రగడ రేపిన హీరో బర్త్ డే పార్టీ | Hrithik Roshan Parties Hard On His Birthday, Hotel Fined Rs 25,000 For Blasting Loud Music | Sakshi
Sakshi News home page

రగడ రేపిన హీరో బర్త్ డే పార్టీ

Published Wed, Jan 13 2016 1:57 PM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

రగడ రేపిన హీరో బర్త్ డే  పార్టీ

రగడ రేపిన హీరో బర్త్ డే పార్టీ

ముంబై:  బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీ   వివాదానికి దారి తీసింది.  బర్త్ డే పార్టీ  బ్యాష్ అంటే సందడే సందడి. విందులు, వినోదాలు మామూలే. అయితే  42వ పుట్టిన రోజు  వేడుకలు మాత్రం హృతిక్ రోషన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముంబైలోని ప్రముఖ హోటల్ లో  పెద్ద ఎత్తున నిర్వహించిన పార్టీ విమర్శలకు తావిచ్చింది.  పరిమితికి మించి ఆడియో సౌండ్ పెట్టి హోరెత్తించడం,  మర్నాడు తెల్లవారే వరకూ  గలాటా సృష్టించడంతో రగడ జరిగింది.
 
హోరెత్తిన మ్యూజిక్ శబ్దాలతో విసుగెత్తిగిన అష్రఫ్ ఖాన్ అనే స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోలేదు.  యథావిధిగా విపరీతమైన శబ్దాలతో, మ్యూజిక్ తో పార్టీ కొనసాగింది. దీంతో చిర్రెత్తిన అతడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి పదిగంటల తరువాత అనుమతి లేకుండా  ఇలాంటి పార్టీలు నిర్వహించడం నేరమంటూ వాదించాడు.  దీంతో  పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు.  సదరు హోటెల్ యజమానికి పాతిక వేల జరిమానా విధించారు. 
 
హృతిక్ 42వ  పుట్టిన రోజు వేడుకలు ముంబై నగరంలోని  ఫోర్ సీజన్స్ హోటెల్  లో శనివారం ఘనంగా జరిగాయి. 34 వ అంతస్తులోని అట్టహాసంగా నిర్వహించిన ఈ పార్టీకి  అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు, ఇతర అతిధులు హాజరయ్యారు.  బాలీవుడ్  స్టార్లు ఈ బర్తడే బాష్ లో సందడి చేశారు. సూపర్ స్టార్  షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పడుకోన్, అమీషా పటేల్, ప్రీతిజింటా, శిల్పాశెట్టి తదితర నటీనటులు సెల్పీలతో హల్చల్   ఇంకా కరణ్ జోహార్, వివేక్ ఒబెరాయ్ ఇలా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ విందుకు విచ్చేశారు. దీంతో హోటెల్ ముందు లెక్కకు మించి వాహనాలను పార్క్ చేయడం ట్రాఫిక్ జామ్కు దారితీసింది. దీనికితోడు  అర్థరాత్రి మొదలైన  పార్టీ మరునాడు 3.30 దాకా జోరుగా సాగడంతో వివాదం రాజుకుంది.   
 
అటు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహారించారన్న ఆరోపణలను వర్లి  పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి  ఖండించారు.   ఫిర్యాదు రాకముందే ఒకసారి హోటెల్  యజమానిని హెచ్చరించి, 12,500 రూ. జరిమానా విధించామని తెలిపారు. ఫిర్యాదు అందిన  పిదప మరోసారి దాడిచేసి, మరో 12,500 రూ. జరిమానా  విధించామన్నారు.  
 
మరోవైపు ఈ వివాదంపై స్పందించడానికి  హీరో ప్రతినిధి  నిరాకరించాడు.  అయితే  ఎవరో  కిట్టని వారే  ఈ ఫిర్యాదు చేశారని ఆరోపించాడు. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement