Clothing
-
'ఈడెన్ ది షాపే' ఫ్యాషన్ ఫోర్కాస్ట్: సరికొత్త డిజైనరీ కలెక్షన్లు..!
నేటి తరం ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా ఈడెన్ ది షాపే సరికొత్త డిజైనరీ కలెక్షన్లతో ఫోర్కాస్ట్-2025తో ముందుకు వచ్చింది. వినూత్న డిజైనరీ కలెక్షన్లతో ఆకట్టుకునేలా ఫ్యాషన్ కలెక్షన్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది ఫ్యాషన్ ఫోర్‌కాస్ట్‌లో భాగంగా ఫ్యాషన్ రంగంపై పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని, ఐకానిక్ 90, 2000ల ప్రారంభంలో ఫ్యాషన్ పునః ప్రవేశం, ఫ్యాషన్ డిజైన్‌లో ఏఐ పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించింది. అదేవిధంగా మహిళలు, యవతకు నచ్చే ఫ్యాషన్ కలెక్షన్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ ఏడాది ఫ్యాషన్ ట్రెండ్లు:సుస్థిరమైన సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ : జీరో-వేస్ట్ డిజైన్లు, సుస్థిరమైన మెటీరియల్‌లు అభివృద్ధి చేస్తూ, పర్యావరణహితమైన, మన్నికమైన హ్యాండ్ మేడ్ డిజైనరీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం.నోస్టాల్జియా ఫ్యాషన్: 1990 నుంచి 2000 వరకు ఐకానిక్‌గా ఉండే షార్ట్ జీన్స్, కార్గో ప్యాంట్లు, భారీ పరిమాణంలో ఉండే బ్లేజర్లు వింటేజ్ గ్రాఫిక్ టీ షర్టులన్నీ కూడా ఆధునాతన సొబగులతో మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మినిమలిజం - నాణ్యత: మినిమలిస్ట్ ఫ్యాషన్ ఇప్పటికీ బలంగానే ఉంది. మెటీరియల్ ఎంపిక నుంచి మొదలుకుంటే క్రాఫ్ట్మ్యాన్షిప్ సుస్థిరమైన సౌకర్యంతో కూడిన కాలనుగుణమైన మన్నికైన బహుముఖ వస్తువుల తయారీ. AI-జనరేటెడ్ కస్టమ్ ఫ్యాషన్: ఏఐ-ఆధారిత ఫ్యాషన్ ఆవిష్కరణలతో వినియోగదారుల ఫ్యూచరిస్టిక్ ఫ్యాషన్ అనుభూతితో, వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా దుస్తుల రూపకల్పన, బట్టలను ఎంపిక చేసుకోవడం మరింత సులభతరం కానుంది. ఫ్యాషన్ ముఖ్యాంశాలు:టాప్‌లు: సౌకర్యవంతంతోపాటు, స్టైలిష్‌గా కనిపించే దుస్తులతోపాటు, భారీగా ఉండే బటన్-డౌన్ షర్టులు, కుర్తా టాప్‌లు, టర్టిల్నెక్ టాప్‌లు మపఫ్డ్ స్లీవ్లతో కూడిన ఆర్టిస్టిక్ డిజైనరీ వస్త్రాలు.బాటమ్స్: అందుబాటులో హై-వెయిస్టెడ్ ప్యాంటు, కార్గో ప్యాంట్లు, డెనిమ్ స్కర్టులు, ప్లీటెడ్ స్కర్టులు, బూట్‌కట్ జీన్స్ వంటివి యువతకు నప్పే, మెప్పించే సౌకర్యవంతమైన వస్త్రాలు. లోదుస్తులు: విశేషమైన ఆదరణ ఉన్నా లగ్జరీ సిల్క్, శాటిన్‌తో చేసిన లోదుస్తులు, వైర్లెస్ బ్రా, బోల్డ్, స్పోర్టీ-చిక్ డిజైనరీ క్లాత్.ఆభరణాలు, ఉపకరణాలు: మినిమలిస్ట్, వింటేజ్-ప్రేరేపిత ఆర్టిస్టిక్ ఆభరణాలు, ముఖ్యమైన ఉపకరణాలలో క్రాస్బాడీ, మినియేచర్ బ్యాగులు, బోల్డ్ శిల్పకళా సంచులు, మెటల్ ఫ్రేమ్‌తో కూడిన సన్ గ్లాసెస్, రెట్రో-ప్రేరేపిత డిజైన్లు, ఫ్యూచరిస్టిక్ ఆకృతులతో ట్రెండీ వేర్. ఫుట్‌వేర్: చంకీ స్నీకర్లు, బోల్డ్ బూట్లు, ప్లాట్‌ఫామ్ హీల్స్ క్యాజువల్ వేర్‌కు అనువైన పాదరక్షలు.బ్యూటీ ట్రెండ్స్: 2025లో ఫ్యాషన్ రంగాన్ని నడిపించే గ్రాఫిక్ ఐలైనర్లు, గ్లో-బూస్టింగ్ హైలైటర్లు, వీగన్ లిప్‌స్టిక్‌లు ఈడెన్-ది షాపే గురించి:హైదరాబాద్‌లోని గాంధీనగర్ కేంద్రంగా ఈడెన్-ది షాపే అంచనాలకు మించి క్యూరేటెడ్ ఫ్యాషన్ కలెక్షన్లను అందిస్తోంది. గ్యాలరీ-ప్రేరేపిత లేఅవుట్‌తో ఇదొక ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. వినియోగదారులు కూడా సరసమైన లగ్జరీ తాజా ట్రెండ్లను సులభంగా పొందవచ్చు. 2016లో ప్రారంభమైన నాటి నుంచి ఈడెన్-ది షాపే ఫ్యాషన్ ఆవిష్కరణలతో బ్రాండెడ్, డిజైనరీ కలెక్షన్లకు వేదికగా నిలుస్తోంది. వివరాల కోసం: ఈడెన్-ది షాపే- ఈడెన్ అనెక్స్, గాంధీనగర్,హైదరాబాద్ - 500080 వద్ద సందర్శించవచ్చుమొబైల్ : +91 9652132812ఈమెయిల్: edentheshoppe@gmail.com(చదవండి: Fashion going back to the root మూలాల్లోకి ఫ్యాషన్ ప్రయాణం) -
సరికొత్త ఫ్యాషన్ : నగరంలో బ్యాంబూ బట్టలు..
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఒక్కరూ అధునాతన జీవనశైలి కోసం పరుగెడుతున్న రోజులివి. ఈ ప్రయాణంలో ఫాస్ట్ఫార్వర్డ్ ఫ్యాషన్ అందరినీ ఆకర్షించడంతో పాటు ఎన్నో వినూత్న మార్పులకు నాంది పలుకుతోంది. ప్రస్తుత కాలంలో సుస్థిరత, మన్నిక తగ్గిపోతుందని, ముఖ్యంగా ఫ్యాషన్, ఫ్యాబ్రిక్ రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందన్నది నిపుణుల మాట. ఇందులో భాగంగా నగరవాసులకు మన్నికతో పాటు పర్యావరణహితమైన దుస్తులను అందిస్తామంటున్నారు స్వాతి, షాచి. వీరు ప్రారంభించిన హౌస్ ఆఫ్ స్వాషా వినూత్నంగా బేంబూ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన టీ షర్టులు, సాక్స్‌లు అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాలర్ల ఆన్లైన్ వేదికగా తమ సేవలందిస్తూనే హైదరాబాద్‌లో మాత్రం భౌతికంగానూ స్టోర్ ప్రారంభించి సరికొత్త సంస్కృతికి నాంది పలికారు. నూతనత్వానికి వేదిక.. బ్యాంబూ ఫ్యాబ్రిక్ అనేది చర్మానికి సున్నితత్వాన్ని, అలర్జీల నుంచి రక్షణతో పాటు స్కూల్ చిన్నారులకు ఈ ఫ్యాబ్రిక్ సాక్సులు యాంటీబ్యాక్టీయల్ సంరక్షణను అందిస్తాయని వ్యవస్థాపకులు తెలిపారు. వినూతనత్వాన్ని అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ ముందుంటుందని, ఈ నేపథ్యంలోనే నగరంలోని జూబ్లీహిల్స్ వేదికగా స్టోర్ ప్రారంభించారని పేర్కొన్నారు. పర్యావరణహితమైన బ్యాంబూ ఫ్యాబ్రిక్‌తో పాటు రసాయనాలు వినియోగించని పంటల నుంచి సేకరించిన కాటన్, కాలిఫోరి్నయాలో మాత్రమే లభించే పీమా కాటన్‌తో హౌస్ ఆఫ్ స్వాషా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ పీమా కాటన్ ప్రపంచవ్యాప్తంగా ఒక శాతం మాత్రమే ఉంటుంది. అంతా హ్యాండ్‌మేడ్... ఆఫర్లలో వస్తున్నాయని నాణ్యతలేని దుస్తులు కొని రెండు, మూడు సార్లు ధరించి పక్కన పడేయడం ఈ తరం అలవాటుగా మారింది. దీని వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. దీనికి స్వస్తి పలకాలనే లక్ష్యంతో హౌస్ ఆఫ్ స్వాషా ప్రారంభించాం. ఎలాంటి ప్రచారాలు చేయకపోవడం వల్ల తక్కువ ధరకే కస్టమర్లకు అందించగలుగుతున్నాం. మిషనరీ వాడకుండా చేనేతకారులతో వీటిని తయారు చేస్తున్నాం. కుట్టడం, కలరింగ్, డిజైనింగ్ అన్నీ మనుషులతోనే చేయిస్తున్నాం. వస్త్రరంగ ఉత్పత్తులపై జైపూర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్ వంటి విభిన్న ప్రదేశాల్లో పర్యటించి పలు అంశాలను సేకరించి నాణ్యతలో మెళకువలు పాటిస్తున్నాం. ఈ మధ్య నగరంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఉద్యాన్ ఉత్సవ్‌లో ప్రశంలు పొందాం. – స్వాతి, వ్యవస్థాపకురాలు -
డ్రెస్సుల వల్ల అలర్జీ!
చలిని తట్టుకోవడానికి ఈ సీజన్లో చేసే కొన్నిపనులు మేనిచర్మాన్ని దెబ్బతీసేలలలా ఉంటాయి. దురద, పొడిబారడం తోపాటు రకరకాల చర్మ సమస్యలు(Allergy) కనిపిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనవి...ఫ్యాషన్ డ్రెస్సులుఈ సీజన్లో చలి నుంచి రక్షణగా స్వెటర్లు, మందపాటి క్లాత్స్, షాలువా.. వంటివి ధరిస్తూ ఉంటాం. ఎక్కువ గంటలు లేదా రాత్రి మొత్తం ఇలాంటి డ్రెస్సుల్లో ఉంటే చర్మం దురద పెడుతుంది. అందుకని, పలచటి కాటన్ డ్రెస్ వేసుకోవాలి. కొన్ని డ్రెస్సులు(dresses) వార్డ్ రోబ్లలో నెలల పాటు అలాగే ఉండిపోతాయి. ఈ సీజన్‌కి అవి సరైన ఎంపిక అని, వాటిని శుభ్రం చేయకుండా అలాగే వేసుకుంటే బాక్టీరియా చర్మానికి హాని చేస్తుంది. అందుకని, వార్డ్రోబ్ నుంచి తీశాక వెంటనే వేసుకోకుండా వాటిని ఆరుబయట గాలికి, కొద్దిపాటి ఎండకు వేసి తర్వాత ధరించాలి. కనీసం కొద్దిసేపు గాలికి ఆరవేయాలి.బిగుతుగా, మేని మొత్తం కవర్ చేసే దుస్తుల వల్ల బ్యాక్ యాక్నె పెరుగుతుంది. ఇలాంటప్పుడు ఎక్కువ గంటలు, బిగుతుగా ఉండే డ్రెస్సుల్లో ఉండకూడదు. షూ(Shoe) వంటివి వేసుకున్నప్పుడు వాటిలో చెమ్మ ఏర్పడుతుంది. డ్రయ్యర్‌తో షూ లోపల మొత్తం చెమ్మ లేకుండా చేసి, తర్వాత వాడుకోవాలి.స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ఈ కాలం చర్మం చాలా పొడిబారి ఉంటుంది. ఇలాంటప్పుడు స్క్రబ్, పీల్ చేయడం.. వంటి బ్యూటీ ట్రీట్మెంట్లు చేయించకూడదు. వైటెనింగ్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మ రంధ్రాల్లోని సహజ తైలాలు పోయి, చర్మం నిస్తేజంగా మారుతుంది. చర్మం మృదువుగా ఉండటానికి రకరకాల బాడీ లోషన్స్కి బదులు క్రీమ్స్ వాడుకోవడం మేలు.వేడికి హీటర్చలి ఎక్కువ కాబట్టి టెంపరేచర్ కోసం రూమ్ హీటర్స్ వాడుతుంటారు. రాత్రి వేళ మొత్తం ఈ హీటర్స్‌లో ఉండటం వల్ల చర్మం డీ హైడ్రేట్ అయి త్వరగా పొడిబారుతుంది.నూనె శాతం అధికంగా ఉండే అవకాడో, నట్స్.. వంటి విటమిన్ ఇ, ఎ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం నునుపుగా ఉంటుంది. (చదవండి: మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!) -
ఫ్యాషన్ ట్రెండ్స్: పాత బట్టలను కొత్తగా మార్చేయొచ్చు..
కొత్తగా మెరిసిపోవాలంటే కొత్త డ్రెస్సులు వేసుకోవాల్సిందేనా! ట్రెండ్‌కు తగినట్టు ఉండాలంటే మార్కెట్లో రెడీమేడ్‌గా ఉండే వాటిని కొనుగోలు చేయాల్సిందేనా! ఈ మాటలకు కాలం చెల్లిపోయేలా వినూత్నంగా ఆలోచన చేస్తున్నారు నేటి మహిళలు. పర్యావరణ అనుకూలంగా ఫ్యాషన్‌లోనూ మార్పులు చేసుకుంటున్నారు. అప్‌సైక్లింగ్ పేరుతో పాత డ్రెస్సులను, చీరలను కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ఈ యేడాది వచ్చిన ఈ మార్పు రాబోయే రోజులను మరింత పర్యావరణ హితంగా మార్చేయనున్నారు అనేది ఫ్యాషన్ డిజైనర్ల మాట. పాత వాటిని కొత్తగా మెరిపించడంలో ఖర్చు కూడా తగ్గుతుంది. పర్యావరణంపై కార్బన్ ఉద్గారాల ప్రభావమూ తగ్గుతుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మన దగ్గర ఉన్న డ్రెస్సులనే కొత్తగా మార్చేయవచ్చు. చిన్నపాటి సృజనతో డ్రెస్సింగ్‌లో మెరుగైన మార్పులు తీసుకురావచ్చు. డెనిమ్.. ప్యాచ్ పాతవి అనే పేరే గానీ చాలామంది ఇళ్లలో పక్కన పెట్టేసిన డెనిమ్ జాకెట్స్, ప్యాంట్స్, కుర్తాలు.. ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించుకోవాలంటే రకరకాల మోడల్స్‌ని తయారు చేసుకోవచ్చు. ప్యాచ్‌వర్క్‌తో రీ డిజైనింగ్ చేసి ఓవర్‌కోట్స్ లేదా హ్యాండ్ బ్యాగ్స్ డిజైన్ చేసుకోవచ్చు. శారీ ఖఫ్తాన్ కుర్తాల మీదకు సిల్క్ ష్రగ్స్ లేదా లాంగ్ ఓవర్ కోట్స్ వాడటం ఇండోవెస్ట్రన్ స్టైల్. పాత సిల్క్ లేదా కాటన్ చీరలను కూడా లాంగ్ కోట్స్‌కి ఉపయోగించ వచ్చు. అలాగే, ఖఫ్తాన్ డిజైన్స్‌కి కూడా శారీస్‌ను వాడచ్చు. పర్యావరణ అనుకూలం ఆర్గానిక్ కాటన్స్, వీగన్ క్లాత్స్.. స్లో ఫ్యాషన్ కిందకు వస్తాయి. వీటితో చేసే డిజైన్స్‌లో ప్రత్యేకంగా మెరిసిపోవడమే కాదు పర్యావరణ ప్రేమికులుగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మన దగ్గర ఉన్న పాత బట్టలను ఎలా తీసేయాలా అనుకునేవారు కొందరు, అవసరమైన వారికి తక్కువ ధరకు అమ్ముదాం అనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాంటివాళ్లకోసం కొన్ని వెబ్స్టోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్స్ అమ్మకందారుల దగ్గర నుంచి దుస్తులు సేకరించి కావల్సిన వారికి అందజేసే మాధ్యమంగా పనిచేస్తున్నాయి. -
రాశీఖన్నా ధరించిన ఈ డ్రెస్ అన్ని లక్షలా? అంత ఏముందో!
అందం, అభినయాలతో ఆకట్టుకున్న కథానాయిక రాశీ ఖన్నా. ఫిట్నెస్ మీద ఎంత స్పృహతో ఉంటుందో దాన్ని ఎలివేట్ చేసే ఫ్యాషన్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటుంది. ఆ స్టయిలిష్ స్టార్ అభిరుచికి అద్దం పడుతున్న బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ప్రతిభను నమ్ముకోవాలి ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండా లేకుండానే ఈ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యా. నటిగా మంచి పేరు సంపాదించుకున్నా! మనకున్న నేపథ్యం.. ఫీల్డ్‌లోకి ఎంటర్ అవడానికి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందేమో కానీ చాన్స్‌లు అందించేది మాత్రం మనలోని ప్రతిభే! అందుకే ప్రతిభను నమ్ముకోవాలి! – రాశీ ఖన్నా జ్యూలరీ బ్రాండ్: మాయా సాంఘ్వీ జ్యూయెల్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. మాయా సాంఘ్వీ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ‘మాయా సాంఘ్వీ జ్యూయెల్స్’ ఒకటి. 1994లో ప్రారంభమైన ఈ దేశీ బ్రాండ్ నేడు అంత్జాతీయ స్థాయికి ఎదిగింది. సంస్కృతీసంప్రదాయ డిజైన్స్‌తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాల్లోని ఔట్‌లెట్స్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. శాంతి బనారస్.. సంప్రదాయ బనారస్‌కు పాశ్చాత్య మెరుగులు అద్దడంలో ‘శాంతి బనారస్’ శైలే వేరు. అంతేకాదు అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్ ఫేమస్. ఈ డిజైన్స్‌కు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర డిజైనర్: శాంతి బనారస్ ధర: రూ. 1,40,000 ∙దీపిక కొండి -
Africa : పాత దుస్తులే వాళ్లకి ఫ్యాషన్!
సాక్షి, అమరావతి: అమెరికా, చైనా వంటి అగ్ర దేశాల్లో వాడేసి వదిలేసిన పాత దుస్తులే ఆఫ్రికా ప్రజలకు కొత్త ఫ్యాషన్. దీంతో ఆఫ్రికా ఖండాన్ని సెకండ్ హ్యాండ్ వ్రస్తాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి వ్యాపారస్తులు విదేశాల నుంచి టన్నుల కొద్దీ పాత దుస్తుల్ని దిగుమతి చేసుకుని పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో 50 శాతం పైగా వాడుకోవడానికి వీలుగా లేక పోవడంతో చెత్తకుప్పలుగా మిగిలిపోతున్నాయి. ఆ దుస్తులు ఆఫ్రికాలోని పర్యావరణానికి సవాలు విసురుతున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఆఫ్రికా దేశాల్లోనే పండిస్తున్నా.. పేదరికం కారణంగా అక్కడి ప్రజలు మాత్రం దిగుమతి చేసుకున్న సెకెండ్ హ్యాండ్ దుస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇటీవల ‘ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా’ ద్వారా ఖండం అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల వ్యాపారాన్ని నిషేధించాలని నిర్ణయించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. లక్షల టన్నుల్లో దిగుమతి ఆఫ్రికా ఖండంలో మాగ్రెబ్ (అరబ్ సంస్కృతి గల దేశాలు), సబ్ సహారా దేశాలు ఉన్నాయి. 2021లో మాగ్రెబ్ దేశాల్లో సెకండ్ హ్యాండ్ దుస్తుల మొత్తం దిగుమతులు సుమారు 107 మిలియన్ డాలర్లు కాగా, సబ్ సహారాలో 1,734 మిలియన్ డాలర్లుకు పైగా ఉంది. ‘గ్రీన్‌పీస్ ఆఫ్రికా’ సంస్థ సర్వే ప్రకారం మడగాస్కర్ ఏటా లక్ష టన్నుల సెకండ్ హ్యాండ్ దుస్తులను దిగుమతి చేసుకుంటే, కెన్యా 900 మిలియన్ల దుస్తులు, ఘనా 720 మిలియన్ల పాత దుస్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. పాత వ్రస్తాల దిగుమతిపై సరైన చట్టాలు లేకపోవడం, చెత్తగా మిగిలిన వాటిని ప్రాసెస్ చేయడంపై సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఈ దేశాలు సెకండ్ హ్యాండ్ దుస్తుల చెత్త కుప్పలుగా మారుతున్నాయి. దిగుమతైన దుస్తుల్లో 60% పైగా ప్లాస్టిక్ కలిసిన వ్రస్తాలే ఉండడంతో వాటిని తగులబెట్టినా.. భూమిలో పాతిపెట్టినా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ట్రాషన్: ది స్టెల్త్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ క్లాత్స్ టు కెన్యా’ నివేదిక ఆఫ్రికాకు సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతులు డిమాండ్‌ను మించిపోయాయని, అవి ఇక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యర్థాల వల్ల నదులు, సముద్రాలు, పట్టణాలు, అడవులు, ప్రజల ఆరోగ్యం కలుíÙతమవుతున్నట్టు నివేదించింది. ఈ దేశాల్లో 2029 నాటికి సెకెండ్ హ్యాండ్ దుస్తుల వార్షిక విలువ 27.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఆఫ్రికా మొత్తం ఆదాయంలో 12.4 శాతం. ఆఫ్రికాలో రెండో అతిపెద్ద ఉపాధి రంగం పేదరికం తాండవించే ఆఫ్రికా దేశాల్లో చవకైన దుస్తులకు డిమాండ్ ఉంది. అక్కడ వ్యవసాయం తర్వాత సెకండ్ హ్యాండ్ వస్త్రాల మార్కెట్టే అతిపెద్ద ఉపాధి రంగం. ఈ తరహా దుస్తులకు అతిపెద్ద ఎగుమతిదారు బ్రిటన్. ఆ దేశం నుంచి 14 మిలియన్ టన్నులు, అమెరికా నుంచి 7 లక్షల టన్నులు వాడేసిన దుస్తులను ఏటా ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుండగా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ నుంచి కూడా ఆఫ్రికాకు ఈ వ్రస్తాలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క ఘనా దేశానికే ప్రతివారం యూరప్, యూఎస్, ఆ్రస్టేలియా నుంచి 15 మిలియన్ల సెకండ్ హ్యాండ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. సెకెండ్‌హ్యాండ్ దుస్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే కెన్యాలో ప్రతిరోజూ 4 వేల టన్నుల వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కెన్యా ప్రభుత్వానికి సెకండ్ హ్యాండ్ వ్రస్తాల దిగుమతి, ఇతర దేశాలు విరాళంగా ఇచ్చిన వాటిపై విధించే పన్ను ముఖ్య ఆదాయ వనరు. ఈ దేశంలో 91.5 శాతం కుటుంబాలు సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుగోలు చేస్తున్నాయని అంచనా. పత్తి ప్రధాన ఉత్పత్తిదారైన జింబాబ్వే పెట్టుబడుల కొరత కారణంగా 85 శాతం పత్తిని ఎగుమతి చేస్తూ, 95 శాతం వ్రస్తాలు దిగుమతి చేసుకుంటోంది. గ్రీన్‌పీస్ ఆఫ్రికా 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాలకు విరాళంగా ఇచ్చే సెకెండ్ హ్యాండ్ దుస్తుల్లో 40 శాతం పైగా ధరించేందుకు పనికిరానివే. వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడమో, నదుల్లో పారవేయడమో చేస్తున్నారు. -
పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించాలంటే ఇవి ట్రై చేయండి
పార్టీలో అందరినీ ఆకట్టుకోవాలంటే ఏదైనా ప్రత్యేకత చూపాల్సిందే అనుకుంటోంది నవతరం. ఇక వెస్ట్రన్ స్టైల్ పార్టీలో అయితే ఆ హంగామా మామూలుగా ఉండదు. ప్లెయిన్ డ్రెస్సులకు స్పెషల్ అట్రాక్షన్‌గా యంగ్‌స్టర్స్‌ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి డిటాచబుల్ హ్యాండ్ కఫ్స్. పార్టీలోనే కాదు క్యాజువల్ వేర్‌గానూ వీటిని ధరించవచ్చు. చూసినవారు థంబ్స్ అప్ ఇవ్వకుండా ఉండలేరు. ఎంబ్రాయిడరీ కఫ్స్... కాంబినేషన్ లేదా పూర్తి కాంట్రాస్ట్‌లో ఉండే డిటాచబుల్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ కఫ్స్ ఏ ప్లెయిన్ డ్రెస్‌కైనా నప్పుతాయి. స్పెషల్ లుక్‌తో ఆకట్టుకుంటాయి. ట్రైబల్, మిషన్, మిర్రర్ ఎంబ్రాయిడరీ వీటిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఎంబ్రాయిడరీ డిజైన్‌ను బట్టి ధర ఉంటుంది. జ్యువెలరీ కఫ్స్.. సంప్రదాయ వేడుకలు ముఖ్యంగా పెళ్లి వంటి వేడుకలలో ధరించడానికి అనువైన జ్యువెలరీ హ్యాండ్ కఫ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇమిటేషన్ జ్యువెలరీ నుంచి డైమండ్ హ్యాండ్ కఫ్స్ వరకు ఉన్నాయి. ఫ్లోరల్ కఫ్స్ టీనేజర్స్, పిల్లలు ముచ్చట పడి ధరించేందుకు వీలుగా ఫ్లోర్ హ్యాండ్ కఫ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు లేస్, క్రోచెట్ అల్లికల హ్యాండ్ కఫ్స్‌ను కూడా తమ ప్రాధాన్యతలను బట్టి ఎంచుకోవచ్చు. ట్రావెల్ కఫ్స్ ప్రయాణాలలో ఫోన్‌తో పాటు కొంత డబ్బు కూడా అదీ ఎలాంటి బ్యాగ్ అవసరం లేకుండా వెంట తీసుకెళ్లాలంటే ఈ ట్రావెల్ హ్యాండ్ కఫ్స్ మంచి ఉపయుక్తంగా ఉంటాయి. -
8 కిలోల బంగారం దుస్తుల్లో దాచేశారు..
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న 8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఓ ప్రయాణికుడు ప్యాంటులో దాచి తీసుకొచ్చిన 2 కేజీల బంగారం బిస్కెట్ ముక్కలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.21 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. అదే విమానంలో వచ్చిన మరో ప్రయాణికుడు కూడా లోదుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 1.75 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ 1.8 కోట్లుగా నిర్ధారించారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద లో దుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 2.17 కేజీల బంగారం పేస్టును బయటికి తీశారు. దీని విలువ 1.31 కోట్లుగా నిర్ధారించారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ధరించిన లో దుస్తుల్లో 2.05 కేజీల బంగారం బయటపడింది. దీని 1.24 కోట్లుగా నిర్ధారించారు. ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పట్టుబడిన 8 కేజీల బంగారం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఒకే రోజులో అత్యధికంగా పట్టుబడిన బంగారం ఇదేనని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
ఓ నది హఠాత్తుగా.. నీలం, నారింజ రంగులోకి మారిపోయింది!
ఓ నది అకస్మాత్తుగా నీలం, నారింజ రంగులోకి మారిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది యూకేలో చోటు చేసుకుంది. బిట్రన్‌లోని స్టఫోర్డ్షైర్లోని ట్రెంట్ నదిలో కొంతభాగం నీలం, మరికొంత భాగం నారింజ రంగులోకి మారింది. దీంతో బ్రిటన్ అంతటా ఇదే చర్చనీయాంశంగా మారింది. అందులో ఉండే చేపలు వంటి ఇతర జలచర జీవులు ఏమయ్యాయో అని పర్వావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపించిన బ్రిటన్ ప్రభుత్వం నది అలా మారడానకి గల కారణం వివరించింది. బట్టల రంగులు అనుకోకుండా నదిలో పడిపోవడంతో నీరు ఇలా ఆ విధమైన రంగులోకి మారిపోయిందని స్పష్టం చేసింది. దీనివల్ల నదిలో ఉండే చేపలు, ఇతర జలచర జీవులు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా పేర్కొంది. నది ఇలా మారిపోయినందుకు అధికారుల కూడా విచారం వ్యక్తం చేశారు. నిజానికి ఆ నది చుట్టు పక్కల ప్రాంతం పర్యాటక ప్రాంతంలా జనాల తాకికి ఎక్కువగా ఉండేది. ఈ అనూహ్య ఘటనతో అక్కడ ఉన్నవాళ్లంతా మాత్రం ఇక్కడ ఏదో జరిగింది.. నది అంతా కాలుష్యం అవుతుందంటూ మండిపడుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు విషయం బయట పడుతుందని, ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ దగ్గరుండి దీనిపై ఎక్వైయిరీ చేయాలని పట్టుబడుతున్నారు ప్రజలు. We're aware of discolouration of the River Trent in #StokeOnTrent caused by the accidental release of clothing dyes. No fish or wildlife are in distress but we recommend people and pets avoid the water whilst the colour remains. If you have any concerns call 0800 80 70 60. pic.twitter.com/MJb8jtt5cZ — Env Agency Midlands (@EnvAgencyMids) July 18, 2023 (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
ష్యాషన్ సెన్స్ ఉట్టిపడేలా..వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి?
ఈ సీజన్లో బయటకు వస్తే ఎప్పుడు చినుకు పడుతుందో తెలియదు. ఆ చినుకుల్లో ఏ డ్రెస్ ఉంటే బాగుంటుందో...ఎలా ఉండాలో తెలియక ఇబ్బందులు అందుకే ఈ సీజన్లో మీ వార్డ్రోబ్, బ్యూటీ రొటీన్లలో కూడా మార్పులు చేసుకోక తప్పదు. డల్‌గా ఉండే వానాకాలం వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చే ట్రెండ్స్ గురించి తెలుసుకుని ఆచరణలో పెడితే ఈ సీజన్‌ని కూడా చక్కగా ఎంజాయ్ చేయచ్చు. ఎండకాలం మాదిరిగా ఇప్పుడు డ్రెస్సింగ్ కుదరదు. అలాగని, వెచ్చగా ఉంచే దుస్తులు కూడా. ఎందుకంటే, వాతావరణంలో మార్పుల వల్ల వేడి– తేమ అధికమై చెమటకు దారి తీయవచ్చు. డల్‌గా ఉండే వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేయడంలోనే కాదు, వానల్లో తడవకుండానూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది. వాటర్ ప్రూఫ్ షూస్ వర్షపు రోజులలో బురద గుంటలు సాధారణం. రోడ్లపై పారే నీటి నుంచి, వర్షపు ధారల నుంచి దాలను కాపాడుకోవాలంటే వాతావరణానికి అనువైనవి ఉండాలి. అందుకు వాటర్ ప్రూఫ్ బూట్లను ఎంచుకోవాలి. బ్లాక్ బూట్లు అయితే ఏ డ్రెస్సులకైనా బాగా నప్పుతాయి. రెయినీ హ్యాట్ వర్షపు రోజుల్లో టోపీ ని ధరించడం ద్వారా మీ స్టైల్‌ని అప్‌గ్రేడ్ చేయవచ్చు. కోటుకు హుడీ లేకపోతే ఒక ట్రెండీ హ్యాట్‌ను వాడచ్చు. అయితే, టోపీ ఉన్నప్పటికీ వెంట గొడుగు మాత్రం వాడాల్సిందే. రెయిన్ పోంచో ఇవి సాధారణంగా మొత్తం ఒంటిని కప్పేసే విధంగా ఉంటాయి అని అనుకుంటారు కానీ, ఇప్పుడు మార్కెట్లో విభిన్న మోడల్స్‌లో రెయిన్ పోంచోస్ వచ్చాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉంటాయి. అలాగే వేసుకున్న దుస్తులను వానకు తడవకుండా కాపాడుకోవచ్చు. గొడుగు కూడా వాడలేనంత వర్షం కురుస్తున్నప్పుడు ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాదు, వర్షాకాలానికి తల తడిస్తే, జుట్టు చిట్లిపోతుంది. జుట్టుకు రక్షణగా కూడా రెయిన్ పోంచో హుడ్ ను కప్పుకోవచ్చు. స్టైలిష్‌గానూ కనిపిస్తారు. మీ రెయిన్ పోంచో వాటర్‌ప్రూఫ్ ఫాబ్రిక్ కింద పొడిగా ఉండగలుగుతారు. ట్రెంచ్ కోట్ వర్షం రోజుల్లో డ్రెస్సింగ్ గురించి ఆలోచించినప్పుడు ఖాకీ రంగు డబుల్ బ్రెస్ట్ ట్రెంచ్ కోట్ గుర్తుకు వస్తుంది. అయితే, వీటిలో ఇప్పుడు విభిన్నరకాల కలర్స్... ఫ్యాబ్రిక్‌లో మార్పులు చేసినవి మార్కెట్లోకి వచ్చాయి. నేటి కాలానికి తగినట్టుగా ఆకట్టుకుంటున్నాయి. గొడుగు ఎంపిక వర్షంలో గొడుగు తప్పని అవసరం. అయితే, అది ఎప్పుడూ బ్లాక్ కలర్లో రొటీన్‌గా ఉంటే బోర్‌గా అనిపిస్తుంది. మంచి బ్రైట్ కలర్స్ ఉన్నవి, స్టైలిష్‌గా ఉన్న గొడుగులను ఎంచుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మిగతా అన్నింటికన్నా పోల్కా డాట్స్, లైన్స్ ఎప్పుడూ స్పెషల్ లుక్‌తో ఆకట్టుకుంటాయి. మిలిటరీ స్టైల్ కోట్లు జీన్స్, టీ షర్ట్ పైకి ఓ మిలిటరీ స్టైల్ కోటు ధరిస్తే చాలు మీ రూపం మరింత ఆధునికంగా మారిపోతుంది. మగవారికి అనువుగా రూపొందిన ఈ డ్రెస్ మగువలకు మరింత ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌గా ఈ సీజన్ మార్చేసింది. -
బిజినెస్‌లో స్పీడ్ పెంచిన అలియా భట్!
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటి అలియా భట్ బిజినెస్‌లోనూ స్పీడ్ పెంచింది. ఆమె 2020లో ప్రారంభించిన కాన్షియస్ కిడ్స్ దుస్తుల బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) విస్తరణ జోరుగా సాగుతోంది. గత ఆరు నెలల్లో ఈ బ్రాండ్ ప్రసూతి దుస్తులు, నర్సింగ్ వేర్, 11 నుంచి 17 ఏళ్ల వారి కోసం టీనేజ్ దుస్తులు, అప్పుడే పుట్టిన శిశువు నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారుల కోసం ప్రత్యేక దుస్తులతో సహా నాలుగు కొత్త కేటగిరీలను ప్రారంభించింది. ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం! తల్లులు, పిల్లల కోసం ప్రత్యేక షాపింగ్ ఆలోచనతో ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ ప్రారంభమైందని, ఇప్పుడు తాము ప్రసూతి నుంచి 17 ఏళ్ల టీనేజర్ల వరకూ వారికి కావాల్సిన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు ఎడ్-ఎ-మమ్మా సీవోవో ఇఫ్ఫాట్ జీవన్ పేర్కొన్నారు. దుస్తులకే పరిమితం కాకుండా ఇతర ఉత్పత్తులకూ విస్తరించాలని ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ యోచిస్తోంది. అందులో భాగంగా పిల్లల సాహస కథల పుస్తకాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు జీవన్ వెల్లడించారు. పుస్తకాలతో పాటు యానిమేటెడ్ సిరీస్‌లు, తల్లులు, పిల్లలకు కావాల్సిన ఇతర ఉత్పత్తలు, ఆటబొమ్మలు కూడా బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని చూస్తోంది. త్వరలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాలలో ప్రారంభిస్తామని, యూఎస్‌లో అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటామని అని జీవన్ చెప్పారు. అంతేకాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో ఆఫ్‌లైన్ మోడల్‌కూ విస్తరించాలని చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి తమ ఎక్స్పీరియన్స్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ఆర్యన్ ఖాన్.. బన్‌గయా బిజినెస్‌మేన్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన సొంత ప్రీమియం స్ట్రీట్‌వేర్ బ్రాండ్ డియావోల్ (D'Yavol)ను ప్రారంభించాడు. ఈ బ్రాండ్ టీజర్‌ను ఆర్యన్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది. టీజర్లో షారుక్ ఎంట్రీ సూపర్! ఇందులో ఆర్యన్ ఖాన్‌తో పాటు షారుక్ ఖాన్ కూడా కనిపించారు. బ్రాండ్ లోగో, థీమ్ రూపొందించే విషయంలో ఆర్యన్ తికమకపడుతుంటాడు. ఏదీ ఓ పట్టాన కుదరక పెయింట్ బ్రష్‌ను నేలకేసి కొట్టి వెళ్లిపోతాడు. తర్వాత తన తండ్రి షారుక్ ఖాన్ ఎంటర్ అవుతాడు. అదే బ్రష్‌తో సింపుల్‌గా ఓ గీత గీస్తాడు. అంతే అద్భుతమైన బ్రాండ్ లోగో, థీమ్ ఆవిష్కృతమౌతాయి. వైవిధ్యంతో రూపొందించిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు ఆర్యన్ గత సంవత్సరం తన ప్రీమియం వోడ్కా బ్రాండ్‌ను ప్రారంభించిన అదే భాగస్వాములైన లెటీ బ్లాగోవా, బంటీ సింగ్‌ల భాగస్వామ్యంతో డియావోల్ పేరుతో ఈ దుస్తుల కంపెనీని ప్రారంభించాడు. వ్యాపార రంగంలోకి ప్రవేశించినప్పటికీ, ఆర్యన్ సినిమా పరిశ్రమతో సంబంధాలు వదులుకోలేదు. తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై నిర్మించనున్న చిత్రం ద్వారా త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఐపీఎల్ వేలం, దానికి సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్ల పనుల్లో సోదరి సుహానా ఖాన్‌తో కలిసి ఆర్యన్ పాల్గొంటున్నాడు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. షారుఖ్ ఖాన్ రూ. 6,289 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులలో ఒకరు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని. వీరికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. అలాగే VFX స్టూడియోను నడుపుతున్నాడు. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తోంది. ఆర్యన్ ఖాన్ వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించి ఖాన్ కుటుంబానికి ఇప్పటికే ఉన్న వ్యాపార పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేశాడు. అయితే అత్యంత పోటీ ఉన్న ఫ్యాషన్ పరిశ్రమలో ఆర్యన్ కొత్త వెంచర్, డియావోల్ ఎలా ఉంటుందో.. ఏ మాత్రం విజయవంతం అవుతుందో చూడాలి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! View this post on Instagram A post shared by Aryan Khan (@___aryan___) -
వీమార్ట్ చేతికి లైమ్‌రోడ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ లైమ్‌రోడ్‌ను సొంతం చేసుకున్నట్లు ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ రిటైల్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. తద్వారా ఓమ్నీ చానల్ విభాగంలో కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. డీల్‌లో భాగంగా ఒకేసారి 31.12 కోట్ల నగదును చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఏఎం మార్కెట్‌ప్లేసెస్(లైమ్‌రోడ్)తో స్లంప్ సేల్ పద్ధతిలో వ్యాపార బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! రెండు సంస్థల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం లైమ్రోడ్కు చెందిన రూ. 14.61 కోట్ల ఆస్తులు, రూ. 36.26 కోట్ల లయబిలిటీలు సైతం బదిలీకానున్నట్లు తెలియజేసింది. 2022 మార్చితో ముగిసిన గతేడాదిలో లైమ్‌రోడ్ రూ. 69.31 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలియజేసింది. ప్రస్తుతం మహిళా విభాగం అమ్మకాలు ఆదాయంలో 65 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు వివరించింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
మింత్రా ధమాకా సేల్: టాప్ బ్రాండ్స్‌పై 80 శాతం డిస్కౌంట్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫ్యాషన్ రీటైలర్ మింత్రా కూడా ఫెస్టివ్ సేల్‌ను ప్రారంభిస్తోంది. బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్ 2022 డిస్కౌంట్సేల్ రేపు (సెప్టెంబరు 23 నుంచి) షురూ కానుంది. ఈ సందర్భంగా టాప్ బ్రాండ్స్‌పై 80 శాతం దాకా తగ్గింపు అందించనుంది. ముఖ్యంగా హెచ్ అండ్ ఎం, లిబాస్, రెడ్ టేప్,గినీ అండ్ జాయ్, మస్త్ అండ్ హార్బర్ ప్యూమా, నైక్ ఉత్పత్తులపై గొప్ప తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబరు 23 నుంచి పలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లు సంస్థల్లో పండుగ సీజన్ సేల్కు తెర తీయనున్నసంగతి తెలిసిందే. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఈ సంవత్సరం అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని రిటైలర్లు భావిస్తున్నారు. అందుకే డిస్కౌంట్, డీల్స్ అంటూ కస్టమర్లను ఊరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్‌ను లాంచ్ చేయనుంది. తద్వారా 60 లక్షల ప్రత్యేక కస్టమర్లను ఆకర్షించాలని భావిస్తోంది. మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ గ్రాండ్ ఓపెనింగ్ అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమవుతుంది. కస్టమర్లకు 6వేలకు పైగా బ్రాండ్లను అందుబాటులో ఉంచుతోంది. మహిళలు, పురుషులు, పిల్లలు, ప్లస్ సైజ్ దుస్తులపై భారీ డీల్స్ అందిస్తోంది. అలాగే ప్యూమా కిడ్స్ వేర్‌పై కనీసం 60 శాతం తగ్గింపును అందిస్తోంది. ప్యూమా, నైక్ స్పోర్ట్స్ షూస్, క్యాజువల్ షూలను 50శాతం వరకు తగ్గింపుతో అందిస్తోంది. ఇంకా MAC, Lakme, Maybelline ఉత్పత్తులపై 15-40శాతం డిస్కౌంట్ లభ్యం. ఇంకా రెడ్ టేప్ షూస్‌పై 80 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. -
శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు!
ప్రకృతి ప్రజలకు అవసరమైనవన్నీ ఇస్తుంది. అయితే కొందరు తమ స్వార్థం కోసం భూమిపై ఉన్న వనరులను వాడుకుంటూ అదే ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణం ప్రమాదంలో ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ కొందరు ముందడుగు వేసి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా యూఎస్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వేల కోట్ల కంపెనీని లాభాపేక్ష లేని ఓ ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. యూఎస్‌కు చెందిన వ్యాపారవేత్త యోవోన్ చుయ్‌నార్డ్ తన కంపెనీ ‘పెటగోనియో’ని పర్యావరణ పరిరక్షణకై లాభాపేక్షలేని సంస్థకు విరాళంగా ఇచ్చాడు. ఇకపై ఈ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం,అటవీ భూములు సంరక్షణకు పాటుపడే సంస్థలకు అందజేయనున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని భార్యాపిల్లలు కూడా మద్దతునిచ్చారు. ఆయన దీనిపై స్పందిస్తూ.. ప్రకృతి అందిస్తున్న వనరులను ఉపయోగించుకుంటూ వాటిని నగదు రూపంలో మార్చుకుంటున్నాం. ఇకపై పెటాగోనియో తన సంపాదనను తిరిగి ప్రకృతికే అందిస్తుందన్నారు. పెటాగోనియో ప్రతి సంవత్సరం సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన జాకెట్లు, స్కై ప్యాంట్లను అమ్మకాలు జరుపుతోంది. కాగా అవుట్డోర్ ఫ్యాషన్ సంస్థగా పెటగోనియాను 50 ఏళ్ల కిందట ప్రారంభించారు. చదవండి: దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. జూలైలోనూ జోరు తగ్గలే! -
Sakshi Cartoon: ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ కామ్రేడ్! ఒకప్పుడు మీకు చికెన్ మీద ఉన్నట్లు!
ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ కామ్రేడ్! ఒకప్పుడు మీకు చికెన్ మీద ఉన్నట్లు! -
నయీ సోచ్
కాలంతోపాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పటిలా సమాజాభివృద్ధికి జీవితాలను అంకితం చేసేవారు కనుమరుగైతే, కనీసం ఆ దిశగా ఆలోచించేవారు వారు సైతం క్రమంగా తగ్గిపోతున్నారు. ‘‘నేను, నా వాళ్లు, నా కుటుంబం’’ అంటూ స్వార్థంగా మారిపోతున్న ఈ రోజుల్లో కాలుష్యంతో పాడైపోతున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రీతూ సింగ్. డ్రెస్‌లు తయారయ్యాక వృథాగా పోతున్న బట్ట ముక్కలతో సరికొత్త డ్రెస్‌లు రూపొందించి వాటిని నిరుపేద పిల్లలకు ఉచితంగా పంచుతోంది. పంజాబ్‌కు చెందిన రీతూ సింగ్ ఎమ్బీఏ పూర్తయ్యాక ఏడాదిపాటు ఫ్యాషన్ రంగంలో పనిచేసింది. ఆ తర్వాత తనకు సామాజిక సేవచేయాలన్న ఆలోచన వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో.. ఓ రోజు రీతూ తన కుమార్తెని స్కూల్ బస్ ఎక్కించడానికి బస్‌స్టాప్‌లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఓ టైలర్, బట్టలు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ ముక్కలను దగ్గరలో ఉన్న చెత్త కుండీలో పడవేయడం చూసింది. అది చూసిన రీతూ ‘‘రోజూ ఇన్ని ముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది’’ అని అనుకుని, వృథాగా పోతున్న ఆ బట్ట ముక్కలకు చక్కటి పరిష్కారం చూపాలనుకుంది. ఏడాది పాటు ఫ్యాషన్ రంగంలో అనుభవం ఉన్న రీతూకు ..‘‘ఈ బట్టముక్క లన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది’’ అన్న ఆలోచన వచ్చింది. వెంటనే బొటిక్‌లు, టైలర్ల దగ్గర నుంచి ముక్కలను సేకరించి వాటిని పిల్లలు వేసుకునే విధంగా డ్రెస్‌లు రూపొందించింది. అలా కుట్టిన డ్రెస్‌లను నిరుపేద పిల్లలకు ఇవ్వడంతో వారు వాటిని ధరించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో రీతూకు మరింత ఉత్సాహం వచ్చింది. మరిన్ని గుడ్డ ముక్కలను సేకరించి ఎక్కువమొత్తంలో డ్రెస్‌ల రూపకల్పన చేయసాగింది. ఇలా గత నాలుగేళ్లుగా రీతు వేస్ట్ పీసెస్‌తో కుట్టిన డ్రెస్‌లను చాలామందికి పంచిపెట్టింది. డ్రెస్‌లతోపాటు బ్యాగులు, జాకెట్లు, నిత్యావసర వస్తువులను వేసుకోగల సంచులను కూడా తయారు చేస్తోంది. నయీ సోచ్‌తో అవగాహన మురికి వాడల్లో నివసిస్తోన్న నిరుపేద పిల్లలకేగాక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లోని పెద్దలు, పిల్లలకు సైతం డ్రెస్‌లు కుట్టి ఇస్తోంది రీతు. స్కూలుకెళ్లే విద్యార్థులు వేసుకోగలిగిన స్టైలిష్ డ్రెస్‌లను రూపొందించి యాభైకి పైగా మురికివాడల్లో పంచింది. తన కార్యక్రమానికి వస్తోన్న స్పందనకు సోషల్ మీడియాలో ‘నయీ సోచ్’ పేరిట పేజ్ క్రియేట్ చేసి అవగాహన కల్పిస్తోంది. ఈ పేజీ ఫాలో అయ్యేవారు చాలా మంది తమకు తెలిసిన బొటిక్స్, టైలర్స్, బట్టల తయారీ యూనిట్ల నుంచి మిగిలిపోయిన బట్ట ముక్కలను సేకరించి తీసుకొచ్చి ఇస్తున్నారు. స్కూళ్లకు వెళ్లి వస్త్ర పరిశ్రమల ద్వారా కాలుష్యం ఎలా ఏర్పడుతుందో వివరించి, పర్యావరణంపై పిల్లల్లో అవగాహన కల్పిస్తోంది. నలుగురు మహిళలను తన పనిలో చేర్చుకుని వారికి ఉపాధి కల్పిస్తో్తంది. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకు రీతూ ఉదాహరణగా నిలుస్తోంది. సమాజాభివృద్ధికి సేవచేసే శక్తి, స్థోమతలు నాకు లేవు అని చేతులు దులుపుకోకుండా, తనకున్న నైపుణ్యంతో గుడ్డముక్కలను చక్కని డ్రెస్‌లుగా తీర్చిదిద్ది ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది రీతు. రోజూ ఇన్ని బట్టముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది. ఈ బట్టముక్కలన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది అన్న ఆలోచన నుంచి పుట్టిందే నయీ సోచ్. -
‘గాప్’ సీఈవోగా సోనియా సింగాల్
పెప్సీకో సీఈవో ఇంద్రా నూయీ తర్వాత అంతటి ఘనతను మరో భారత సంతతి మహిళ సాధించారు. భారత సంతతి అమెరికన్ మహిళల్లోనే అత్యున్నత హోదా సాధించారు. ఆమే సోనియా సింగాల్(49). ఫార్చూన్500 కంపెనీల్లో 186వ స్థానంలో ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘గాప్ ఇంక్’కు ఆమె సీఈవో అయ్యారు. ఈ కంపెనీ ఆదాయం ఏడాదికి 18 బిలియన్ డాలర్లు. అమెరికాసహా విదేశాల్లో 3,727 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో 1.35 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతకుముందు ఈమె సన్ మైక్రోసిస్టమ్స్, ఫోర్డ్ మోటార్స్‌లో 15 ఏళ్లపాటు పనిచేశారు. గాప్ ఇంక్‌లో 2004లో చేరిన ఈమె గ్రూప్‌లోని ఓల్డ్ నేవీ సీఈవోగా, గాప్ ఇంక్ యూరప్ ఎండీగా ఉన్నారు. అమెరికాలో ముగ్గురు శ్వేత జాతి నాయకుల మధ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా భిన్నత్వం, లింగ సమానత్వంపై జోరుగా చర్చ సాగుతున్న సమయంలో ఈ నియామకం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫార్చూన్500 కంపెనీల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 33 మంది మహిళలు ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు. వలస వచ్చిన కుటుంబాల నుంచి మహిళలు సీఈవో స్థాయికి ఎదగడం అరుదు. భారత్‌లో పుట్టిన సోనియా కుటుంబం.. ఆమె చిన్నతనంలో కెనడాకు తర్వాత అమెరికాకు వెళ్లింది. సోనియా కెట్టరింగ్ వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్టాన్ఫోర్డ్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. -
క్వీన్ కారుణ్యం
క్వీన్ ఎలిజబెత్ 2 ఇకనుంచి ‘ఫర్’ దుస్తులు ధరించబోవడం లేదని బ్రిటన్ రాజప్రాసాదం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ‘పెటా’.. ‘రాణిగారి నిర్ణయానికి ఛీర్స్ చెబుతున్నాం’ అని ట్వీట్ చేసింది. బ్రిటిష్ రాణి.. క్వీన్ ఎలిజబెత్ – 2.. ఫర్ని త్యజిస్తున్నారు! జంతువుల చర్మాన్ని వలిచి ఆ వెంట్రుకలతో చేసే ఫర్ దుస్తులను ధరించరాదనే నియమం పెట్టుకున్నారట క్వీన్. బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారి వెల్లడించిన తాజా సమాచారం ఇది. క్వీన్ ఎలిజబెత్ డ్రెస్ మేకర్ ఏంజెలా కెల్లీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘‘రాణిగారు పాల్గొనే వేడుకల్లో ఆమె గొప్పదనానికి ప్రతీకగా గానీ, చలికాలంలో వెచ్చదనం కోసం కానీ ఆమె ఫర్ దుస్తులు ధరించి కనిపించినా సరే... అవి జంతువుల ఫర్‌తో చేసినవి కాబోవు. కృత్రిమ ఫర్‌తో చేసినవే అయి ఉంటాయి’’ అని కూడా చెప్పారు ఏంజెలా కెల్లీ. క్వీన్ ఎలిజబెత్ తీసుకున్న ఈ కరుణ పూరిత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పెటా ( పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) యాక్టివిస్టులు తమవంతుగా రాణికి మద్దతు ప్రకటించారు. రాణిగారు తను ధరించే దుస్తుల విషయంలో అనేక నియమాలు పాటిస్తారు. అయితే వస్త్రధారణ విషయంలో ఏనాడూ సంప్రదాయం తప్పని రాణిగారు.. జీవితంలో ఒకే ఒకసారి మాత్రం ప్యాంట్ ధరించారు. అది కూడా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు! 1970లో రాణిగారు కెనడా టూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలియగానే ఒక ఔత్సాహిక కుర్ర టైలరు రాణిగారి కోసమని మ్యాటీ–సిల్క్ ట్రౌజర్ సూట్‌ని ప్రత్యేకంగా కుట్టి తెచ్చాడు. అదీగాక.. కెనడా వెళుతూ రాణిగారు ఈ మాత్రం మోడర్న్‌గా లేకుంటే ఎలా అని ఆస్థానంలోని వారందరినీ ఆ టైలర్ ఒప్పించాడు. ముఖ్యంగా రాణిగారిని మెప్పించాడు. అతడి ఆరాటాన్ని కాదనలేక రాణిగారు టూర్లో ఆ ప్యాంట్ వేసుకుని టూర్ నుంచి వచ్చీ రాగానే తీసి పక్కన పెట్టేశారు. మళ్లీ దానిని వేసుకోనే లేదు. ఆ సంగతలా ఉంచితే, రాణి గారు వేసుకునే దుస్తులకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఆ దుస్తులది కాదు. ఆ దుస్తులపైకి ఆమె పట్టుకునే గొడుగుది! ఏ రంగు డ్రెస్ వేసుకుంటే ఆ రంగు గొడుగును చేత పట్టుకుంటారు క్వీన్ ఎలిజబెత్. ఇక బయటికి వచ్చినప్పుడు ఆమె తన చేతికి తగిలించుకునే బ్యాగు కూడా ప్రత్యేకమైనదే. ‘లానర్’బ్రాండ్ బ్యాగు అది. ఒక్కో బ్యాగు వెల కనీసం వెయ్యి డాలర్ల నుంచి మొదలవుతుంది. రాణి గారి అంతస్తుతో పోలిస్తే 70 వేల రూపాయలు (వెయ్యి డాలర్లు) తక్కువే కానీ, అది ప్రారంభ ధర మాత్రమే. అలాంటి బ్యాగులు రాణిగారి చేతి పట్టున 200 వరకు ఉన్నాయి! ఈ బ్యాగులు, బూట్లు, షూజ్, వాచీలను అలా ఉంచితే.. రాణి గారు వేసుకునే దుస్తుల్లో తొంభై శాతం లేత నీలం, లేదా ముదురు నీలం రంగుల్లో ఉండేవే. నీలం తర్వాత లేత ఆకుపచ్చ, ఆ తర్వాత ఎరువు రంగులను క్వీన్ ఎలిజబెత్ ఇష్టపడతారట. రంగు ఏదైనా ఇక ముందు రాణిగారు ధరించే దుస్తులు ఫర్‌తో చేసినవి మాత్రం అయి ఉండవు. -
రిలయన్స్ నుంచి 'సస్టైనబుల్ ఫ్యాషన్'
సాక్షి, ముంబై: టెలికాం రంగంలో ఇటీవల జియో సాధించిన విజయం నుంచి పొందిన స్ఫూర్తితో.... పర్యావరణహిత (సస్టెయినబుల్) దుస్తులను సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ముందుకు వచ్చింది. 'సస్టైనబుల్ ఫ్యాషన్'కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్ఐఎల్ పెట్రోకెమికల్స్ విభాగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విపుల్ షా మాట్లాడుతూ పర్యావరణహిత నుంచి ఫ్యాషన్ ను తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామనీ, ఇదొక సుస్థిరదాయక కార్యక్రమని అన్నారు. తాము ఈ సస్టైనబుల్ ఫ్యాషన్‌ను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని.. ఇది కూడా ఒక రకమైన కార్పోరేట్ సామాజిక బాధ్యత కిందకే వస్తుందన్నారు. రిలయన్స్ పెట్రో ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడంలో ప్రపంచం మొత్తంలో తొలి కంపెనీ తమదే అన్నారు. భారతదేశంలో పెట్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసే ఏకైక కంపెనీ రిలయన్స్ మాత్రమేనని, ఏటా రెండు బిలియన్ల మేరకు ఉపయోగించిన పెట్ బాటిల్స్ ను ప్రాసెస్ చేస్తోందన్నారు. ప్రకృతికి ఎలాంటి హాని కలగని రీతిలో అతి తక్కువ కర్బన పదార్ధాలతో ఉండే దుస్తులను యువతరం కోరుకుంటోంది. ప్రతీ సంవత్సరం దాదాపు రెండు బిలియన్ల బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తున్నామని షా తెలిపారు. దీనిని రాబోయే రెండేళ్లలో ఆరు బిలియన్లకు పెంచాలన్నదే తమ లక్ష్యమని విపుల్ స్పష్టం చేశారు. ఈ విధానంలో తాము అనుసరించే విధానం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.రానున్న రెండేళ్ళలో దాన్ని ఆరు బిలియన్లకు పెంచాలని భావిస్తోంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా అందుబాటు ధరల్లో ఉండేలా, అందరినీ చేరుకునేలా సుస్థిరదాయక ఫ్యాషన్ కు అవసరమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమనం కంపెనీ చెబుతోంది. ఒక వ్యూహం ప్రకారం రిలయన్స్ సుస్థిరదాయక ఫైబర్ ను, దుస్తులకు అది అందించే విశిష్టతలను ఆధారంగా చేసుకొని, అవే విశిష్టతలను అందించే సుస్థిరేతర ఉత్పాదనలకంటే పోటీ ధరలకు అందించాలని యోచిస్తోంది. ఈత దుస్తులు మొదలుకొని చలికాలపు దుస్తులు, బ్యాక్ ప్యాక్స్ దాకా అన్నిటికీ అంతర్జాతీయ బ్రాండ్లు రీసైకిల్డ్ మెటీరియల్ తో తయారు చేయనుంది. వ్యర్థ పెట్ బాటిల్స్ సేకరణ, వాటిని పర్యావరణ స్నేహపూర్వక ఫైబర్స్ గా రెక్రాన్ గ్రీన్ గోల్డ్ గా మార్చడం, టెక్స్ టైల్ వాల్యూ చెయిన్ లో వాటిని మరింత దిగువకు తీసుకెళ్తూ, ఫైబర్స్ ను అధిక విలువ కలిగిన స్లీప్ ఉత్పాదనలుగా, ఆర్ఎలాన్ ఆధారిత ఫ్యాషన్ దుస్తులుగా మార్చడం దాకా ఒక వలయాకారంలో ఈ ప్రక్రియ ఉంటుంది. ఉపయోగించిన పెట్ బాటిల్స్ ద్వారా ఉత్పత్తి చేసే గ్రే ఫైబర్ రెక్రాన్ గ్రీన్ గోల్డ్, డోప్ డైడ్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ అనేది రెక్రాన్ గ్రీన్ గోల్డ్ ఎకో డి బ్రాండ్‌గా గుర్తింపు పొందాయనీ, ఈ పర్యావరణ స్నేహపూర్వక ఫైబర్స్ రిలయన్స్ రేపటి తరపు ఫ్యాబ్రిక్ శ్రేణి బ్రాండ్ అయిన ఆర్ఎలాన్ ఫ్యాబ్రిక్ 2.0 కు సుస్థిరదాయకత శక్తిని అందిస్తాయని షా తెలిపారు. 'సాధారణంగా వాటర్ బాటిల్స్‌ను ఖాళీ చేసిన తర్వాత వాటినే పారేస్తాం. కానీ వీటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. త్వరగా మట్టిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ డబ్బాలు నగరాలు, పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడతాయి' అని షా పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఉపయోగకరమైన ఉత్పాదనలుగా మార్చడం అనే భావనపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఒక బాధ్యతాయుత కార్పొరెట్ గా రిలయన్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2000 సంవత్సరానికి పూర్వమే ఇది మొదలైందన్నారు. అంతర్గత చర్యలను పటిష్ఠం చేసుకోవడంతో పాటుగా, యార్న్, టెక్స్ టైల్ తయారీదారులు, అగ్రగామి దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, రిటైలర్లు, ఫ్యాషన్ హౌస్ ప్రతినిధులతో కూడుకొని ఉన్నతన హబ్ ఎక్స్ లెన్స్ ప్రోగ్రామ్ ద్వారా యావత్ టెక్స్ టైల్ పరిశ్రమతో సన్నిహితంగా కలసి పని చేస్తోంది. ఈ క్రమంలో యార్న్, టెక్స్టైల్, దుస్తుల తయారీదారులతో తమకంపెనీ భాగస్వామిగా మారింది. కో-బ్రాండెడ్ వస్త్రాలు, దుస్తులు తయారు చేసేందుకు ఒక వ్యూహాన్ని రూపొందించింది. యారో, రాంగ్లర్, రేమండ్, లీ లతో సహా ఇతర అంతర్జాతీయ బ్రాండ్లతో అది ఇప్పటికే భాగస్వామిగా మారిందని షా పేర్కొన్నారు. -
మీ ఆరోగ్యాన్ని... దుస్తులే చెబుతాయి!
ఫిట్నెస్ కోసం మనం స్మార్ట్‌వాచ్‌ల వంటి బోలెడన్ని పరికరాలు వాడేస్తున్నామా... యూబీసీ ఓకనగాన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు ఇకపై ఇవేవీ అవసరం లేదని చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. తాము ఎంచక్కా ఉతికేసుకున్నా పనిచేయగల సెన్సర్లను అభివృద్ధి చేశామని.. వీటిని పోగులుగా వాడుకున్న దుస్తులను వేసుకుంటే మీ ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండవచ్చునని వీరు చెబుతున్నారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉండే ఈ సెన్సర్ దుస్తుల్లోని పోగులు సాగిపోవడం ఆధారంగా మన కదలికలను గుర్తిస్తాయి. కాకపోతే ఈ పోగులను గ్రాఫీన్ నానోప్లేట్లెట్స్తో శుద్ధి చేయాల్సి ఉంటుంది. పీజో రెసిస్టివిటీ అనే భౌతిక ధర్మం ఆధారంగా ఈ సెన్సర్లు పనిచేస్తాయని, గుండెచప్పుళ్లను గుర్తించడంతోపాటు, ఉష్ణోగ్రత నియంత్రణకు వీటిని వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మినా హూర్ఫర్ అంటున్నారు. స్పాండెక్స్ వంటి వస్త్రాల్లో సెన్సర్లు ఉన్న పోగులను ఏర్పాటు చేసి దాన్ని సిలికాన్ షీట్లతో చుట్టేస్తే... అవి నిత్యం మన వివరాలను నమోదు చేస్తూ అవసరమైనప్పుడు సమాచారం అందిస్తాయని.. శరీరంలో నీళ్లు తగ్గితే తాగమని సూచించడం, ఒత్తిడికి గురైనప్పుడు విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వడం వంటి పనులన్నీ ఈ సెన్సర్ ఆధారిత వస్త్రాలు చేయగలవని మినా అంటున్నారు. ప్రస్తుతానికి తాము సెన్సర్లను పరీక్షించే దశలో ఉన్నామని.. సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవకాశముందని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ సరికొత్త, చౌక సెన్సర్ దుస్తులు మార్కెట్లోకి వచ్చేస్తాయని అన్నారు. -
ఎత్తుగా కనపడాలంటే...
నడుము దగ్గర బిగుతుగా ఉండే దుస్తులను ధరించటం వలన చూసే వారికి మీరు పొడవుగా స్లిమ్‌గా ఉన్నట్టు కనపడటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా డార్క్ లేదా నలుపు రంగు జీన్స్’ని చాలా బిగుతుగా కుట్టిన దుస్తులను వేసుకోవటం వలన మీరు చాలా స్లిమ్’గా ఉన్నట్టు కనపడతారు. వీటిని మీ శరీర కదలికలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. -
మీ లుక్ ఇలా మార్చుకోండి
ఎత్తు తక్కువ ఉన్నవారు పొడవుగా కనిపించాలన్నా, సన్నగా ఉన్నవారు కొంచెం బొద్దుగా కనిపించాలన్నా ఈ చిన్న చిన్న కిటుకులు పాటించాలి... ఎత్తు తక్కువ ఉన్నవారు చిన్న అంచు(బార్డర్) లేదా అసలుఅంచు లేని చీరలు కట్టుకుంటే పొడువుగా కనిపిస్తారు.చర్మరంగుకు దగ్గరగా ఉండే రంగు దుస్తులను ధరిస్తే మీ రూపం పొడువుగా కనిపిస్తుంది. సన్నగా ఉన్నవారు అలంకరణలు ఎక్కువ ఉన్న అంటే గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు, చీరలు కట్టుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.నలుపు, ఎరుపు, నీలం.. వంటి బాగా ముదురు రంగు దుస్తుల మీదకు బంగారు ఆభరణాలు ధరిస్తే అందం రెట్టింపు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బొద్దుగా ఉన్నవారు చర్మం రంగు దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు.బొద్దుగా, ఎత్తు తక్కువ ఉన్నవారు చారల దుస్తులు, చీరలు ధరించాలంటే.. నిలువు చారలున్నవి ఎంచుకోవాలి. -
నాకీ జన్మ బాగానే ఉంది
ఒకసారి దుస్తులు మాసిపోయాక ఇక ఎక్కడ కూర్చోడానికైనా మనిషి సిద్ధపడతాడు కాబట్టి, దుస్తులు మాసిపోకుండా ముందే జాగ్రత్తపడడం మంచిది. అనగనగా ఓ రాజు. ఆ రాజు మంచివాడే కానీ, మాటలను అదుపు చేసుకోవడం చేతకానివాడు. అలా ఓ రోజున ఒక మునిని ఇష్టం వచ్చినట్లు మాట్లాటంతో ఆ ముని ఆగ్రహావేశాలకు గురయ్యాడు. రాజుని ఓ పందిలా అవుతావని శపించాడు. తాను పందిలా మారడమన్న ఊహనే రాజు భరించలేకపోయాడు. వెంటనే ముని కాళ్లమీద పడి, ‘‘మహాత్మా! దయచేసి నాకు శాపాంతం తెలియజెప్పండి’’ అని ప్రార్థించాడు. ‘‘నువ్వు పంది జన్మలో ఉండగానే ఎవరైనా సరే, నిన్ను కనిపెట్టి నిన్ను సంహరిస్తే, నీకు సద్గతి కలుగుతుంది’’ అని చెప్పాడు. వెంటనే రాజు, యువరాజుని పిలిచి ‘‘కుమారా, ఒక ముని నన్ను పంది జన్మ ఎత్తమంటూ ఘోరంగా శపించాడు. నేను ఇంతకాలమూ రాజుగా గడిపిన వాడిని. పందిలాగా బతకాల్సిన దుస్థితి రాకూడదు. కనుక నేను పందినైన తర్వాత నన్ను ఎలాగైనా సరే వెతికి అక్కడికక్కడే చంపివేస్తే నాకు వెంటనే విముక్తి కలుగుతుంది’’ అని చెప్పాడు.కొంతకాలం గడిచింది. యువరాజు బయలుదేరాడు. ఎక్కడెక్కడో వెతికాడు. చివరికి ఓ చోట తన తండ్రిని పంది రూపంలో కనిపెట్టగలిగాడు. ఓ మురికి కాలువలో ఆ పంది మరొక ఆడ పందితోనూ, ఓ నాలుగైదు పంది పిల్లలతోనూ ఉండగా చూశాడు. యువరాజు పంది రూపంలో ఉన్న తండ్రిని నరకడానికి కత్తి తీశాడు.అప్పుడు ఆ పంది మాటలాడింది.‘కుమారా, తొందరపడకు. కాస్తంత ఆగు. ఇప్పుడు ఈ బతుకు బాగానే ఉంది. ఏ మాత్రం అసహ్యంగా లేదు. ఇదిగో నా పక్కనున్న ఈమె నీకు పిన్ని. మిగిలిన పంది పిల్లలు నీకు తమ్ముళ్లు’’ అంది.ఆ మాటలు విన్న యువరాజు మనసు వికలమై పోయింది. దేన్నయితే ముందు అసహ్యించుకుంటామో తర్వాత దాన్నే ఇష్టపడతాం. దేన్నయితే కోరుకుంటామో అది దొరికిన తర్వాత వద్దనుకుంటాం. ఒకసారి కావాలనుకున్నది మరోసారి వద్దనుకోవడమే మనిషి స్వభావం. ఒకసారి దుస్తులు మాసిపోయాక ఇక ఎక్కడ కూర్చోడానికైనా మనిషి సిద్ధపడతాడు కాబట్టి, దుస్తులు మాసిపోకుండా ముందే జాగ్రత్తపడటం మంచిది. – యామిజాల జగదీశ్ -
వానల్లో హాయ్ హాయ్
వేసవి వేడి పరారయ్యింది. చల్లటి గాలులు.. అవి మోసుకువచ్చే వాన చినుకులు హాయిగాఉన్నా చిత్తడి నేలలో సరైన ఔట్ఫిట్ లేకపోతేమాత్రం చిరాకుగా ఉంటుంది. మబ్బులతో చిరుచీకట్లు కమ్మేసే వానకాలం ఎలాంటి దుస్తులుధరించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది.వేసవి వార్డ్‌రోబ్‌ని క్లోజ్ చేసి వానకాలానికే ప్రత్యేక మైన దుస్తులు ఎంచుకోవాల్సిన సమయం ఇది. సింథటిక్ కప్రీస్ వీటిలో పొట్టి, పొడుగు కప్రీస్ ఉన్నాయి. వేసవిలో వాడిన కాటన్, డెనిమ్ కప్రీస్ను ఈ సీజన్లోనూ ధరించవచ్చు. అయితే ఇవి తడిస్తే ఆరాలంటే ఎక్కువ టైమ్ పడుతుంది. దీనికి బదులుగా సింథటిక్ కప్రీస్, పలాజో, నీ లెంగ్త్ ట్రౌజర్స్ ఈ కాలానికి అనువైనవి. వాటర్‌ప్రూఫ్ బ్యాగ్స్ ఏ కాలమైన వెంట హ్యాండ్ బ్యాగ్ ఉండాల్సిందే. అయితే, మిగతాకాలాలలో వాడినట్టు కాటన్, లెదర్ బ్యాగులు వాడితే లోపల ఉండే వస్తువులను తడవకుండా ఉంచలేం. పైగా బ్యాగ్ కూడా పాడైపోతుంది. ఈ సమస్య రాకుండా వాటర్‌ప్రూఫ్ బ్యాగ్స్, బ్యాగ్–ప్యాక్స్ సరైన ఎంపిక. మొబైల్ కవర్స్, వాలెట్ వంటివి వాటర్‌ప్రూఫ్‌వి ఎంచుకోవాలి. ఇవి కూడా మంచి బ్రైట్‌కలర్స్, ఫ్లోరల్ డిజైన్స్ అయితే కాలానుగుణంగా ఉంటాయి. నైలాన్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడితే ట్రెండ్‌లో ఉన్నారనే కితాబులే పొందుతారు. వస్తువులూ సురక్షితం, రెయిన్‌కోట్స్ ఈ సీజన్‌కి 3డి గ్రాఫిక్ ఎఫెక్ట్ ఉన్న రెయిన్ కోట్స్ లభిస్తున్నాయి. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల మీరేం దుస్తులు ధరించారో బయటకు కనిపిస్తుంది. ప్లాస్టిక్ ట్రెంచ్ కోట్స్ కూడా మంచి ఎంపిక. ఇవి మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ని దాచిపెట్టవు. బెలూన్ రెయిన్ కోట్స్, రెయిన్ పాంచోస్ కూడా నియాన్ షేడ్స్‌లో లభిస్తున్నాయి. రెయిన్ బూట్స్/ఫ్లిప్‌ఫ్లాప్స్ ఇవి ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నవే. కానీ, రెయిన్ సీజన్‌కి ఎవర్గ్రీన్ కూడా ఇవే! ఎక్కువ కాలం మన్నుతాయి. బురద, నీటి నుంచి రక్షణగా ఉంటాయి. వీటి గురించి మరో ఆలోచన చేయకుండా ఈ సీజన్లో ధరించవచ్చు. అలాగే, జెల్లీ ఫ్లాట్స్, ఫంకీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఈ కాలం మీ పాదాలు మెచ్చే స్నేహితులు. రంగు రంగుల మడతల గొడుగులు ఈ కాలం తప్పనిసరి అవసరంమున్న వస్తువు గొడుగు. అది అవసరం మాత్రమే కాదు, ఫ్యాషన్ యాక్ససరీ కూడా! గొడుగు అనగానే మనకు నల్లని రంగులో ఉండేదే కనిపిస్తుంది. కానీ, వీటిలో ఎన్నో మోడల్స్, కలర్స్, ప్రింట్లు అందుబాటులో ఉన్నాయి. ట్రాన్సపరెంట్, చూడముచ్చటైన ప్రింట్లు, ముదురు రంగులు, మూడు మడతలుగా ఉండే గొడుగులు ఈ సీజన్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఫంకీ యాక్ససరీస్ రంగు రంగుల ప్లాస్టిక్ బ్యాంగిల్స్, పూసల బ్రేస్లెట్లు, గొలుసులు డల్‌గా ఉండే వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేస్తాయి. మోడ్రన్ దుస్తుల మీదకు ఫంకీగా ఉండే ఈ అలంకరణ ఆభరణాలు మరింత అందాన్ని పెంచుతాయి. మెటల్ స్టికర్స్ నీళ్లలో తడిచినా ఇబ్బంది ఉండదు. వాటర్ మేకప్ నీళ్లలో పదే పదే తడిచే అవకాశం ఉండే ఈ కాలం మేకప్‌కి దూరంగా ఉండటం బెస్ట్. మేకప్ తప్పనిసరి అనుకుంటే మాత్రం వాటర్‌ఫ్రూఫ్ మేకప్ బ్రాండ్స్‌ని ఎంచుకోవాలి. ఫేస్‌వైప్స్ వేసవిలో చెమట అద్దడానికి వీటిని ఉపయోగించి ఉంటారు. ఈ కాలం ముఖం మీద పడిన నీటి తుంపరలను తొలగించడానికి వాడాలి. మేకప్‌లో ఉన్నప్పుడు వీటి అవసరం ఎక్కువ. మొబైల్ కవర్స్ నీటిలో తడిచినా పాడవకుండా ఫోన్‌కి కూడా రెయిన్ గేర్ అవసరం. అయితే, ఈ కవర్స్ కూడా ధరించిన డ్రెస్‌కు కాంబినేషన్ కవర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. -
నగరంలో యువరాజ్ సింగ్ సందడి
సోమాజిగూడ : భారత్ క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్ నగరంలో సందడి చేశారు. తమ అభిమాన క్రికెటర్ కళ్ల ముందు ప్రత్యక్షమైతే అనుభూతే వేరు కదూ! హైదరాబాద్ సెంట్రల్లో అభిమానులకు అలాంటి ఘటనే ఎదురైంది. తన సొంత బ్రాండ్ స్పోర్ట్స్ క్లాతింగ్ వేర్ ‘యువీకెన్’ ఉత్పత్తులను పంజాగుట్ట సెంట్రల్లో మంగళవారం ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగుల సహాయార్థం తాను యువీకెన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. ఫౌండేషన్ యువీకెన్ పేరుతోనే క్లాతింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ స్టోర్స్‌లో తమ క్లాతింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నాడు. క్లాతింగ్ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చిన లాభాన్ని క్యాన్సర్ రోగుల సహాయార్థంగా వినియోగించనున్నట్లు పేర్కొన్నాడు. -
వేసవిలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా..
టూ ఇన్ వన్ షర్ట్ల గురించి మీరెప్పుడైనా విన్నారా? రెండువైపులా వేసుకోవచ్చు ఈ షర్ట్‌ను. అయితే వీటితో రంగులు, డిజైన్లు మారడానికి మించి ఇంకో ప్రయోజనం లేదు. ఇలా కాకుండా.. చలికాలంలో ఒకవైపున వేసుకుంటే వెచ్చగా ఉంటే.. ఇదే షర్ట్‌ను వేసవిలో తిరగేసి వేసుకుంటే చల్లగా అనిపిస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలాంటి అద్భుతాన్నే ఆవిష్కరించారు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఇలాంటి దుస్తులు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే.. జనాలు ఏసీలు, ఫ్యాన్ల వాడకాన్ని తగ్గిస్తారని, తద్వారా వాతావరణ మార్పులను కొద్దిగానైనా అడ్డుకోవచ్చునని అంటున్నారు ఈ వినూత్న వస్త్రాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఈ కూయి. గత ఏడాది కూయి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చర్మాన్ని చల్లబరచడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను ప్రసారం చేయగల ఓ వస్త్రాన్ని అభివృద్ధి చేసింది. పత్తితో తయారైన వస్త్రంతో పోలిస్తే ఇది శరీరాన్ని రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ చల్లగా ఉంచగలిగింది. వేర్వేరు ఉష్ణోగ్రత సామర్థ్యాలున్న రెండు పొరలను ఈ ప్రత్యేక వస్త్రంతో కలిపి వాడటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకూ వీలవుతుందని వీరు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ వస్త్రాన్ని నేరుగా వాడే అవకాశం లేదని.. పోగులు తయారు చేసి వస్త్రం తయారు చేస్తే అది దృఢంగా ఉండటంతోపాటు మన్నిక కూడా ఎక్కువవుతుందని.. ప్రస్తుతం తాము అదే ప్రయత్నంలో ఉన్నామని కూయి తెలిపారు. వీలైనంత సులువుగా ఈ వినూత్న వస్త్రాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
కుట్టుకోవాల్సిందే..!
పాఠశాలలకు చేరిన గుడ్డ దుస్తులకు బదులు వస్త్రాల పంపిణీ ఏడునెలల తర్వాత సరఫరా జతకు కుట్టుకూలీగా రూ.40 నిర్ణయించిన ప్రభుత్వం ముందుకురాని దర్జీలు కథలాపూర్ (వేములవాడ) : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు రెడీ అంటూ ప్రగల్భాలు పలికారు. తీరా బడులు ప్రారంభమై ఏడు నెలలు గడిచాక కుట్టు వస్త్రాలు కాకుండా కేవలం గుడ్డ సరఫరా చేయడంతో విద్యార్థులు, పాఠశాలల బాధ్యులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో డ్రెస్సుకు రూ.40 కుట్టుకూలీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులపైన ఆర్థికభారం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు పునరాలోచించి కుట్టుకూలీ పెంచాలని, విద్యార్థులకు త్వరగా డ్రెస్సులు అందించాలని పలువురు కోరుతున్నారు. ఆప్కో నుంచి చేనేతకు మార్పు.. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 506, ప్రాథమికోన్నత 87, హైస్కూళ్లు 187 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 73 వేల మంది చదువుకుంటున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం డ్రెస్సులు అందిస్తోంది. వీరు సుమారు 55 వేల మంది వరకు ఉంటారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల డ్రెస్సులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీరికి గత విద్యాసంవత్సరం వరకు డ్రెస్సులు పంపిణీ చేయగా.. అవి సరిపోకపోవడం, చిరగడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈసారి బట్టను సరఫరా చేసినట్లు సమాచారం. గతంలో బట్టలు ఆప్కో ద్వారా పాఠశాలకు సరఫరా చేసేవారు. ఈసారి చేనేత సహకార సంఘం ద్వారా సరఫరా చేసింది. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేసి ఒక్కో డ్రెస్సుకు కుట్టుకూలీగా రూ.40 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఇది గిట్టుబాటు కాదని దర్జీలు అంటున్నారు. ప్రభుత్వ ధరకు అదనంగా విద్యార్థులు కొంత మొత్తం చెల్లిస్తేనే డ్రెస్సులు కుట్టేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. కుట్టుకూలీ ఏ నిధుల నుంచో..? విద్యార్థుల డ్రెస్సుకు రూ.40 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించనప్పటికీ నిధులు ఎక్కడినుంచి చెల్లిస్తారనేది ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. పాఠశాలల ఎస్ఎస్ఎ నిధుల్లోంచి గతంలో చెల్లించేవారు. ఈ ఏడాది పాఠశాల ఖాతాలో ఉన్న ఆ నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిధులను ఇతర శాఖలకు మళ్లించారనే ఆరోపణలున్నాయి. విద్యార్థుల డ్రెస్సుల కుట్టుకూలీకి నిధులు వస్తాయో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ చూపి త్వరగా డ్రెస్సులు అందేలా చూడాలని విద్యార్థిసంఘాల నేతలు కోరుతున్నారు. జాప్యం దారుణం డ్రెస్సులు అందించే విషయంలో ప్రభుత్వ నిబంధనలు చూస్తే విద్యాసంవత్సరం ముగిసేవరకు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి కుట్టుకూలీని పెంచి ప్రభుత్వం మంజూరు చేయాలి. ఎనిమిదేళ్ల నాటి నిబంధనలు అమలు చేసి నెలల తరబడి జాప్యం చేయడం దారుణం. – ఆరెల్లి సాగర్, ఏబీవీపీ మండల కోకన్వీనర్ -
యూ‘నో’ఫాం!
♦ ఇచ్చుడు వచ్చినప్పుడే.. ♦ అతీగతీ లేని యూనిఫాం క్లాత్ ♦ ఈ విద్యాసంవత్సరం ఆలస్యమే.. ♦ సకాలంలో ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు విద్య.. పాఠ్యపుస్తకాలు.. స్కూల్ డ్రస్.. మధ్యాహ్న భోజనం.. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే సౌకర్యాలు. బడులు తెరిచే నాటికి దుస్తులు పిల్లలకు పంపిణీ చేస్తాం.. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించండి అంటూ బడిబాటలో ఇంటింటికీ విస్తృతంగా ప్రచారం చేసిన ఉపాధ్యాయుల పరిస్థితి దుస్తుల జాడ లేకపోవడంతో కక్కలేక మింగలేకుండా ఉంది. యూనిఫాం క్లాత్‌ను సరఫరా చేసే రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులు గత విద్యాసంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆలస్యం చేస్తారా.. అసలు దుస్తులు వస్తాయా.. రావా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిల్లల తల్లిదండ్రులు యూనిఫాం విషయమై అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి. అధికారులు మాత్రం ఇండెంట్ పెట్టాం.. ఎప్పుడొస్తే అప్పుడే పాఠశాలలకు పంపిస్తామని చెప్పడం గమనార్హం. - ఖమ్మం ఇండెంట్ పంపించాం.. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులకు ఇండెంట్ పంపించాం. ఈ విద్యాసంవత్సరం 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే 1,57,364 మంది విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయాల్సి ఉంది. ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం నుంచి క్లాత్ వచ్చిన వెంటనే యూనిఫాంలు త్వరగా కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం. - రవికుమార్, ఎస్ఎస్ఏ పీఓ ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల మధ్య తారతమ్య భావన లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాంలు అందిస్తోంది. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతీ విద్యార్థికి ఏడాదికి రెండు జతల చొప్పున అందించేందుకు రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ఉచితంగా క్లాత్ సరఫరా చేస్తోంది. గతంలో ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తే.. ఎమ్మార్సీల ద్వారా దానిని పాఠశాలలకు పంపించడం.. అక్కడ వాటిని కుట్టించి విద్యార్థులకు సరఫరా చేసేవారు. అయితే ఇలా చేయడం వల్ల జాప్యం జరుగుతుందని, నాణ్యత లోపిస్తుందని భావించిన ఎస్ఎస్ఏ(సర్వశిక్ష అభియాన్) అధికారులు దుస్తుల క్లాత్‌కు జతకు రూ.160, కుట్టుకూలి రూ.40 చొప్పున.. జతకు రూ.200.. రెండు జతలకు రూ.400 చొప్పున హెచ్ఎం అకౌంట్లలో వేసేవారు. కొన్ని ప్రాం తాల్లో ఇవి సక్రమంగా పంపిణీ కావడం లేదని, పలువురు డబ్బులు కాజేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో క్లాత్‌ను నేరుగా ఆప్కో ద్వారా కొనుగోలు చేసి కుట్టించి ఇచ్చేవారు. అయితే గత విద్యాసంవత్సరం ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో డిసెంబర్ వరకు కూడా విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయలేదు. పంద్రాగస్టుకు కొత్త బట్టలు వేసుకుందామని భావించిన విద్యార్థులకు.. జవవరి 26 వరకు కూడా అందుబాటులోకి రాలేదనే విమర్శలు వచ్చాయి. ఈ‘సారీ’ ఆలస్యమే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు నానా తంటాలు పడుతున్న ఉపాధ్యాయులకు.. విద్యార్థులకు దుస్తులు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. దుస్తులు ఎక్కడ కొనుగోలు చేయాలి.. ఎవరికి అప్పగించాలి.. అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కూడా దుస్తుల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో అన్నీ ఉచితమే అని ఉపాధ్యాయులు చెప్పడంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నామని, అయితే దుస్తులు ఇవ్వడం ఆలస్యం కావడంతో కొత్త బట్టలు కుట్టించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని, ఇప్పుడు వందలకు వందలు పెట్టి బట్టలు ఎలా కుట్టించాలని వాపోతున్నారు. ప్రభుత్వం పాఠశాలలు తెరిచే నాటికి సరఫరా చేస్తే ఈ బాధ ఉండేది కాదని అంటున్నారు. కాగా, పాఠశాలల పునఃప్రారంభం రోజునే పుస్తకాలు, దుస్తులు అందిస్తే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు చెప్పడం గమనార్హం. -
ఇంటిప్స్
దుస్తుల మీద మరకలు పోగొట్టాలంటే... చెమట మరకలు సులువుగా తొలగించాలంటే నిమ్మరసంతో రుద్ది, శుభ్రం చేయాలి. {Xk మరక పోవాలంటే సోడాతో రుద్ది, కడగాలి. రక్తపు మరకలను తొలగించడానికి హైడ్రోజెన్ పెరాక్సైడ్‌ను వాడాలి. నూనె మరకలు పోవాలంటే చాక్‌పీస్ పొడి చల్లి, రుద్ది, అరగంట తర్వాత లిక్విడ్ సోప్‌తో శుభ్రపరచాలి. కాఫీ మరక పోవాలంటే బేకింగ్ సోడాను ఉపయోగిం చాలి. -
దుస్తులకూ బజాజ్ ఈఎంఐ కార్డు
బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ హెడ్ సంజీవ్ మఘె హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటిదాకా కన్జూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్ మొదలైన వాటికే పరిమితమైన ఈఎంఐ నెట్వర్క్ కార్డును తాజాగా దుస్తులు, హాలిడే ప్యాకేజీలు, చిన్న ఉపకరణాలు వాటి కొనుగోలుకు కూడా వర్తింపచేస్తున్నట్లు బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ హెడ్ (ఈఎంఐ కార్డుల విభాగం) సంజీవ్ మఘె తెలిపారు. ఇందుకోసం కనీస ఇన్వాయిస్ మొత్తం రూ. 5,000గా ఉంటుందని గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, పుణే, బరోడా నగరాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టామని, త్వరలో మిగతా నగరాల్లోనూ అందుబాటులోకి తేనున్నామని వివరించారు. దీనికోసం హైదరాబాద్‌లో 25 బ్రాండ్స్, 100 పైగా స్టోర్స్‌తో చేతులు కలిపినట్లు సంజీవ్ చెప్పారు. మూడు నగరాల్లో మొత్తం 300 పైగా స్టోర్స్‌తో భాగస్వామ్యం ఉందని, వచ్చే నాలుగేళ్లలో దీన్ని 50 వేల అవుట్‌లెట్స్‌కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆయా స్టోర్స్‌లో దుస్తులు, ఐ వేర్ లాంటి ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు కార్డును స్వైప్ చేసి, ఈఎంఐల్లోకి మార్చుకోవచ్చని చెప్పారు. కోచింగ్ క్లాస్‌లకు కూడా దీన్ని విస్తరించే యోచనలో ఉన్నట్లు సంజీవ్ పేర్కొన్నారు. హాలిడే ప్యాకేజీల కోసం కాక్స్ అండ్ కింగ్స్‌తో టైఅప్ పెట్టుకోగా, నిర్దిష్ట ఉత్పత్తుల కోసం ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కూడా చేతులు కలిపినట్లు వివరించారు. డ్యూరబుల్స్ అమ్మకాల్లో దాదాపు అయిదో వంతు బజాజ్ ఫైనాన్స్ ద్వారానే జరుగుతున్నాయని సంజీవ్ పేర్కొన్నారు. -
ఎండ సెగ.. మేనిగనిగ
బ్యూటిప్స్ వేసవిలో ఉక్కపోతకు పొట్టి, స్లీవ్‌లెస్, ట్యాంక్ టాప్స్ దుస్తులను ఉపయోగిస్తుంటారు. ఇవి స్టైల్‌గానూ ఉంటాయి. అయితే, వీటి వల్ల ఎండకు చర్మం ట్యాన్ అవుతుందని భయపడుతుంటారు. ఈ సమస్య దరిచే రకుండా ఉండాలంటే... వేసవిలో చర్మసంరక్షణ జాబితాలో సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ఎస్.పి.ఎఫ్ 40 శాతం ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను పగటి వేళలో బయటకు వెళ్లడానికి 15-30 నిమిషాల ముందు రాసుకోవాలి. దీని వల్ల సూర్యకాంతి నేరుగా శరీరం మీద పడటం వల్ల కలిగే హాని శాతం తగ్గుతుంది. {పతిరోజూ పగటి వేళలో కనీసం 15-20 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. అప్పుడే చర్మం తన సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ను కోల్పోదు, త్వరగా పొడిబారదు. ఈతకొట్టేటప్పుడు నీటిలో క్లోరినేటెడ్ శాతం అధికంగా ఉంటే చర్మం, జుట్టు పొడిబారతుంది. అందుకని ఈత కొట్టిన తర్వాత తప్పనిసరిగా మంచినీళ్లతో స్నానం చేయాలి.పగటి వేళలో 3-4 సార్లు ఎలాంటి క్లెన్సర్లు వాడకుండా కేవలం నీటితోనే ముఖాన్ని, చేతులను, పాదాలను శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మానికి డీ-హైడ్రేషన్ సమస్య తలెత్తదు. జిడ్డు చర్మం అయితే స్వేదగ్రంధులు ఈ కాలం మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటప్పుడు ఔషధమూలికలతో తయారైన ఫేస్‌ప్యాక్‌లతో చర్మసౌందర్యాన్ని కాపాడుకోవాలి. పగటి వేళ సూర్యకిరణాల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకని ఈ టైమ్‌లో వీలైనంతవరకు (ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు) బయటకు వెళ్లకుండా ఉండటమే మేలు. మేకప్ వేసుకునేవారు మినరల్ మేకప్‌ని వాడటం మేలు. లేత రంగులు, చర్మానికి తగినంత చమట పట్టేలా ఉండే సౌందర్య ఉత్పత్తులను వాడాలి. బయటకు వెళ్లేటప్పుడు కళ్లద్దాలు, టోపీ తప్పనిసరిగా ఉపయోగిస్తే 70 శాతం ఎండతాకిడి వల్ల కలిగే అనర్థాలను నివారించవచ్చు. -
ఉన్నితంగా...
మన్నిక చలికాలంలో ఉన్ని దుస్తులు ఎంతో ఉపకరిస్తాయి. తలకు కట్టుకునే మఫ్లర్, స్వెటర్, గ్లౌజులు, సాక్సులు ఇలా ఎన్నో ఉన్ని వస్తువులను ఈ కాలంలో రోజూ ఉపయోగిస్తుంటారు. మరి వాటిని ఉతికేటప్పుడు మామూలు దుస్తుల్లా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన బ్రష్: ఉన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో వాషింగ్ మిషన్‌లో వేయకూడదు. ఆ దుస్తులకు తగ్గట్టుగా బ్రష్‌ను ఎంచుకోవాలి. అంతేకాదు ప్రతిరోజూ స్వెటర్లను ఉపయోగిస్తుంటారు కాబట్టి ఎక్కువ మురికి వాటిపై పేరుకుపోతుంది. అందుకే రెండు రోజులకోసారి వాటిని ఉతకడం ఆరోగ్యకరం. మరకలు పోయేందుకు డ్రై క్లీన్: ఏదో ఒక సందర్భంలో ఉన్ని దుస్తులపై మరకలు పడుతూనే ఉంటాయి. వెంటనే వాటికి డ్రై క్లీనింగ్ చేయించాలి. మరీ అంత పెద్ద మరక కాదు అనుకుంటేనే చేతులతో ఉతకాలి. అదీ నాణ్యమైన సబ్బునే ఉపయోగించాలి.తీగలపై ఆరేయకూడదు: మిగతా దుస్తుల్లాగా ఉన్ని వాటిని తీగలపై ఆరేయకూడదు. అలా చేస్తే అవి సాగిపోయి ఆకారం మారే అవకాశం ఉంది. వీలైనంత వరకు వాటిని గోడలపైనో లేక టేబుళ్లపైనో ఆరేయడం మేలు. వాటికి వేడి కూడా ఎక్కువ తగలకుండా చూసుకోవాలి. -
సంక్షేమ హాస్టళ్లలో.. సమస్యల ముళ్లు
హాస్టళ్ల విద్యార్థులను పీడించిన పాత సమస్యలు విరగడ కాకుండానే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఊడిన మరుగుదొడ్ల తలుపులు అలాగే ఉన్నారుు. దుస్తులు, వస్తువులను తుప్పురేకుల పెట్టెల్లోనో, నేలపైనో ఉంచాల్సిన దుస్థితి కొనసాగుతూనే ఉంది. కష్టాలు తిష్ట వేసిన అద్దె భవనాల నుంచి విముక్తీ సుదూరమే. మరో వైపు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు పెంచడానికి సిద్ధంగా లేదు. పిఠాపురం : జిల్లాలో పదవతరగతి లోపు ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు ఉండే వసతి గృహాలు (హాస్టళ్లు) 61 ఉండగా ఆ వర్గాల కాలేజీ విద్యార్థులుండే వసతిగృహాలు 38. వీటిలో సుమారు 9,400 మంది వసతి పొందుతున్నారు. 80 శాతానికి పైగా వసతిగృహాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బాలికల వసతిగృహాలలో మరుగుదొడ్లు లేక వారు పడుతున్న తిప్పలు.. గొప్పలు చెప్పుకొనే సర్కారు తలదించుకోవలసినవేనని చెప్పక తప్పదు. ఇక ఇచ్చే ఆహారంలో పోషక విలువలు లేక పలువురు విద్యార్థులు రక్తహీనత వంటి రోగాల బారిన పడుతున్నారు. ఒక్కో విద్యార్థికీ రోజూ 2,600 కిలో కేలరీల శక్తి గల ఆహారపదార్థాలు అందించాల్సి ఉండగా ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం కేవలం 1,500 కిలో కేలరీల శక్తినిచ్చే పదార్థాలు మాత్రమే అందుతున్నారుు. ఏరీ ఏఎన్ఎంలు? ప్రతి వసతిగృహంలో ఒక ఏఎన్ఎంను నియమించాల్సి ఉండగా ఏ ఒక్క దానిలో నూ వారు అందుబాటులో లేరు. దాంతో ఆ రోగ్య పరీక్షలు జరగక విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్య ప రీక్షల నిమిత్తం ఒక్కో హాస్టల్‌కు నెలకు రూ. 1,000 కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం వాటి ఊసెత్తడం లేదు. అనేక వసతిగృహా ల్లో ట్యూటర్ లేక పాఠ్యాంశాల్లోని సందేహాల్ని నివృత్తి చేసుకోలేకపోతున్నారు. పలు హాస్టళ్ల ప్రాంగణాల్లో లైట్లు వెలగక విద్యార్థులు చీకటిలోనే సంచరిస్తున్నారు. పలుచోట్ల హ్యేండ్ పంపులు రిపేరు వచ్చి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు జరగడం లేదు. ఇక మన్యంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. ఐరన్ లోపంతో పలువురు విద్యార్థులు మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నారు. నీటిశుద్ధి యంత్రాలు దాదాపు అన్నీ మూలనపడ్డారుు. చెప్పులూ అందలేదు.. సుమారు ఆరేళ్లుగా విద్యార్థులకు పెట్టెలు ఇవ్వక పోవడంతో తుప్పు పట్టిన పెట్టెల్లోనో, నేలపైనో ఉంచుకోవాల్సి వస్తోంది. కాస్మోటిక్స్ చార్జీలు సకాలంలో అందవు. పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ ధరలున్నప్పటి చార్జీలనే ఇవ్వడం వల్ల విద్యార్థులు చాలీచాలని సరుకులతో కాలం గడపాల్సి వస్తోంది. ఏడాదికోసారి పంపిణీ చేయాల్సిన చెప్పులు, బ్యాగులు, దుప్పట్లు, నోట్ పుస్తకాలు, కార్పెట్లు గత ఏడాది పూర్తిస్థాయిలో అందలేదు. జిల్లాలో 45 వరకు వసతిగృహాలు అద్దె భవనాలలోనే ఉన్నాయి, ఇవి కూడా శిథిలావస్థలో సమస్యలకు నెలవులుగా ఉన్నాయి. చాలీచాలని ఇరుకు గదులో మగ్గుతూనే విద్యార్థులు ఏడాదంతా గడుపుతున్నారు. సౌకర్యాల మెరుగుకు చర్యలు : డీడీ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగు పర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు చెప్పారు. రామచంద్రపురం, కాకినాడ, రంపచోడవరంలలో సొంత భవనాలను నిర్మించామని, మిగిలిన చోట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్టెలు గత ఆరేళ్ల నుంచి ఇవ్వలేదని, ప్రస్తుతం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. -
సత్సంప్రదాయానికి వారధి
తెలుగు ఉగాది యుగాది అనే పదానికి యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి వికృతి ఉగము. ఈ ఉగము నుంచి పుట్టినదే ఉగాది. తెలుగు వారిది, కన్నడిగులది చాంద్రమానం. కేరళ, తమిళనాడు రాష్ట్రాలవారిది సౌరమానం. మనం జరుపుకునే పండుగలు, చే సే శుభకార్యాలు, చెప్పుకునే సంకల్పాలన్నీ చాంద్రమానం ప్రకారమే! తెలుగు సంప్రదాయం ఉట్టిపడే ఈ పండుగలో దాగి ఉన్న విశేషాలను అవలోకిద్దాం... మనకు జ్యోతిష శాస్త్రరీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగ ఉగాది. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. నిన్న మొన్నటి వరకు ఉన్న ‘జయ’ నామ సంవత్సరం నుంచి రేపటితో ‘మన్మథ’ నామ సంవ త్సరంలోకి అడుగు పెడుతున్నాం. రైతులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, కళాసాంస్కృతిక రంగాలవారు, సినీనటులు, ఉపాధ్యాయులు, వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలలో ఉండే వారంతా ఈ సంవత్సరం తమ రాశిఫలాలు లేదా నామనక్షత్ర ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఆరోగ్యానికి అభ్యంగనం ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారనిశాస్త్రోక్తి. కాబట్టి ఉగాదినాడు పొద్దున్నే లేచి ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, నలుగు పెట్టి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలారా స్నానం చేయాలి. తర్వాత నూతన వస్త్రాలు లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి, నిత్యకర్మానుష్ఠానాలు ముగిసిన అనంతరం బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి, పంచాంగ శ్రవణం చేయాలి. నూత్న వస్త్రాలు లేదా శుభ్రవస్త్రాలు ఉగాది రోజున చిరిగిన, మాసిన లేదా విడిచిన బట్టలు ధరించిన వారికి, తలస్నానం చేయని వారికి సంవత్సరమంతా రకరకాల వ్యాధులు, దారిద్య్రబాధలు సోకుతాయని శాస్త్రోక్తి. కాబట్టి ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదర . ఈ పండగ నాడు ఏమి చేయాలి? ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి మండలతో లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇష్టదేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదించాలి. అనంతరం పంచాంగ పఠనం లేదా శ్రవణం చేయాలి. పంచాంగం అంటే ... తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, వారం వల్ల అనుకూలతను, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివారణ, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. కాబట్టి చేసే పనులలో విజయాన్ని కాంక్షించేవారు తప్పక పంచాంగం చూడాలి. పంచాంగ శ్రవణం ఎందుకు? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని, పంచాంగ శ్రవణం వల్ల భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. అంతేకాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను వినడం వల్ల గ్రహదోషాలు నివారించబడి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదిన పంచాంగ ఫలాలను తెలుసుకోవాలి. ఆ ఆరు రుచులలో అనేక అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరురుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈసత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని అందిస్తుంది ఉగాది పచ్చడి. వైవిద్యభరితం అభిరుచి, అలవాటు లేదా ఆచారాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దీనిని పచ్చడిలా గట్టిగా చేస్తే, ఇంకొన్ని ప్రాంతాలలో జారుగా చేసి, కొత్తకుండలో పోసి, ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, అతిథులకు ఇవ్వడం ఆనవాయితీ. తెలుగు సంప్రదాయానికి నాంది... తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదితోనే ఆరంభమవుతుంది కాబట్టి వేడుకలు, కవి సమ్మేళనాలు జరుగుతాయి. అవేమీ లేకపోయినా, ఉగాది సంప్రదాయం మేరకు ప్రతి ఒక్కరూ పాత కక్షలు, కార్పణ్యాలు మరచి అన్యోన్యంగా, సంతోషంగా గడపాలి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి సింహాసనాన్ని అలంకరించిందీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని అనేక చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాది మంచి శుభతరుణం అన్నమాట.మీరు సంకల్పించిన శుభకార్యాలన్నీ నెరవేరాలని, ఈ మన్మథ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ సకల శుభాలు చేకూర్చాలని ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది. -
నికిత డేర్!
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి దుస్తులు వేసుకోవడానికైనా రెడీ అన్న నటీమణులను చూస్తూనే ఉంటాం. కానీ... మరాఠీ నటి నికిత గోఖలే మాత్రం అందుకు భిన్నం. అసలెవరూ అడగకపోయినా... ప్లే బాయ్ మ్యాగజైన్ ‘హగ్ హెఫ్నర్’ కోసం నగ్నంగా నటించడానికి కూడా వెనకాడనంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ దెబ్బకు ఫిల్మ్ సర్కిల్ షేకయింది. ఇంతలా డేర్‌గా అమ్మడు రెడీ అంటోందేంటని మరాఠీ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారట. ప్రస్తుతం ఈ గుమ్మ చేసిన మరాఠీ ఫిల్మ్ ‘కాలేజీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ మోడల్ కూడా అయిన నికిత... ప్రస్తుతం విదేశీ టూర్లలో యమ బిజీగా గడిపేస్తోంది. మ్యాగజైన్ ఫొటో షూట్స్‌తో బాగా పాపులర్ అయిన ఈ సెక్సీ సుందరి... ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో తన అప్డేట్స్ పోస్ట్ చేసి కిక్కెస్తోంది. -
త్రీడీ డ్రెస్.. అదుర్స్..!
ఆధునిక ఫ్యాషన్ ప్రపంచం సరికొత్త శిఖరాలకు చేరుకుందని చెప్పడానికి ఈ భామ వేసుకున్న డ్రెస్సే నిదర్శనం. దీనిని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించారు. అతివల శరీరాకృతికి సరిగ్గా సరిపోయేలా దుస్తులు రూపొందించడం ఈ విధానం ప్రత్యేకత. తొలుత యువతి శరీరాకృతిని త్రీడీ స్కానింగ్ చేస్తారు. అనంతరం ఆమెకు నచ్చిన డిజైన్‌తో సరిగ్గా ఒంటికి సరిపోయేలా త్రీడీ ప్రింటర్ ద్వారా డ్రెస్ ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. అమెరికా మసాచుసెట్స్‌కు చెందిన ఓ డిజైన్ స్టూడియో ఈ వినూత్న ఆవిష్కరణ చేసింది. ఒక్క డ్రెస్‌ను ప్రింట్ చేయడానికి 48 గంటల సమయం పడుతుందని, ఇందుకు 3వేల డాలర్లు (దాదాపు రూ.1.80 లక్షలు) ఖర్చవుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. -
ఈ-కామర్స్‌లో నిర్మల్ బొమ్మలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, యాక్సెసరీస్ వంటివి చూశాం. ఇక నుంచి నిర్మల్ బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, పెంబర్తి పాత్రలు ఇ-కామర్స్ సైట్లలో హల్చల్ చేయనున్నాయి. ఆన్లైన్లో విక్రయానికి ఈ కంపెనీలతో మాట్లాడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు పరిమితమైన వైవిధ్య హస్తకళలను మంచి ప్యాకింగ్‌తో ప్రపంచానికి పరిచయం చేయొచ్చని అన్నారు. ఇక్కడి హస్తకళలకు మంచి ఆదరణ ఉందని చెప్పారు. అమెరికాకు చెందిన దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్.. ఎఫ్‌ఎంసీజీతోపాటు విభిన్న రంగాల్లో ఉన్న ఐటీసీ లిమిటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఆసక్తిగా ఉంది. హైదరాబాద్‌కు సమీపంలోని గజ్వేల్‌లో పార్క్‌ను స్థాపించాల్సిందిగా కంపెనీకి సూచించామని తారక రామారావు పేర్కొన్నారు. ఐటీసీతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చెప్పారు. ఐటీసీ గ్రూప్ మాదాపూర్‌లో నెలకొల్పనున్న ప్రతిపాదిత 5 స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. ఐటీసీ కోహినూర్ పేరుతో రానున్న ఈ హోటల్‌కు కంపెనీ రూ.700 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే ఐటీసీ రూ.3,000 కోట్లతో భద్రాచలం పేపర్ ప్లాంట్ విస్తరణ ప్రతిపాదనను ప్రభుత్వం స్వీకరించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ బిర్యానీ.. ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ ఎక్కువ రోజులు నిల్వ చేయగలిగే విధానమేదీ లేదని మంత్రి అన్నారు. ఈ విధానం గనక వస్తే యూఎస్ఏ వంటి సుదూర దేశాలకు ఎగుమతి చే సేందుకు వీలవుతుందని అన్నారు. ఐఐపీ డెరైక్టర్ ఎన్.సి.సాహా మాట్లాడుతూ హోటళ్లు ముందుకు వస్తే పరిశోధన సాగించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. 20 రోజుల వరకు బిర్యానీ నిల్వ చేయగలిగేలా ప్యాక్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. ‘గతంలో ప్యాకింగ్ అంటే సులువుగా పట్టుకోగలగడం, తీయగలిగేలా ఉండడం. ఇప్పుడు ఉత్తమ ముడి పదార్థాలు, వినూత్న డిజైన్, భద్రత ప్రాధాన్యతగా మారిపోయాయి’ అని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి అన్నారు. సదస్సులో ఐఐపీ చైర్మన్ ఆర్వీఎస్ రామకృష్ణ, హైదరాబాద్ చైర్మన్ ఏవీపీఎస్ చక్రవర్తి తదితరులు మాట్లాడారు. -
చేనేతల కళ ‘కల’
చీరాల: తరాల తరబడి వారిది ఆకలి పోరాటం. చేతి వృత్తి నే నమ్ముకొని ఎంతో కళాత్మకంగా నేసే దుస్తులు వారికి పూట కూడా కడుపు నింపడం లేదు. అందరికీ అందమైన వస్త్రాలను తయారు చేసే వారు.. రోజంతా పని చేసినా పూట గడవని దుర్భిక్షం. నమ్మిన వారే కష్టానికి కూలి కట్టకపోవడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా కలిసి ఒక రోజంతా పనిచేస్తే కనీసం రూ.100 కూడా సంపాదించలేని పరిస్థితి. తాను అధికారంలోకి వస్తే చేనేతలకు పూర్వవైభవం తీసుకువచ్చి ఆదుకుంటానని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వా త చేనేతల సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడంలేదు. ఇబ్బందులు పెడుతున్న ఆప్కో... జిల్లాలో 33,184 మగ్గాలుండగా 25వేల చేనేత కార్మిక కుటుంబాల్లోని 70వేల మంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 సహకార సంఘాల్లో 17,862 మంది చేనేతలు పని చేస్తున్నారు. వీరు తయారు చేసే వస్త్రాలను చేనేత సహకార సంఘాల ద్వారా ఆప్కో కొనుగోలు చేయాలి. కానీ దీనిని సమర్థవంతంగా నడిపించేవారు కనుమరుగయ్యారు. దీంతో గత ఆరు నెలల నుంచి 20 శాతం మాత్రమే కొనుగోలు చే శారు. ఇప్పటికే ఉత్పత్తి అయిన వస్త్రాలు సహకార సంఘాల వద్ద పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. ఈ దెబ్బకు సహకార సంఘాలు ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడంతో ఉపాధి లేక కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు గతంలో ఆప్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు ప్రభుత్వం ఇప్పటికీ డబ్బు చెల్లించలేదు. పాత బకాయిలు కూడా రాకపోవడంతో చేనేతలు అప్పుల పాలవుతున్నారు. నీరుగారిన చంద్రబాబు వాగ్దానాలు టీడీపీ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. దీంతో ఘనకార్యం సాధించినట్లు జబ్బలు చరుచుకుంటున్న పాలకులు చేనేతలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా మరిచారు. నాడు చేనేతల కోసం బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. కానీ చేనేత, జౌళిరంగానికి కలిపి రూ. 99.87కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది చేనేత రంగానికి చెల్లించాల్సిన బకాయిల్లో సగానికి కూడా సరిపోవు. చేనేత వస్త్రాలపై 30 శాతం రిబేట్ ఇస్తామని ఆ నాడు ప్రగల్భాలు పలికినా.. బడ్జెట్లో ఆ ఊసేలేదు. సగం ధరకే జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పుకున్నారు. వృద్ధ చేనేత కార్మికులకు ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం తదితర పట్టణాల్లో వృద్ధాశ్రమాలు, ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్న బాబు.. ఇప్పుడేమో ప్లేటు తిరగేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 76940 మందికి చేనేత పెన్షన్లు ఇస్తున్నారు. దీనితో పాటు వంద రోజుల ప్రణాళికలో 3276 మందికి అదనంగా పెన్షన్ ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. రూ. 1.50 లక్షలతో 13 జిల్లాల్లో 901 మందికి వర్క్షెడ్లతో కూడిన ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన సీఎంగారికి ఆ మాట గుర్తుందో లేదో మరి. ప్రమాణ స్వీకారం చేసే రోజు చేనేత రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే ఇటీవల మొత్తం రూ. 119కోట్లు రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ. 176కోట్లు చేనేత రుణాలున్నాయి. కానీ వీటితో పాటు సహకార సంఘాలు సీసీ కింద తీసుకున్న రూ. 26కోట్ల లెక్క చూపించలేదు. మొత్తం మీద రూ. 202కోట్లు రద్దు కావాల్సి ఉండగా కేవలం రూ. 119 కోట్లు మాత్రమే అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో! రైతు, డ్వాక్రా రుణాలు రద్దు కోసం జీఓ నెం. 174ను విడుదల చేశారు. అయితే అందులో చేనేత ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ముందుగా ప్రకటించినట్లు చేనేతలకు రూ. 1000 కోట్లు కేటాయించాలని.. చేనేత పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. వస్త్ర ఉత్పత్తిని సమీక్షించేందుకు ఓ మిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిని చేనేతలు వ్యతిరేకిస్తున్నారు. పారిశ్రామిక వేత్తల చేతుల్లో తమ బతుకులు పెట్టేందుకే ఈ ఏర్పాట్లని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆరోపిస్తోంది. -
చేదెక్కిన ‘చక్కెర’ బతుకులు
9 నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్న ఉద్యోగులు 400మంది ఉద్యోగులకు రూ.3.5కోట్ల బకాయిలు గతేడాది రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.9.87కోట్లు {పైవేటు ఫ్యాక్టరీలకు చెరుకు తరలిస్తున్న రైతులు ఈసారి ఇంకా ఉద్యోగులను రీకాల్ చేయని వైనం నేడు చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ పాలకమండలి సమావేశం సాక్షి, చిత్తూరు: ‘‘సూర్యప్రకాష్(పేరు మార్చాం) చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలో ఉద్యోగి. ఈయనకు 9 నెలలుగా జీతం ఇవ్వలేదు. ఇతనికి ముగ్గురు పిల్లలు. జూన్, జూలైలో పిల్లల చదువుకోసం ఫీజులు, దుస్తులు, పుస్తకాల కోసం 40వేల రూపాయలు ఖర్చయ్యూరుు. జూన్‌లో 50వేల రూపాయలు అప్పు చేశాడు. ప్రతి నెలా ఇంటి బాడుగ, ఇతర ఖర్చులు కలిపి 10వేల రూపాయల వరకూ ఖర్చు వస్తోంది. జూన్‌లో చేసిన అప్పుతో కలిపి 1.7లక్షల రూపాయల అప్పులు తేలారుు. ఎవరినైనా అప్పు అడగాలన్నా అడగలేని పరిస్థితి. పేరుకు ‘చక్కెర ఫ్యాక్టరీ’లో ఉద్యోగం అనే మాటే కానీ...ప్రకాష్...ఆయన భార్యాపిల్లలు ఆర్థికంగా తీవ్ర వేదనపడుతున్నారు.’’ ఈ ఫొటోలోని రైతుపేరు సురే ష్ బాబు. కార్వేటినగరం ఎం.ఎం విలాసం వాసి. గతేడాది 3ఎకరాల్లో చెరుకు సాగు చేశాడు. అప్పటికే 2012కు సంబంధించి 40వేల రూపాయల బకాయిలు ఉన్నాయి. అయినా గతేడాది చెరుకును ఫ్యాక్టరీకి తోలాడు. ఇప్పటికీ రెండేళ్లకు సంబంధించి 90వేల రూపాయల బకాయిలు రావాలి. పంట పెట్టుబడికి చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. గతేడాది పంటసాగుకు ఇంట్లోని బంగారు తాకట్టుపెట్టాడు. ఈ ఏడాది ఇద్దరు పిల్లల చదువుకు మళ్లీ అప్పు చేశాడు. పూర్తిగా కష్టాల ఊబిలో కూరుకుపోయాడు. దీనంతటికీ కారణం పంట దిగుబడి ఇంటికి రాకపోవడమే ! సూర్యప్రకాష్ కుటుంబంలాగే చిత్తూరు సహకార చక్కెర కర్మాగారంలోని 400మంది ఉద్యోగులు వేదనపడుతున్నారు. నగరి, పుత్తూరు, కార్వేటి నగరంతో పాటు పలు మండలాల్లోని వందలాది మంది రైతులు అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం స్పందించదు. ఇదేంటి ? అని ప్రశ్నిస్తే గతంలో నష్టాలు వచ్చాయి ? అవి అలాగే కొనసాగుతున్నాయి ? అనే చెబుతున్నారు. ఉద్యోగుల బకాయిలు రూ.3.5 కోట్లు ఫ్యాక్టరీలో 400మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 120మంది పర్మినెంట్ ఉద్యోగులు. తక్కినవారు కన్సాలిడేటెడ్ ఉద్యోగులు. వీరందరికీ గతేడాది నవంబర్ నుంచి వేతనాలు ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 400మందిలో అప్పులేని ఉద్యోగి లేరని తోటి ఉద్యోగులు చెబుతుంటే... వారి జీవనం ఎంత కష్టంగా సాగుతుందో తెలుస్తుంది. కష్టాలు పడుతున్నవారు పత్రికలకు అభిప్రాయాలు ఇచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే..‘లేనిపోని కారణాలతో యాజమాన్యం వేధిస్తుంది’ అంటున్నారు. ఇప్పటి వరకూ ఉద్యోగుల రీకాల్ లేదు ఏటా జూన్‌లో ఉద్యోగుల రీకాల్ జరిగేది. ఈ ఏడాది ఆగస్టు గడుస్తున్నా కన్సాలిడేటెడ్ ఉద్యోగులను రీకాల్ చేయలేదు. అక్టోబర్, నవంబర్ నుంచి సీజన్ మొదలవుతుంది. నవంబర్-ఫిబ్రవరిలో 600మంది ఉద్యోగులు ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ రీకాల్‌పై ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి చెరుకుసాగు తక్కువే.. 2012-13లో 1.05 లక్షల టన్నుల చెరుకు ఫ్యాక్టరీకి చేరింది. క్వింటాలు 1800 రూపాయలతో యాజమాన్యం డబ్బులు చెల్లించాలి. కొందరికి, కొద్దిమేర మాత్రమే డబ్బు చెల్లించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 3.4 కోట్లు ఫ్రీలోన్ ఇచ్చినా బకాయిలు చెల్లించలేకపోయారు. 2013-14లో రైతులు 47వేల టన్నుల చెరుకు ఫ్యాక్టరీకి తోలారు. దీనికిగాను టన్నుకు రూ.2100చొప్పున 9.87కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 50వేల టన్నుల చెరుకు పంటకు ఫ్యాక్టరీ రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంది. అయితే పాత బకాయిలు చెల్లించకపోతే చెరుకును రైతులు మరో ఫ్యాక్టరీకి తరలించేందుకు వెసులుబాటు ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు రైతులు ఎస్ఆర్ పురం మండలం నెళవాయిలోని ‘సాగర్ షుగర్స్’కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఫ్యాక్టరీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఇటీవల రామకృష్ణ నేతృత్వంలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఉద్యోగుల జీతాలతో పాటు రైతుల బకాయిలు చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు, రైతులకు దాదాపు 13 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం యాజమాన్యానికి ఇబ్బందే! ఈ క్రమంలో ప్రభుత్వం ఆదుకుని ఫ్యాక్టరీని గట్టేక్కించాల్సి ఉంది. బకాయిలు ఉన్నాయి....నేనూ కొత్తగా వచ్చాను ఉద్యోగులు, రైతులకు బకాయిలు ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. సోమవారం జరిగే పాలకమండలి సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తా! -మల్లికార్జునరెడ్డి, ఎండీ నెళవాయికి చెరుకు తోలుతున్నా సార్! ఐదెకరాల్లో చెరుకుసాగు చేశా ! నాకు చిత్తూరు ఫ్యాక్టరీ వాళ్లు 25వేల రూపాయల బకాయిలు ఇవ్వాల.! మేమే అప్పు చేసి పంటసాగు చేస్తే.. మా పంట తీసుకుని మాకు అప్పు పెడితే ఎట్టా. అందుకే నెళవాయి ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తుండా! -దేశయ్య, పాదిరికుప్పం, కార్వేటినగరం -
‘ప్లస్’ అయ్యే అలంకరణ
వయసు పైబడడం, ఆరోగ్యం, వంశపారంపర్యం, పని ఒత్తిడి... ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు ఓ బెడదలా ఇటీవల చాలామందిని వేధిస్తోంది. పెరిగిన బరువు అందానికి ‘మైనస్’ అనుకోవడం కన్నా.. దానినే ‘ప్లస్’గా మార్చుకుంటే మేలు అని భావించేవారి కోసమే ఈ కథనం... సాధారణంగా అన్ని షాపులలో జీరో (0) నుంచి ఫార్టీ (40) సైజ్ లోపు కొలతలలో రకరకాల దుస్తులు లభిస్తున్నాయి. నలభై కన్నా పై కొలతలలో ఉన్నవారిని ‘ప్లస్ సైజ్’ అంటారు. ఈ సైజ్ వారికి డ్రెస్సులు కావాలంటే మాత్రం ‘సారీ, టైలర్‌తో చెప్పి కుట్టించుకోండి..’ అని సలహా ఇస్తుంటారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకుని సరైన కొలతలలో లేని దుస్తులు తెచ్చుకొని ఇబ్బంది పడటం, టైలర్ సరైన కొలతలలో డ్రెస్ కుట్టకపోవడం, తమ శరీరాకృతికి సరిపడా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, డిజైన్ చేయించుకోవాలో తెలియకపోవడం.. ఇవన్నీ అధికబరువు (ప్లస్ సైజ్) ఉన్నవారి ప్రధాన సమస్యలు. లావుగా ఉన్నా అందంగా, కాలానుగుణంగా వేషధారణ హుందాగా ఉండాలంటే... దుస్తుల ఎంపిక సరిగ్గా ఉండాలి. ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటేమీ జీవనశైలి మరింత సులభంగా, మరింత సుందరంగా మారిపోతుంది. మీ శరీరాకృతి లావుగా ఉంటే... బాధాపడాల్సిన అవసరమే లేదు. ఫ్యాషన్ డిజైనర్లు. ప్లస్ సైజ్ ఉమన్ దుస్తుల ఎంపికకు ఇస్తున్న ఈ సూచనలు పాటించండి... బిగుతుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. చిన్న సైజు, బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. మరీ వదులుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. ‘బాగా వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సన్నగా కనపడతాం’ అనుకోవడం అపోహ. వేలాడుతున్నట్టుగా ఉండే దుస్తులను ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. అధికబరువున్న వారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్లస్ సైజ్ ఉమన్‌కు డిజైన్ చేసిన బ్రాండెడ్ దుస్తుల్లోనూ అన్నీ ఒకే తరహావి ఉంటాయి. ఒక్కోసారి ఆ డ్రెస్ కొలతలు మీకు నప్పకపోవచ్చు. అందుకని ఎంపిక చేసుకునేటప్పుడు ఒకసారి కొనుగోలు చేసే దుస్తులను వేసుకొని, అద్దంలో చూసుకొని, నప్పితేనే తీసుకోవాలి. లావుగా కనిపించే శరీర భాగాలలో ముదురు రంగులతో కవర్ చేసే డిజైన్లు గల దుస్తులను ఎంపిక చేసుకోవాలి. కాంతిమంతమైన/లేత రంగులకన్నా ఫ్యాషన్‌లో ముదురు రంగులు ఎప్పుడూ ముందుంటాయి. లావుగా ఉన్నవారు వీటిని నిరభ్యంత ధరించవచ్చు. అంతేకాదు ఈ రంగులు అధికబరువును తక్కువగా చూపిస్తాయి. వంగపండు, గోధుమ, బూడిద... రంగువి కూడా ముదురు రంగులలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే టాప్ (నడుము పై భాగంలో) కలర్ ముదురు రంగులో ఎంపిక చేసుకుంటే బాటమ్ (నడుము కింది భాగంలో) లేత రంగులో తీసుకోవాలి. అధికబరువు ఉన్నవారు దుస్తులతో ఇంకాస్త బరువును పెంచుకోకూడదు. దుస్తులకు వచ్చే పెద్ద పెద్ద బటన్స్, పెద్ద పాకెట్స్, వెడల్పాటి కుచ్చులు.. ఎదుటివారి దృష్టి పడేలా చేస్తాయి. అందుకని దుస్తులపై డిజైన్స్ ఇలా అన్నీ పెద్ద పెద్దగా ఉండేవి ఎంచుకోకూడదు. ప్యాంట్స్ అయితే బ్యాక్ పాకెట్స్‌పై, టాప్స్ అయితే చేతులు లేని జాకెట్‌పై ఎంబ్రాయిడరీ లేకుండా జాగ్రత్తపడాలి. మీ వార్డ్రోబ్ నుంచితొలగించాల్సినవి..! చాలా పొట్టిగా ఉండే షార్ట్స్ వదులుగా ఉండే ట్రౌజర్స్ పొట్టి లంగాలు (మినీ స్కర్ట్స్) మామ్ జీన్స్ (నడుము, పిరుదుల భాగం ఎక్కువ వదులు ఉండేవి) రిప్డ్ జీన్స్ (అక్కడక్కడా చిరుగులు ఉన్న జీన్ ప్యాంట్స్), కార్గో ప్యాంట్స్ బ్యాగీ జీన్స్ (పూర్తి వదులుగా ఉండేవి) ఫిట్‌గా లేని బ్లేజర్స్ బ్యాగీ స్వెట్స్ పొడవు లంగాలు మెరిసే రాళ్లు, కుందన్స్, చమ్కీతో చేసిన డిజైన్లు గల దుస్తులు ఎక్కువ కుచ్చులు ఉన్న డ్రెస్సులు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న దుస్తులు రంగురంగులుగా ఉండే కౌబాయ్ బూట్లు. ‘ప్లాట్’గా పై నుంచి కిందకు ఒకే విధంగా ఉండేలాంటి దుస్తులు తీసుకోకూడదు. మహిళలు సాధారణం గా తమ వేషధారణ ఒకే రంగు (మ్యాచింగ్)లో ఉండాలనుకుంటారు. మ్యాచింగ్ అధికమైతే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. ‘కాంట్రాస్ట్’ (ఒకదానితో ఒకటి పోలిక లేనివి) కలర్స్ దుస్తులు వేసుకుంటే మేలు. ఉదా: స్కర్ట్/ప్యాంట్స్ వేసుకునేవారు అదే రంగు టీ షర్ట్ వేసుకోకూడదు. టీ షర్ట్‌పైన వేసుకునే ఓవర్‌కోట్ స్కర్ట్/ప్యాంట్ ఒకే రంగులో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. సైజ్ చార్ట్! ఛాతీ పరిమాణం 41-45, నడుము పరిమాణం 33-37 హిప్ (పిరుదుల)పరిమాణం 43-47 ఉన్నవారు XXSసైజ్ దుస్తులను ... ఛాతీ పరిమాణం 77-83, నడుము 71-78 హిప్ (పిరుదుల)పరిమాణం 80-90 ఉన్నవారు XXLసైజ్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ప్లస్ సైజ్ వారు ఆన్లైన్ చార్ట్‌ను అనుసరించవచ్చు. అలంకరణ అనేది వస్తువుల స్థాయిని పెంచాలి. మీరు లావుగా ఉంటే ధరించే ఆభరణా లు సన్నగా ఉంటే ఏ మాత్రం కనిపించవు. అందుకని మధ్యస్థం- పెద్ద సైజున్నవి ఎంచుకోవాలి. మీ కాళ్లకు తగిన మందపాటి హీల్ ఉన్న చెప్పులు ధరించాలి. అలాగే పెద్ద పర్స్/బ్యాగ్ వెంట తీసుకెళ్లాలి. ఈ తరహా ఇతర అలంకరణ వస్తువులు మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి. నోట్: మరీ పెద్ద పెద్దవి కాకుండా... మీరు ఉన్న లావును కొద్దిగా అధిగమించేలా మాత్రమే మీ ఇతర అలంకరణ వస్తువులు ఉండాలనే విషయం మర్చిపోవద్దు. అలంకరణ సమయంలో మీ బరువు, మీ ఎత్తు సైజ్, ఎముక సామర్థ్యం.. ఇవన్నీ దృష్టిలోపెట్టుకోవాలి. మీ వార్డ్రోబ్లోఉండాల్సివి..! వి నెక్ గల తెల్లటి చొక్కా (బటన్ డౌన్ షర్ట్) శరీరాకృతికి సరిగ్గా సరిపడే నలుపు రంగు డ్రెస్. ఫిట్‌గా ఉండే లాంగ్ ప్యాంట్స్ ఫిటెడ్ బ్లేజర్స్ ప్రస్తుత కాలానికి తగ్గ దుస్తులు మీకు మాత్రమే ప్రత్యేకం అనిపించే స్టైల్ దుస్తులు హాఫ్ స్కర్ట్(మోకాళ్ల వరకు ఉండేది) ఎంపిక సరైనది పొట్టను కవర్ చేసే డిజైనర్ దుస్తులు. (వీటి ఎంపికలో డిజైనర్/షాప్/ ఆన్లైన్ సాయం తీసుకోవచ్చు) శరీరాకృతికి సరిగ్గా నప్పేవి, సరైన ఫిట్‌తో ఉన్న లో దుస్తులు బెల్ట్‌లు, ఆభరణాలు, పాదరక్షలు.. వీటితోనూ మీ దుస్తుల్లో కొత్త మార్పులు తీసుకురావచ్చు. దుస్తులు కుట్టించుకోవాలంటే... కుర్తా, టాప్స్ టైలర్‌తో కుట్టించుకునేటప్పుడు ‘సైడ్ ఓపెన్స్’ పిరుదుల పై భాగం వరకు పెట్టించుకోవాలి. దీని వల్ల కూర్చునేటప్పుడు డ్రెస్ ముందు భాగం పొట్టమీదకు రాకుండా ఉంటుంది. వెయిస్ట్ భాగంలో బిగుతుగా ఉండే డ్రెస్ వల్ల మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. జాకెట్టు చేతులు కుచ్చులున్నవి డిజైన్ చేయించుకుంటే చేతులు మరింత లావుగా కనిపిస్తాయి. లావుగా ఉన్నవారికి బ్రాడ్, ఓవర్ నెక్స్ సరిగ్గా నప్పుతాయి. నోట్: లావుగా ఉన్నప్పటికీ పొడవుగా ఉన్నవారు... స్లీవ్స్, ప్యాంట్స్, లెగ్గింగ్స్ సరైన ఫిట్‌తో ఉండేవి తీసుకోవచ్చు. పొట్టిగా ఉంటే నిలువు చారలు ఉన్నవి, విభిన్న రకాల రంగుల్లో ఉన్న డ్రెస్సులను ఎంచుకోవాలి. చీరలు కట్టుకునేవారు కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. 42 - 62 అంగుళాల పరిమాణంలో ఉన్నవారి కోసం సాధారణ దుస్తుల నుంచి పార్టీవేర్ వరకు ప్లస్ సైజ్ స్టోర్లలో అన్ని రకాల బ్రాండ్లలో (టాప్స్, కుర్తీస్, లెగ్గింగ్స్, జీన్స్, టీ షర్ట్స్, పార్టీవేర్, వెస్ట్రన్‌వేర్, ట్రెడిషనల్ వేర్..) నాణ్యమైన దుస్తులు లభిస్తున్నాయి. ఇవన్నీ కాటన్, టెరీకాటన్, సిల్క్, సింథటిక్... మెటీరియల్స్‌లో లభిస్తున్నాయి. - నిర్మలారెడ్డి కర్టెసీ ప్లస్ సైజ్, పంజగుట్ట, హైదరాబాద్ -
ట్రైబల్ టైలర్లు కావలెను..!
* ఎస్టీ విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు దర్జీల కొరత * సంక్షేమ హాస్టళ్లలో పక్కన పడేసిన క్లాత్ * ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టని వైనం * మధ్యవర్తుల పైరవీలతో అధికారుల ఇబ్బందులు నీలగిరి: జిల్లాలో ట్రైబల్ టైలర్లు (గిరిజన దర్జీలు) కరువయ్యారు. దీంతో ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు దుస్తులు కుట్టే నాథుడే లేకుండాపోయాడు. దర్జీలు లేరన్న కారణాన్ని సాకుగా చూపి వేల మీటర్ల క్లాత్‌ను పక్కన పడేశారు. జిల్లా మొత్తంగా 39 ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు, 11 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 13,000 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. విద్యాసంవత్సర ప్రారంభంలోనే జిల్లాకు 1,6,226 మీటర్ల క్లాత్ చేరింది. ఒక్కో విద్యార్థికి మూడు జతల దుస్తులు కుట్టించి ఇవ్వాలి. గతంలో క్లాత్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం, విద్యార్థులకు ఒకటిరెండు జతలు ఇవ్వడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం గత ఏడాది నుంచే నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. గిరిజన టైలర్లకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దుస్తులు కుట్టే బాధ్యతను వారికే అప్పగించాలని పేర్కొంది. వసతి గృహాల వద్దనే కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు దుస్తులు కుట్టించాలనే నిబంధన విధించింది. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా 16 హాస్టళ్లను దుస్తులు కుట్టించే కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ కేంద్రాల వద్దనే మిగిలిన 34 హాస్టళ్లకు చెందిన దుస్తులు కుట్టించాలి. దీంతో ఒక్కో హాస్టల్‌కు ఎంతలేదన్నా పది నుంచి 20 కుట్టుమిషన్లు అవసరం. ఈ స్థాయిలో కుట్టుమిషన్లు ఏర్పాటు చేసేంత శక్తిసామర్థ్యాలు కలిగిన గిరిజన టైలర్లు తమకు దొరకడం లేదని వార్డెన్లు రాతపూర్వకంగా జిల్లా అధికారులకు లేఖ రాశారు. వసతి గృహాల వద్ద దుస్తుల కుట్టేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని, క్లాత్ ఇస్తే, బయట కుట్టి హాస్టళ్లకు పంపిస్తామని కొందరు గిరిజన టైలర్లు సంప్రదించినట్లుగా వార్డెన్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పటి వరకు దుస్తులు కుట్టే వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో వసతి గృహాలకు చేరిన క్లాత్ నిరుపయోగంగా ఉండిపోయింది. ఆగస్టు 15వ తేదీ నాటికి విద్యార్థులకు కొత్త దుస్తులు అందించాలి. కానీ ఇప్పటి వరకూ అధికారులు ఆ దిశగా ఏ ప్రయత్నమూ చేయలేదు. గతేడాది కూడా గిరిజన దర్జీలు లేరన్న కారణాన్ని సాకుగా చూపిన వార్డెన్లు దుస్తులు కుట్టే బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. దీంతో పలుచోట్ల క్లాత్ దుర్వినియోగం కావడంతోపాటు శాఖాపరంగా అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడు పక్కదారి పట్టకుండా ఉండేందుకు, గిరిజన దర్జీలకు ఉపాధి కల్పించాలన్న పట్టుదలతో జిల్లా యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. దళారుల ప్రమేయంతోనే ఇబ్బందులు : వి.సర్వేశ్వరరెడ్డి, మాడా పీఓ దుస్తులు కుట్టేందుకు గిరిజన దర్జీలను రానివ్వకుండా దళారులు అడ్డుకుంటున్నారు. అంతేకాదు.. పలుచోట్ల బెదిరింపులకు పాల్పపడుతున్నట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. గతంలో కూడా ఈ విధమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దుస్తులు కుట్టినందుకుగాను టైలర్లకు ఒక్కో జతకు రూ.40 చొప్పున చెల్లిస్తాం. దీంట్లో కమీషన్లు రాబట్టుకునేందుకు దళారులు ప్రవేశించి గిరిజన టైలర్లను రానివ్వడం లేదు. ఇద్దరు, ముగ్గు రు దర్జీలు ఒక గ్రూపుగా ఏర్పడి దుస్తులు కుట్టేందుకు ముందుకొచ్చారు. ఇదే విషయమై కలెక్టర్‌కు ఫైల్కూడా పెట్టాం. కానీ వ్యక్తిగతంగా ముందుకొచ్చి హాస్టళ్ల వద్ద దుస్తులు కుట్టేవారికే మాత్రమే ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. దీంతో దర్జీలను ఎంపిక చేసే పనిలో ఉన్నాం. త్వరలో దుస్తులు కుట్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. -
కళకళ.. వెలవెల
సాక్షి, సిటీబ్యూరో: వేసవి ముగియడంతో నగరంలోని ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ గురువారం పునఃప్రారంభమయ్యాయి. కొత్త దుస్తులు, పుస్తకాల బ్యాగులు తగిలించుకొని వచ్చిన విద్యార్థులతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు కళకళలాడగా, సర్కారీ స్కూళ్లు మాత్రం విద్యార్థులు లేక బోసిపోయాయి. కొత్తగా చేరుతున్న చిన్నారులతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంట రావడంతో పలు ప్రైవేటు పాఠశాలలు కిటకిటలాడా యి. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు ఉపాధ్యాయులంతా వచ్చినప్పటికీ.. విద్యార్థులు పెద్దగా హాజరు కాలేదు. సెలవులకు ఊళ్లకు వెళ్లిన విద్యార్థలు కొందరు తిరిగి రాకపోవడం, ఎండ తీవ్రత ఇంకా తగ్గకపోవడం కూడా కారణాలు కావచ్చని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే..జిల్లావ్యాప్తంగా ఏ పాఠశాల్లోనూ విద్యార్థులకు కనీసం ఒక్కజత యూనిఫారాన్ని కూడా విద్యాశాఖ అధికారు లు అందజేయలేదు. విద్యార్థులకు ఉచి త పాఠ్యపుస్తకాలను కూడా అరకొరగానే పంపిణీ చేశారు. తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏ యేటికాయేడు తీవ్రంగా పడిపోతోంది. అదేమీ లేదని అధికారులంటున్నప్పటికీ ఇది వాస్తవం. సాధారణంగా వేసవి సెలవుల్లో బడిబాట, విద్యా పక్షోత్సవాలు.. తదితర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నమోదు ను పెంచుకోవటానికి విద్యాశాఖ కసరత్తు చేయ టం పరిపాటి. కానీ ఈసారి అలాంటి కార్యక్రమాలేవీ జరగకుండానే పుణ్యకాలం కాస్తా ముగిసిపోయింది. విద్యాశాఖ అధికారులు వేసవి సెలవు ల షెడ్యూల్లో బడిఈడు బాలలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం విచారకరం. పాఠ్య పుస్తకాల కొరత! పాఠశాలల పునఃప్రారంమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదు. ప్రతిఏటా పాఠ్యపుస్తకాల కొరత విద్యార్థులను వేధిస్తున్నా..ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జూన్ 12నుంచి పాఠశాలలు తెరిచిన వెం టనే.. నగరంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ అధికారులు చే సిన ప్రకటనలు కాగితాలకే పరిమితయ్యాయి. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల్లో 65 శాతం పుస్తకాలు మాత్రమే పాఠశాలలకు చేరాయి. మిగిలిన 35 శాతం పుస్తకాలు స్కూళ్లకు ఎప్పుడొస్తాయో అంతుబట్టని దుస్థితి నెలకొంది. పుస్తకాలు ఇవ్వకుంటే విద్యార్థులు బడి రాకుండా పోయేందుకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. యూనిఫారాలు లే వ్ ! ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం మరోమారు సుస్పష్టంగా కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన యూనిఫారాల గురించి అటు ఆర్వీఎంలోనూ.. ఇటు విద్యాశాఖలో ఆ హడావిడేమీ కనిపించడం లేదు. హైదరాబాద్ జిల్లాలో 1.07లక్షలమందికి 2.14లక్షల జతలు సిద్ధం కావాల్సి ఉండగా..నేటివరకు ఒక్క జత కూడా రెడీ కాలేదని తెలిసింది. కనీసం కాంట్రాక్టర్ నుంచి బట్ట(క్లాత్)కూడా అందలేదు. కమీషన్లకు కక్కుర్తిపడిన ప్రభుత్వ పెద్దలు.. అధ్వాన్నపు కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడమే ఈ జాప్యానికి కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పేదవారి ఊటీ... కొల్లి మలై
వేసవి కాలం కుటుంబంతో కలసి సెలవులు హాయిగా, చల్లగా ఆస్వాదించాలనగానే సాధారణంగా ఉత్తర భారతదేశంలోని డెహ్రాడూన్, కులూ మనాలి లాంటివి గుర్తొస్తాయి. దక్షిణాదిలోనే చూద్దామనుకుంటే ఊటీ, కొడెకైనాల్ లాంటి వాటికి తప్ప వేరే సరికొత్త హిల్ స్టేషన్లు మనసులోకి రావు. చాలామందికి తెలియని ఓ వేసవి పర్యాటక కేంద్రం - ‘కొల్లి మలై’గా ప్రసిద్ధమైన కొల్లి హిల్స్. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ ఉంది. పర్యాటకుల తాకిడికి ఇంకా పెద్దగా లోనుకాని ప్రాంతమిది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కొండ ప్రాంతం కేవలం 1500 మీటర్ల ఎత్తున ఉంటుంది. కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతకు ఇది నిలయం. ప్రాథమికంగా ఈ కొల్లి హిల్స్‌లో ‘మలయాళీ గిరిజనులు’గా అందరూ పిలిచే స్థానిక గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. పట్టణ ప్రాంతపు నవ నాగరికులు ఎవరూ ఉండరు. అందుకే, ఈ కొల్లి హిల్స్‌కు కేంద్రస్థానమైన సెమ్మేడులో కూడా మనకు అపరిశుభ్రమైన రహదారులు కానీ, బహిరంగంగా ప్రవహించే మురుగు నీరు కానీ కనిపించవు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ గిరిజనులు కూడా ఎంతో సంస్కారయుతంగా ఉంటారు. చక్కగా దుస్తులు వేసుకుంటారు. వాళ్ళ ఇంటి ముందు కూడా ఓపెన్ డ్రెయిన్లేవీ ఉండవు. ఆ కొండ కోనల అభివృద్ధిలో చదువు కీలక పాత్ర పోషించిందని అనుకోవచ్చు. ఒక్కసారి గతంలోకి వెళితే, కొల్లి హిల్స్‌కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. తూర్పు కనుమల్లో భాగమైన ఈ కొండ ప్రాంతం ప్రస్తావన ప్రాచీన తమిళ రచనలైన ‘శిలప్పదికారం’, ‘మణిమేఖలై’, ‘పురననూరు’, ‘ఐన్కుర్నూరు’ లాంటి వాటిలో ఉంది. ఈ ప్రాంతానికి అన్ని వసతులూ ఉండేవనీ, అందరికీ ప్రాథమిక విద్య ఉండేదనీ చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయం ఇవాళ్టికీ కొనసాగుతోంది. ఈ కొండల్లోని మహిళలు ఎంతో ఉత్సాహంగా కొత్త పనులు చేపడుతుంటారు. ఇక, ఈ కొల్లి హిల్స్‌కు ఒకప్పటి పాలకుడైన వాళ్విల్ ఒరి ఎంతో ముందుచూపున్న మనిషి అని ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావన ఉంది. దాదాపు తొమ్మిది శతాబ్దాల తరువాత కూడా ఇప్పటికీ ఈ కొండ ప్రాంతం, ఇక్కడి ప్రజలపై ఆయన ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. చల్లగా ఉంటుంది... చలి పెట్టదు! మిగిలిన హిల్ స్టేషన్ల వాతావరణానికి భిన్నంగా కొల్లి హిల్స్ ప్రశాంతంగా ఎండాకాలంలో కొద్ది రోజులు ప్రకృతి ఒడిలో సేద తీరడానికి అనువుగా ఉంటాయి. ఎండాకాలంలో ఇక్కడి పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రిపూట ఉష్ణోగ్రత 16 నుంచి 22 డిగ్రీలే! అయితే, చలికాలంలో మాత్రం ఇక్కడ ఉష్ణోగ్రత - పగటిపూట 10 డిగ్రీలు, రాత్రి వేళ 5 డిగ్రీలు. అందుకే, వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఇది చక్కటి పర్యాటక ప్రాంతం. పైగా, ఇక్కడ తక్కువ ధరకే బస చేసేందుకు వీలుగా కొన్ని రిసార్ట్లు కూడా ఉన్నాయి. భోజనం కూడా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే, చాలామంది ఈ ప్రాంతాన్ని ‘పేదవాళ్ళ ఊటీ’ అని పిలుస్తుంటారు. చుట్టుపక్కల చూడదగ్గవెన్నో! నిజం చెప్పాలంటే, కొల్లి హిల్స్‌కు చేసే ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరంగా, ఉద్విగ్నభరితంగా, సాహసోపేతంగా ఉంటుంది. మైదాన ప్రాంతం నుంచి ఆ కొండల మీదకు దూరం కేవలం 15 కి.మీ.లే. కానీ, పాము మెలికలు తిరిగినట్లు, దాదాపు 73 మలుపులతో ఉంటుందా మార్గం. పగటి పూట ఈ ప్రయాణం చేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ కొండల సౌందర్యాన్ని కళ్ళారా చూడవచ్చు. కెమేరాతో చక్కటి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. కొల్లి హిల్స్ పైకి చేరాక, అక్కడ ఉన్నంతలో పెద్ద పట్నం - సెమ్మేడు. అక్కడ బస చేసి, ఆ చుట్టుపక్కలి ప్రాంతాలకు తిరిగి రావచ్చు. సెమ్మేడులోనే హోటళ్ళు, రిసార్టులు ఉంటాయి. సెమ్మేడుకు 17 కి.మీ.ల దూరంలో ఓ జలపాతం ఉంది. ఋతుపవనాలు వచ్చి, తొలకరి జల్లులు కురిశాక, ఇక్కడకు వెళితే, ఆ పరిసరాలు ఎంత అందంగా ఉంటాయో! ఇక్కడకు దగ్గరలోనే ప్రాచీన సంగ కాలానికి చెందిన ఆరపాలీశ్వర ఆలయం ఉంది. ఈ శివుడి గుడి ఎంతో మహిమాన్వితమైనదని స్థానికుల నమ్మకం. ఈ ‘పేదవారి ఊటీ’ని అభివృద్ధి చేయవచ్చని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం గడచిన ఏడేళ్ళుగా ఆ పనిలో ఉంది. పర్యాటక స్థలంగా కొల్లి హిల్స్‌ను ప్రోత్సహిస్తోంది. అలాగే, ఈ కొండల మీద ఓ రెండు వ్యూ పాయింట్లను సిద్ధం చేయాలని చూస్తోంది. అవే గనక సిద్ధమైతే, పర్యాటకులకు మరింత ఆకర్షణ తోడవుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఓ వరం. ఇక్కడ సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను సహజంగా పండించి, అమ్ముతుంటారు. అలాగే, ఈ కొండల నిండా అనాస, పనస, సపోటా, బత్తాయి తోటలు పుష్కలం. మిరియాలు, కాఫీ లాంటి వాణిజ్య పంటలు ఈ కొండల్లో నివసించే గిరిజనులకు ప్రధాన దిగుబడి. ఈ ప్రాంతాన్ని సందర్శించినవారు గుర్తుగా ఇలాంటివి కొని తీసుకువెళ్ళచ్చు. గిరిజనుల పవిత్ర అరణ్యాలు మరో విశేషం ఏమిటంటే, ఈ కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘ఎం.ఎస్. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్’లో పనిచేస్తున్న డాక్టర్ ఇజ్రాయెల్ ఆలివర్ కింగ్ ఇక్కడి ప్రజలు పవిత్రంగా భావించే ఈ అడవులపై పిహెచ్.డి. చేశారు. ‘‘పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ఎవరినీ గిరిజనులు అనుమతించరు. ఈ ప్రాంతాల్లోనే వారు తమ బంధువులను, పూర్వీకులను ఖననం చేస్తారు. ఈ కొండలకే పరిమితమైన ఈ విలక్షణ ఆచారం, పవిత్ర అరణ్యాలనే ఈ పద్ధతి దేశంలో మరెక్కడా లేదు’’ అని కింగ్ వివరించారు. కొల్లి హిల్స్‌లోని ఈ మలయాళీ గిరిజనులు నేరాలకు పాల్పడరు. అందుకే, ఈ ప్రాంతంలో నేరాలు జరిగినట్లు పెద్దగా ఎప్పుడూ వినం. అయితే, ఇక్కడ జరిగే ఒకే ఒక్క నేరం - వ్యభిచారం. గమ్మత్తేమిటంటే, అలా వ్యభిచరిస్తూ పట్టుబడిన జంట పంది మాంసం వండి, మొత్తం గ్రామ ప్రజలకు విందు పెట్టడమే శిక్ష! ఎలా వెళ్ళాలంటే... తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సేలమ్‌కు రవాణా సౌకర్యాలున్నాయి. చక్కటి రైలు మార్గం కూడా ఉంది. మరింకేం! ఈ ‘పేదవారి ఊటీ’కి వెళ్ళి, ప్రకృతిలో తాదాత్మ్యం కండి! * తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి. * కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి. * పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి * ఎవరినీ ఇక్కడి గిరిజనులు అనుమతించరు. - కె. జయదేవ్ (ఈ వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు, చలనచిత్ర రూపకర్త. సైన్స్ పత్రిక ‘నానో డెజైస్ట్’కు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.) -
దుస్తులపై మరకలు..
దుస్తులపై మరకలు.. దుస్తులపై నూనె మరకలు అయినచోట ఉప్పులో అద్దిన నిమ్మముక్కతో రుద్ది, తర్వాత డిటెర్జెంట్ సోప్‌తో శుభ్రపరచాలి. ఎండబెట్టిన నిమ్మ తురుమును పొడి చేసి, గాలిచొరబడని జార్లో భద్రపరచాలి. తెల్లని దుస్తులను ఉతకడానికి డిటర్జెంట్‌తో పాటు ఈ పొడిని కొద్దిగా కలిపి నానబెట్టాలి. మురికి త్వరగా వదలడమే కాకుండా దుస్తులకు మెరుపులాంటి తెలుపుదనం వస్తుంది. దుస్తులపై టీ మరకలు అయిన చోట చల్లని పాలలో ముంచిన స్పాంజితో రుద్ది, ఆరిన తర్వాత శుభ్రపరచాలి. కంటికింద నలుపు... చర్మం బిగుతు అవడానికి, తెల్లబడటానికి స్కిన్ టైటనింగ్, వైటనింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడుతుంటారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది. అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూతా మృదువుగా రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, చర్మం పొడిబారడం తగ్గుతుంది. కంటిచుట్టూ చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకని రాత్రిపూట మేకప్ నుంచి, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు కంటికింద నలుపును దూరం చేస్తాయి. గోరంత పని... పెరిగిన గోళ్లను కత్తిరించడం, గోరు చుట్టూ భాగాన్ని శుభ్రపరచడం వల్ల వేలికొసల్లో అందంగా కనిపిస్తాయి గోళ్లు. గోరువెచ్చని సబ్బునీటితో చేతులను శుభ్రపరుచుకోవాలి. క్యుటికల్ టూల్ సాయంతో గోరు చుట్టూ ఉన్న చిగుళ్లను శుభ్రపరచాలి. చిన్న నెయిల్ క్లిప్పర్‌తో గోరు చుట్టూ ఉన్న క్యుటికల్స్, గోళ్లు కత్తిరించాలి. యాంటిసెప్టిక్/ యాంటీబయోటిక్ క్రీమ్ ను గోళ్ల చుట్టూ రాయాలి. ఆలివ్ ఆయిల్‌ని వేలికి అద్దుకుని, గోళ్లపై రాసి, మృదువుగా రబ్ చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా పెరుగు తాయి. -
నైట్స్‌లో...రైట్ ట్రాక్స్!
రోజుకు 24 గంటలు. అందులో సుమారు 8 గంటలు నైట్ డ్రెస్సులోనే ఉంటారు అతివలు. అయితే.. హాయిగా నిద్రించడానికి, ఇంటా, బయట సౌకర్యంగా తిరగడానికి నైట్ డ్రెస్‌ల ఎంపిక ఎప్పుడూ అంత ప్రత్యేకంగా ఉండదు. కారణం.. ‘ఇంట్లోనే ఉంటాం, ఎవరికీ కనిపించం..కదా! అలాంటప్పుడు ఏ దుస్తులైతేనేం’ అనుకునేవారే ఎక్కువ. కానీ, రాత్రి వేళ ధరించే దుస్తుల ఎంపిక ఎప్పుడూ రైట్ ట్రాక్‌లో ఉండాలి... రేపు అనే భవిష్యత్తుకు నేడు అందమైన కల కనాలంటే అలసిన శరీరానికి కంటి నిండా నిద్ర అవసరం. ‘అందుకు పడకగదిని శుభ్రంగా ఉంచి, మెత్తటి పరుపును సరిచేయడమే కాదు, ఒంటిపై ఉన్న వస్త్రానికీ ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటున్నారు నైట్ దుస్తుల తయారీ నిపుణులు. ‘కేవలం నిద్రించే సమయాలలోనే కాకుండా, రోజంతా ధరించే వీలున్న ‘టైమ్‌లెస్’ దుస్తులు నేడు లభిస్తున్నాయి. వీటి ఎంపికలోనే మనదైన ముద్ర కనిపించాలి. డిజైనర్ స్లీప్ వేర్... రాత్రి ధరించే దుస్తులకే కొన్ని హంగులను జతచేస్తే విలాసవంతమైన జీవనశైలిని సొంతం చేసుకోవచ్చు. డిజైనర్ ఎంపిక చేసిన ఫ్యాబ్రిక్‌ను కొనుగోలు చేసి, మీ శరీరాకృతికి తగ్గట్టు సౌకర్యంగా దుస్తులను డిజైన్ చేయించుకుంటే సరి! ప్రపంచ ప్రసిద్ధి పొందిన డిజైనర్ ఆర్మానీ రోబ్స్ నైట్ గౌన్లను సౌకర్యంగానూ, స్టైల్‌గానూ రూపొందించి పేరుపొందాడు. దుస్తుల ఎంపికకు ముందు... రాత్రి పడుకునేముందు కదలికలకు తగ్గ సౌకర్యవంతమైన దుస్తులనే ఎంచుకోవాలి. ‘నైట్ వేర్’ అంటే శరీరమంతా కప్పి ఉంచేవి అనుకోకూడదు. రాత్రి ధరించే దుస్తులు కూడా ఎదుటివారి ప్రశంసలు అందుకునేలా ఉండాలి. అదే సమయంలో మీరు నిద్రించే భంగిమలో దుస్తులు(స్లీప్వేర్) ఇంట్లోవారికైనాసరే ఇబ్బంది కలిగించని విధంగానూ ఉండాలి. కళ్లకు, చర్మానికి ఎంచుకున్న ఫ్యాబ్రిక్, స్టైల్ హాయి గొలిపేలా ఉండాలి. రాత్రి ధరించే దుస్తులు మెత్తని వస్త్రంతో తయారైనవి కావాలనుకుంటారు. వీటిలో కాటన్, సిల్క్, శాటిన్, వెల్వెట్.. దుస్తులు మేలైనవి. లేత రంగులు, చిన్న ప్రింట్లు కంటికి, మెదడుకు హాయిగొలుపుతాయి. చక్కటి నిద్రకు ఉపకరిస్తాయి. చాలామంది ఎక్కువ డబ్బును స్లీప్వేర్ మీద ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఏదో ఒకటిలే అని సరిపెట్టేస్తుంటారు. వేసుకున్న దుస్తుల నాణ్యత, రంగులు, స్టైల్, కొలతలు, ధర.. ఇవన్నీ మెదడుపై ప్రభావాన్ని చూపి నిద్రలేమికి కారణాలు అవ్వచ్చు. అందుకని ఈ అంశాలన్నింటిపైనా దృష్టిపెట్టాలి. స్లీప్ గౌన్లు... వేసవిలో చేతులు లేని కురచ గౌన్లు సరైన ఎంపిక. అదే చలికాలంలో పొడవాటి లేదా మోచేతుల వరకు ఉండే చేతులు, ప్యానల్ ఉన్న గౌన్లను ఎంచుకోవచ్చు. నైట్ గౌన్ లేదా కాటన్ నైట్ గౌన్లను లేస్ సరిగ్గా కనిపించేలా వాడాలి. పర్యావరణ అనుకూలం: నిద్రలేమి సమస్యలు దరిచేరకూడదన్నా, కంటినిండా నిద్ర కావాలన్నా పర్యావరణ అనుకూల దుస్తుల ఎంపిక మేలైనది. చలి, వాన, ఎండ.. కాలాలు ఏవైనా ఎకోఛాయిస్ మేలైన ఎంపిక. రసాయనాల వాడకం లేని నూలు తయారీ వస్త్రాల కోసం సేంద్రియ ఉత్పత్తుల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి చలిలో వెచ్చదనం, వేడిలో చల్లదనం మేనికి అందిస్తాయి. వేసవికి ప్రత్యేకం: వేసవిలో ముందు వేడిగా, అర్థరాత్రి దాటాక వాతావరణం చల్లగా మారుతుంది. ఈ కాలం ఏసీ, ఫ్యాన్ల వాడకాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వేసవి రాత్రులలో మేనికి గాలి తగిలే, చమటను పీల్చుకునే వస్త్రాలను ఎంచుకోవాలి. కురచ చొక్కాలు, పొడవాటి ప్యాంట్లు లేదా పైజామాలు సరైన ఎంపిక. చేతులు లేని నైట్ గౌన్లు తేలికగా ఉంటాయి. లెగ్గింగ్స్ టి-షర్ట్ సరిజోడి. యువతరానికి వైవిధ్యం: ట్రాక్‌సూట్స్ యువతులకు బాగా నప్పుతాయి. లాంగ్ పైజామా, పైన టీ-షర్ట్ లేదా షార్ట్, టీ-షర్ట్ మంచి ఎంపిక. క్రీడల పట్ల ఆసక్తి చూపే అమ్మాయిలు ట్రాక్ ప్యాంట్ ధరిస్తే బాగుంటుంది. ఎక్కువ కుచ్చిళ్లు ఉన్న పైజామా, హుడీస్ ధరించడం మేలు. ఇంటి నుంచి అలా ఆరుబయట తిరిగి రావాలనుకున్నా ఈ తరహా డ్రెస్‌ల మీద నిరభ్యంతరంగా బయటకు వెళ్లిరావచ్చు. లో దుస్తుల సౌకర్యం: బ్రా, ప్యాంటీస్తో సహా నైట్‌వేర్.. విభిన్న కట్లు, స్టైల్, కలర్స్, మెటీరియ ల్స్, ప్యాటర్న్స్‌లో లభిస్తున్నాయి. కురుచ దుస్తులు ధరించినప్పుడు లో దుస్తులు హైకట్, జి-స్ట్రింగ్స్ ఉండేలా జాగ్రత్తపడాలి. మరీ బిగుతుగా, చమటను పీల్చుకోని లో దుస్తులను ఎంచుకోకూడదు. పైజా మా, నైట్ గౌన్, షార్ట్స్.. ఇలా ఆయా దుస్తులకు అనుగుణంగా లో దుస్తులను ఎంచుకోవాలి. కమిసోల్స్: పొడవైన ‘యు, వి’ నెక్ మోడల్లో ఉండే కమిసోల్స్ మహిళల కోసం మార్కెట్ నిండా ఉన్నాయి. ఇవి అమ్మాయిలే కాదు మధ్య వయస్కులు కూడా ధరించవచ్చు. ఈ డ్రెస్ బయట తిరగడానికి సౌకర్యవంతంగానూ, నిద్రించడానికి హాయిగానూ ఉంటాయి. వీటిలో శాటిన్, కాటన్, లినెన్.. మెటీరియల్‌లో రకరకాల ప్యాటర్న్స్ లభిస్తున్నాయి. పైజామాల ఎంపిక: పైజామాలలో మోకాళ్ల వరకు, మడమల వరకు అని రెండు రకాలవి ఎంచుకోవాలి. అప్పుడే సౌకర్యం, వీలునుబట్టి మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. యోగా ప్యాంట్స్, ట్రాక్ సూట్స్ స్టైల్‌గానూ, సౌకర్యంగానూ ఉంటాయి. షాప్‌కి వెళ్లేముందు మీ శరీర కొలతలను చెక్ చేసుకోండి. దీని వల్ల దుస్తుల ఎంపిక సులువు అవుతుంది కాబోయే అమ్మకు ప్రత్యేకం మొదటి మూడు నెలలు సాధారణ నైట్ దుస్తులు వాడచ్చు. ఆ తర్వాతి నెలలో శరీరాకృతిలో మార్పులకు త గ్గ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. సిగ్గుపడకుండా తమ శరీరాకృతికి తగిన, సౌకర్యంగా ఉండే నైట్ దుస్తుల ఎంపిక చేసుకోవాలి. సాగే గుణం ఉన్న దుస్తులు మూడు జతల చొప్పున తీసుకోవాలి. సహజసిద్ధమైన రంగులు, దేనితోనైనా మ్యాచ్ చేసుకోదగిన టాప్స్ పొడవుగా ఉన్నవి ఎంచుకోవాలి. దీనివల్ల ఎక్కువ ఖర్చుకాదు. డ్రెస్సులు మరీ తక్కువగా ఉన్నాయనే భావన దరిచేరదు. గర్భవతుల కోసం షాపుల్లో ప్రత్యేకమైన విభాగాలు ఉంటాయి. వాటిలో తమకు అనుగుణమైనవి ఎంచుకోవాలి. పెరుగుతున్న పొట్టను మృదువుగా హత్తుకునేలాంటి దుస్తులు ఉంటే సౌకర్యంగా ఉంటాయి. ఇందుకోసం మీరు ‘ప్రెగ్నెన్సీ మ్యాగజీన్స్’ను చూడవచ్చు. తల్లి సౌకర్యం, సంతోషం గర్భస్థ శిశువు ఎదుగుదలపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. నిర్వహణ: నిర్మలారెడ్డి -
కలంకారి ఇంపుగా.. హాయిగా..
సౌకర్యం, సంప్రదాయాలను అనుసరించి కాలానుగుణంగా వేషధారణల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటికే మళ్ళీ చిన్న చిన్న మార్పులను జోడించి, ట్రెండ్ సృష్టించడమే ఫ్యాషన్. వేసవిలో చెమటను పీల్చుకునే దుస్తులను, లేత రంగులను ఇష్టపడతారు. ఆ విధంగా కాటన్ క్లాత్‌కు, ‘కలంకారి’ డిజైన్లకు చరిత్ర ఎంతో ఉంది. ఈ రెండింటినీ జోడించి కొత్త కొత్త దుస్తులను సృష్టిస్తే... ఈ వేసవి కూల్‌గానే కాదు మరింత ‘కళ’ గానూ మారిపోతుంది. నూలు వస్త్రంపై సహజసిద్ధమైన రంగులతో చేసిన డిజైన్లు కాబట్టి ‘కలంకారి’ దుస్తులు కంటికి ఇంపుగా, ఒంటికి మెత్తగా, మనసుకు హాయిగా అనిపిస్తాయి. వీటిలో ‘పెన్ కలంకారి’ డిజైన్లు ఖరీదు ఎక్కువ. ప్రింటెడ్ ‘కలంకారి’ వస్త్రాలు ఖరీదు తక్కువే! కాబట్టి స్తోమతను బట్టి, సౌకర్యాన్ని బట్టి కలంకారికి ఆధునిక సొబగులను ఎన్నైనా అద్దవచ్చు. వేసవి ఫ్యాబ్రిక్స్‌తో... వేసవిలో సింథటిక్ దుస్తులు చర్మంపై ర్యాష్‌కు కారణం అవుతాయి. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకని వేసవికి అనుకూలమైన నూలు, నార, లినెన్, రేయాన్, కోటా, మల్మల్, శాటిన్, కోరా ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవచ్చు. వీటికి ‘కలంకారి’ ఫ్యాబ్రిక్‌ను జోడిస్తే వినూత్నమైన దుస్తులు వేషధారణలో ‘కళ’తీసుకువస్తాయి. టాప్ టు బాటమ్... తలపైన కలంకారి టోపీ, అదే కాంబినేషన్లో కలంకారి వెయిస్ట్‌కోట్, ముదురు ఆకుపచ్చ లెహంగాకు చేసిన కలంకారి ప్యాచ్ వర్క్, హ్యాండ్ బ్యాగ్.. ఎండలో చార్మ్‌గా వెలిగిపోవడానికి మంచి ఎంపిక కలంకారి. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళ కలంకారి. ఎన్ని రకాలుగా ఉపయోగించినా బోర్ అనిపించని కలంకారి ఫ్యాబ్రిక్‌తో లెక్కలేనన్ని డిజైన్లు తీసుకురావచ్చు. సహజంగా ‘కలంకారి’ని బెడ్‌షీట్స్, దిండుగలేబులుగా వాడుతుంటారు. నేను దీంట్లో ఒక ట్రెండ్‌ను సృష్టించి, స్టైలిష్ ఫ్యాబ్రిక్‌గా పరిచయం చేయాలనుకున్నాను. ఆ విధంగానే జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైన ఆధునిక దుస్తుల్లో కలంకారి డిజైన్లను మెరిపించాను. నేను ఎక్కువగా ఆకుపచ్చ, నీలం, ఎరుపు, నలుపు, ఆలివ్.. రంగుల కలంకారి ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిస్తాను. దాంట్లో టాప్స్ పై వేసుకొని జాకెట్స్, బాటమ్‌గా చురీ ప్యాంట్స్, పొడవైన కుర్తాలు.. ఇలా చాలా రకాలుగా సృష్టించాను. చీరలు, లెహంగాలు, కుర్తాలు, జంప్‌సూట్స్...ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేశాను. చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ముంబయ్, ఢిల్లీ, ప్యారిస్ నుంచి కూడా నాకు కలంకారి దుస్తులకు ఆర్డర్లు వస్తుంటాయి. ఇది రీ సైకిల్ ఫ్యాబ్రిక్. కాస్త ఎంబ్రాయిడరీ టచ్ ఇచ్చామంటే మరింత వెలిగిపోతుంది. వేసవిలో కలంకారి రంగులు, ప్రింట్లు కూల్ ఫీలింగ్‌ను ఇస్తాయి. - అస్మితా మార్వా, ఫ్యాషన్ డిజైనర్ ఖర్చు తక్కువ... ‘అచ్చు కలంకారి’ ఖరీదు తక్కువే! ప్రింటెడ్ కలంకారి ఫ్యాబ్రిక్ మీటర్ ధర రూ.100 నుంచి లభిస్తుంది. అదే పెన్ కలంకారి అయితే డిజైన్ బట్టి ధర వేల రూపాయల్లో ఉంటుంది. వెరైటీ డిజైన్లు... పొడవు పొట్టి లెహంగాలు, వెయిస్ట్ కోట్లు, జాకెట్లు, కుర్తాలు, హారమ్ ప్యాంట్స్, ఫ్రాక్‌లు.. ‘కలంకారి’తో వీటిలో ఎన్నో ప్రత్యేకతలను చూపించవచ్చు. యాక్ససరీస్.. పర్సులు, బ్యాగులు, పాదరక్షలు, టోపీలు, చెవి ఆభరణాలు.. కలంకారి డిజైన్లతో కనువిందు చేస్తుంటే వాటిని అలంకరణలో భాగం చేసుకొని మరింత ప్రత్యేకంగా వెలిగిపోవచ్చు. -
దుస్తుల అలమరా... 5 సూచనలు
ఖరీదైన అలమరాలు కొనుగోలులో చూపించినంత శ్రద్ధ చాలామంది అందులో దుస్తులను సర్దుకోవడంలో చూపించరు. అందుకే చాలా సమయాలలో డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ దుస్తులు అందుబాటులో ఉండక ఇబ్బందులు పడుతుంటారు. అలమరాను సర్దుకోవడానికి ఐదు సూచనలు. 1.అరలలో అన్నీ కుక్కేసినట్టుగా ఉన్న దుస్తులను బయటకు తీసి (అవసరం లేనివి-అవసరం ఉన్నవి) రెండు భాగాలు చేయండి. 2.ఆధునిక దుస్తులైన టీ షర్ట్లు, కుర్తీలు, గౌన్లు, జీన్స్, హారెమ్ ప్యాంట్స్ ... వంటివి ఒక అరలో సర్దండి. 3.సంప్రదాయ తరహా లంగా ఓణీ, చుడీదార్లు, చీరలు ఒక అరలో సెట్ చేయాలి. ఏ డ్రెస్ అయినా మ్యాచింగ్ అయ్యే దుస్తులు ఒకే చోట ఉండేలా జాగ్రత్తపడండి. 4.ఏ సమయంలో అయినా ధరించడానికి వీలుగా ఉండే క్యాజువల్ డ్రెస్సులు, లోదుస్తులు విడిగా అమర్చుకోండి. 5.దుస్తుల మీదకు నప్పే యాక్ససరీస్ (పూసలు, కలప, క్లాత్...ఆభరణాలు, చేతి గడియారాలు, కేశాలంకరణ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్..) ఒక అరలో ఉంచాలి. దీని వల్ల సందర్భానుసారం ధరించే దుస్తుల మీదకు సరైన మ్యాచింగ్ సులువుగా తీసుకునే ఉంటుంది. శుభ్రంగా దుస్తుల అలమరను అనుకూలంగా అమర్చుకుంటే కొనుగోలు ఎంపికలోనూ అవగాహన కలుగుతుంది. సందర్భానికి తగ్గట్టు త్వరగా ముస్తాబు అయ్యే అవకాశమూ ఉంటుంది. -
యువతిని మోసగించిన మరో యువతి
వరంగల్ రైల్వేస్టేషన్ లాకర్లోని బ్యాగుతో అపహరణ బ్యాగులో 10 తులాల బంగారు ఆభరణాలు, దుస్తులు ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన జీఆర్పీ పోలీసులు ఎదుట బాధితురాలి ఆవేదన మట్టెవాడ, న్యూస్‌లైన్ : ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చిన ఓ యువతికి మాయ మాటలు చెప్పి, ఆమెకు సంబంధించిన బ్యాగ్‌ను మరో యువతి ఎత్తుకెళ్లిన సంఘటన వరంగ ల్ రైల్వేస్టేషన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన బెరైడ్డి నర్సింహారెడ్డికి కూతురు సోనీ(18) ఉంది. ఆమె తన అత్తగారి ఊరైన అదే జిల్లా వల్లభాపూర్ నుంచి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హుజురాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి బస్సులో ఫిబ్రవరి 16న వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రెండురోజులపాటు ప్లాట్ ఫాంపైనే గడిపింది. 18న సుధ అనే యువతి కలిసి సోనీకి మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న బ్యాగును రైల్వేస్టేషన్‌లోని లాకర్లో పెట్టింది. సుధా తన పేరుతోనే అడ్రస్ రాయించి, రశీదు కూడా తీసుకుంది. అనంతరం సోనీని కరీమాబాద్‌లోని ఎరుకల సాయమ్మ ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. తిరిగి రైల్వేస్టేషన్‌కు వచ్చిన సుధ లాకర్లోని బ్యాగు తీసుకుని ఉడాయించింది. సాయమ్మ ఇంట్లో ఉన్న ఆమె సుధ కోసం ఎన్నిరోజులు ఎదురు చూసినా ఆమె రాకపోవడంతో అనుమానం కలిగింది. 24వ తేదీన సోనీ తన పుట్టింటికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తండ్రి నర్సింహారెడ్డితోపాటు బంధువులు వచ్చి సోనీని తీసుకెళ్లారు. అయితే బ్యాగు కోసం వరంగల్ స్టేషన్ లాకర్ వద్దకు వెళ్లగా సుధ అనే యువతి తీసుకెళ్లినట్లు లాకర్ నిర్వాహకుడు చెప్పాడు. అందులో 10 తులాల బంగారం, బట్టలున్నాయని సోనీ బోరున విలపించింది. సుధను పట్టుకుని తమకు న్యాయం చేయాలని వారు రైల్వే పోలీసులను కోరారు. ఈ విషయమై జీఆర్పీ ఎస్సై మునీరుల్లా మాట్లాడుతూ వీణవంక పోలీస్‌స్టేషన్‌లో సోనీ మిస్సింగ్ కేసు నమోదై ఉందని, అక్కడివారే కేసు విచారణ చేస్తారని తెలిపారు. కేసును జీఆర్పీకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు తాము స్పందించనున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా సాయమ్మను వీణవంక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి, సుధను రెండు రోజుల్లో తమ వద్దకు తీసుకురావాలని హెచ్చరించినట్లు తెలిసింది. -
పొడుగ్గా కనిపించాలా!
మీ ఎత్తు 5 అడుగులు... అంతకన్నా తక్కువగా ఉందా! అయితే డ్రెస్ డిజైనర్స్ చెబుతున్న ఈ సూచనలు మీకోసమే! ధరించే దుస్తులు మీ శరీరాన్ని కప్పేసేలా ఉండకూడదు. దీని వల్ల మరింత పొట్టిగా కనిపిస్తారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే కాస్త కురచ దుస్తులను ఎంచుకోవాలి. టాప్, బాటమ్.. ఒకే రంగు గల డ్రెస్సు ధరిస్తే మరింత చిన్నగా కనిపించడం ఖాయం. అందుకే డ్రెస్సింగ్‌లో విభిన్నతను చూపించండి. ఎప్పుడూ ముదురు రంగులను ఎంచుకోవడమే ఉత్తమం. లేత రంగులు, బరువైన ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే చూడ డానికి గాడీగా ఉంటుంది. ఎత్తు తక్కువగా కనిపిస్తారు. పెద్ద పెద్ద పువ్వుల ప్రింట్లు, గాడీ డిజైన్లు కాకుండా చిన్న చిన్న ప్రింట్లు ఉన్న డ్రెస్సులను ఎంచుకోండి. చెక్స్ ఉన్న దుస్తులు తీసుకునేవారు నిలువు చారల దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. కూర్చునేటప్పుడు, నిల్చునేటప్పుడు చాలామంది అనుకోకుండా నడుము, భుజాలు వంచుతుంటారు. నిల్చున్నా, కూర్చున్నా వీపుభాగం నిటారుగా, భుజాలు విశాలంగా ఉంటే మీలో ఆత్మవిశ్వాసం ఎదుటివారికి ఎత్తుగా ఉండేలా కనిపిస్తుంది. వంగిపోయి ఉంటే మీలోని ఆత్మన్యూనత మరింత పొట్టిగా చూపిస్తుంది. మీ అభద్రతతో సహా! -
పార్టీలో పర్ఫెక్ట్గా..!
టీనేజర్స్ ఎక్కడ ఉంటే సందడంతా అక్కడే అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా వేడుకలలో తామే అంతా అయినట్టు తిరిగేస్తుంటారు. అతిథుల దృష్టిని ఆకర్షించేది ఎక్కువగా వీరే! అందుకే వస్త్రాలంకరణ పట్ల టీనేజర్స్ ప్రత్యేక శ్రద్ధ కనపరచడం అవసరం. ముందు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినది సందర్భానుసారంగా దుస్తుల ఎంపిక. పాశ్చాత్య, సంప్రదాయ వేడుకలను దృష్టిలో పెట్టుకొని థీమ్‌కు తగ్గ దుస్తులను ఎంచుకోవాలి. ఇతరులను పోల్చి దుస్తులను ఎంచుకోకూడదు. తమ శరీరాకృతికి తాము ఎంచుకున్న దుస్తులు నప్పుతాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తమ ఎత్తు, లావు, శరీరాకృతిని బట్టి ధరించే దుస్తులు పర్ఫెక్ట్ ఫిట్‌గా ఉండేలా ఎంచుకోవాలి. చక్కని డ్రెస్‌ను ఎంచుకున్నా చాలామంది రంగుల విషయంలో పొరపాటు పడుతుంటారు. దీంతో పార్టీలో చార్మింగ్‌గా వెలిగిపోయేవారు సైతం గాడీ రంగులను ఎంచుకోవడంతో ఎబ్బెట్టుగా కనిపిస్తారు. ఫలితంగా దుస్తుల ఎంపిక తెలియనివారుగా నలుగురిలో పేరుపడిపోతారు. అందుకే తమ మేనిరంగును బట్టి దుస్తుల రంగు ఉండేలా చూసుకోవాలి. సాయంకాలం పార్టీలకు కాంతివంతమైన ముదురు రంగులు, పగటి పూట తేలికపాటి రంగు దుస్తులను ఎంచుకోవాలి. సంప్రదాయ వేడుకలకు హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులు, వెస్ట్రన్ పార్టీలకు సింపుల్‌గా అనిపించేలా వస్త్రాలంకరణ ఉండాలి. క్యాజువల్ ఈవెనింగ్ పార్టీస్ అయితే బ్లూ డెనిమ్ జీన్స్, డీప్ యు-నెక్ టాప్, రెడ్ స్కర్ట టీనేజ్ అమ్మాయిలకు బాగా నప్పుతుంది. యాక్సెసరీస్ కూడా సింపుల్‌గా, దుస్తులకు మ్యాచ్ అయ్యేవి ధరించాలి. ఒక చేతికి బ్రేస్లెట్, పెద్ద పెద్ద చెవి రింగులు లేదా హ్యాంగింగ్స్, నడుముకు స్టైలిష్ బెల్ట్, కాళ్లకు హీల్స్ వాడితే చాలు, అల్ట్రామోడ్రన్‌గా కనిపిస్తారు. చిన్న చిన్న స్కర్ట్లు, ఫ్రాక్‌లు ధరించినప్పుడు తప్పనిసరిగా డ్రెస్ మంచి ఫిటింగ్ ఉండేలా చూసుకోవాలి. స్లీవ్‌లెస్ టీ -షర్ట్ ధరించినప్పుడు పొడవాటి స్కర్ట్, ఫ్లిప్-స్లాప్స్ అయితే పార్టీ లుక్ అదిరిపోతుంది. అబ్బాయిలైతే కార్గో ప్యాంట్లు, టీ షర్ట్ ధరిస్తే చాలు రాక్ అండ్ రోల్లా క్యాజువల్ పార్టీలో స్టైలిష్‌గా మెరిసిపోవచ్చు. ఇటీవల పార్టీ థీమ్స్ చాలా రకాలుగా ఉంటున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా థీమ్ పార్టీస్ అయితే దానికి తగ్గట్టుగా డ్రెస్ చేసుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.