birthday bash
-
నిహారిక బర్త్‌డే సెలబ్రేషన్స్ .. దగ్గరుండి కేక్ కట్ చేయించిన అన్నావదిన (ఫోటోలు)
-
బర్త్‌డే వేడుకల్లో బీభత్సం: కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరి, రచ్చ..రచ్చ!
పుట్టినరోజు సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసిన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పటాకులు పేల్చి, కరెన్సీ నోట్లకు గాల్లోకి విసరడమే కాకుండా, స్థానికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించి అసభ్యకరంగా దూషించి ఘటన కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నంద్‌గ్రామ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) రవి కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం ముగ్గురు వ్యక్తులు పుట్టిన రోజు వేడుకల్లో బీభత్సం సృష్టించారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోపల కారు పైకప్పుపై నిలబడి విచ్చల విడిగా బాణా సంచా కాల్చడంతోపాటు కరెన్సీని గాల్లోకి విసిరి గలాటా సృష్టించారు. అంతేకాదు దీన్నిప్రశ్నించిన అపార్ట్మెంట్ వాసులను దుర్భాషలాడారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అపార్ట్మెంట్ ఓనర్స్ సంఘం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. @ghaziabadpolice @DCPCityGZB #Ghaziabad pic.twitter.com/Q97dZabFch — Ajnara Integrity AOA (@integrityaoa) October 29, 2023 https://t.co/Nlf6IPi1Le — DCP CITY COMMISSIONERATE GHAZIABAD (@DCPCityGZB) October 29, 2023 -
ఏడడుగుల బంధానికి ఏడేళ్ల గుర్తుగా.. చెట్టుకి పుట్టినరోజు..
వికారాబాద్: ఆలుమగల అనుబంధానికి గుర్తుగా మిగిలింది ఆ వృక్షం. భర్త బతుకున్న రోజుల్లో కలిసి నాటిన మొక్క నేడు మానువైనా.. మనువాడినవాడికి తీపపిగుర్తుగా మలచుకొని.. ఆ పచ్చని చెట్టువద్దే ఏటా అతడి జన్మదిన వేడుకలు నిర్వహిస్తోంది ఓ ఇల్లాలు.తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, వెంకటయ్య భార్యభర్తలు. ఏడేళ్ల క్రితం వెంకటయ్య జన్మదినం సందర్భంగా చించోళి రోడ్డు మార్గంలో ఉన్న వారి నివాసం ఎదుట ఇద్దరూ కలిసి ఓ మొక్క నాటారు. ఏడాది తర్వాత వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టువద్దే వెంకటయ్య జయంతి వేడుకలు నిర్వహించే వారు. రోడ్డు విస్తరణలో భాగంగా చెట్టును అక్కడి నుంచి తొలగించాల్సి రావడంతో వేర్లతో సహా చెట్టును తీసుకెళ్లి తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నాటారు. కాగా శనివారం భర్త వెంకటయ్య జయంతి కావడంతో అదే చెట్టు వద్ద భార్య, బంధువులు వేడుకలు నిర్వహించారు. -
ప్రియుడి బర్త్‌డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఇటీవల (జూన్ 26) పుట్టినరోజు వేడుకును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.అతని ప్రేయసి మలైకా అరోరా స్టార్ ప్రింటెడ్ బాడీకాన్ డ్రెస్‌లో దిల్ సే చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్ ఛైయ్యా ఛైయ్యాకు డ్యాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసింది. సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ బర్త్ డే బాష్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్న మలైకా అరోరా బాడీకాన్ డ్రస్ ఎంత అనే చర్చ జోరందుకుంది. దీని ధర అక్షరాల 99వేల రూపాయలట. మలైకా అరోరా రిబ్బడ్ బాడీకాన్ డ్రెస్ స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవేకి చెందిన రిబ్బెడ్ కాటన్ జెర్సీలో ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అంటారు. స్లీవ్‌లెస్ వైట్ గౌన్‌పై ఎరుపు రంగు ఆంథూరియం పువ్వులను అందంగా డిజైన్ చేశారు. మలైకా వైట్ అండ్ రెడ్ గౌనులో మెరిసిపోవడమేకాదు, కిల్లింగ్ స్టెప్స్‌తో ఇరగదీసింది. ఈ వేడుకలో అతని సోదరి ఖుషీ కపూర్, అన్షులా కపూర్‌తో పాటు ఆమె ప్రియుడు రోహన్ థక్కర్, కునాల్ రావల్, అర్పితా మెహతా తదితరులు సందడి చేశారు. -
నయన్‌కు సర్ప్రైజ్: విక్కీ బర్త్‌డే బ్యాష్ మామూలుగా లేదుగా
సాక్షి, హైదరాబాద్: లేడీ సూపర్‌స్టార్ అంటూ ఫ్యాన్స్‌తో నీరాజనాలు అందుకుంటున్న స్టార్ హీరోయిన్ నయనతార ఈ రోజు (నవంబరు18) 37వ పుట్టినరోజును జరుపు కుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు కాబోయే భర్త , దర్శకుడు విఘ్నేష్ శివన్ నయన్ పుట్టిన రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. స్పెషల్ పార్టీతో తన లేడీ లవ్‌ను సర్ప్రైజ్ చేశాడు. బాణాసంచా ఆకాశమంతా వెలిగిపోయింది. అర్థర్రాతి నుంచే చెన్నైలో నయనతారకు బర్త్‌డే సంబరాలు షురూ అయ్యాయి. సరిగ్గా గడియారం 12 కొట్టంగానే విక్కీ నయన్‌తో కేక కట్ చేయించి క్రాకర్స్ పేల్చి సందడి చేశాడు. ఈ పార్టీకి విక్కి, నయన్ కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. మరోవైపు తమ అభిమాన హీరోయిన్‌కు ఫ్యాన్స్‌తో పాటు, పలువురు ప్రముఖులు కూడా నయనతారకు బర్త్‌డే విషెస్ అందిస్తున్నారు. కాగా విఘ్నేష్ శివన్, నయనతార ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ ఫంక్షన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ లవ్‌బర్డ్స్ పెళ్లి పీటలెక్కే ముహూర్తాన్ని ఇంకా ప్రకటించలేదు. Birthday Bash 🌟🎉 #VikkyNayan pic.twitter.com/UtTqX6bJtx — Nayanthara✨ (@NayantharaU) November 17, 2021 -
పుట్టినరోజు వేడుకలు ఎందుకు రద్దయ్యాయంటే?
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ మంగళవారం 63వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే, ఆయన ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదు. చెన్నైతోపాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు ప్రజలు అవస్థలు పడుతుండటంతో జన్మదిన వేడుకలను కమల్ రద్దు చేసుకున్నారు. వేడుకలకు బదులుగా చెన్నైకి 20 కిలోమీటర్ల దూరంలోని అవది ప్రాంతంలో తన అభిమానులు ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంప్‌ను ఆయన సందర్శించబోతున్నారు. అక్కడి నుంచి వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ చెన్నైను సందర్శించి.. బాధితులతో గడపబోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు కమల్ హాసన్ గత కొన్నాళ్లుగా సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి.. ఓ మొబైల్ యాప్‌ను విడుదల చేయాలని కమల్ భావించారు. తాజా వర్షాల నేపథ్యంలో వేడుకలు రద్దుచేసుకున్న కమల్.. మొబైల్ యాప్ లాంచ్ మాత్రం యథావిధిగా నిర్వహించబోతున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఈ యాప్ మొదటి అడుగు అని, తన సందేశాన్ని ఈ యాప్ ద్వారా ప్రజలకు అందించబోతున్నట్టు కమల్ చెప్తున్నారు. 'పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకోవడం నన్ను అభిమానించే వారికి నచ్చకపోవచ్చు. కానీ, రేపు కూడా ఒక మామూలు రోజు మాత్రమే. దానిని సంబరాలతో గడిపేకంటే.. మనం కోరుతున్న మార్పు దిశగా ఈ రోజును వినియోగించుకోవడం ఉత్తమం' అంటూ అభిమానులను ఉద్దేశించి కమల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ప్రజలను ఆదుకునేందుకు తన అభిమాన సంఘాన్ని దశాబ్దం కిందటే వెల్ఫేర్ అసోసియేషన్‌గా కమల్ మార్చిన సంగతి తెలిసిందే. -
రగడ రేపిన హీరో బర్త్ డే పార్టీ
ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీ వివాదానికి దారి తీసింది. బర్త్ డే పార్టీ బ్యాష్ అంటే సందడే సందడి. విందులు, వినోదాలు మామూలే. అయితే 42వ పుట్టిన రోజు వేడుకలు మాత్రం హృతిక్ రోషన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముంబైలోని ప్రముఖ హోటల్ లో పెద్ద ఎత్తున నిర్వహించిన పార్టీ విమర్శలకు తావిచ్చింది. పరిమితికి మించి ఆడియో సౌండ్ పెట్టి హోరెత్తించడం, మర్నాడు తెల్లవారే వరకూ గలాటా సృష్టించడంతో రగడ జరిగింది. హోరెత్తిన మ్యూజిక్ శబ్దాలతో విసుగెత్తిగిన అష్రఫ్ ఖాన్ అనే స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. యథావిధిగా విపరీతమైన శబ్దాలతో, మ్యూజిక్ తో పార్టీ కొనసాగింది. దీంతో చిర్రెత్తిన అతడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి పదిగంటల తరువాత అనుమతి లేకుండా ఇలాంటి పార్టీలు నిర్వహించడం నేరమంటూ వాదించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. సదరు హోటెల్ యజమానికి పాతిక వేల జరిమానా విధించారు. హృతిక్ 42వ పుట్టిన రోజు వేడుకలు ముంబై నగరంలోని ఫోర్ సీజన్స్ హోటెల్ లో శనివారం ఘనంగా జరిగాయి. 34 వ అంతస్తులోని అట్టహాసంగా నిర్వహించిన ఈ పార్టీకి అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు, ఇతర అతిధులు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్లు ఈ బర్తడే బాష్ లో సందడి చేశారు. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పడుకోన్, అమీషా పటేల్, ప్రీతిజింటా, శిల్పాశెట్టి తదితర నటీనటులు సెల్పీలతో హల్చల్ ఇంకా కరణ్ జోహార్, వివేక్ ఒబెరాయ్ ఇలా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ విందుకు విచ్చేశారు. దీంతో హోటెల్ ముందు లెక్కకు మించి వాహనాలను పార్క్ చేయడం ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. దీనికితోడు అర్థరాత్రి మొదలైన పార్టీ మరునాడు 3.30 దాకా జోరుగా సాగడంతో వివాదం రాజుకుంది. అటు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహారించారన్న ఆరోపణలను వర్లి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి ఖండించారు. ఫిర్యాదు రాకముందే ఒకసారి హోటెల్ యజమానిని హెచ్చరించి, 12,500 రూ. జరిమానా విధించామని తెలిపారు. ఫిర్యాదు అందిన పిదప మరోసారి దాడిచేసి, మరో 12,500 రూ. జరిమానా విధించామన్నారు. మరోవైపు ఈ వివాదంపై స్పందించడానికి హీరో ప్రతినిధి నిరాకరించాడు. అయితే ఎవరో కిట్టని వారే ఈ ఫిర్యాదు చేశారని ఆరోపించాడు. -
హీరో చెల్లెలి బర్త్ డే పార్టీ భగ్నం
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ బర్త్ డే పార్టీకి అనుకోని అతిథులు వచ్చారు. తన 26వ పుట్టినరోజును పురస్కరించుకుని గతవారం పాలీ హిల్స్ లోని తన నివాసంలో గతవారం అర్పిత ప్రిబర్త్ డే పార్టీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు. తెల్లవారుజాము వరకు పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెట్టడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు తెల్లవారుజామున 2.30 గంటలకు అర్పిత ఇంటి తలుపు తట్టారు. అనుకోని అతిథులుగా వచ్చిన పోలీసులను చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెట్టి చుట్టపక్కలవారికి నిద్రాభంగం కలిగించిందుకు మహారాష్ట్ర పోలీసు చట్టం కింద కేసు నమోదు చేశారు. రూ. 12 వేల జరిమానా విధించి, సంగీతం ఆపుజేయించారు. తన గారాల చెల్లెలు పుట్టినరోజు పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో సల్మాన్ ఖాన్ నొచ్చుకున్నాడట. తర్వాత రోజు ఆదివారమైనా షూటింగ్ కు వెళ్లిపోయాడట. -
దావూద్, తాలిబన్లు డబ్బులిస్తున్నారు!
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ 75వ పుట్టినరోజు వేడుకలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆ వేడుకలకు తాలిబన్ల నుంచి దావూద్ ఇబ్రహీం నుంచి నిధులు వచ్చాయని, అందుకే ఇంత ఆర్భాటంగా చేస్తున్నామని ములాయం సన్నిహితుడు, యూపీ మంత్రి ఆజంఖాన్ ఒకింత ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ములాయం.. రెండు రోజుల పాటు ఈ వేడుకలు చేసుకుంటున్నారు. 75 అడుగుల కేక్ కోస్తున్నారు. ఇంగ్లండ్ నుంచి తెప్పించిన విక్టోరియన్ గుర్రపు బండిలో ఊరేగుతారు. ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే బెలూన్లను భారీ సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా ములాయం బ్యానర్ల వద్ద కట్టారు. రోడ్డు మీద ఉండే డివైడర్లకు కూడా కొత్త రకం పెయింట్లు వేశారు. అర్ధరాత్రి దాటగానే ములాయం 75 అడుగుల ఎత్తున్న కేకును కట్ చేస్తారు. ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో బాలీవుడ్ గాయనీ గాయకులు వస్తున్నారు. ములాయం కొడుకు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రధాన ఆకర్షణగా ఉంటారు. ఈ కార్యక్రమం అంతా సీనియర్ మంత్రి ఆజంఖాన్ సొంత ఊళ్లో జరుగుతోంది. ఆయనే ఇదంతా చేయిస్తున్నారు. ఈ ఆర్భాటాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోసలిస్టుగా రాజకీయ జీవితం ప్రారంభించిన ములాయం.. ఇప్పుడు ఇలా అట్టహాసంగా వేడుకలు చేసుకోవడం ఏంటని విపక్షాల నాయకులు మండిపడుతున్నారు. ఈ విమర్శలతో ఆజంఖాన్‌కు చిర్రెత్తుకొచ్చింది. డబ్బు ఎక్కడి నుంచి వస్తే ఏంటని ప్రశ్నించారు. తాలిబన్ల నుంచి దావూద్ ఇబ్రహీం నుంచి నిధులు వచ్చాయని ఆగ్రహంగా అన్నారు. -
బాలీవుడ్ భాడీగార్డ్