రిలయన్స్ నుంచి 'సస్టైనబుల్ ఫ్యాషన్' | Reliance Industries aims to make sustainable clothing affordable | Sakshi
Sakshi News home page

పర్యావరణహిత దుస్తులు, అందుబాటు ధరల్లో - రిలయన్స్ 

Published Mon, Sep 16 2019 7:00 PM | Last Updated on Mon, Sep 16 2019 7:35 PM

Reliance Industries aims to make sustainable clothing affordable - Sakshi

సాక్షి, ముంబై: టెలికాం రంగంలో ఇటీవల జియో సాధించిన విజయం నుంచి పొందిన స్ఫూర్తితో.... పర్యావరణహిత (సస్టెయినబుల్) దుస్తులను సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ముందుకు వచ్చింది. 'సస్టైనబుల్ ఫ్యాషన్'కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఆర్ఐఎల్ పెట్రోకెమికల్స్ విభాగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విపుల్ షా మాట్లాడుతూ పర్యావరణహిత నుంచి ఫ్యాషన్ ను తీసుకువచ్చేందుకు తాము  ప్రయత్నిస్తున్నామనీ, ఇదొక సుస్థిరదాయక కార్యక్రమని అన్నారు.  తాము ఈ సస్టైనబుల్ ఫ్యాషన్‌ను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని.. ఇది కూడా ఒక రకమైన కార్పోరేట్ సామాజిక బాధ్యత కిందకే వస్తుందన్నారు.  రిలయన్స్ పెట్రో ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడంలో ప్రపంచం మొత్తంలో తొలి కంపెనీ తమదే అన్నారు. భారతదేశంలో పెట్  బాటిళ్లను రీసైక్లింగ్ చేసే ఏకైక కంపెనీ రిలయన్స్ మాత్రమేనని,  ఏటా రెండు బిలియన్ల మేరకు ఉపయోగించిన పెట్ బాటిల్స్ ను ప్రాసెస్ చేస్తోందన్నారు.

 ప్రకృతికి ఎలాంటి హాని కలగని రీతిలో అతి తక్కువ కర్బన పదార్ధాలతో ఉండే దుస్తులను యువతరం కోరుకుంటోంది.  ప్రతీ సంవత్సరం దాదాపు రెండు బిలియన్ల బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తున్నామని షా తెలిపారు. దీనిని రాబోయే రెండేళ్లలో ఆరు బిలియన్లకు పెంచాలన్నదే తమ లక్ష్యమని విపుల్ స్పష్టం చేశారు. ఈ విధానంలో తాము అనుసరించే విధానం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.రానున్న రెండేళ్ళలో దాన్ని ఆరు బిలియన్లకు పెంచాలని భావిస్తోంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా అందుబాటు ధరల్లో ఉండేలా, అందరినీ చేరుకునేలా సుస్థిరదాయక ఫ్యాషన్ కు అవసరమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమనం కంపెనీ చెబుతోంది.

ఒక వ్యూహం ప్రకారం రిలయన్స్ సుస్థిరదాయక ఫైబర్ ను, దుస్తులకు అది అందించే విశిష్టతలను ఆధారంగా చేసుకొని, అవే విశిష్టతలను అందించే సుస్థిరేతర ఉత్పాదనలకంటే పోటీ ధరలకు అందించాలని యోచిస్తోంది. ఈత దుస్తులు మొదలుకొని చలికాలపు దుస్తులు, బ్యాక్ ప్యాక్స్ దాకా అన్నిటికీ అంతర్జాతీయ బ్రాండ్లు రీసైకిల్డ్ మెటీరియల్ తో తయారు చేయనుంది.  వ్యర్థ పెట్ బాటిల్స్ సేకరణ, వాటిని పర్యావరణ స్నేహపూర్వక ఫైబర్స్ గా రెక్రాన్ గ్రీన్ గోల్డ్ గా మార్చడం, టెక్స్ టైల్ వాల్యూ చెయిన్ లో వాటిని మరింత దిగువకు తీసుకెళ్తూ, ఫైబర్స్ ను అధిక విలువ కలిగిన స్లీప్ ఉత్పాదనలుగా,  ఆర్ఎలాన్ ఆధారిత ఫ్యాషన్ దుస్తులుగా మార్చడం దాకా ఒక వలయాకారంలో ఈ ప్రక్రియ ఉంటుంది.

ఉపయోగించిన పెట్ బాటిల్స్ ద్వారా ఉత్పత్తి చేసే గ్రే ఫైబర్ రెక్రాన్ గ్రీన్ గోల్డ్,  డోప్ డైడ్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ అనేది రెక్రాన్ గ్రీన్ గోల్డ్ ఎకో డి బ్రాండ్‌గా గుర్తింపు పొందాయనీ,  ఈ పర్యావరణ స్నేహపూర్వక ఫైబర్స్ రిలయన్స్ రేపటి తరపు ఫ్యాబ్రిక్ శ్రేణి బ్రాండ్ అయిన ఆర్ఎలాన్ ఫ్యాబ్రిక్ 2.0 కు సుస్థిరదాయకత శక్తిని అందిస్తాయని  షా తెలిపారు.  'సాధారణంగా వాటర్ బాటిల్స్‌ను ఖాళీ చేసిన తర్వాత వాటినే పారేస్తాం. కానీ వీటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. త్వరగా మట్టిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ డబ్బాలు నగరాలు, పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడతాయి' అని షా పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఉపయోగకరమైన ఉత్పాదనలుగా మార్చడం అనే భావనపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఒక బాధ్యతాయుత కార్పొరెట్ గా రిలయన్స్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2000 సంవత్సరానికి పూర్వమే ఇది మొదలైందన్నారు.

అంతర్గత చర్యలను పటిష్ఠం చేసుకోవడంతో పాటుగా, యార్న్, టెక్స్ టైల్ తయారీదారులు, అగ్రగామి దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, రిటైలర్లు, ఫ్యాషన్ హౌస్ ప్రతినిధులతో కూడుకొని ఉన్నతన హబ్ ఎక్స్ లెన్స్ ప్రోగ్రామ్ ద్వారా యావత్ టెక్స్ టైల్ పరిశ్రమతో సన్నిహితంగా కలసి పని చేస్తోంది. ఈ క్రమంలో యార్న్, టెక్స్టైల్, దుస్తుల తయారీదారులతో తమకంపెనీ భాగస్వామిగా మారింది. కో-బ్రాండెడ్ వస్త్రాలు, దుస్తులు తయారు చేసేందుకు ఒక వ్యూహాన్ని  రూపొందించింది. యారో, రాంగ్లర్, రేమండ్, లీ లతో సహా ఇతర అంతర్జాతీయ బ్రాండ్లతో అది ఇప్పటికే భాగస్వామిగా మారిందని షా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement