించిన పెట్ బాటిల్స్ ను ప్రాసెస్ చేస్తోందన్నారు. ప్రకృతికి ఎలాంటి హాని కలగని రీతిలో అతి తక్కువ కర్బన పదార్ధాలతో ఉండే దుస్తులను యువతరం కోరుకుంటోంది. ప్రతీ సంవత్సరం దాదాపు రెండు బిలియన్ల బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తున్నామని షా తెలిపారు. దీనిని రాబోయే రెండేళ్లలో ఆరు బిలియన్లకు పెంచాలన్నదే తమ లక్ష్యమని విపుల్ స్పష్టం చేశారు. ఈ విధానంలో తాము అనుసరించే విధానం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.రానున్న రెండేళ్ళలో దాన్ని ఆరు బిలియన్లకు పెంచాలని భావిస్తోంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా అందుబాటు ధరల్లో ఉండేలా, అందరినీ చేరుకునేలా సుస్థిరదాయక ఫ్యాషన్ కు అవసరమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమనం కంపెనీ చెబుతోంది. ఒక వ్యూహం ప్రకారం రిలయన్స్ సుస్థిరదాయక ఫైబర్ ను, దుస్తులకు అది అందించే విశిష్టతలను ఆధారంగా చేసుకొని, అవే విశిష్టతలను అందించే సుస్థిరేతర ఉత్పాదనలకంటే పోటీ ధరలకు అందించాలని యోచిస్తోంది. ఈత దుస్తులు మొదలుకొని చలికాలపు దుస్తులు, బ్యాక్ ప్యాక్స్ దాకా అన్నిటికీ అంతర్జాతీయ బ్రాండ్లు రీసైకిల్డ్ మెటీరియల్ తో తయారు చేయనుంది. వ్యర్థ పెట్ బాటిల్స్ సేకరణ, వాటిని పర్యావరణ స్నేహపూర్వక ఫైబర్స్ గా రెక్రాన్ గ్రీన్ గోల్డ్ గా మార్చడం, టెక్స్ టైల్ వాల్యూ చెయిన్ లో వాటిని మరింత దిగువకు తీసుకెళ్తూ, ఫైబర్స్ ను అధిక విలువ కలిగిన స్లీప్ ఉత్పాదనలుగా, ఆర్ఎలాన్ ఆధారిత ఫ్యాషన్ దుస్తులుగా మార్చడం దాకా ఒక వలయాకారంలో ఈ ప్రక్రియ ఉంటుంది. ఉపయోగించిన పెట్ బాటిల్స్ ద్వారా ఉత్పత్తి చేసే గ్రే ఫైబర్ రెక్రాన్ గ్రీన్ గోల్డ్, డోప్ డైడ్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ అనేది రెక్రాన్ గ్రీన్ గోల్డ్ ఎకో డి బ్రాండ్‌గా గుర్తింపు పొందాయనీ, ఈ పర్యావరణ స్నేహపూర్వక ఫైబర్స్ రిలయన్స్ రేపటి తరపు ఫ్యాబ్రిక్ శ్రేణి బ్రాండ్ అయిన ఆర్ఎలాన్ ఫ్యాబ్రిక్ 2.0 కు సుస్థిరదాయకత శక్తిని అందిస్తాయని షా తెలిపారు. 'సాధారణంగా వాటర్ బాటిల్స్‌ను ఖాళీ చేసిన తర్వాత వాటినే పారేస్తాం. కానీ వీటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. త్వరగా మట్టిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ డబ్బాలు నగరాలు, పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడతాయి' అని షా పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఉపయోగకరమైన ఉత్పాదనలుగా మార్చడం అనే భావనపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఒక బాధ్యతాయుత కార్పొరెట్ గా రిలయన్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2000 సంవత్సరానికి పూర్వమే ఇది మొదలైందన్నారు. అంతర్గత చర్యలను పటిష్ఠం చేసుకోవడంతో పాటుగా, యార్న్, టెక్స్ టైల్ తయారీదారులు, అగ్రగామి దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, రిటైలర్లు, ఫ్యాషన్ హౌస్ ప్రతినిధులతో కూడుకొని ఉన్నతన హబ్ ఎక్స్ లెన్స్ ప్రోగ్రామ్ ద్వారా యావత్ టెక్స్ టైల్ పరిశ్రమతో సన్నిహితంగా కలసి పని చేస్తోంది. ఈ క్రమంలో యార్న్, టెక్స్టైల్, దుస్తుల తయారీదారులతో తమకంపెనీ భాగస్వామిగా మారింది. కో-బ్రాండెడ్ వస్త్రాలు, దుస్తులు తయారు చేసేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించింది. యారో, రాంగ్లర్, రేమండ్, లీ లతో సహా ఇతర అంతర్జాతీయ బ్రాండ్లతో అది ఇప్పటికే భాగస్వామిగా మారిందని షా పేర్కొన్నారు. -
యువజనోత్సాహం
దేహముంది.. ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది అంతకంటే సైన్యముండునా అని ఒక సినీకవి చెప్పినట్లు యువతకు మించిన శక్తి లేదు. వారు ఉంటేనే దేశ భవితకు పటిష్టమైన పునాదులు పడతాయి. దేశాల సమగ్రాభివృద్ధి జరుగుతుంది. అందుకే యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు.. భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఏటా ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుతోంది. 2000 సంవత్సరం నుంచి ఐరాస ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో ముందుకొస్తోంది. అలా చేయడం వల్ల ఆ అంశంపై యువతలో, వివిధ దేశాల ప్రభుత్వాల్లో, యువత సంక్షేమం కోసం పనిచేసే సంస్థల్లో అవగాహన పెరిగి, ఆ రంగంలో యువత పాత్రను పెంపొందించే దిశగా కృషి చేస్తోంది. ‘విద్యావ్యవస్థలో మార్పులు’అన్న థీమ్‌తో యువజన దినోత్సవాన్ని జరుపుతోంది. జీవనం సాగించేందుకు అవసరమయ్యే విద్య యువతరానికి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 2030 నాటికి ప్రపంచదేశాలు సుస్థిర అభివృద్ధి సాధించాలన్న సందేశాన్నిస్తోంది. నిపుణుల కొరత తీరాలంటే అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలన్న నినాదంతో ఈసారి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఐరాస సభ్యదేశాల్లో ప్రభుత్వాలు, యువత సంక్షేమం కోసం పనిచేసే సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు 2030 నాటికి విద్యావ్యవస్థలో మార్పుల ద్వారా యువత బంగారు భవిష్యత్‌కు ఎలాంటి బాటలు వేయొచ్చో.. వారు తీసుకునే చర్యలేంటో ఐరాస పరిశీలించనుంది. నిరుపేద దేశాల్లో 10 శాతం యువత సెకండరీ ఎడ్యుకేషన్ మాత్రమే పూర్తి చేయగలుగుతోంది. ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి మాతృ భాషలో విద్యాబోధన జరగట్లేదు. శరణార్థుల్లో 75 శాతానికి పైగా మందికి సెకండరీ విద్య కూడా అందుబాటులో లేదు. ఇలాంటి అసమానతలు తొలగిపోయి అందరికీ విద్య అందుబాటులోకి వస్తేనే ఏ దేశ ప్రగతి అయినా సాధ్యమని ఐరాస అంటోంది. -
మంచంపట్టిన ప్రజారోగ్యం
‘దండిగా ఉండే బంగారం, వెండి నిల్వల కంటే మించిన నిజమైన సామాజిక సంపద ప్రజారోగ్యమే’ అన్నారు మహాత్మా గాంధీ. ఇంత అపురూపమైన సంపదను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని తాజా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీ వెల్లడించింది. ఈ గణాంకాలు 2017–18కి సంబంధించినవి. ఆరోగ్యరంగంలో మెరుగైన పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాల్లో ఎప్పటిలాగే కేరళ 74.01 స్కోర్‌తో అగ్ర భాగాన ఉంది. తదనంతర స్థానాల్లో ఆంధ్రప్రదేశ్(65.13), మహారాష్ట్ర(63.99), గుజరాత్(63.52), పంజాబ్(63.01), హిమాచల్‌ప్రదేశ్(62.41), జమ్మూ–కశ్మీర్(62.37), కర్ణాటక (61.14), తమిళనాడు(60.41) వగైరాలున్నాయి. ఈమధ్యకాలంలో మెదడువాపు వ్యాధితో 170 మందికిపైగా పసిపిల్లలు మరణించిన బిహార్ 32.11తో, ఆ మాదిరి నాసిరకం వైద్య సేవలతో ఉత్తర ప్రదేశ్ 28.61తో అట్టడుగున ఉన్నాయి. రెండేళ్లక్రితం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 600మంది పిల్లలు మెదడువాపు వ్యాధి బారినపడి కన్నుమూశారు. నీతి ఆయోగ్ మంచి పనితీరును ప్రదర్శించా యంటున్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నమాట వాస్తవమే అయినా వాటి స్కోరు కనీసం 80 వరకూ వెళ్తేనే అవి ఆరోగ్యరంగంలో అన్నివిధాలా పటిష్టంగా ఉన్నట్టు లెక్క. ఆ సంగతలా ఉంచి ఆరోగ్య సేవల కల్పనలో రాష్ట్రాల మధ్య ఇంతగా వ్యత్యాసం ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రాలమధ్యే కాదు– దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నగరాలకూ, పట్టణాలకూ... పట్టణాలకూ, గ్రామాలకూ మధ్య కూడా ఇలాంటి వ్యత్యాసాలే ఉన్నాయి. మైదాన ప్రాంతాలకూ, ఆదివాసీ ప్రాంతాల మధ్యా ఇదే వరస. మరో దశాబ్దకాలంలో...అంటే 2030నాటికి ప్రపంచంలోని ప్రతి దేశమూ సుస్థిరాభివృద్ధి లక్ష్యా లను(ఎస్డీజీ) సాధించాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది. ఆ లక్ష్యాల్లో ‘అందరికీ, అన్నిచోట్లా’ సార్వత్రిక ఆరోగ్య సదుపాయం’ లభించడం కూడా ఒకటి. ఎంతటి అనారోగ్య సమస్య ఎదురైనా ఆర్థికపరమైన చిక్కుల్లో పడకుండా దాన్నుంచి పౌరులు బయటపడగలిగే స్థితి ఏర్పరచాలన్నదే ‘సార్వత్రిక ఆరోగ్య సదుపాయం’ సారాంశం. కానీ నీతిఆయోగ్ ఆరోగ్య సూచీని చూస్తే మన దేశంలో ఆ దిశగా బుడిబుడి అడుగులైనా పడుతున్నాయా అన్న సందేహం కలుగుతుంది. నీతిఆయోగ్ 2015 నుంచి ఏటా ఈ ఆరోగ్య సూచీని విడుదల చేస్తోంది. విషాదమేమంటే వీటిని గమనించుకుని సరి చేసుకోవాలని, ఇకపై మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించాలని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్న దాఖ లాలు లేవు. అత్యధిక రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనీస పారిశుద్ధ్యం కొరవడి వైరస్‌లతో, బాక్టీరియాతో నిండి ఉంటున్నాయి. ఎక్కడా కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండటం లేదు. మందులు లేక, వైద్యులు లేక ఆసుపత్రులన్నీ అల్లాడుతున్నాయి. మొన్న అనేకమంది పసిపిల్లల ప్రాణాలు తీసిన ముజఫర్‌పూర్ ఆసుపత్రి దుస్థితి ఇదే. అక్కడ వెంటనే పిల్లలకు గ్లూకోజ్ అందిం చగలిగి ఉంటే వారిలో చాలామంది ప్రాణాలు నిలబడేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలు మాత్రమే కాదు... ఏటా విడుదలయ్యే జాతీయ శాంపిల్ సర్వే వంటివి కూడా ఎన్నో అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, లాన్సెట్ కూడా అడపా దడపా హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడా కదలిక ఉండటం లేదు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ జనం ఆరోగ్యానికి పెట్టే ఖర్చులు తడిసి మోపెడై అప్పుల బారినపడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. కొన్ని కుటుంబాల్లో తలసరి వినిమయం కన్నా ఆరోగ్య వ్యయమే అధికంగా ఉంటున్నదని తేల్చిచెప్పింది. జమైకా, బొలీవియా, వియత్నాం వంటి దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులు చికిత్స కోసం చేసే వ్యయం బాగా ఎక్కువ. ఆర్థిక సంస్కరణల తర్వాత మన ఆర్థిక వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి చెందింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) పుంజుకుంటోంది. కానీ దానికి దీటుగా ప్రామాణికమైన వైద్య సేవలు అందు బాటులోకి రావడం లేదు. సంపన్నులకు మాత్రమే అవి దక్కుతున్నాయి. ఇప్పుడు 23 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నీతిఆయోగ్ ఆరోగ్య సూచీని రూపొందించింది. అందులో నవజాత శిశు మరణాలు, శిశు మరణాలు, సంతాన సాఫల్యత రేటు, తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్య, వ్యాధి నిరోధకత, క్షయవ్యాధి, మౌలిక సదుపాయాలు, హెచ్ఐవీ వంటివి అరికట్టడంలో సాధిస్తున్న పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో సాధిస్తున్న ప్రగతి వగైరా అంశాలు అందులో ఉన్నాయి. నిరుటితో పోలిస్తే యూపీ, జార్ఖండ్ వంటివి స్వల్పంగా మెరుగైతే, తమిళనాడు స్థితి దిగజారింది. నిజానికి రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్ని దారుణాలు చోటు చేసుకున్నాయో లెక్కలేదు. బ్యాటరీ లైట్ల వెలుగులో శస్త్రచికిత్సలు, నవజాత శిశువులు ఎలుకలు కొరకడం వల్ల, చీమలు కుట్టడంవల్ల మరణించిన ఉదంతాలు బాబు పాలనలో జరిగి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆరోగ్యశ్రీ, 108 వంటి ప్రాణప్రదమైన సేవలు నామమాత్రంగా మారాయి. నీతిఆయోగ్ ప్రాతిపదికల్లో ఇంకా అంటురోగాలు, మానసిక అనారోగ్యం, భయంకర వ్యాధులు వగైరాలను చేరిస్తే వాస్తవ చిత్రం మరింత స్పష్టంగా వెల్లడవుతుంది. సకాలంలో వైద్య సదుపాయం అందించగలిగితే జాతీయ స్థాయిలో సంభవించే మరణాల్లో కనీసం మూడోవంతు నిరోధించడం సాధ్యమేనని నిరుడు జాతీయ శాంపిల్ సర్వే వెల్లడించింది. మనతో సమానమైన తలసరి ఆదాయం గల దేశాలూ, తక్కువగా ఉన్న దేశాలు కూడా ఆరోగ్య రంగంలో మనకంటే ఎంతో మెరుగ్గా ఉంటు న్నాయి. మన దేశం ప్రజారోగ్యానికి కేటాయించే మొత్తం జీడీపీలో 1.02శాతం మించడం లేదు. దాన్ని 2.5 శాతానికి తీసుకెళ్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. చాలా దేశాలు ప్రజారోగ్యానికి 9.2 మొదలుకొని అయిదు శాతం వరకూ ఖర్చు చేస్తున్నాయి. కనుక కేటాయింపుల్ని మరింత పెంచి దేశంలో ప్రజారోగ్యరంగాన్ని పటిష్టం చేయడం తక్షణ కర్తవ్యమని పాలకులు గుర్తించాలి. -
ఆందోళనకు గురిచేస్తోన్న ఐఎల్ఓ గణాంకాలు..
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) విడుదల చేసిన గణాంకాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చెక్కుపై ఒక్క సంతకంతో లక్షల రూపాయలు సంపాదిస్తున్న నేటి కాలంలో పూట గడవక పిల్లల్ని పనికి పంపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని ఐఎల్ఓ నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 152 మిలియన్ మంది బాల కార్మికులు ఉన్నారని.. వారిలో చాలా మంది ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చేసే కర్మాగారాల్లో పనిచేస్తున్నారని వెల్లడించింది. వీరిలో ఐదు నుంచి పదిహేడేళ్ల వయస్సు లోపు వారే అధికంగా ఉన్నారని పేర్కొంది. పారిశుద్ధ్యం, భవన నిర్మాణం, వ్యవసాయం, గనులు, ఇళ్లలో పని చేసే బాల కార్మికుల సంఖ్య పెరుగుతోందని ఐఎల్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వారి బాల్యాన్ని హరించడంతో పాటు ఆరోగ్యంపై, ప్రవర్తనపై దుష్ప్రభావాన్ని చూపుతుందని.. విద్యకు దూరమవడం వల్ల భవిష్యత్ అంధకారంగా మారుతోందని పేర్కొంది. ఇటీవలి కాలంలో 5 నుంచి 11 సంవత్సరాల వయస్సున్న బాల కార్మికుల సంఖ్య 19 మిలియన్లకు చేరిందని వెల్లడించింది. అదే విధంగా కర్మాగారాల్లో పని చేసే బాలికల సంఖ్య 28 మిలియన్లు, బాలల సంఖ్య 45 మిలియన్లుగా ఉందని ఐఎల్ఓ నివేదికలో పేర్కొంది. నానాటికీ పెరుగుతున్న బాల కార్మికుల మరణాలు.. భారతదేశంలో అక్రమంగా జరుగుతున్న మైకా గనుల తవ్వకాల కారణంగా కేవలం రెండు నెలల్లో ఏడుగురు బాల కార్మికులు మరణించారని 2016లో రాయిటర్స్ పరిశోధనాత్మక నివేదిక వెల్లడించింది. మైకా ఉత్పత్తి చేస్తున్న ప్రధాన రాష్ట్రాలైన బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లలో మూడు నెలలపాటు జరిపిన సర్వేలో బాలకార్మికులను ఎక్కువగా నియమించుకున్నట్లు వెల్లడైందని పేర్కొంది. మైకా గనుల్లో పనిచేసే బాల కార్మికులు తీవ్ర అనారోగ్యం పాలవడంతో మరణాలు సంభవిస్తున్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఐఎల్ఓ ఎజెండా.. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐఎల్ఓ-2018 నివేదికను రూపొందించింది. ఇందులో భాగంగా పని ప్రదేశాల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల గురించి ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించనుంది. సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ప్రపంచదేశాలు 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా అంతం చేసేలా కృషి చేయడంతో పాటు కార్మికుల ఆరోగ్యం, భద్రత గురించి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఐఎల్ఓ పేర్కొంది.