
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సామ్రాజ్యవారసుడు, బిలియనీర్ అనంత్ అంబానీ పుట్టిన రోజంటే ఓ రేంజ్ ఉండాలి. అతిరథమహారథులు, సెలబ్రిటీలు, విశిష్ట అతిథులు..ఇలా బోలెడంతా హంగామా, హడావిడి ఉండాలి అనుకోవడంలో, ఉండటంలో సందేహం లేదు. కానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా, అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈసారి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఏమిటబ్బా అది? నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియో విశేషాలేంటో తెలుసుకుందాం రండి!
అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవల (ఏప్రిల్ 10న) తన 30వ పుట్టినరోజును జరుపుకున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకాధీశ ఆలయానికి అనంత్ అంబానీ 170 కి.మీల పాదయాత్ర చేసిన మరీ తన బర్త్‌డే వేడుకలకు ఒక ఆధ్మాత్మిక వైభవాన్ని తీసుకొచ్చారు. తనకెంతో విశ్వాసమైన భద్రతా సిబ్బంది మధ్య కేక్ కట్ చేయడం విశేషంగా నిలిచింది. అనేకమంది నెటిజన్ల ప్రశంసలందుకుంది. ఆ క్షణం అనంత్ చూపించిన ఆప్యాయత, సర్‌ప్రైజ్ అందరినీ ఆకర్షించింది.
నల్లటి పట్టు కుర్తా పైజామాలో మెరిసిపోతున్న బర్త్‌డే బోయ్‌కి పూల బొకేను అందించింది సెక్యూరిటీ టీం (Security guards). వారి అభినందనలు, కేరింతల మధ్య అనంత్ ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. అంబానీ అప్‌డేట్స్ ఇన్‌స్టాగ్రామ్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబ వారసుడు ఇలా నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం నెటిజనులకు తెగ నచ్చేసింది. వీడియో అంబానీ కుటుంబానికి, అతని బాడీ గార్డులకు మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయతలకు నిదర్శనం అంటున్నారు అభిమానులు.

అనంత్ అంబానీ మాజీ నానీ భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలు
అనంత్‌కి వచ్చిన అనేక పుట్టినరోజు సందేశాలలో మరో ప్రత్యేకమైంది ఉంది. అదేంటీ, అంటే తనకి చిన్నప్పుడు నానీగా పనిచేసిన లలితా డిసిల్వా, చిన్న అనంత్ సాంప్రదాయ దుస్తులు ధరించి, ఛాతీపై చిన్న భారతీయ జెండాను ధరించి ఉన్న అనంత్ చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేశారామె. ఆ ఫోటోతో పాటు, లలిత ఒక భావోద్వేగ అభినందను రాసుకొచ్చారు.
“నా అనంత్‌కి బోలెడన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు అతన్ని దీవించుగాక. నా అనంత్ ఇప్పుడు చాలా పెద్దవాడు. అతను జంతువులను అమితంగా ప్రేమించే తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. జంతువుల భద్రత కోసం మీరు చేసిన కృషికి అనంత్, లవ్యూ...మీ రోజును ఆస్వాదించండి, అందమైన పుట్టినరోజు. శుభాకాంక్షలు’’